174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం | Nlg Peddavura Pulicherla ZPHS Two Toilet For Hundred Girl Students | Sakshi
Sakshi News home page

174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం

Published Thu, Dec 9 2021 2:07 PM | Last Updated on Thu, Dec 9 2021 2:41 PM

Nlg Peddavura Pulicherla ZPHS Two Toilet For Hundred Girl Students - Sakshi

పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు.

ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

చదవండి:  టాయిలెట్స్‌ ఎవరు కడగాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement