పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
టీడీపీ నేతల రాజీయత్నం
నందిగాం: నందిగాం మండలంలోని హరిదాసుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గత నెల 31రాత్రి ఓ విద్యార్థినితో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వ్య వహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో టీడీ పీ నేతలు రాజీయత్నాలకు దిగడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. హరిదాసు పురం డ్రిల్ మాస్టారు డిసెంబరు 31 అర్ధరాత్రి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక సెల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షల పే రుతో అసభ్య చాటింగ్ చేసినట్లు సమాచారం.
అయితే బాలిక కుటుంబసభ్యులు చాటింగ్ చూసి, తర్వాత రోజు పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు, కొంతమంది గ్రామస్తుల సమ క్షంలో డ్రిల్ మాస్టర్‌ను నిలదీయడమే కాకుండా నందిగాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. వ్యవహారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకోవడంతో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఉ పాధ్యాయు డు తరఫున వకల్తా పుచ్చుకుని రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నా.. ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment