హెచ్‌ఎం రామారావు
వైరా రూరల్: విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ హెచ్‌ఎం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కీచకు డిలా తయారయ్యాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాలాది రామారావు పాఠాలు బోధించే సమయంలో తమ చేతులు పట్టుకోవడమే కాకుండా శరీరంపై తడుముతున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ సినిమా ప్రదర్శనకు తీసుకెళ్లిన క్రమంలోనూ పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, పాఠశాలలో విద్యార్థులతో కాళ్లు పట్టించుకుంటున్నాడని వారు చెప్పారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు.
పాఠశాలకు వస్తుండగా..
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్‌ఎం రామారావు తీరుతో ఆగ్రహంగా ఉన్న తల్లిదండ్రులు సోమవారం ఆయన పాఠశాలకు వస్తుండగా అడ్డుకున్నా రు. కారులో వస్తున్న ఆయనకు దేహశుద్ధి చేయడమే కాక సర్పంచ్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తల్లిదండ్రులు వినలేదు. వైరా, తల్లాడ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, సురేశ్‌లు అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా శాంతించలేదు.
హెచ్‌ఎంను తీసుకెళ్లేందుకు వీలులేదని తేల్చిచెప్పారు. చివరకు పోలీసులు హెచ్ ఎం రామారావును పెట్రోలింగ్ వాహనంలో తరలిస్తుండగా గ్రామస్తులు, తల్లిదండ్రులు వాహనం నుంచి ఆయనను బయటకు లాగి మరోమారు చితకబాదారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి హెచ్‌ఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment