Zilla Parishad High Schools
-
మేడ్చల్, బాచుపల్లి ZPHSలో లైబ్రరీ ప్రారంభం
-
అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’
అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే నాతవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి 10వ తరగతి వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకల్లా ఆన్లైన్లో విద్యార్థుల హాజరు పూర్తి చేశారు. ఆ వెంటనే అందుకు తగ్గ ట్టుగా నిర్దేశిత కొలత ప్రకారం మంగళవారం మెనూ అనుసరించి రాగి పిండి, చింతపండు పులిహోర కోసం బియ్యం, ఇతర సరుకులను వంట సిబ్బందికి అందజేశారు. ఉదయం 10.20 గంటలకు బెల్లంతో చేసిన రాగిజావ ఇచ్చారు. మధ్యాహ్నం 12.20కి పులిహోర, దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు అందించారు. ఆరోజు బడికి హాజరైన 500 మంది విద్యార్థులు బడిలో అందించిన ఆహారాన్నే తీసుకున్నారు. మండల విద్యాశాఖాధికారి అమృత కుమార్ పులిహోరను రుచి చూసి పిల్లల అభిప్రాయం తెలుసుకుని రిజిస్టర్లో నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’ కింద పోషక విలువలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం బడికి రాగానే హాజరు తీసుకుని అందుకు అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసేందుకు మెనూ సరుకులు అందచేసు్తన్నారు. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ అందుకు తగ్గట్టు వంట చేస్తున్నారు. వివరాలను పారదర్శకంగా రిజిస్టర్లో నమోదు చేస్తూ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. వారంలో ఆరు రోజులు రోజుకో మెనూ చొప్పున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుల వద్దనున్న మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ స్టిస్టమ్ ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం వివరాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,689 కోట్లు కేటాయించిందంటే పిల్లలకు పౌష్టికాహారం పంపిణీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం.. పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. సోమవారం వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావ్, గుడ్డు కూర, చిక్కీ, మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటేబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌బాత్ లేదా నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ మెనూగా అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్ క్లినిక్ సిబ్బంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త హీనత నివారణ మాత్రలు అందించడంతోపాటు మోతాదు ప్రకారం తీసుకునేలా పర్యవేక్షిస్తున్నారు. రాగి జావ చాలా బాగుంటుంది వారంలో మూడురోజులు ఉదయం ఇంటర్వెల్ టైంలో బెల్లంతో చేసిన రాగిజావను వేడివేడిగా ఇస్తారు. బడిలో అందరం తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఎంత కావాలన్నా ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా వేడిగా కావాల్సినంత పెడతారు. మా బడిలో ఎవరూ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. అందరూ ఇక్కడ వండిందే తింటారు. టీచర్లు కూడా ప్రతిరోజు మాతో కలిసి భోజనం చేస్తారు. – ఏ.కిరణ్‌కుమార్, రామ్‌ప్రసాద్, చిట్టినాయుడు (పదో తరగతి, సెక్షన్ ‘సి’), నాతవరం జెడ్పీహెచ్ఎస్ ఇంట్లో తిన్నట్టుగానే స్కూల్లో వండే ఆహారం ఇంట్లో ఉన్నట్టుగానే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే తింటా. అన్నం తినేటప్పుడు ఎలా ఉందని మా మాస్టారు రోజు అడుగుతారు. బాగో లేకపోతే అదే విషయం చెబుతాం. దాన్ని రిజిస్టర్లో రాస్తారు. మాతో కూడా రాయిస్తారు. – వి.స్నేహశ్రీ, 9వ తరగతి బి–సెక్షన్, నాతవరం జెడ్పీహెచ్ఎస్ మా పిల్లలూ ఇక్కడే.. మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డలకు వండినట్లే అందరు పిల్లలకు వండి పెడుతున్నాం. గతంలోనూ మధ్యాహ్నం బడిలో భోజనం పెట్టినా ఇంత చక్కగా పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడం చూస్తుంటే మాకూ ఆనందం కలుగుతుంది. – దుర్గాభవాని, మిడ్ డే మీల్స్ తయారీదారు, నాతవరం జెడ్పీహెచ్ఎస్ టీచర్లకూ అదే భోజనం.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయి. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, వసతులను ప్రభుత్వం కల్పించింది. నిజంగా ఇదో గొప్ప మార్పు. మా స్కూల్లో 590 మంది పిల్లలు, 21 మంది ఉపాధ్యాయులున్నారు. మా పర్యవేక్షణలోనే వంటలు చేస్తారు. ప్రతిరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ వండిన ఆహారమే తింటారు. ఏనాడూ బాగోలేదన్న ఫిర్యాదు రాలేదు. – ఎస్.శాంతికుమారి, నాతవరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం నచ్చకపోతే ‘బ్యాడ్’ అని రాస్తాం స్కూల్లో వండిన ఆహారం ఎప్పుడూ బాగుంటుంది. మాకు నచ్చినట్టుగానే వంట చేస్తారు. తిన్న తర్వాత ఎలా ఉందో ప్రతి రోజు మా టీచర్లు అడుగుతారు. నిర్భయంగా చెప్పమంటారు. బాగుంటే ‘గుడ్’ అని బాగో లేకపోతే ‘బ్యాడ్’ అని రిజిస్టర్లో రాస్తాం. ఒకసారి అలా రాస్తే మెనూ మార్చారు. – కె.మహేశ్వరి, (పదో తరగతి), అల్లిపూడి జెడ్పీ హైస్కూల్ ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం వరకు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజంగా ఇది ఓ విప్లవమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక మెనూ అమలు చేస్తూ తిన్నాక అభిప్రాయాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం. పిల్లల అభిప్రాయాల మేరకే గతంలో మెనూ మార్చారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పడానికి ఇది చాలు. – ఎన్.వై.నాయుడు పీఎస్ టీచర్, అల్లిపూడి జెడ్పీహెచ్ఎస్ కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 104 కాగా బుధవారం రోజు 86 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం కూరగాయల అన్నం, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. 10 గంటలకల్లా సరుకులు తీసుకున్న వంట సిబ్బంది పాఠశాల ప్రాంగణంలోని కిచెన్‌లో 12.15 గంటలకు భోజనాన్ని రెడీగా ఉంచారు. తెలుగు ఉపాధ్యాయుడు గోవిందు భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశాక మరో ఉపాధ్యాయుడు ఎన్వై నాయుడు వేడివేడి భోజనం ఫొటోను ఐఎంఎంఎస్ యాప్‌లో అప్లోడ్ చేసి విద్యార్థుల సంఖ్యను కూడా నమోదు చేశారు. - అల్లిపూడి, నాతవరం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి -
తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలిన ఏడో తరగతి విద్యార్థిని
-
నెల్లూరులో విషాదం.. క్లాస్‌రూంలో కుప్పకూలి విద్యార్థిని మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెనువిషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్ సాజీదా అనే విద్యార్థిని.. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నవయసులోనే చిన్నారి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఏడో తరగతి చదువుతున్న సాజీదా.. క్లాస్ రూంలో టీచర్ ప్రశ్నలు అడగడంతో లేచి సమాధానాలు ఇస్తోంది. అయితే ఒక్కసారిగా ఆ చిన్నారి కుప్పకూలింది. వెంటనే స్కూల్ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండె పోటుతో సాజీదా మృతి చెందిదని ప్రాథమికంగా చెబుతున్నా.. పూర్తిస్థాయి పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తేనే మృతికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. సమాధానాలు చెబుతూ హఠాత్తుగా ఆమె కుప్పకూలిందని.. ఫిట్స్ అనుకుని తాళాలు చేతిలో పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని బయాలజీ టీచర్ చెబుతున్నాడు. ఆ వెంటనే సహోద్యోగి సాయంతో ఆస్పత్రికి తరలించామని తెలిపాడాయన. మరోవైపు సాజీదాకు ఎలాంటి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని సాజీదా కుటుంబం కన్నీళ్లతో చెబుతోంది. పదమూడేళ్ల వయసుకే గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త.. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఇదీ చదవండి: మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి.. -
కీచక హెచ్ఎంకు దేహశుద్ధి
వైరా రూరల్: విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ హెచ్ఎం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కీచకు డిలా తయారయ్యాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాలాది రామారావు పాఠాలు బోధించే సమయంలో తమ చేతులు పట్టుకోవడమే కాకుండా శరీరంపై తడుముతున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ సినిమా ప్రదర్శనకు తీసుకెళ్లిన క్రమంలోనూ పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, పాఠశాలలో విద్యార్థులతో కాళ్లు పట్టించుకుంటున్నాడని వారు చెప్పారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వస్తుండగా.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం రామారావు తీరుతో ఆగ్రహంగా ఉన్న తల్లిదండ్రులు సోమవారం ఆయన పాఠశాలకు వస్తుండగా అడ్డుకున్నా రు. కారులో వస్తున్న ఆయనకు దేహశుద్ధి చేయడమే కాక సర్పంచ్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తల్లిదండ్రులు వినలేదు. వైరా, తల్లాడ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, సురేశ్‌లు అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా శాంతించలేదు. హెచ్ఎంను తీసుకెళ్లేందుకు వీలులేదని తేల్చిచెప్పారు. చివరకు పోలీసులు హెచ్ ఎం రామారావును పెట్రోలింగ్ వాహనంలో తరలిస్తుండగా గ్రామస్తులు, తల్లిదండ్రులు వాహనం నుంచి ఆయనను బయటకు లాగి మరోమారు చితకబాదారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి హెచ్ఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
బెండపూడి జెడ్పీ హైస్కూల్: మీ ఆంగ్లం అద్భుతం: యూఎస్ కాన్సులేట్ జనరల్
తొండంగి: కాకినాడ జిల్లా బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఆంగ్ల భాషలో కనబరుస్తున్న ప్రతిభను గుర్తించిన అమెరికన్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ వారితో శుక్రవారం వెబ్ ఎక్స్ కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. అమెరికా యాసలో విద్యార్థులు ఇంగ్లిష్ మాట్లాడడంపై ఆయన అభినందనలు తెలిపారు. బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు అమెరికా యాసలో ఇంగ్లిష్‌ను అనర్గళంగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులను పిలిపించుకుని ముచ్చటించారు. ఇది కాస్తా జాతీయ మీడియాలో ప్రసారం కావడంతో అమెరికన్ కాన్సులేట్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో బెండపూడి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అమెరికన్ కాన్సులేట్ అధికారులు కోరారు. ఈ మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో వెబ్ ఎక్స్ ద్వారా విద్యార్థులతో యూఎస్ కాన్సులేట్ జనరల్ డోనాల్డ్ హెప్లిన్ మాట్లాడేందుకు బెండపూడి హైస్కూల్లో ఏర్పాట్లు చేశారు. డోనాల్డ్ హెప్లిన్‌తో విద్యార్థులు మేఘన, రీష్మ, తేజస్విని, వెంకన్నబాబు మాట్లాడారు. సుమారు 20 నిమిషాలు విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన ముచ్చటించారు. ఎంత మందికి అమెరికాలో చదువుకోవాలని ఆసక్తి ఉందని ప్రశ్నించారు. విద్యార్థులంతా అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తిగా ఉన్నామని బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్, అమెరికా సత్సంబంధాల అభివృద్ధికి ఆంగ్లభాష వారధిగా నిలుస్తుందని హెప్లిన్ పేర్కొన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను కూడా హెప్లిన్ ప్రత్యేకంగా అభినందించారు. -
అందరికీ ఉన్నత విద్య
పేద విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ కానుంది. నూతన విద్యా విధానాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది నుంచి జెడ్పీ హైస్కూ ల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఒక జూనియర్ కళాశాల కేవలం బాలికలకు కేటాయించనున్నారు. ఇప్పటికే అన్ని వసతులు ఉన్న జెడ్పీ హైస్కూల్స్‌ను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్‌బోర్డు అధికారులు గుర్తించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. నెల్లూరు (టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది నుంచి ప్రతి మండలంలో రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొత్తం 51 జెడ్పీ హైస్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను ఈ ఏడాది నుంచి ప్రవేశ పెట్టనున్నారు. వాటిల్లో ఒకటి బాలిక కళాశాల ఒకటిని ఏర్పాటు చేయనున్నారు. తొలుత కేజీబీవీ, మోడల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని ప్రాంతాల్లోని జెడ్పీ హైస్కూల్స్‌ను ఎంపిక చేశారు. వీటిల్లో 33 బాలికల, 18 కో–ఎడ్యుకేషన్ (బాలురు, బాలికలు) కళాశాలలుగా ఎంపిక చేశారు. అయితే వచ్చే ఏడాది నుంచి కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అక్కడే ఇంటర్ చదివే విధంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను ప్రోత్సహించే పనిలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం రెండు మండలాల్లో రెండేసి జూనియర్ కళాశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు మండలంలోని కోవూరు, ఇనమడుగు ప్రాంతాల్లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మహిళల కోసం కేవలం డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల మాత్రమే ఉంది. ఇప్పటికే 6 కేజీబీవీల్లో బాలికలకు ఇంటర్ అందిస్తున్నారు. మరో 4 కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు. వీటితో పాటు 10 మోడల్స్ స్కూల్స్‌ల్లో ఇంటర్ విద్యను అందిస్తున్నారు. ఇంటర్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు జిల్లాలో కొత్తగా ఏర్పాటుకానున్న జూనియర్ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులను ప్రవేశ పెడుతున్నారు. ఒక్కో గ్రూపులో కనీసం 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. విద్యార్థుల ఎంపికలో రిజర్వేషన్, దారిద్య్రరేఖకు దిగువను ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇంటర్‌కు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 4వ తేదీ నుంచి కళాశాలలను ప్రారంభించనున్నారు. ఈ కళాశాలలను ప్రారంభిస్తే పేద వర్గాలకు ఉన్నత విద్య మరింత అందుబాటులోకి రానుంది. అందరికీ అందుబాటులో ఇంటర్ విద్య ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్య అందరికీ అందుబాటులోకి రానుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 33 హైస్కూల్స్‌ల్లో బాలికల జూనియర్ కళాశాలలను, మరో 18 ఉన్నత పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ కో–ఎడ్యుకేషన్‌ను అమలు చేయబోతున్నాం. దీనిపై విధి విధానాలు వచ్చిన వెంటనే ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లను ప్రారంభిస్తాం. – డీఈఓ రమేష్, డీవీఈఓ శ్రీనివాసులు -
మా బడికి రావొద్దు.. సీట్లు లేవు
స్టేషన్ ఘన్పూర్: ‘ఇతర మండలాల పిల్లలకు సీట్లు ఇస్తే స్థానిక పిల్లలకు అవకాశం ఉండదు. అయినా ఇక్కడ సీట్లు ఖాళీ లేవు’అని చెప్పడంతో అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు నిరసన తెలిపారు. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో సోమవారం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా దామెర మండలం కొగిలివాయి గ్రామానికి చెందిన కన్నెబోయిన రజిని కుమార్తె జీవన (8వ తరగతి), గోల్కొండ కుమార్ కుమార్తె అనిత (10వ తరగతి) ప్రస్తుతం ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. వీళ్లని ఆదర్శంగా తీసుకుని కొగిలివాయితోపాటు కమలాపూర్‌కు చెందిన నలుగురు విద్యార్థినులను వారి తల్లిదండ్రులు సోమవారం ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చేర్పించేందుకు తీసుకువచ్చారు. అయితే స్కూల్ హెచ్ఎం అజామొద్దీన్ ‘మా పాఠశాలలో సీట్లు లేవు.. ఇప్పటికే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వేరే ఎక్కడైనా జాయిన్ చేసుకోండి’అని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. హెచ్ఎంను బతిమాలినా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఆయన్ను వివరణ అడగ్గా హాస్టల్లో ఉండి చదివే 50 మంది విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా హాజరుకావడం లేదని, విద్యార్థులు కూర్చోడానికి ఫర్నిచర్ లేదని తెలిపారు. -
నేను ఐఏఎస్ అయ్యేదాకా మీరే సీఎంగా ఉండాలి సార్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద ప్రస్తావించారు బెండపూడి విద్యార్థులు. జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. గురువారం తాడేపల్లికి ఆ విద్యార్థులను రప్పించుకుని కాసేపు మాట్లాడారాయన. ఈ సందర్భంగా.. రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామీలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని(సీఎం జగన్‌ను ఉద్దేశించి).. ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని చెప్పింది రేష్మా. ఇక మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. సగటు విద్యార్థిగా ఉన్న తనను.. మంచి వక్తంగా, అదీ ఇంగ్లీష్ ద్వారా రాటుదేల్చారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేకించి.. మీ(సీఎం జగన్‌ను ఉద్దేశించి) ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది మేఘన. అనుదీప్ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని, అందుకు కృతజ్ఞతలని అన్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. విద్యార్థులంతా మీ వెన్నంటి ఉంటామని చెప్పాడు. తనకు ఐఏఎస్ ఆఫీసర్ కావడమే తన లక్ష్యమని, తాను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేదాకా మీరు సీఎంగా కొనసాగాలని, మీ దగ్గర పని చేయడం తన కోరికని, ప్రామిస్ చేయమని సీఎం జగన్‌ను కోరాడు అనుదీప్. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్ సహా అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచి ప్రతిభను చూపుతున్న బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం జగన్.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసారా ఆశీర్వదించారు. చదవండి: ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్ -
విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్
-
విద్యార్థులతో సీఎం జగన్ ముచ్చట
-
‘బెండపూడి’ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ తరహాలో ఇంగ్లిష్‌లో మాట్లాడడం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అయ్యింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ కథనం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లింది ఈ విషయం. ఈ నేపథ్యంలో.. ఆయన స్వయంగా రప్పించుకుని ఆ విద్యార్థులతో ముచ్చటించారు. గురువారం బెండపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తాడేపల్లికి వెళ్లి.. సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా.. వాళ్లతో సీఎం జగన్ సంభాషణ దాదాపుగా ఆంగ్లంలోనే కొనసాగింది. వాళ్ల ప్రతిభను మెచ్చుకుని.. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని దీవించారు సీఎం జగన్. మేఘన అనే స్టూడెంట్ తన కిడ్డీ బ్యాంక్‌లోని రూ. 929 సీఎం జగన్‌కు ఇచ్చింది. అయితే మేఘన నుంచి కేవలం రూ.19 మాత్రమే తీసుకుని మిగతా డబ్బును ఆమెకే ఇచ్చారు సీఎం జగన్. ఈ దృశ్యం అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది. సీన్ రివర్స్ అయ్యింది: టీచర్ తాను తెలుగు మీడియం విద్యార్థిని కావడంతోనే.. ఇంగ్లిష్‌పరంగా వాళ్లకు ఇబ్బందులు ఎదురు కాకుండా బోధించానని, తద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు వచ్చిందని విద్యార్థుల కూడా వచ్చిన ప్రభుత్వ టీచర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా నిబద్ధతతో పని చేస్తున్నారని తెలిపారాయన. గత రెండేళ్లలో సీన్ రివర్స్ అయ్యిందని, కార్పొరేట్.. ప్రైవేట్ స్కూళ్లలోనూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వీడియోలను ప్రదర్శిస్తుండగా విశేషం అని చెప్పారాయన. -
బెండపూడి విద్యార్థుల ప్రతిభకు సీఎం జగన్ ఫిదా
తొండంగి: కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జెడ్పీ హైస్కూలు విద్యార్థులు విదేశీ శైలిలో అనర్గళంగా ఇంగ్లిష్‌లో మాట్లాడి అబ్బురపరచిన వైనం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి వెళ్లింది. ‘ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా’ శీర్షికతో ఇటీవల ‘సాక్షి’లో కథనం వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం స్పందించారు. తనను కలవాల్సిందిగా సీఎం నుంచి తమకు సమాచారం అందిందని బెండపూడి జెడ్పీ హైస్కూలు హెడ్మాస్టర్ జి.రామకృష్ణారావు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు జి.వి.ప్రసాద్ తెలిపారు. గురువారం విద్యార్థులను తోడ్కొని వెళ్లి సీఎంను కలవనున్నట్టు వారు వివరించారు. -
ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్
నల్లమాడ: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను పాఠశాల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాఠశాలలోని తరగతి గదిలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం డీఈఓతో పాటు డిప్యూటీ డీఈఓ మీనాక్షి, ఏడీ రామకృష్ణ, ఎంఈఓ వేమనారాయణ పాఠశాలలో విచారణ చేపట్టారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ... ఘటనపై సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆరుగురు విద్యార్థులపై సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఇంతకీ ఏం జరిగిందంటే... ? ఏప్రిల్ 30న ఎస్ఏ పరీక్షలు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు ఓ తరగతిలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, డెస్క్, వైర్‌కుర్చీ(చైర్) ధ్వంసం చేశారు. ఆ రోజు విధుల్లో ఉన్న ఇన్చార్జ్ హెచ్ఎం శ్యాంప్రసాద్ ఫిర్యాదు మేరకు హెచ్ఎం రమణప్ప మరుసటి రోజు ఘటనకు బాధ్యులైన విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. తమ పిల్లలు చేసిన పనికి తాము క్షమాపణలు కోరుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా చూసుకోవడంతో పాటు ధ్వంసమైన ఫర్నీచర్ మరమ్మతులకు అయ్చే ఖర్చు తామే భరిస్తామని చెప్పడంతో అప్పట్లో సమస్య సద్దుమణిగింది. తాజాగా ఈ నెల 2న ఇలాంటి సంఘటనే అనంతపురం జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. అయితే అది నల్లమాడ ఉన్నత పాఠశాలలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. దీంతో ఏప్రిల్ 30న నల్లమాడ పాఠశాలలో జరిగిన ఘటన మళ్లీ తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో డీఈఓ పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు. సామగ్రి ధ్వంసం చేసిన విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడారు. విద్యార్థులు తరగతి గదిలోని సామగ్రి ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని తేలడంతో డీఈఓ వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని హెచ్ఎం రమణప్పకు ఆదేశాలిచ్చారు. (చదవండి: వదినతో గొడవ.. పల్సర్ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..) -
ఇంగ్లిష్‌పై బెండపూడి జెండా
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక మేజర్ గ్రామ పంచాయతీ. పది వేల జనాభాతో నాలుగైదు శివారు పల్లెలు కలిగిన ఆ పంచాయతీలో వ్యవసాయం, కూలి నాలీ, చిన్నా, చితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వారే ఎక్కువ. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామ పంచాయతీ పేరు బెండపూడి. ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు చూపుతున్న భాషా నైపుణ్యం వల్ల ఇప్పుడు ఈ గ్రామం పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. వ్యవసాయం తప్ప అక్షరం ముక్క తెలియని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో ఆన్లైన్లో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఇది ఎలా సాధ్యమైందంటే.. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తోంది. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (లిప్) అనే 100 రోజుల వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ... ఈ మూడు భాషలపై పట్టు సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ‘లిప్’ కార్యక్రమానికి బెండపూడిలో ఉపాధ్యాయుడు జీవీఎస్ ప్రసాద్ వినూత్న ఆలోచనలు కూడా జోడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో డిబేట్లలో పాల్గొనేలా విద్యార్థులను తీర్చి దిద్దారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపైంది. ‘హలో వుయ్ స్పీక్ ఇంగ్లిష్ వెరీ వెల్ విత్ ఎవ్రీవన్’ అంటూ అనర్గళంగా మాట్లాడుతున్న ఈ పాఠశాల విద్యార్థులను చూసి కార్పొరేట్ పాఠశాలలు విస్తుపోవాల్సిందే. ఈ విద్యార్థులు ఆంగ్లబాషను అమెరికాలో వాడుక భాష స్టైల్లో చాలా సాదాసీదాగా మాట్లాడేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులను తలదన్నే రీతిలో అమెరికన్ విద్యార్థులతో వారాంతాల్లో డిబేట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. రోజూ ఐదు పదాలు.. ► బెండపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 483 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం గతేడాది నవంబరు 10న ప్రారంభించి, మార్చి 31 వరకు నిర్వహించారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు ఇంగ్లిష్ పదాల చొప్పున నేర్పించారు. ఆ పదాలకు తెలుగు, హిందీ ఆర్థాలు నేర్పారు. ఇలా వంద రోజుల్లో 1,500 పదాలు నేర్చుకునే విధంగా ఒక ఫార్మాట్ రూపొందించి అమలు చేశారు. ► ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ అనే మరో 100 రోజుల కార్యక్రమంలో ఇంగ్లిష్ పదాలు నేర్చుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం స్కూల్ అసెంబ్లీలో తొలి 10, 15 నిమిషాలు ఈ పదాలపై ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తున్నారు. తర్వాత తరగతి గదిలో వాటిని బోర్డుపై రాయించి, ఎలా పలకాలో వివరిస్తున్నారు. ► ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్ష పెట్టే వారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలకు 10 మార్కుల చొప్పున మొత్తం 30 మార్కులకు ఆ పరీక్ష ఉండేది. తద్వారా ఆంగ్లంపై ఎంత వరకు పట్టు సాధించారనేది మదింపు చేసుకుంటూ చివరలో గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్టులో బెండపూడి విద్యార్థులు 60–84 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో బి కేటగిరీలో ఫోర్ స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకున్నారు. ఆమెరికన్ విద్యార్థులతో ఆన్లైన్ డిబేట్లు ► ఆంగ్ల భాషపై బాగా ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారు అమెరికన్ ఫొనెటిక్ (ఉచ్ఛారణ) సౌండ్స్‌పై దృష్టి సారించేలా చూశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘నేటివ్ స్పీకర్స్ క్లబ్’ను ఏర్పాటు చేశారు. ఇందుకు పెనుగొండ లోవరాజు చారిటబుల్ ట్రస్ట్, పెనుగొండ చిట్టబ్బాయి చారిటబుల్ ట్రస్ట్‌ల తోడ్పాటు తీసుకున్నారు. ► అమెరికా సంయుక్త రాష్ట్రాలైన అట్లాంటా, జార్జియాల్లోని వివిధ పాఠశాల విద్యార్థులు, వారి స్నేహితులతో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆన్లైన్లో బెండపూడి విద్యార్థులు పలు అంశాలపై డిబేట్లు నిర్వహిస్తున్నారు. ► ఈ పాఠశాలలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్ధులు అమెరికన్ స్లాంగ్‌లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. తమ పిల్లలు అనర్గళంగా మాట్లాడుతుండటం చూసి తల్లిదండ్రులు మురిసి పోతున్నారు. ఉపాధ్యాయులు జీవీ ప్రసాద్, సీహెచ్‌వీ సుబ్బారావు, ఎం.శ్రీదేవి సమన్వయంతో పని చేయడం వల్ల ఈ విజయం తమ పాఠశాల సొంతమైందని ప్రధానోపాధ్యాయుడు జి.రామకృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది మా స్కూల్లో ఇంగ్లిష్ భాష నేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఎల్ఐపీ ప్రోగ్రాం నిర్వహించారు. కొత్త ఇంగ్లిష్ పదాలు నేర్చుకోవడం దినచర్యగా మారింది. దీంతో వాడుక భాషలో ఇంగ్లిష్ పదాలపై పట్టు సాధించా. మా ఇంగ్లిష్ టీచర్ జీవీ ప్రసాద్ సహకారంతో ఆన్లైన్లో అమెరికాలోని విద్యార్థులతో డిబేట్లో పాల్గొంటున్నాము. ఇప్పుడు ఏ స్థాయిలో వారితోనైనా ఇంగ్లిష్‌లో చక్కగా మాట్లాడగలుగుతాననే ఆత్మవిశ్వాసం పెరిగింది. – ఆర్.తేజస్విని, ఎనిమిదో తరగతి, జెడ్పీ హైస్కూల్, బెండపూడి ప్రతి రోజు ఇంగ్లిష్‌పై ప్రత్యేక శ్రద్ధ మా పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ పదాలు రోజుకు ఐదు చొప్పున ప్రతి రోజూ ఉదయం అసెంబ్లీలో టీచర్లు చెప్పించారు. తరగతి గదిలో వాటిని మరోసారి మాతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం మాకు బాగా ఉపకరించింది. తొలుత స్నేహితులతో ఇంగ్లిష్‌లో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఎవరితోనైనా చక్కగా మాట్లాడుతున్నాం. – కె.రీష్మ, పి.అనూష, పదవ తరగతి, జెడ్పీ హైస్కూల్, బెండపూడి విజన్ ఉన్న ప్రభుత్వం ప్రభుత్వం పాఠశాలల బాగు కోసం ఎంతో చేస్తోంది. పిల్లలకు మంచి భవిష్యత్ కోసం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించింది. ఆంగ్ల భాష అభ్యసించడం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్ లభిస్తుంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమెరికన్ స్లాంగ్‌ను మా విద్యార్థులకు నేర్పించాం. తొలుత ఎంపిక చేసిన విద్యార్థులతో ‘నేటివ్ స్పీకర్స్ క్లబ్’ ఏర్పాటు చేసి ఈ ప్రగతి సాధించాం. – జీవీ ప్రసాద్, ఇంగ్లిష్ అధ్యాపకుడు, బెండపూడి -
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు
నందిగామ: ఆయనో అధికారి.. విద్యార్థి మృతి ఘటనలో విచారణకు నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ‘విద్యార్థి ట్యాంక్ పైకి ఎలాఎక్కాడు? పాఠశాలకు మెట్లున్నాయా? ట్యాంక్‌కు అంత దగ్గరలో విద్యుత్ లైన్లు వెళ్లడం ఏమిటి’ అంటూ పాఠశాల సిబ్బంది, స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. పదండి ఆ ట్యాంక్‌ను చూద్దాం.. అంటూ బయటకొచ్చి.. చకచకా గోడ ఎక్కేశారు. ఆపై ట్యాంక్ వద్దకు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరుపై స్వయంగా అవగాహనకొచ్చారు. ఇదంతా కింద నుంచి చూస్తున్న ఇతర అధికారులు అవాక్కవ్వడం వారి వంతైంది. ఇంతకీ ఎవరు ఈ అధికారి అనుకుంటున్నారా.. గతంలో ఓ రైతు వేషంలో ఎరువుల దుకాణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న మోసాలను బయటపెట్టారు గుర్తుందా.. ఆయనే విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్. చదవండి: (అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..) వివరాలు ఇవీ.. పట్టణ శివారుల్లోని అనాసాగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గోపీచరణ్ అనే విద్యార్థి ఆగస్టు 25వ తేదీన పాఠశాల పైభాగంలో వాష్‌రూమ్‌లపై గల నీటి ట్యాంక్‌ను కడిగేందుకు ట్యాంక్ పైకి వెళ్లి, విద్యుత్ షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం గురువారం పాఠశాలను విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్‌చంద్ పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో అసలు సంఘటన ఎలా జరిగింది? అన్న విషయాన్ని నిర్థారించేందుకు స్వయంగా తానే ట్యాంక్‌పైకి ఎక్కారు. లెక్కల మాస్టారుగా.. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన సబ్ కలెక్టర్ వారికి గణిత బోధన చేయడంతోపాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్ కలెక్టర్ వెంట డీఈఓ తాహెరా సుల్తానా, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజి, డెప్యూటీ తహసీల్దార్ రిబ్కా రాణి, ఎస్హెచ్ఓ కనకారావు ఉన్నారు. చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష) -
శభాష్ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం
స్టార్టప్స్ అంటే ఫ్లిప్‌కార్ట్, ఓలా, జోమాటోలు గుర్తుకు వస్తాయి. స్టార్టప్ ఫౌండర్లు అంటే బైజూస్ రవీంద్ర, అథర్ తరుణ్ మెహతా ఇలా బయటి వారి పేర్లే వినిపిస్తాయి. స్విగ్గీ, రెడ్‌బస్ వంటి స్టార్టప్‌లు తెలుగు వారే స్థాపించిన వీరిలో చాలా మంది అర్బన్ నేపథ్యం, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వారే ఎక్కువ. కానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలోని జిల్లా పరిషత్ స్కూల్‌కి చెందిన ఓ విద్యార్థికి వచ్చిన ఐడియా పెద్ద స్టార్టప్‌కి నాందిగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన శ్రీజకి వచ్చిన ఐడియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రూపు రేఖలనే మార్చబోతుంది. ఆమె ఇచ్చిన ఐడియాతో రూపొందించిన బయోపాట్లను భారీ ఎత్తున తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. సైన్స్‌ఫేర్ కోసం పాఠశాల స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫేర్ పోటీల్లో ఇంటి దగ్గర దొరికే వస్తువులతో చేతులతోనే ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే కుండీలను శ్రీజ తయారు చేసింది. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ఆమె రూపొందించిన కుండీలు ఎంతో ఉపయోకరంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించడంతో పాటు ప్టాస్టిక్ వినియోగాన్ని కంట్రోల్ చేసే వీలుంది. ముందుకొచ్చిన టీఎస్ఐసీ శ్రీజ బయోపాట్ కాన్సెప్టుని తెలంగాణ ఇన్నోవేషన్ సెంటర్ (టీఎస్ఐసీ) దృష్టికి తీసుకెళ్లారు ఆమె పాఠశాలలో పని చేసే మ్యాథ్స్ టీచర్ అగస్టీన్. శ్రీజ ఫార్ములా ప్రకారం కుండీలు తయారు చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని రూపొందించేందుకు టీఎస్ఐసీ ముందుకు వచ్చింది. శభాష్ శ్రీజ టీఎస్ఐసీ చేపట్టిన పలు ప్రయోగాల అనంతరం తొలి బయో ప్రెస్ 4టీ మిషన్ సెప్టెంబరు మొదటి వారంలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ తయారైన కుండీలకు బయోపాట్‌లుగా పేరు పెట్టారు. ఇటీవల శశిథరూర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ పరిశీలించి శ్రీజను మెచ్చుకుంది. భారీ ఎత్తున శ్రీజ ఐడియాని అనుసరించి టీఎస్ఐసీ రూపొందించిన బయోప్రెస్ 4టీ మిషన్‌తో నెలకు 6,000ల వరకు బయోపాట్స్‌ని తయారు చేయవచ్చు. దీన్ని త్వరలోనే 50,000 సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. హరితహారంలో వాడే మొక్కలతో పాటు పలు నర్సరీలకు సైతం వీటిని సరఫరా చేసే యోచనలో ఉన్నారు. దీని కోసం స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతంలో సరికొత్త ఉపాధికి ఈ బయోపాట్స్ అవకాశం కల్పిస్తున్నాయి. TSIC congratulates Srija, a Rural Innovator scouted & supported through #ఇంటింటాinnovator & @WEHubHyderabad, for getting a custom machine designed by T-Works to mass manufacture her innovation Bio-degradable pots. Srija's innovation is ready for pilot.@KTRTRS @startup_ts https://t.co/FNdkOYX81Z — Telangana State Innovation Cell (TSIC) (@teamTSIC) September 17, 2021 2 మిలియన్ టన్నులు బయోపాట్లను భారీ ఎత్తున తయారు చేసి దేశవ్యాప్తంగా అన్ని నర్సరీల్లో ఉపయోగిస్తే ఏడాదికి రెండు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను భూమిపైకి రాకుండా అడ్డుకునే వీలుంది. రాష్ట్ర స్థాయిలో హరితహారం ప్రాజెక్టులో బయోపాట్స్ మంచి ఫలితాలు సాధిస్తే.... జాతీయ స్థాయిలో సైతం వీటిని తయారు చేసి, మార్కెటింగ్ చేసే వీలుంది. అందరూ వింటున్నదే బయోపాట్ స్టార్టప్‌కి శ్రీకారం పాఠశాలో ఉన్నప్పుడే జరిగింది. పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తే అందులో ప్లాస్టిక్ వల్ల తలెత్తే అనర్థాలు, పర్యావరణ కాలుష్యం అనే టాపిక్స్ కామన్. స్కూల్ స్థాయిలో దాదాపు అందరు పిల్లలు వీటి గురించి వినడం, రాయడం చేస్తారు. అయితే తాను తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం శ్రీజ చేసింది. కళ్లెదుటే సమస్య ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో పిల్లలు మొక్కలు నాటడం విధిగా మారింది. శ్రీజ సైతం ఇలా అనేక సార్లు మొక్కలు నాటింది. అయితే మొక్కలు నాటిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్లను ఇష్టారీతిగా పడేడయం అవి రోజల తరబడి అక్కడే ఉండటం ఆమెకు నచ్చేది కాదు. అంతేకాదు కవర్ల ఊరబెరికేప్పుడు అజాగ్రత్తగా ఉంటే కొన్ని మొక్కలు చనిపోవడం కూడా ఎన్నో సార్లు చూసింది. దీంతో ప్లాస్టిక్ చెత్త అనే సమస్య శ్రీజను ఆలోచనలో పడేసింది. ఐడియా తట్టింది శ్రీజ నివసించే ఏరియాకి సమీపంలో ఉన్న పల్లి నూనె మిల్లుల్లో వేరుశనగ పొట్టును బయట పారేసి కాల్చేస్తుండేవారు. దీంతో ఆమె కళ్ల ముందే వాయు కాలుష్యాన్ని నిత్యం చూసేది. అయితే కాలిపోకుండా మిగిలిన పొట్టు భూమిలో కలిసి పోవడం గమనించింది. వేరుశనగ గింజలకు రక్షణగా ఉండే ఆ పొట్టు మొక్కలకు అండగా ఉండలేదా ? అనే ఆలోచన వచ్చింది. స్నేహితుల సాయంతో స్నేహితుల సాయంతో సేకరించిన పల్లీల పొట్టును మిక్సీలో వేసి పౌడర్‌గా మార్చింది. దానికి నీటిని కలిపి పేస్టులా చేసి ఓ మట్టి పాత్రను తయారు చేసింది. అలా తాను తయారు చేసిన మట్టి పాత్రలో ఓ మొక్కను ఉంచి పాఠశాల ఆవరణలో పాతింది. సరిగ్గా 20 రోజులకు ఆ మట్టి పాత్ర భూమిలో కలిసిపోయి మొక్కకు ఎరువుగా మారింది. అంతే తాన కళ్ల ముందే ఉన్న పోగుపడిన ప్లాస్టిక్ వ్యర్థాలు , వాయు కాలుష్యాలను తగ్గించేందుకు ఉమ్మడి అవకాశం అక్కడే లభించింది. పల్లెల నుంచి జోగులాంబ గద్వాలలోని చింతలకుంట జిల్లా పరిషత్ స్కూల్ వేదికగా ఓ కొత్త స్టార్టప్ రూపుదిద్దుకుంది. దానికి ఊపిరి పోసింది ఓ సాధారణ పాఠశాల విద్యార్థిని అయితే ఆమెకు అండగా ఆ పాఠశాల నిలిచింది. మన గ్రామీణ ప్రాంతంలో ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపించింది. పల్లెల నుంచి స్టార్టప్‌లు పుట్టుకొస్తాయంటూ లోకానికి చాటింది. - సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’ -
సన్యాసుల వేషంలో వచ్చి.. బాలికల కిడ్నాప్‌నకు యత్నం
మెరకముడిదాం: పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పోలీసులు, బాలికలు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరు గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ తెలిపారు. -
సిరిసిల్ల సర్కారు బడి.. మెరుగుబడి!
-
హెచ్ఎం వర్సెస్ టీచర్
విద్యారణ్యపురి: కడిపికొండలోని జిల్లాపరిషత్ హైస్కూల్లోని హెచ్ఎం జయమ్మ, అదే స్కూల్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా వెంకటకరుణాకర్‌కు మధ్య కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ఇరువురు పరస్పరం డీఈఓకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెంకటకరుణాకర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా.. బెరింపులకు గురిచేస్తున్నారని హెచ్ఎం జయమ్మ 15సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోకున్నా.. చార్జెస్ ప్రేమ్ చేశారని తెలిసింది. మరోవైపు వెంకటకరుణాకర్ కూడా హెచ్ఎం జయమ్మపై డీఈఓకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ కార్యదర్శి రమేష్‌బాబుతో పరిశీలన చేయించారు. ఈ అంశంపై ఆయన నివేదిక ఇవ్వగా... హెచ్ఎం జయమ్మ చెప్పినట్లు ఉపాధ్యాయుడు వినడం లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాం కడిపికొండ జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జయమ్మ, వెంకటకరుణాకర్‌కు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపించాక వెంకటకరుణాకర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఆయనపై చార్జెస్ ఫ్రేమ్ చేశామన్నారు. ఒకటి, రెండురోజుల్లో విద్యాశాఖకు సబంధించిన వారితో విచారణ జరిపించాక చర్యల్లో భాగంగా ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు కడిపికొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జయమ్మ ఈనెల 13న సంబంధిత పరిధిలోని పోలీస్టేషన్లో మ్యాథ్స్ స్కూల్‌అసిస్టెంట్ వెంకటకరుణాకర్‌పై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తన వద్దకు వెంకటకరుణాకర్ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయబోగా.. సర్వీస్‌బుక్ ఇవ్వాలంటూ తాను ఇచ్చిన మెమో, నోటీసులు తీసుకోవాలని సూచించానని తెలిపారు. సరేనని నమ్మబలికి హాజరు రిజిస్టర్లో సంతకం చేశాక మెమో, నోటీసుబుక్ను తన ముఖంపై కొట్టడంతో పాటు కులం, లింగ వివక్షతతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఏసీసీ ఈనెల 16న హైస్కూల్‌కు వెళ్లి కూడా విచారణ జరిపినట్లు సమాచారం. -
రోమియో టీచర్
చెన్నై ,తిరువొత్తియూరు: దిండుక్కల్ సమీపంలో తరుంబత్తుపట్టి ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో ప్లస్‌టూ చదువుతున్న విద్యార్థినికి అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు రాజా అశోక్‌కుమార్ ప్రేమలేఖ ఇచ్చాడు. ప్రేమలేఖ విద్యార్థికి ఇచ్చిన సంగతి పాఠశాలలో సంచలనం కలిగించింది. దీనిపై పాఠశాల నిర్వాహకులు, తల్లిదండ్రులు సంఘం సమక్షంలో విచారణ జరిగింది. నివేదికను పాఠశాల విద్యాశాఖ అధికారులకు పంపించారు. విచారణ అనంతరం జిల్లా ముఖ్య అధికారి శరత్‌కుమార్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
డీవైఈఓ పోస్టుల భర్తీ ఎప్పుడో?
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాఠశాల పనితీరును పర్యవేక్షించేందుకు డీవైఈఓలు కరువయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ ఎప్పుడా అని పలువురు ఉపాధ్యాయులు నేటికీ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఉన్నాయి. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దయానందం ఈ ఏడాది జూన్ 30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. కందుకూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు గత కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉండటంతో లక్ష్మయ్య ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేశారు. పర్చూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో రామ్మోహనరావును ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కాశీశ్వరరావును నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావుపై అదనపు బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులపై నివేదిక ఇచ్చేదెవరు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి ఫిర్యాదులు చేసుకున్నా, పాఠశాలలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమైనా ఉప విద్యాశాఖాధికారి అక్కడకు వెళ్లి ఎంక్వయిరీ చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారికి అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు(జడ్జిమెంట్) తీసుకుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారే ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వయంగా డీఈఓ వెళ్లి ఎంక్వయిరీ చేసి, ఆ ఎంక్వయిరీపై జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వీస్ రూల్స్ లేకపోవడమే జిల్లాలో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ గత కొన్నేళ్ల నుంచి నిలిచిపోయింది. అందుకు కారణం వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేకపోవడమే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మధ్య ఆధిపత్య పోరు కూడా కీలకమైన ఇలాంటి పోస్టులకు విఘాతం కలిగిస్తోంది. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఆ రెండు యాజమాన్యాలకు చెందినవారు ఒకరి తర్వాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో నెలకొన్న రగడ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వాల చేతులు దాటిపోయి చివరకు కోర్టుల వరకు వెళ్లడంతో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీపై ప్రభావం చూపుతోంది. విద్యాశాఖ మంత్రి జోక్యం తప్పనిసరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఇన్చార్జిలను నియమించినప్పటికీ వారు జీత భత్యాల బిల్లులకు సంబంధించిన విషయాలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో, జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. విజిట్స్..ఇన్స్పెక్షన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలను క్రమం తప్పకుండా విజిట్స్, ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ► ప్రాథమిక పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో ఉండగా, ఉన్నత పాఠశాలల పనితీరును ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు సమకూరుతున్నాయా, వారికి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారా, మ«ధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా, విద్యార్థుల పాఠశాలలకు సక్రమంగా హాజరవుతున్నారా తదితరాలన్నింటిని ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► అంతేగాక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు çసకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారా, తరగతులు ఏవిధంగా చెబుతున్నారు, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు తదితర వాటిని కూడా ఉప విద్యాశాఖాధికారులు చూడాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ► ఇక ఉన్నత పాఠశాలలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా, నిధులు సరిపోక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించడం జరుగుతుంది. వీటితోపాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లను కూడా ఉప విద్యాశాఖాధికారులే చూడాల్సి ఉంటుంది. -
ఆత్మకూరు విద్యార్థికి అరుదైన అవార్డు
ఆత్మకూరు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి.అమరనాథరెడ్డి ఇండియన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇస్కా ట్రావెల్ అవార్డ్‌కు ఎంపికయ్యాడు. దేశ వ్యాప్తంగా పది మంది విద్యార్థులు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికైంది అమరనాథరెడ్డి ఒక్కరే కావడం గమనార్హం. ఈ నెల 18న జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో విద్యార్థి తరఫున గైడ్ టీచర్ మల్లికార్జున ఈ అవార్డును నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణాచారి, మాజీ ఐఎస్‌సీఏ కార్యదర్శి అశోక్ కుమార్ సక్సేనా చేతుల మీదుగా అందుకున్నట్లు పాఠశాల హెచ్ఎం ఏవీఎం రాఘవ తెలిపారు. -
‘పది’పై ప్రత్యేక దృష్టి ఏది?
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 92.4శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇది 90 శాతం వరకు నమోదైంది. రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానం, తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది సంతృప్తిగానే ఉన్నా ఈసారి మరిం త మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సి న విద్యాశాఖాధికారులు ఇంత వరకు మేల్కొనలేదు. ప్రత్యేక బోధన తరగతులు ఏర్పాటుచేయడంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేయాల్సిన అధికారులు ఆ దిశ గా దృష్టి సారించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లాలో 23,308 మంది.. జిల్లావ్యాప్తంగా 503 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో 23వేల 308 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వా ర్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రణాళికాయుతంగా బోధించేడమే కాకుండా పాఠ్యాంశాలను రివిజన్ చేసేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేయాల్సి ఉం టుంది. వీటిని పట్టించుకోకపోగా, పదో తరగతి పా ఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు స్టడీమెటీరియ ల్ కూడా ఇంత వరకు అందించలేదు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన అధికారులు.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరువైన 40రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రతీ విద్యాసంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలల్లో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులను వార్షి క పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలకు స్టడీ మెటీరియల్ అందజేయడ మే కాకుండా ప్రతిరోజు పాఠశాల సమయానికి ముం దు, తరగతులు ముగిశాక గంట చొప్పున ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేస్తారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతుండగా, ఈసారి హెచ్ఎంలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇక వార్షిక పరీక్షలకు ముందుగా 40 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతీ సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలతో పుస్తకాలు అందజేసేవారు. ఇది కూడా అమలుకు నోచుకోలేదు. మార్చి 27నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా.. అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. నిధుల కొరతే కారణమా..? ఏటా పదో తరగతి విద్యార్థుల కోసం స్టడీ మెటీరియ ల్, పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన విషయాలతో జాబితా ముద్రించే జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) వద్ద నిధులు లేకపోవడమే ఈసారి అధికారులు స్పందించకపోవడానికి కారణమని తెలుస్తోంది. 6నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నుంచి అధికారులు కొంతమేర ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రాలు, ఇతరత్రా ముద్రించేవా రు. అయితే, విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో 6, 7, 8వ తరగతుల విద్యార్థుల నుంచి ఫీ జు వసూలు చేయడాన్ని నిలిపివేసిన అధికారులు 9, 10వ తరగతి విద్యార్థుల నుంచి మాత్రం వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం రూ.50లక్షల నుంచి రూ.35లక్షలకు పడిపోయింది. దీంతో స్టడీ మెటీరియ ల్, ప్రత్యేకప్రణాళిక జాబితా ముద్రించలేదని తెలుస్తోంది. కాగా, పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తు న్న డీఈఓ విజయ్‌కుమార్.. ఎస్సెస్సీ విద్యార్థులపై కూ డా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.