![Zp High School Student Get Travel Award - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/21/award.jpg.webp?itok=YLjbPHwK)
అమర్‌నాథరెడ్డి
ఆత్మకూరు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి.అమరనాథరెడ్డి ఇండియన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇస్కా ట్రావెల్ అవార్డ్‌కు ఎంపికయ్యాడు. దేశ వ్యాప్తంగా పది మంది విద్యార్థులు ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ తరఫున ఎంపికైంది అమరనాథరెడ్డి ఒక్కరే కావడం గమనార్హం. ఈ నెల 18న జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో విద్యార్థి తరఫున గైడ్ టీచర్ మల్లికార్జున ఈ అవార్డును నాగాలాండ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణాచారి, మాజీ ఐఎస్‌సీఏ కార్యదర్శి అశోక్ కుమార్ సక్సేనా చేతుల మీదుగా అందుకున్నట్లు పాఠశాల హెచ్‌ఎం ఏవీఎం రాఘవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment