pedavura
-
174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం
పెద్దవూర: బాలికలు బారులు తీరి కనిపిస్తున్న ఈ ఫొటో మూత్రశాల వద్దది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల పరిస్థితి ఇది. ఈ పాఠశాలలో మొత్తం 398 మంది విద్యార్థులున్నారు. బాలికల సంఖ్య 174 కాగా, మరో ఆరుగురు బోధన సిబ్బంది ఉన్నారు. ఇంతమందికి పాఠశాలలో ఉన్న మూత్రశాలలు మాత్రం రెండే. అందులో ఒకటి మరమ్మతులకు గురికాగా, వినియోగంలో ఉన్నది ఒకటి మాత్రమే. దీంతో విరామ సమయంలో ఇలా బారులు తీరాల్సి వస్తోంది. అరగంట ముందు నుంచే బాలికలను తరగతుల వారీగా విరామానికి పంపిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చదవండి: టాయిలెట్స్ ఎవరు కడగాలి? -
ఘనంగా తీజ్ పండుగ
పెద్దవూర: మండలంలోని నీమానాయక్ తండాలో శనివారం తీజ్ పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలో పెళ్లిళ్లు కాని యువతులు, బాలికలు ఇంటికొక తీజ్ బుట్టను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరి బుట్టలో ఎక్కువ మొలకలు వస్తాయో వారి కోర్కెలు ఫలిస్తాయని గిరిజనుల నమ్మకం. తీజ్ బుట్టలతో తండాలో డప్పులతో గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించి రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బావిలో నిమజ్జనం చేశారు.