Head Master
-
సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు తిరస్కరించారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సెలవివ్వడం కుదరదంటూ తెగేసి చెప్పారు. పాపం ఆ ఉపాధ్యాయుడు విధిలేక చేతికి ఐవీ డిప్ సెలైన్ పెట్టుకునే విధులకు హాజరయ్యారు. ఆయన ఆరోగ్యం విషమించడం చూసి తోటి వారే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బొలంగీర్ ప్రభుత్వ పాఠశాలలో విజయలక్ష్మి ప్రధాన్ హెడ్మాస్టర్ కాగా, ప్రకాశ్ భోయి గణితం టీచర్. ఇటీవల తన తాత అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన అనంతరం ప్రకాశ్ ఆరోగ్యం దెబ్బతింది. విధులకు హాజరు కాలేనందున, సెలవు ఇప్పించమంటూ ఆయన ప్రధానోపాధ్యాయినికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయం కాబట్టి, మ్యాథ్స్ టీచర్ అవసరం ఎంతో ఉంటుందని చెబుతూ ఆమె ఆ వినతిని తిరస్కరించారు.అయితే, ఎన్ని సార్లు కోరినా హెడ్మాస్టర్ వినిపించుకోకపోవడంతో ప్రకాశ్ భోయి చేతికి సెలైన్ పెట్టుకునే విధులకు వచ్చారు. ఆయన పరిస్థితి చూసి తోటి టీచర్లే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పటన్గఢ్ బ్లాక్ విద్యాధికారి(బీఈవో) ప్రసాద్ మాఝి స్పందించారు. కాజువల్ లీవ్ కోసం ప్రకాశ్ భోయి పంపించిన దరఖాస్తును ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మీ ప్రధాన్ ఎందుకు తిరస్కరించారనే విషయమై విచారణ చేపట్టామన్నారు. ఆమెదే తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. #ମିଳିଲାନି_ଛୁଟି #ସାଲାଇନ୍_ଧରି_ସ୍କୁଲରେ_ଶିକ୍ଷକଦେହ ଖରାପ ସତ୍ତ୍ବେ ମିଳିଲାନି ଛୁଟି। ମାନିଲେନି ପ୍ରିନ୍ସିପାଲ୍, ଶିକ୍ଷକ ହେଲେ ଗୁରୁତର। ସାଲାଇନ୍ ଲଗାଇ ସ୍କୁଲ ଦୁଆରେ ଛାଡ଼ିଲେ ପରିବାର। ଦେଖନ୍ତୁ ଏ ଦୃଶ୍ୟକୁ, ସ୍କୁଲ ଦୁଆରେ ଛିଡ଼ା ହୋଇଛନ୍ତି ଶିକ୍ଷକ। #Teacher #Leave #Saline #Controversy #Balangir #OTV pic.twitter.com/tlnV7Sxlvj— ଓଟିଭି (@otvkhabar) March 8, 2025 -
ఊరి జనానికి అడ్డంగా దొరికిపోయిన హెడ్ మాస్టర్
-
స్కూల్ హెడ్ మాస్టర్ కు టీడీపీ నేతల బెదిరింపులు
-
స్కూల్ హెచ్ఎంకు టీడీపీ నేతల బెదిరింపులు.. ఆడియో వైరల్
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపైనే దాష్టీకానికి దిగారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మేకలపల్లిలో స్కూల్ కమిటీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వ్యవహరించలేదని హెచ్ఎం గోవిందప్పపై సోమందేపల్లి టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం మాదే.. జాగ్రత్తగా ఉండాలంటూ టీచర్‌ను హెచ్చరించారు. టీడీపీ నేత సిద్ధలింగప్ప వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, మరోవైపు చిరుద్యోగులపై కూడా టీడీపీ నాయకులు ప్రతాపం చూపుతున్నారు. ఎమ్మెల్యే పీఏ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన అనిల్, బాలక్రిష్ణ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విభాగంలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కూ లేదు. అయితే అధికార టీడీపీ నాయకులు ఆ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ రంగు పులిమి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని నియమించేందుకు పావులు కదిపారు.ఎమ్మెల్యే పీఏ ద్వారా ఆదేశాలు అందుకున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులు ఇక నుంచి విధులకు రావొద్దని కార్మికులకు తెలిపారు. 2004 నుంచి పనిచేస్తున్న తనను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని వాటర్‌మెన్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉద్యోగంతోనే తాను భార్య, కుమారుడిని పోషించుకునేవాడినని, ఇప్పుడు జీవనం ఎలా సాగించాలో తెలియడం లేదని అన్నాడు.2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. 2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. -
హెచ్ఎం వేధింపులు.. జాబ్ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!
గౌరిబిదనూరు(బెంగళూరు): తాలకాలోని దారినాయకనపాళ్య (డి పాళ్య) గ్రామంలోని ప్రభుత్వ కర్ణాటక పబ్లిక్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడైన రాజేశ్ కాంట్రాక్టు టీచర్‌ను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అతని మాటలు వినకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడని దళిత సంఘర్ష సమితి కార్యకర్తలు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఆమెను వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో దషిస్తున్నాడని సమితి నేతలు ఆరోపించారు. ఇది తెలిసి తాలకా విద్యాశాఖ అధికారి శ్రీనివాసమూర్తి అక్కడకు చేరుకుని నిరసనకారులతో చర్చించారు. హెచ్ఎం పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రమిచ్చారు. సర్వశిక్షా అభియాన్ అధికారి గంగారెడ్డి పాల్గొన్నారు. చదవండి కిసాన్ మోర్చా మహిళా నేత ఆత్మహత్య.. బీజేపీ కీలక నిర్ణయం.. -
లైంగిక వేధింపులు.. హెడ్ మాస్టర్‌ను కర్రలతో చితకబాదిన అమ్మాయిలు
బెంగళూరు: పిల్లలకు పాఠాలు బోధించాల్సిన హెడ్ మాస్టర్ పైశాచికంగా ప్రవర్తించాడు. స్కూల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థినులు అంతా కలిసి అతనికి తగిన బుద్ధి చెప్పారు. తమను వేధిస్తున్న హెడ్ మాస్టర్ వద్దకు కర్రలతో వెళ్లి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కర్ణాటక మండ్య జిల్లా కట్టేరి గ్రామంలోని ఓ పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #mandya A senior teacher of a govt school in Kattigeri beaten up by students before handing him over to police.There were several complaints of sexual misconduct against Chinmayanand.Yesterday,students got together & hit him with sticks for harassing a girl student #Karnataka pic.twitter.com/ud2WSMCkLx — Imran Khan (@KeypadGuerilla) December 15, 2022 -
పిల్లలూ.. మనం జంతువులను పుస్తకాల్లోనే చూడాలేమో..!
హెచ్ఎం: పిల్లలూ... మీరెప్పుడైనా పులిని చూశారా... విద్యార్థులు: ఊహు.. చూడలేదు సార్... హెచ్ఎం: పోనీ.. ఏనుగునీ.. విద్యార్థులు: (లేదన్నట్టుగా తెల్ల మొహం) హెచ్ఎం: భవిష్యత్తులో మీరు వీటిని జూలో, పుస్తకాల్లోనే చూడాల్సిన పరిస్థితి రావొచ్చేమో.. విద్యార్థులు: ఎందుకు సార్? హెచ్ఎం: ఎందుకంటే... అడవులు నశించిపోవడంతో జంతు సంపద కూడా అంతరించిపోతోంది.. అంటూ అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం కొత్తపాలెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోసూరు రాము బోధించారు. విద్యార్థులతో జంతు మాస్క్‌లు ధరింపజేసి, ఆయన కూడా మాస్క్ వేసుకొని బోధన చేశారు. దేశంలో వేలల్లో ఉన్న జంతు సంపద వందల్లోకి చేరిందని.. ప్రస్తుత పరిస్థితులను విద్యార్థులకు వివరించారు. వినూత్న రీతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తిగా విషయాన్ని అర్థం చేసుకుంటారనే ఇలా చేశానని ఆయన చెప్పారు. (క్లిక్ చేయండి: కురమయ్య.. నీ ఆలోచన బాగుందయ్యా!) -
పాఠశాలకు కొడవలితో వస్తున్న ప్రధానోపాధ్యాయుడు
అస్సాంలోని ఒక ప్రాథమిక పాఠశాల హెడ్ మాష్టారు కొడవలితో రావడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదీగాక ఈ ఘటన గురించి పోలీసులుకు పలు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు హెడ్ మాష్టారుని ధృతిమేధ దాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. దాస్ ఆయుధాన్ని దాచేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. తాము ఆ పాఠశాలకు వెళ్లినప్పుడూ ఇతర టీచర్లు, పిల్లలు భయపడుతున్నట్లు గమనించామన్నారు. ఐతే సదరు హెడ్ మాష్టారు దాస్ ఇతర టీచర్లు విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో కాస్త అసహనానికి గురై కోపంగా ఉన్నట్లు కాచర్ జిల్లా పాఠశాలల డిప్యూటీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ హజారీ తెలిపారు. అదీగాక ఆ పాఠశాలలో ఏకంగా 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారని, అక్కడ ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే అవసరమని చెప్పారు. క్రమశిక్షణ కోసం దాస్ ఇలా ప్రవర్తించినట్లు హజరీ పేర్కొన్నారు. ఐతే హెడ్ మాష్టార్ దాస్‌పై ఇతర టీచర్లు, విద్యాశాఖ గానీ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం అతన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఐతే పోలీసులు అతని వద్ద నుంచి రెండు నోట్లు లభించాయి. వాటిలో తనకేదైనా జరిగితే ఆ నలుగురు టీచర్లే కారణమని, మరోక నోట్లో తాను ముగ్గురు టీచర్లను చంపాలనుకున్నట్లు రాశాడని తెలిపారు. (చదవండి: యాక్సిడెంట్‌గా చిత్రీకరించి మర్డర్‌కి ప్లాన్! మాజీ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ మృతి) -
హెచ్ఎం చనువుతో.. టీచర్‌గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్‌గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్‌గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్‌లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
కీచక హెచ్ఎంకు దేహశుద్ధి
వైరా రూరల్: విద్యాబుద్ధులు నేర్పించి వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన ఓ హెచ్ఎం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కీచకు డిలా తయారయ్యాడు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాలాది రామారావు పాఠాలు బోధించే సమయంలో తమ చేతులు పట్టుకోవడమే కాకుండా శరీరంపై తడుముతున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా గాంధీ సినిమా ప్రదర్శనకు తీసుకెళ్లిన క్రమంలోనూ పదో తరగతి విద్యార్థినుల మధ్యలో కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తించాడని, పాఠశాలలో విద్యార్థులతో కాళ్లు పట్టించుకుంటున్నాడని వారు చెప్పారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు ఆదివారం సాయంత్రం ఎంఈఓ కొత్తపల్లి వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వస్తుండగా.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న హెచ్ఎం రామారావు తీరుతో ఆగ్రహంగా ఉన్న తల్లిదండ్రులు సోమవారం ఆయన పాఠశాలకు వస్తుండగా అడ్డుకున్నా రు. కారులో వస్తున్న ఆయనకు దేహశుద్ధి చేయడమే కాక సర్పంచ్ ఇంట్లో నిర్బంధించారు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా తల్లిదండ్రులు వినలేదు. వైరా, తల్లాడ ఎస్సైలు శాఖమూరి వీరప్రసాద్, సురేశ్‌లు అక్కడికి చేరుకుని సర్దిచెప్పినా శాంతించలేదు. హెచ్ఎంను తీసుకెళ్లేందుకు వీలులేదని తేల్చిచెప్పారు. చివరకు పోలీసులు హెచ్ ఎం రామారావును పెట్రోలింగ్ వాహనంలో తరలిస్తుండగా గ్రామస్తులు, తల్లిదండ్రులు వాహనం నుంచి ఆయనను బయటకు లాగి మరోమారు చితకబాదారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి హెచ్ఎంను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ప్రధానోపాధ్యాయుడి పాడుపని.. మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..
వేలూరు(చెన్నై): వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని మాచంబట్టి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో పేర్నంబట్టు సమీపంలోని ఆలయ వీధికి చెందిన పాల్ వణ్ణన్ హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఈ పాఠశాలలో చుట్టు పక్కలున్న గ్రామాల నుంచి మొత్తం 75 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇదిలా ఉండగా హెచ్ఎం పాల్ వణ్ణన్ ఓ విద్యార్థినితో మాట్లాడాలని చెప్పి తన గదిలోకి పిలిపించుకుని లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన ఆమె తండ్రి హెచ్ఎంపై దాడి చేసి అనంతరం ఉమరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి పోక్సో చట్టం కింద హెచ్ఎం పాల్వణ్ణన్ను అరెస్ట్ చేశారు. చదవండి: Ananthapur Woman Suicide: అలాంటి తప్పు చేయాల్సి వస్తే చావడానికైనా సిద్ధం.. -
స్టడీ అవర్‌కు రాలేదని చితగ్గొట్టిన హెచ్ఎం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: స్టడీ అవర్‌కు రాలేదనే కోపం తో ఒక ప్రధానో పాధ్యా యుడు నలుగురు విద్యార్థులను కట్టెతో చితక బాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ బాలుర హాస్టల్లో బుధవారం ఉదయం 8.30 గంటలకు స్టడీ అవర్ ఏర్పాటు చేశారు. కానీ తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, నవీన్, దీపక్, పవన్ నాయక్ రాలేదు. ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు వారిని పిలిపించారు. స్టడీ అవర్‌కు ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెత్తంతో విద్యార్థుల వీపులు, చేతులపై కొట్టడంతో వాతలు తేలాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారితో పాటు గిరిజన సంఘం నేత రమేష్ తదితరులు హాస్టల్‌కు చేరుకుని ప్రధానోపాధ్యాయుడితో గొడవకు దిగారు. దీనిపై హెచ్ఎం బుచ్చిరాములును వివరణ కోరగా విద్యార్థులు స్టడీ అవర్‌కు రాలేదని, క్రమశిక్షణతో ఉండాలనే కొట్టాను తప్ప మరో ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. -
విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..
కెలమంగలం(బెంగళూరు): ఏడో తరగతి విద్యార్థినిపై పాఠశాల హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు హెచ్ఎంకు దేహశుద్ధి చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. అంచెట్టి సమీపంలోని కొప్పగరై ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో డెంకణీకోటకు చెందిన లారెన్స్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 7వ తరగతి విద్యార్థినిని గురువారం మాట్లాడాలని ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక తప్పించుకొని ఇంటికి వెళ్లి ఇకపై పాఠశాలకు వెళ్లనని తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. బాలిక బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డెంకణీకోట మహిళా పోలీసులు లారెన్స్‌ను అరెస్ట్ చేసి హోసూరు జైలుకు తరలించారు. సదరు హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ డెంకణీకోట విద్యా జిల్లా అధికారి అన్బళగన్ ఆదేశాలు జారీ చేశారు. మరో ఘటనలో.. డాప్ పేరుతో దోపిడీ యశవంతపుర: కోరమంగలలో ఒక సంస్థలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న దినేశ్ గురువారం రాత్రి 12 గంటల సమయంలో విధులు ముగించుకొని వీరభద్రేశ్వరనగరకు వెళ్లడానికి నాయండహళ్లి సర్కిల్లో వేచి ఉన్నాడు. డ్రాప్ చేస్తామని కొందరు వ్యక్తులు అతన్ని కారులో ఎక్కించుకొని కత్తి చూపించి రూ.3వేల నగదు లాక్కొని అతన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో వాహనాన్ని వదలి ఉడాయించారు. గిరి నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ట్రైనింగ్ విద్యార్థిని.. ఇంటికి వస్తేనే సంతకాలు పెడతానంటూ..
సాక్షి,సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది గురువులు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ కోసం వచ్చిన బీఈడీ విద్యార్థినిని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని బుధవారం డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విద్యార్థిని సూర్యాపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. బీఈడీ టీచింగ్ ట్రైనింగ్‌లో భాగంగా 20రోజులుగా జిల్లా కేంద్రంలోని నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలకు వస్తోంది. ట్రైనింగ్ పూర్తవ్వడంతో çసంబంధిత పాఠశాల హెచ్ఎం ట్రైనింగ్ పూర్తిచేసినట్లు రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే సదరు విద్యార్థిని రెండు మూడు సార్లు హెచ్ఎం దగ్గరకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించింది. తన రికార్డులపై సంతకాలు చేయాలని కోరగా ఇంటికి వస్తే గాని సంతకాలు చేయనని హెచ్ఎం ఫోన్లోనే అసభ్యంగా మాట్లాడినట్లు ఆ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రైనింగ్‌కు వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం తనను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తెలిపింది. హెచ్ఎంపై దాడి..? హెచ్ఎం చేష్టలకు విసిగిపోయిన సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో వారు హెచ్ఎంపై దాడి చేసినట్లు సమాచారం. హెచ్ఎంపై దాడి చేసి అక్కడ నుంచి వచ్చి డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హెచ్ఎంపై బీఈడీ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత హెచ్ఎంపై విచారణ చేపట్టి.. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –అశోక్, డీఈఓ చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. -
కీచక హెచ్ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్
మైసూరు: పవిత్రమైన గురువు వృత్తిలో ఉండి, ఓ విద్యార్థినితో రాసలీలలు సాగిస్తున్న హెడ్మాస్టర్ నీచ ఉదంతమిది. ఈ ఘటన మైసూరు జిల్లా హెచ్డీ కోటె తాలూకాలో వెలుగు చూసింది. విద్యార్థినితో రాసలీలలు చేస్తున్న వీడియోలు వాట్సప్‌లో వ్యాప్తి చెందడంతో ఆ హెచ్ఎంపై ప్రజలు భగ్గుమంటున్నారు. మైసూరువ్యాప్తంగా ఆ వీడియోలు వైరల్ కావడంతో బాలిక కుటుంబం తలెత్తుకోలేకపోతోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న జిల్లా విద్యాధికారి స్పందించారు. త్వరలోనే పాఠశాలను సందర్శిస్తానని, వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..) -
అడుగులో అడుగై.. అమ్మలా తానై
గడివేముల: వారిద్దరూ భార్యాభర్తలు..కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్నారు. ఉన్నట్టుండి వారి జీవితంలో ఒక ఉపద్రవం వచ్చి పడింది. అనారోగ్యంతో భర్త అచేతన స్థితిలోకి వెళ్లారు. దీంతో భార్య అమ్మలా మారారు. భర్తకు అన్ని సపర్యలు చేస్తున్నారు. ఆకలేస్తే అన్నం తినిపిస్తున్నారు. బాధ వస్తే ఓదార్చుతున్నారు. కన్నీళ్లు వస్తే తుడుస్తున్నారు. ఏదైనా ప్రదేశాన్ని చూడాలనిపిస్తే కారులో తీసుకెళ్తున్నారు. చదవండి: పరీక్ష ఫలితాల వెల్లడిలో జేఎన్టీయూ(ఏ) కొత్త ఒరవడి తన భుజం సాయంతో భర్తను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాలిన్యం లేని ఆమె మంచితనం...భర్త మనసు తెలిసి మసలుకునే లాలిత్యం ఆదర్శంగా నిలిచాయి. అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్న ఈ రోజుల్లో భర్తకు అమ్మలా సేవలు చేస్తున్న గడిగరేవుల జిల్లా పరిషత్ హైసూ్కల్ ప్రధానోపాధ్యాయురాలు వసుంధరా దేవి స్ఫూర్తిగా నిలిచారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన అరవింద పంచరత్నంతో కర్నూలుకు చెందిన ఈమెకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. పంచరత్నం గ్రామంలో వ్యవసాయం చేసేవారు. విమలా వసుంధరాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. వీరు నంద్యాలలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె డాక్టర్‌గా, మరో కుమార్తె, కుమారుడు బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి పెళ్లిళ్లు సైతం అయ్యాయి. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో మధుమేహ వ్యాధితో పంచరత్నం కాళ్లు చేతులు చచ్చుబడి నడవలేని స్థితిలోకి వెళ్లారు. షుగర్ వ్యాధి తీవ్రత అధికం కావడంతో ఆయన ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి నడవలేని స్థితిలో ఉన్న భర్తకు విమలా వసుంధరాదేవి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు షుగర్ స్థాయిని పరీక్షిస్తూ..సమయానికి మాత్రలు ఇస్తున్నారు. తనతో పాటు కారులో పాఠశాలకు తీసుకెళ్లి, మధ్యాహ్న సమయంలో గోరుముద్దలు తినిపిస్తూ చిన్నపిల్లాడిలా భర్తను చూసుకుంటున్నారు. కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతంలో ఉన్నారని, భర్తకు సపర్యలు చేయడంలో తాను ఆనందాన్ని వెతుక్కుంటున్నానని విమలా వసుంధరాదేవి తెలిపారు. -
పెద్దసారు పాడుబుద్ధి.. విద్యార్థినులు బడికి వెళ్లకపోవడంతో..
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): గురుశిష్యుల సంబంధానికి మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన బంధువులు సదరు హెచ్ఎంను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో బడితపూజ చేశారు. ఈ ఘటన చింతలపాలెం మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కొందరు విద్యార్థులు పక్క గ్రామమైన తమ్మారం ప్రాథమిక పాఠశాలకు కాలినడకన వెళ్లి చదువుకుంటున్నారు. చదవండి: ఫేస్బుక్ స్నేహం.. అశ్లీల వీడియోలతో మోడల్‌కు బెదిరింపులు రెండు రోజులుగా ఇద్దరు విద్యార్థినులు పాఠశాలకు వెళ్లకపోవడంతో కుటంబ సభ్యులు ఆ అమ్మాయిలను నిలదీశారు. దీంతో వారు హెచ్ఎం అనిల్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. దీంతో వారు హెచ్ఎంను నిలదీయండంతో నిర్లక్ష్యంగా సమాధాన మిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన వారు ఆయనపై దాడిచేశారు. హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపారు. చదవండడి: వీడియో వైరల్: మైనర్ బాలికపై గ్రామస్తుల అకృత్యం.. ప్రియుడితో పారిపోయిందని.. -
కోవిడ్: శుభ్రత.. హెచ్‌ఎంలదే బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు బాధ్యతలు మరిన్ని పెరగనున్నాయి. ఈ దిశగా త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను విద్యాశాఖ రూపొందించింది. మార్పుచేర్పుల తర్వాత ప్రభుత్వ ఆమోదం తీసుకుని ఆదేశాలివ్వనున్నట్లు విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభం, మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు. వీటిని పరిష్కరించగల సమర్థత ప్రధానోపాధ్యాయుడికే ఉంటుందని భావించారు. ఇందులో కోవిడ్ నిబంధనల అమలే కీలకంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి గతం లోనే ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడ్డాయి. పాఠశాలల్లో శానిటైజేషన్, మధ్యాహ్న భోజన పథకం అమలులో అనుసరించాల్సిన జాగ్రత్తలపై ఇందులో ప్రస్తావించారు. ప్రత్యక్ష బోధన చేస్తున్న పాఠశాలల్లో కొన్నిచోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఎక్కువ మందికి వ్యాపించడానికి శానిటైజేషన్ లోపమే కారణమని అధికారులు గుర్తించారు. కానీ పూర్తి బాధ్యులెవరనేది తేల్చడం కష్టమైంది. సమష్టిగా జరిగిన చర్యలకు ఒకరిని ఎలా బాధ్యులను చేస్తారనే ప్రశ్న తలెత్తింది. దీనిపై ఉన్నతాధికారులు చర్చించి, కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించారు. కొత్త మార్గదర్శకాలు.. ►పాఠశాల పరిశుభ్రతకు హెచ్ఎం బాధ్యత తీసుకోవాలి. స్థానిక పారిశుధ్య సిబ్బంది శానిటైజేషన్ విధులను నిర్వర్తించలేని పరిస్థితి ఉంటే హెచ్ఎం ఉన్నతాధికారుల దృష్టికి తేవాలి. కాగా, తమ పరిధిలో లేని పారిశుధ్య కార్మికుడిపై తామెలా ఫిర్యాదు చేస్తామని హెచ్ఎం అడుగుతున్నారు. అలా చేస్తే రాజకీయ వివాదాలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ►విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గమనించడం, అవసరమైన పరీక్షలు చేయించడమూ హెచ్ఎం బాధ్యతే. లక్షణాలు కన్పిస్తే పరీక్షలు చేయించడం, మిగతా విద్యార్థులనూ పరీక్షించడం వం టివి చేయాలి. అయితే ఈ పనులన్నీ హెచ్ఎం చేస్తే ఇతర విధుల మాటేంటని ప్రశ్నిస్తున్నారు. ►మధ్యాహ్న భోజనంలో హెచ్ఎం పాత్రను కీల కం చేయబోతున్నారు. పదార్థాలు శుభ్రంగా ఉం డేలా చర్యలు తీసుకోవాలి. పదార్థాలు ఎక్కడి నుంచి తెప్పించేది రికార్డు చేయాలి. వంట తయారీలో పాల్గొనే వారి ఆరోగ్య పరిస్థితిని గమనించాలి. ప్రతికూల పరిస్థితులు వస్తే తాము బలి అవుతామని హెచ్ఎంలు అంటున్నారు. నిధుల్లేకుండా బాధ్యతలేంటి?: జంగయ్య కోవిడ్ నిబంధనల అమలుకు అవసరమైన శానిటైజేషన్‌కు ప్రభుత్వం ముందుగా నిధులివ్వాలి. చాలామంది హెచ్ఎంలు విధిలేని పరిస్థితుల్లో వారి సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం ముందు కార్యాచరణపై దృష్టి పెట్టాలి. శానిటైజేషన్‌కు నిధులిచ్చాక హెచ్ఎంలను బాధ్యులను చేస్తే ఇబ్బంది ఉండదు. -
సాయం చేయబోతే..ఫోన్ మాయం
సాక్షి, కల్లూరు (ఖమ్మం): బైక్‌పై నుంచి పడిన వ్యక్తిని పైకి లేపుదామని సాయం చేయబోయిన హెచ్ఎం ఫోన్ అపహరణకు గురైంది. నారాయణపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వంగా రామారావు పెనుబల్లి నుంచి వచ్చి మంగళవారం కల్లూరులోని ఎన్నెస్పీ బస్టాప్ వద్ద దిగారు. అకస్మాత్తుగా బైక్‌పై వచ్చిన ఓ యువకుడు అక్కడే కిందపడ్డాడు. ‘అబ్బా..లేపండి సార్’ అంటూ కోరడంతో సాయం చేస్తుండగా..అంతలోనే మరో వ్యక్తి వచ్చి చేరాడు. అతడిని పైకిలేపుతున్నట్లు నటిస్తూ రామారావు చొక్కా జేబులో ఉన్న రూ.30వేల ఫోన్‌ను తస్కరించి..అంతకుముందే పడిన యువకుడితో కలిసి పరారయ్యారు. కాసేపటి తర్వాత ఈయన తేరుకుని గుర్తించి..ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే..సాంకేతిక లోపంతో 15రోజులుగా సీసీ కెమెరాలు పని చేయట్లేదని వారు తెలపడంతో..ఉసూరుమంటూ నారాయణపురంలో పాఠశాల విధులకు వెళ్లిపోయారు. చదవండి: సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం -
ప్రధానోపాధ్యాయుడి కీచక బుద్ధి.. వ్యాక్సినేషన్ వేయడానికి వచ్చిన నర్స్పై..
బెంగళూరు: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్లు వేసుకునే విధంగా.. ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన హెల్త్ సెంటర్ ఉద్యోగిని పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమానుషంగా ప్రవర్తించి.. అశ్లీల సందేశాలను పంపించాడు. బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఈ సంఘటన బెళగావిలోని దేగాం ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగిని గత రెండు వారాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ లు వేస్తుంది. ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ చావలాగి .. మహిళా ఉద్యోగి సెల్‌ఫోన్ నంబర్‌ను సంపాదించాడు. ఆ తర్వాత.. ప్రతిరోజు ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. అంతటితో ఆగకుండా.. అశ్లీల సందేశాలు, ఫోటోలు పంపుతూ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధించసాగాడు. దీంతో ఆమె అతనికి ప్రవర్తన మార్చుకోవాలని కోరింది. అయినప్పటికి అతగాడు తన వక్రబుధ్ది మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె బంధువులు, స్నేహితులకు వేధింపుల విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలో వారంతా కలిసి గడిచిన బుధవారం (ఆగస్టు4) ప్రధానోపాధ్యాయుడి ఛాంబర్‌కు చేరుకుని ఆ కీచకుడిని గదిలో బంధించారు. ఆ తర్వాత అతడికి దేహశుద్ధి చేశారు. అయితే, తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితుడిని సస్పెండ్ చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కాగా, బాధితురాలు సురేష్ చావలాగిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పీఎస్‌హెచ్‌ఎం పోస్టులు ఇచ్చేదెప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (పీఎస్‌హెచ్‌ఎం) పోస్టులకు మోక్షం లభించడం లేదు. 10 వేల ప్రాథమిక పాఠశాలల్లో పీఎస్‌హెచ్‌ఎంలను నియమిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మూడు నెలల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ఆయా స్కూళ్లలో ఇప్పటికే ఉన్న హెడ్ మాస్టర్ పోస్టులు, తాజాగా ఇంకా ఎన్ని పోస్టులు మంజూరు చేయాలన్న అంశాలపై వివరాలను సేకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని 18,217 ప్రాథమిక పాఠశాలల్లో 4,429 లో–ఫిమేల్ లిటరసీ (ఎల్ఎఫ్ఎల్) హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నట్లు తేల్చింది. సీఎం కేసీఆర్ 10 వేల స్కూళ్లలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో మరో 5,571 పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని, ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం లేకుండాపోయింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 4,429 ప్రధానోపాధ్యాయ పోస్టులు పోగా, మిగతా పోస్టులను మంజూరు చేస్తారా? లేదంటే వాటికి అదనంగా కొత్తగా 10 వేల పోస్టులను మంజూరు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. జిల్లాల వారీగా పోస్టులు జిల్లా పాత కొత్త మొత్తం పోస్టులు పోస్టులు ఆదిలాబాద్ 484 613 1,097 హైదరాబాద్ 168 205 373 కరీంనగర్ 562 709 1,271 ఖమ్మం 460 581 1,041 మహబూబ్‌నగర్ 580 731 1,311 మెదక్ 426 535 961 నల్లగొండ 500 629 1,129 నిజామాబాద్ 389 485 874 రంగారెడ్డి 369 466 835 వరంగల్ 491 617 1,108 మొత్తం 4,429 5,571 10,000 -
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన హెచ్ఎం
సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్‌ఎన్‌వీఆర్ హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్‌వీఎన్‌ఆర్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్‌ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్‌కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
కీచక హెచ్ఎం రిమాండ్
ప్రకాశం, చీరాల రూరల్: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కీచక హెచ్ఎం జె.నాగభూషణాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఈపురుపాలెం ఎస్ఐ వి.సుధాకర్ గురువారం తెలిపారు. ఈపురుపాలెం పద్మనాభుని పేటలోని ఎంపీపీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులతో ఆ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగభూషణం కొంతకాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. భయాందోళన చెందిన విద్యార్థినులు పాఠశాలలో జరుగుతున్న విషయాలను తమ తల్లిదండ్రులకు చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి హెచ్ఎంను నిలదీసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థినులతో హెచ్ఎం వెకిలి చేష్టలు
చీరాల రూరల్: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడే ఆ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కీచకుడిలా మారడంతో స్థానికులు ఆ అయ్య వారిని పాఠశాలలోనే చితకబాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన మంగళవారం ఈపురుపాలెంలో జరిగింది. విద్యార్థినుల తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం.. ఈపురుపాలెం పద్మనాభునిపేట మండల పరిషత్ పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న జె.నాగభూషణం కొంతకాలంగా మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. వికృత చేష్టలు చేస్తున్నాడు. విద్యార్థినులకు ముద్దులు పెట్టడం వంటి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు భరించలేని అభంశుభం తెలియని చిన్నారులు స్కూల్లో జరుగుతున్న అకృత్యాలను తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడ్డారు. తల్లిదండ్రుల్లో కట్టలు తెచ్చుకున్న ఆగ్రహం చిన్నారుల ఆవేదనను విన్న తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మంగళవారం పాఠశాలకు చేరుకుని హెచ్ఎం నాగభూషణాన్ని ప్రశ్నించారు. అనంతరం హెచ్ఎంను చితకబాదారు. అంతటితో ఆగని తల్లిదండ్రులు ఈపురుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి, ఎస్ఐ వి.సుధాకర్, మండల విద్యా శాఖాధికారిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. విద్యార్థినులు, తల్లిదండ్రులతో విడివిడిగా మాట్లాడారు. కీచక హెచ్ఎం నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హెచ్ఎంపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి తెలిపారు. -
హెచ్ఎం అసభ్యప్రవర్తనపై ఆగ్రహం
తూర్పుగోదావరి, రాజోలు: విద్యార్థినుల ఆలనా...పాలనా చూసుకోవాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే వక్రబుద్ధితో విద్యార్థినులు చెప్పుకోలేని విధంగా లైంగిక వేధింపులకు పాల్పడడంతో గ్రామస్తులు ఆగ్రహించి ఆ ఉపాధ్యాయుడిపై తిరగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజోలు మండలం బి.సావరం యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.సుబ్రహ్మణ్యం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిసిన తల్లిదండ్రులు కోపోద్రిక్తులై శుక్రవారం పాఠశాలను చుట్టుముట్టారు. చీటికిమాటికీ కొట్టడంతోపాటు బెదిరిస్తున్నారని ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినులను సచివాలయంలోని మహిళాసంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)కు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని పట్టుపట్టారు. పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తీరుపై మండల విద్యాశాఖాధికారి గోపాలకృష్ణ విచారణ నిర్వహించి నివేదికను డీఈవోకు అందజేశారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎస్.శంకర్ తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హెచ్ఎం సస్పెన్షన్ బి.సావరం యూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం సస్పెండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు రావడంతో హెచ్ఎంపై ఈమేరకు చర్యలు తీసుకున్నారు. ఉపాధ్యాయులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. -
స్కూల్ యూనిఫాంలో ప్రధానోపాధ్యాయుడు
సాక్షి, కేసముద్రం: విద్యార్థులు వేసుకునే స్కూల్ యూనిఫాంనే తానూ కుట్టించి ధరించాడు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నర్సింహులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొడిపాక రమేశ్. శుక్రవారం ఆయన యూనిఫాంతో విధులకు హాజరు కావడంతో విద్యార్థులంతా ఆశ్చర్యంగా చూశారు. అనంతరం హెచ్ఎం పిల్లలతో కలసి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. బుధ, శనివారం మినహా మిగతా అన్ని రోజులు స్కూల్ యూనిఫాం వేసుకునే వస్తానని హెచ్ఎం చెప్పారు. ఎలాంటి అసమానతలు లేకుండా విద్యార్థుల్లో కలసిపోయి వారికి విద్యాబుద్ధులు నేర్పడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేశ్ చెప్పారు. -
సీఎం కార్యాలయ ఆదేశాలు బేఖాతరు
సాక్షి, తాడిపత్రి: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారిని లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరగకుండా పటిష్టమైన భద్రతను తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇందులో బాగంగానే ‘దిశ’ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్నలనే కాకుండా యావత్ దేశ ప్రజల మన్నలను అందుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి. అయితే దిశ చట్టానికి కొందరు అధికారులు, పోలీసులు తూట్లు పొడుతున్నారు. తాడిపత్రి పట్టణంలోని ప్రకాశం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్ తోటి ఉపాధ్యాయులను లైంగికంగా వేధించడం సంచలనమైంది. దీనిపై గత ఏడాది డిసెంబర్ 9న పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగికంగా వేధింపులపై కేసు రిజిష్టర్ అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు కీచకోపాధ్యాయునిపై చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. అప్పటి నుంచి మెడికల్ లీవుపై వెళ్లిన నటరాజ్.. ఉన్నట్లుండి శనివారం పాఠశాలలో ప్రత్యక్షమయ్యాడు. మీడియా కనిపించగానే బయటకు వెళ్లిపోతున్న నటరాజ్ సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడినా... కీచకోపాధ్యాయుడు నటరాజ్‌పై చర్యలు తీసుకుని వెంటనే విధుల నుండి సస్పెన్షన్ చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆదేశాలు వెలువడినా స్థానిక మున్సిపల్ అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 11న స్థానిక మున్సిల్ అధికారులు ప్రకాశం ఉన్నత పాఠశాలకు వెళ్ళి నటరాజ్ వ్యవహారంపై విచారణ జరిపి ఆర్డీకి నివేదికను అందజేశారు. కానీ ఇంత వరకు కీచకోపాధ్యాయునిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఎవరీ అంతుపట్టడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా విధుల్లోకి.. సాధారణంగా మున్సిపల్ పరిధిలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు మెడికల్ లీవుపై వెళ్ళి వచ్చిన తరువాత తిరిగి తన విధుల్లోకి హాజరుకావాలంటే ముందుగా స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు తన ఫిట్నెస్ సర్టిఫికెట్ అందజేసి ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుని నుండి భాద్యతలను స్వీకరించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా శనివారం ఉదయం కీచకోపాధ్యాయుడు నటరాజ్ పాఠశాలలో విధులకు హాజరవడంతో అక్కడున్న ఉపాధ్యాయులు అవాక్కైయ్యారు. మీడియాకు చూసి అక్కడి నుంచి పరారైన నటరాజ్ .. ఆదివారం ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ పొంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. కాపాడుతున్న ఖాకీలు ! చట్టం దృష్టిలో అందరూ సమానులే అని నీతులు చెప్పే పోలీసులు సదరు కీచకోపాధ్యాయుడు చూపిస్తున్న చూపిస్తున్న ఉదాసీనతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సత్వరమే భాదిత మహిళలకు న్యాయం చేయాలని సీఎం.వైఎస్ జగన్, హోంమంత్రి సుచరితతో పాటు, జిల్లా ఎస్పీ సత్యయేసుబాబులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ తాడిపత్రి పోలీసులు మాత్రం ఆ కీచకోపాధ్యాయుడిని ఇంత వరకు అరెస్టు కూడా చేయకపోవడంతో పాటు తమకేమి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నారు. అందరి ఆదేశాలను తుంగలో తొక్కి కీచకోపాధ్యాయుడు ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం కల్పించారన్న ఆరోపణలున్నాయి. మహిళలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు కీచకోపాధ్యాయునికి అండగా నిలవడం సరికాదని అంటున్నారు. -
పాఠశాలలో హెచ్ఎం భర్త దాష్టీకం
జయపురం: సభ్యసమాజం తలదించుకునే సంఘటన కొరాపుట్ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. సేవాశ్రమ పాఠశాల హాస్టల్లో ఉంటున్న విద్యార్థినులకు రక్షణగా ఉండాల్సిన వారే భక్షకులుగా మారారు. దీంతో కామాంధుల దాష్టీకానికి బలైన ఓ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చింది. బాలికను పరీక్షించిన డాక్టర్లు మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ విషాద సంఘటన జయపురం సబ్‌డివిజన్ పుంపుణి గ్రామంలో గల సేవాశ్రమ పాఠశాలలో జరిగింది. ఈ విషయం బయటకు పొక్కగానే సంబంధిత అధికారుల్లో కదలిక ప్రారంభమైంది. ఆ విద్యార్థిని ఎవరి వల్ల గర్భం దాల్చిందన్నది స్పష్టం కాకపోయినా ఆశ్రమ పాఠశాల ప్రధాన అధ్యాపకురాలి భర్తతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిçస్తున్నారు. మూడు రోజుల కిందట ఆ పాఠశాలలో ఒక విద్యార్థిని గర్భవతి అయిందన్న విషయం పాఠశాల అధికారుల దృష్టికి వచ్చింది. అయితే ఆ విషయాన్ని మరుగు పరిచేందుకు బయటకు పొక్కనివ్వలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత దాచి పెడదామన్నా పాఠశాల విద్యార్థిని గర్భిణి అయిందన్న విషయం బయటకు పొక్కింది. గజలబడి ఆదివాసీ గ్రామంలో దిక్కుతోచని స్థితిలో గిరిజనులు దీంతో ఈ విషయం ప్రజలలో చర్చనీయాంశంగా మారడంతో జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీఓ తక్షణమే దృష్టి సారించి సేవాశ్రమ పాఠశాలకు వచ్చి హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ బాలిక మూడు నెలులగా శానిటరీ నేప్కిన్స్ తీసుకువెళ్లడం లేదని రికార్డులు పరిశీలించి తెలుసుకున్నారు. వెంటనే వారు ఆ విద్యార్థినిని జయపురంలోని ఫుల్‌బెడలో గల కొరాపుట్ జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఆ బాలికను పరీక్షించిన డాక్టర్ ఆమె మూడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. దీంతో ఆ విషయం ఆశ్రమ పాఠశాల గోడలు దాటి బయటకు పొక్కింది. విద్యార్థిని గర్భిణి అయిందన్న విషయం తెలిసిన ఉన్నతాధికారులు కంగుతిన్నారు. వెంటనే జయపురం సమగ్ర గిరిజనాభివృద్ది ప్రాజెక్టు అధికారి గోపీనాథ్ సరక, కొరాపుట్ జిల్లా శిశు సురక్షా అధికారి శుభశ్రీ దాస్, సీడబ్ల్యూసీ అధ్యక్షురాలు గాయత్రి దేవి తదితరులు సేవాశ్రమ పాఠశాలకు వెళ్లారు. ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గర్భిణి అన్న విషయం నిర్ధారణ చేసుకునేందుకు మరోసారి ఆ విద్యార్థినిని హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఆమె గర్భవతి అని మరోసారి డాక్టర్లు నిర్ధారించడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సేవాశ్రమ పాఠశాలలో దర్యాప్తు ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల, హాస్టల్ సిబ్బంది, గర్భం దాల్చిన విద్యార్థిని, సహచర విద్యార్థినులను విచారణ చేశారు. అనంతరం పోలీసులు ఆశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుఖాంతి రథ్ భర్తను, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బాలికకు ప్రేమ వ్యవహారం? స్టేషన్లో వారిని విచారణ చేయగా ఆ బాలిక గర్భిణి అయ్యేందుకు గల కారణాలు వెల్లడి కాలేదు. అయితే పోలీసులు అన్ని కోణాల నుంచి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో మరి కొన్ని అనుమానాలు వినిపించాయి. ఆ విద్యార్థిని దసరా సెలవులకు ఇంటికి వెళ్లిందని పంపుణి ప్రాంతంలో ఒక యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం ఉందన్న విషయం తెలియడంతో ఆ కోణంలో కూడా పోలీసులు ఆ యువకుడిని కూడా విచారణ చేశారు. అయితే ఏ ఆధారమూ లభించక పోవడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆఖరికి ఆ విద్యార్థిని గర్భిణి అయ్యేందుకు సేవాశ్రమ పాఠశాల ప్ర«ధానోపాధ్యాయురాలి భర్త రాజేంద్ర రథ్ కారణమని పోలీసులు ధ్రువీకరించారు. ఈ మేరకు రాజేంధ్ర రథ్(60)ను, నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు జయపురం స»బ్‌డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయం పోలీసు అధికారి జి. వరుణ్ విలేకరులకు శుక్రవారం వెల్లడించారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
లాడ్జీలో ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం ఆత్మహత్య
సాక్షి, జహీరాబాద్: మతి స్థిమితం సరిగ్గా లేక మానసికంగా బాధపడుతున్న వికారాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జహీరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ– 2 విఠలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం క్యాద్గిరాకు చెందిన మోసీన్ (34) అల్లాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతడికి కొన్ని రోజుల నుంచి మతి స్థిమితం సక్రమంగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎక్కడెక్కడో తిరిగేవాడు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వికారాబాద్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి అదే రోజు రాత్రి జహీరాబాద్‌కు చేరుకున్నాడు. అక్కడ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న తిరుమల లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తనకు జీవితంపై విరక్తి వచ్చిందని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కుటుంబసభ్యులకు మెసేజ్ పెట్టి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అన్న అబ్దుల్ మోహిజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య బషీరాబాద్ ఉర్దూ మాధ్యమం పాఠశాలలో వలంటీర్‌గా పని చేస్తోంది. కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరు బషీరాబాద్: జహీరాబాద్‌లో మోసీన్(38) ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి స్వగ్రామం క్యాద్గిరలో విషాదం అలుముకుంది. జహీరాబాద్‌లో పోలీసులు మృతదేహం అప్పగించడంతో గురువారం రాత్రి క్యాద్గిరకు చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యతో బషీరాబాద్ మండల ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని మోసీన్‌కు నివాళులర్పించారు. -
హెచ్ఎం వర్సెస్ టీచర్
విద్యారణ్యపురి: కడిపికొండలోని జిల్లాపరిషత్ హైస్కూల్లోని హెచ్ఎం జయమ్మ, అదే స్కూల్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా వెంకటకరుణాకర్‌కు మధ్య కొంత కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ఇరువురు పరస్పరం డీఈఓకు ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెంకటకరుణాకర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోగా.. బెరింపులకు గురిచేస్తున్నారని హెచ్ఎం జయమ్మ 15సార్లకు పైగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోకున్నా.. చార్జెస్ ప్రేమ్ చేశారని తెలిసింది. మరోవైపు వెంకటకరుణాకర్ కూడా హెచ్ఎం జయమ్మపై డీఈఓకు పలు ఆరోపణలతో ఫిర్యాదు చేశారని తెలిసింది. ఇరువురి ఫిర్యాదులపై డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ కార్యదర్శి రమేష్‌బాబుతో పరిశీలన చేయించారు. ఈ అంశంపై ఆయన నివేదిక ఇవ్వగా... హెచ్ఎం జయమ్మ చెప్పినట్లు ఉపాధ్యాయుడు వినడం లేదని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తాం కడిపికొండ జెడ్పీ హైస్కూల్లో హెచ్ఎం జయమ్మ, వెంకటకరుణాకర్‌కు మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరిపించాక వెంకటకరుణాకర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి వివరణ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితమే ఆయనపై చార్జెస్ ఫ్రేమ్ చేశామన్నారు. ఒకటి, రెండురోజుల్లో విద్యాశాఖకు సబంధించిన వారితో విచారణ జరిపించాక చర్యల్లో భాగంగా ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు కడిపికొండ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం జయమ్మ ఈనెల 13న సంబంధిత పరిధిలోని పోలీస్టేషన్లో మ్యాథ్స్ స్కూల్‌అసిస్టెంట్ వెంకటకరుణాకర్‌పై ఫిర్యాదు చేశారు. పాఠశాలలో తన వద్దకు వెంకటకరుణాకర్ వచ్చి రిజిస్టర్లో సంతకం చేయబోగా.. సర్వీస్‌బుక్ ఇవ్వాలంటూ తాను ఇచ్చిన మెమో, నోటీసులు తీసుకోవాలని సూచించానని తెలిపారు. సరేనని నమ్మబలికి హాజరు రిజిస్టర్లో సంతకం చేశాక మెమో, నోటీసుబుక్ను తన ముఖంపై కొట్టడంతో పాటు కులం, లింగ వివక్షతతో దూషించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఏసీసీ ఈనెల 16న హైస్కూల్‌కు వెళ్లి కూడా విచారణ జరిపినట్లు సమాచారం. -
ఆ స్కూల్లో పిల్లలందరికీ చొక్కా నిక్కరు..
కేరళ, ఎర్నాకుళం జిల్లాలో వలయాంచిరంగార అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది. వందేళ్లు దాటిన ఆ పాఠశాలలో టీచర్లతోపాటు బోధనేతర సిబ్బంది కూడా మహిళలే. ఈ ఆల్‌ఉమెన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు సి.రాజి పిల్లల యూనిఫామ్ విషయంలో ఇప్పటి వరకు కొనసాగిన ఒక సంప్రదాయ విభజన రేఖను చెరిపేశారు. అన్ని స్కూళ్లలాగే ఆ స్కూల్లో కూడా అబ్బాయిలకు షర్టు – నిక్కరు, అమ్మాయిలకు షర్టు– స్కర్టు స్కూల్ యూనిఫామ్‌గా ఉండేది. ప్రిన్సిపల్ నిర్ణయంతో ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ‘షర్టు – నిక్కరు’ వేసుకుంటున్నారు. బాలికలకు ఆడేటప్పుడు సౌకర్యంగా ఉండటం కోసమే ఇలా యూని (డ్రెస్) కోడ్‌ను తెచ్చారు. ‘‘ఆటల్లో ఒకటో తరగతి పిల్లలు ఉన్నంత చురుగ్గా పెద్ద తరగతుల పిల్లలు ఉండడం లేదు. ఒకటి– రెండు తరగతుల్లో చురుగ్గా ఉన్న పిల్లలు కూడా నాలుగైదు తరగతులకు వచ్చే సరికి ఆటలాడడానికి బిడియపడుతున్నారు. ఉత్సాహంగా ఉండాల్సిన పిల్లలకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నది వాళ్ల దుస్తులే. ఆటల్లో పైకెగిరి షటిల్ రాకెట్‌తో కాక్‌ను కొట్టాలన్నా, ఒక్క గెంతులో లాంగ్ జంప్ చేయాలన్నా, హై జంప్ చేయాలన్నా స్కర్టు పైకెగురుతుందేమోననే బిడియంతో ఆటలాడడానికి ముందుకు రావడం లేదు. క్రీడాకారులుగా తయారుకాగలిగిన సత్తా ఉన్న పిల్లలను వస్త్రధారణ కారణంగా రెక్కలు విరిచి కూర్చోబెట్టడం ఏమిటి అనిపించింది. కార్పొరేట్ స్కూళ్లలో ఉన్నట్లు రెగ్యులర్ స్కూల్ డ్రస్ ఒకటి, స్పోర్ట్స్ పీరియడ్‌కి మరో రకం డ్రస్ అనే నియమం పెట్టడం మాకు కుదరదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రస్ చేంజ్ రూములు ఏర్పాటు చేయడం కష్టం. ఇంటి నుంచి స్కూలుకి నడిచి వచ్చే పిల్లలకు తమ వెంట మరో జత దుస్తులు తెచ్చుకోవడం కూడా కష్టమే. అందుకే స్కూల్ డ్రెస్‌ని ఇలా డిజైన్ చేశాం. నిక్కర్ని కూడా ముందు ఉన్నట్లు తొడల వరకే కాకుండా, అందరికీ మోకాళ్ల వరకు ఉండేలా నియమం పెట్టాం’’ అన్నారు ప్రధానోపాధ్యాయురాలు రాజీ మేడమ్. తల్లిదండ్రులకూ సంతోషమే రాజీ మేడమ్ డిజైన్ చేసిన యూనిసెక్స్ యూనిఫామ్ పట్ల అమ్మాయిల తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. బాలికలు మాత్రం... నిక్కర్ జేబులో చేతులు పెట్టుకుంటూ సంతోషపడుతున్నారు. చాక్లెట్ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చిన రూపాయిని జేబులో దాచుకుంటూ, మధ్యలో చూసుకుంటూ మురిసిపోతున్నారు. రాజి మేడమ్ పదేళ్లుగా వలయాంచిరంగార ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు, ఆమె చదివింది కూడా అదే స్కూల్లో. ప్రస్తుతం ఆమెతో పని చేస్తున్న అనేక మంది సిబ్బంది ఆమెకు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్లే. ‘తనకు స్కూల్లో ప్రతి అంగుళం తనకు తెలుసని, గ్రామంలో ప్రతి ఒక్కరితో పరిచయం ఉందని, అందువల్లనే స్కూలు అవసరం ఏమిటో గుర్తించి పరిష్కరించడంలో తనకు అందరి సహకారం ఉంటోందని’ చెప్పారు రాజీ మేడమ్.– మంజీర -
ఉపాధ్యాయ వృత్తికే కళంకం
సాక్షి రామగిరి(పెద్దపల్లి) : లంచాల మకిలి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంటుకుంది. ఇప్పటివరకు రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలకు పరిమితమైన లంచావతారులు ఇప్పుడు ఉపాధ్యాయుల రూపంలో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల తరువాత గురువును దేవునితో పోల్చుతూ ఆచార్యదేవో భవా అంటారు. విద్యార్థులకు సత్యమేవ జయతే, అబద్ధాలు ఆడరాదని చెప్పే ఉపాధ్యాయులే ఇలా అక్రమ సంపాదనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా ఇదే మొదటిసారి కావచ్చు. నెలకు వేలల్లో వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందరో ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వృత్తికి వన్నె తెస్తున్న ఈరోజుల్లో ఉపాధ్యాయులంటే అవినీతిపరులే అనే విధంగా చులకన భావం ఏర్పడే విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఆ వృత్తికే మాయని మచ్చగా మారింది. ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దండుగుల లలిత విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.బద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల ఓదెలు కుమారుడు రఘు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివాడు. పరీక్షల సమయంలో రఘుకు హాల్‌టికెట్ ఇవ్వకుండా హెచ్ఎం లలిత ఇబ్బంది పెట్టింది. ఎందుకు హాల్‌టికెట్ ఇవ్వడం లేదని రఘు తల్లిదండ్రులు రమ, ఓదెలు హెచ్ఎంను కలిసి అడుగగా, రఘు హాజరు శాతం తక్కువగా ఉందని, హాల్‌టికెట్ ఇవ్వడం కుదరదని ఖరాకండిగా చెప్పింది. ఆందోళన చెందిన రమ, ఓదెలు ఆమెను బతిమాడారు. అయినా కనికరించలేదు. తన కొడుకు భవిష్యత్ నాశనం అవుతుందని రమ హెచ్ఎం కాళ్లు మొక్కింది. దీంతో రూ.3 వేలు ఇస్తే హాల్‌టికెట్ ఇస్తానని చెప్పింది. మరోమార్గం లేక కూలీ పనులు చేసుకునే రఘు తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్ కోసం హెచ్ఎం లలితను ప్రాధేయపడి రూ.1,500 చెల్లించడంతో హాల్‌టికెట్ ఇచ్చింది. అయితే పదో తరగతి పరీక్షలు రాసిన రఘు భౌతికశాస్త్రంలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం టీసీ కావాలని ఇటీవల హెచ్ఎంను కలిసి కోరాడు. అందుకు రూ.2 వేలు ఇవ్వాలని లలిత డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని రఘు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో 20 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. స్పందించిన ఏసీబీ అధికారులు ఓదెలు, రఘు చెప్పే విషయాలను నిర్ధారించుకోవడానికి గతనెల 15న బాధితులతో కలిసి మారువేశంలో పాఠశాలకు వెళ్లారు. లంచం కోసం లలిత బాధితులను వేధిస్తుందని ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకున్నారు. ఆతర్వాత హెచ్ఎం మెడికల్ లీవ్ తీసుకుంది. గురువారం తిరిగి విధుల్లో చేరింది. ఈ క్రమంలో ఓదెలు, రఘు హెచ్ఎం లలిత డిమాండ్ చేసిన రూ.2 వేలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. డబ్బులు ముట్టజెప్పి టీసీ తీసుకుని బయటకు వచ్చాక.. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు హెచ్ఎంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లలిత భర్తకు సింగరేణిలో ఉన్నతస్థాయి ఉద్యోగం. వీరు సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పదోన్నతి పొందినట్లు, గతంలో స్కూల్ గ్రాంటు, దాతలు విరాళాలు కూడా కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, మంచిర్యాలలో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. -
ఆ హెచ్ఎం తీరు.. ప్రత్యేకం
పాల్వంచరూరల్: ఆ హెడ్మాస్టర్ స్టైలే వేరు. అందరి ఉపాధ్యాయుల మాదిరిగా కూర్చీలో కూర్చో కుండా.. నేలపైనే కూర్చొని విద్యాబోధన చేస్తారు. పాల్వంచ మండలం సంగం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వారిలో హెచ్ఎం లాల్‌సయ్యద్ అనేక సంవత్సరాలుగా నేలపైనే కూర్చొని పాఠాలు బోధిస్తున్నారు. ఈయన గతంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠాలు బోధించేటప్పుడు నేలపైనే కూర్చొంటే విద్యార్థులు తనతో కలిసిపోతారని, మరింత శ్రద్ధతో వింటారని హెచ్ఎం తెలిపారు. ఏళ్ల నుంచి తాను అలాగే పాఠాలు బోధిస్తున్నట్లు వివరించారు. -
బడికి వెళ్తూ మృత్యుఒడిలోకి..
శ్రీకాకుళం, పాతపట్నం: మరి కొద్దిసేపట్లో పాఠశాలకు వెళ్లాల్సిన ఆ ప్రధానోపాధ్యాయుడిని విద్యుత్ స్తంభం రూపంలో మృత్యువు వెంటాడింది. పెథాయ్ తుఫాన్ గాలుల కారణంగా రోడ్డుకు అడ్డంగా నేలవాలిన స్తంభాన్ని గమనించక బైకుతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ఉమామహల్ వెనుకన ఉపాధ్యాయుల కాలనీలో నివాసముంటున్న పాగోటి ధర్మారావు(56) మెళియాపుట్టి మండలం ఆంపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఎప్పట్లాగే మంగళవారం ఉదయం 8 గం టలకు భార్య పార్వతికి చెప్పి పాఠశాలకు బైకుపై బయలుదేరారు. కొండల ప్రాంతంలో ఉండే ఆంపురం పాఠశాలకు సిగ్నల్ సమస్య ఉండటం తో ప్రతిరోజూ అదే దారిలో ఉన్న బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ వేసుకుని వెళ్తుంటారు. మంగళవారం కూడా అదే మాదిరిగా బడ్డుమర్రి పాఠశాలలో బయోమెట్రిక్ హాజరు వేసుకుని బైకుపై ఆంపురం పాఠశాలకు బయలుదేరారు. సోమవారం కురిసిన వర్షం, ఈదురుగాలుల ధాటికి ఆంపురం–తెంబూరు రోడ్డులోని జామిచిన్నయ్యపేట వద్ద విద్యుత్ స్తంభం వాలిపోయి రోడ్డుకు నాలుగున్నర అడుగు ఎత్తులో ఉండిపోయింది. మంగళవారం ఉదయం కూడా వర్షం కురవడంతో ధర్మారావు రైన్ కోటు వేసుకుని బైకుపై వెళ్తుండగా విద్యుత్ స్తంభాన్ని గమనించక ఢీకొట్టారు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అంతకుముందే విద్యుత్ సిబ్బంది ఈ స్తంభాన్ని పరిశీలించి టిఫిన్ కోసం తెంబూరు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ప్రమా దం జరిగింది. స్థానికులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ బి.ఎస్.ఎస్.ప్రకాష్, ఎస్ ఐ ఈ.చిన్నంనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, శవపంచనా మా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యుల కు అందజేశారు. ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ధర్మారావు స్వగ్రామం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ కాశీపురం. మూడేళ్లుగా ఆంపురం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. మెళియాపుట్టి పీఆర్టీయూ మం డలశాఖ అధ్యక్షునిగానూ కొనసాగుతున్నారు. కుమారుడు ఇంద్రసేనాకుమార్ అవనిగెడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నాడు. కుమార్తె విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతోంది. ధర్మారావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలి పారు. విషయం తెలుసుకున్న పాతపట్నం, మెళి యాపుట్టి మండల ఎంఈఓలు బి.సింహాచలం, ఎస్.దేవేంద్రరావు, పాతపట్నం పీఆర్టీయూ మండలశాఖ అధ్యక్షుడు ఎ.జనార్దనరావు, అంబేడ్కర్ మండల యువజన సంఘం అధ్యక్షుడు సుదర్శన్, పలువురు ఉపాధ్యాయులు ఆస్పత్రికి చేరుకున్నారు. పీఆర్టీయూ నాయకుల సంతాపం శ్రీకాకుళం: మెళియాపుట్టి మండలంలో ఎల్ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న పాగోటి ధర్మారావు మంగళవారం జరిగిన ప్రమాదంలో మరణించడంతో పీఆర్టీయూ నాయకులు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ధర్మారావు విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సంతాపం తెలిపిన వారిలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు భైరి అప్పారావు, జిల్లా అధ్యక్షుడు పప్పల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, గౌరవాధ్యక్షుడు వి.హరిశ్చంద్రుడు, అసోసియేట్ అధ్యక్షుడు వైబీఎస్ ప్రసాదరావు, పత్రికా సంపాదక వర్గ సభ్యులు జి.యోగానంద్, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలివాడ ధనుంజయరావు, బొంగు సత్యనారాయణ, ఎస్.ప్రసాదరావు, ఇ.గణపతి, జె.భరత్చరణ్ తదితరులు ఉన్నారు. -
పాఠశాలలో రాసలీలలు
తమిళనాడు, టీ.నగర్: నాగర్‌కోవిల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు యువతితో రాసలీలలు జరుపుతూ పట్టుబడడంతో విద్యాశాఖ అతన్ని సస్పెండ్ చేసింది. ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కోవిల్ సమీపంలోగల ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సుదాంగన్ హెడ్మాస్టర్. ఇతని స్నేహితుడు సుబ్బు. ఇతనూ ఉపాధ్యాయుడే. వీరు సెలవు రోజుల్లో ప్రత్యేక తరగతుల పేరిట పాఠశాలకు వచ్చేవారు. ఒక యువతిని పాఠశాలకు తమ వెంట తీసుకుని వచ్చి రాసలీలలు జరుపుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో మిగతా ఉపాధ్యాయులను పాఠశాలకు రావద్దని తామే చూసుకుంటామని చెప్పేవారని తెలిసింది. ఇలా ఒక రోజు తన కుమారుడితో మహిళ పాఠశాలకు రాగా హెడ్మాస్టర్తో గదిలో ఉంచి ఉపాధ్యాయుడు గది బయట తాళం వేశాడు. దీన్ని గమనించిన బాలుడు ఏడుపు లంకించుకోవడంతో స్థానికులు అక్కడికి చేరుకుని టీచర్ సుబ్బుతో గది తెరిపించారు. దీనిగురించి ఫిర్యాదు అందుకున్న జిల్లా విద్యాధికారి ప్రధానోపాధ్యాయుడు సుదాంగన్ను శనివారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
ఎంఈవోపై హెచ్ఎం దాడి
కృష్ణాజిల్లా, ఘంటసాల (అవనిగడ్డ): స్కూల్ తనిఖీకి వెళ్లిన మండల విద్యా శాఖాధికారిపై సంబంధిత పాఠశాల హెచ్ఎం దాడి చేసిన ఘటన సోమవారం ఘంటసాల మండలం దేవరకోటలో చోటు చేసుకుంది. ఎంఈవో భృగుమళ్ల వెంకట సుబ్బారావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన దేవరకోట గ్రామదర్శినిలో స్థానికులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ పాఠశాల (ఆర్) లో 20 మంది విద్యార్థులు ఉన్నారని, ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే, ఒకరిని డెప్యూటేషన్‌పై వేరేచోటకు పంపారని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండల ప్రత్యేకాధికారి ఏడీవీ నారాయణరావుకు అర్జీ ఇచ్చారు. దీనిపై విచారించి వివరణ ఇవ్వాలని ఎంఈవో సుబ్బారావును ప్రత్యేకాధికారి ఆదేశించారు. దీనిలో భాగంగా సోమవారం ఉదయం పాఠశాల తనిఖీకి ఎంఈవో వచ్చారు. హాజరు పట్టీ పరిశీలించారు. ఇరవై మంది విద్యార్థులకుగాను 14 మందే హాజరయ్యారు. హాజరుకాని విద్యార్థుల పేర్లను ఎంఈవో నమోదు చేసుకుంటున్నారు. దీంతో కుర్చీలో ఉన్న ఎంఈవోను పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన బోలెం శ్రీనివాసరావు కిందకు తోసేశారు. దీంతో ఎంఈవో కింద పడిపోయాడు. తేరుకున్న ఆయన లేచి నిలబడగానే మెడమీద హెచ్ఎం చేయి వేసి గొంతు నొక్కడంతో పాటు దుర్భాషలాడారు. ప్రతిదానికి నా పాఠశాలకే వస్తున్నావేంటి.. అని ఎంఈవోతో హెచ్ఎం వాగ్వాదానికి దిగారు. తాను ఎంఈవోనని ఎప్పుడైనా వస్తానని చెప్పడంతో, నువ్వు ఎంఈవో అయితే నాకేంటి ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని హెచ్ఎం హెచ్చరించారు. తాను పాఠశాల తనిఖీకి వచ్చినట్లు సంతకం చేయాలి విజిటింగ్ బుక్ ఇవ్వమని ఎంఈవో కోరగా ఉగ్రుడైన హెచ్ఎం అందుకు నిరాకరించారు. దీంతో ఎంఈవో తన కార్యాలయానికి వచ్చేశారు. అనంతరం ఎంఈవో ఘంటసాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఎం బోలెం శ్రీనివాసరావు నుంచి తనకు ప్రాణహాని ఉందని, విధులు సక్రమంగా నిర్వహించడానికి తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఇదే విషయాన్ని విద్యా శాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినట్లు ఎంఈవో సుబ్బారావు వెల్లడించారు. -
రాజ్ భవన్ స్కూల్.. నావల్ల కాదు బాబోయ్!
సోమాజిగూడ: సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ విధులు నిర్వహించలేనని చేతులెత్తేశారు. ఈ స్కూల్లో హెచ్ఎంకు కనీసం రూమ్ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు. ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్ స్కూలు (బేగంపేట్–2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్ఎంగా బేగంపేట్–2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. తాజాగా హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ తానిక్కడ విధులు నిర్వర్తించలేనని, పేరెంట్ స్కూలుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల డీఈఓకు లేఖ రాశారు. దీనిపై డీఈఓ వెంకటనర్సమ్మ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం గత పది రోజులుగా స్కూలు రావడం మానేశారు. కనీసం రూమ్ కూడా లేదు... ఈ విషయంపై ఇన్చార్జి హెచ్ఎం సుమన్‌ను వివరణ కోరగా... తాను బేగంపేట్–2 స్కూలుకు వెళ్తున్నట్లు చెప్పారు. అదేమంటే రాజ్‌భవన్ స్కూల్లో హెచ్ఎం కూర్చునేందుకు కనీసం రూమ్ కూడా లేదని, గత రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్ స్కూలును వీడి బేగంపేట్ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
హెడ్మాస్టర్ బంపర్ ఆఫర్!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సాధారణంగా టెన్త్ టాపర్లకు వివిధ రకాల బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ ఎక్కువగా కార్పొరేట్ విద్యార్థులకే. ప్రభుత్వ చదువులు చదివిన వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే. అలాటిది.. ప్రభుత్వ హైస్కూల్లో చదివిన విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం ఉంటుందని ఎవరు ఊహిస్తారు? బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు స్కూలు హెడ్ మాస్టర్ ఆ అవకాశం కల్పిస్తారని ఎవరు అనుకుంటారు? అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు దానిని సాధ్యం చేశారు. పేద పిల్లలు తమ ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించేట్టు వారికి ప్రోత్సహించడానికి, ఉన్నత లక్ష్యాలు అందుకునే దిశగా వారిని ఉత్తేజపరచడానికి చింతలగ్రహారం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివాజీ ఈ ఆఫర్ పెట్టారు. తమ హైస్కూల్లో టెన్త్ టాపర్లుగా 10/10 సాధించుకున్న విద్యార్థులను ఆయన ఏటా ప్రోత్సహిస్తుంటారు. గతేడాది రూ. 5 వేల వంతున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన ఆయన ఈసారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10/10 గ్రేడ్లు వచ్చిన వారందరినీ విమానంలో హైదరాబాద్ టూర్‌కు పంపిస్తానని విద్యార్ధులను ఉత్తేజపరిచారు. దాంతో విద్యార్థులు పోటాపోటీగా చదివారు. గత టెన్త్ పరీక్షల్లో పొలమరశెట్టి కుశలవర్ధన్, దాడిరూప, వడ్డీది సింధు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. వీరు విజయవాడలో ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా సాధించారు. మాట ఇచ్చిన శివాజీ వాగ్దానం ప్రకారం వీరిని శుక్రవారం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్‌కు టూర్‌కు పంపారు. రూప టికెట్ ఉన్నా అనివార్యకారణాల వల్ల ఈ అవకాశాన్ని చివరి నిమిషంలో పొందలేదు. కుశలవర్ధన్, సింధులకు హైదరాబా ద్ చూపించడానికి తోడుగా నాగమణి టీచర్‌ను కూడా పంపారు. ఇలా రెండురోజుల పాటు హైదరాబాద్‌లో ముఖ్య పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించి తిరిగి గరీబ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకుంటారు. శుక్రవారం విమానాశ్రయంలో ఈవిజేతలకు హ్యాపీ జర్నీ అంటూ హెచ్ఎం శివాజీ వీడ్కోలు పలకడాన్ని అక్కడి ప్రయాణికులంతా చూసి,మంచి మాస్టారని అభినందించారు. -
పిండి వంటలకు అన్నీ సిద్ధం చేసి..
కడప, రాజంపేట టౌన్ /ఒంటిమిట్ట: సంక్రాంతి వంటల కోసం పిండిని మిషన్‌లో ఆడించుకొని.. ఇంటిలో ఇచ్చిన గంటకే ఓ ఉపాధ్యాయుడు మృత్యువాత పడటంతో.. కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. రాజంపేట మండలం వైబీఎన్ పల్లె ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సంగరాజు చంద్రరాజు (50) పండగకు అవసరమయ్యే సరుకులన్నింటినీ సిద్ధం చేశారు. కొంత అనారోగ్యంగా ఉండటంతో.. ఆస్పత్రిలో చూపించుకునేందుకు కడపకు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఒంటిమిట్ట మండల పరిధిలోని నడింపల్లి దగ్గర కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. బాధితుడిని 108 ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషాద ఛాయలు చంద్రరాజు 1984 నుంచి ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఎంతో నిబద్ధతగా, అంకిత భావంతో పని చేసిన ఆయన ప్రజల మన్ననలు పొందారు. అలాగే ఉపాధ్యాయ ఉద్యమాల్లో పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. ఆయనకు భార్య, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు. మండలంలోని ఉపాధ్యాయుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక వాహనాల్లో కడప రిమ్స్‌కు తరలి వెళ్లారు. -
ఇళ్ల పేరుతో ప్రధానోపాధ్యాయురాలి భారీ మోసం..
సాక్షి, తిరువళ్లూరు: హౌసింగ్ బోర్డులో ప్లాట్లు ఇప్పిస్తానంటూ వంద మందిని కోట్ల రూపాయల్లో మోసం చేసిన ప్రధానోపాధ్యాయురాలిపై బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. చెన్నై అయపాక్కం ప్రాంతానికి చెందిన మేఖల తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్‌లోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అయపాక్కంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ హౌసింగ్ బోర్డులో ప్లాట్లను ఇప్పిస్తానని పాడి, మనలి, తిరువొత్తియూర్ ప్రాంతాలకు చెందిన 103 మంది వద్ద నుంచి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసింది. అయితే ఇంత వరకు ప్లాట్లు ఇప్పించకపోగా, నగదును కూడా తిరిగి ఇవ్వడం లేదు. దీనిపై దాదాపు 50 మంది బాధితులు సోమవారం కలెక్టర్ సుందరవల్లికి వినతి పత్రం సమర్పించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. తమ నగదును వాపసు చేయాలని కోరితే దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. -
విద్యార్థినులకు లైంగిక వేధింపులు
వేలూరు: పాఠశాలలో విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసిన కీచక హెడ్మాస్టర్కు గ్రామస్తులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వేలూరు జిల్లా ఆంబూరు తాలుకా కంచి కొల్లై గ్రామానికి చెందిన జ్ఞానశేఖరన్ సోలూరు ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నాడు. ఎనిమిదో తరగతి విద్యార్థినులకు బోధన చేసేవాడు. ఆ సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నట్టు పలువురు విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు హెచ్ఎం జ్ఞానశేఖరన్‌ను నిలదీశారు. అందుకు హెచ్ఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు దురుసుగా మాట్లాడడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు అతనికి దేహశుద్ధి జరిపారు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు పాఠశాలకు వెళ్లి హెచ్ఎం జ్ఞానశేఖరన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. -
ఓ ‘పెద్ద’ సారూ.. ఈ ‘చిన్న’ బుద్ధేమిటి..?
వయసు పెరిగితే.. బుద్ధి వికసిస్తుంది..! హోదా పెద్దదైతే.. పెద్దరికం వస్తుంది..!! సార్వత్రిక సత్యమిది.. కొన్ని సత్యాలు.. అప్పుడప్పుడూ అసత్యాలవుతాయి.. అతడి విషయంలోనూ అలాగే జరిగింది.. వయసు పెరిగినప్పటికీ.. బుద్ధి కుంచించుకుపోయింది..! హోదా పెద్దదవడంతో.. పెద్దరికం మాయమైంది..!! బోనకల్(మధిర) : చూడ్డానికి అతడొక ‘పెద్ద’ మనిషి. పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలి్సన బాధ్యతాయుత వృత్తిలోగల ఉపాధ్యాయుడు. సాధారణ ఉపాధ్యాయుడు మాత్రమే కాదు.. తనలాంటి కొందరు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు నాయకత్వ స్థానంలోగల ప్రధానోపాధ్యాయుడు. పిల్లల భాషలో చెప్పాలంటే.. ఆయనొక ‘పెద్ద’ సారు! ఈ ‘పెద్ద’ సారుపై పోలీస్ స్టేషన్లో అరుదైన ఓ కేసు నమోదైంది. ఎవరా ‘పెద్ద’ సారు? ఏమిటా కేసు..? డి.రమణయ్య. ఈయనే ఆ ‘పెద్ద’ సారు. బోనకల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆయనపై నమోదైంది ‘పోక్సో’ కేసు. ‘పోక్సో’ అంటే.. ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్’. ఇదొక చట్టం. లైంగిక నేరగాళ్ల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే ‘చుట్టం’. ‘అయితే..? ఈ కేసును ఆయనపై ఎందుకు పెట్టారు?’ అనే సందేహం మీకు రావచ్చు. మీరు మనసులో అనుకుంటున్నట్టుగానే.. ఆ ‘పెద్ద’ సారు.. చేయకూడని ‘పెద్ద’ తప్పే చేశాడు. ఏం చేశాడంటే... చదువుకుంటున్న పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగో.. బడిలో ఉపాధ్యాయులు కూడా అంతే. వారిని అంత జాగ్రత్తగా, బాధ్యతగా చూసుకోవాలి. ఆ పిల్లలు బడిలో ఉన్నంతసేపు కంటికి రెప్పలా కాపాడాలి. విద్యాబుద్ధులు నేర్పాలి. కానీ, అక్కడి ప్రధానోపాధ్యాయుడు రమణయ్య.. ఇవన్నీ మర్చిపోయాడు. కంటి పాపే కాటేసేందుకు ప్రయత్నించింది. బుద్ధులు నేర్పించాలి్సందిపోయి.. తానే బుద్ధిహీనుడిగా మారాడు. ఎనిమిదవ తరగతి చదువుతున్న నలుగురు అమ్మాయిలపై కొన్ని రోజుల నుంచి అనుచితంగా ప్రవర్తించసాగాడు. కడుపు నొప్పి వస్తున్నదంటూ బిక్క మొహంతో తన వద్దకు వచ్చిన ఆ నలుగురిలో ఓ అమ్మాయితో తన గదిలో ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. ఆ పాప అదే రోజున తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. చిందులేశాడు మరుసటి రోజునే పాఠశాలకు వచ్చి నిలదీద్దామని ఆ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. దీనిని అతడు ముందే ఊహించాడేమో.! ‘అది’ జరిగిన మరుసటి రోజు నుంచి సిక్ లీవ్ పెట్టాడు. దాదాపుగా పది రోజుల తరువాత, శుక్రవారం విధులకు హాజరయ్యాడు. ఆ నలుగురు విద్యార్థినుల తల్లిదండ్రులు, కుటుంబీకులు కలిసి పాఠశాలకు వెళ్లారు. హెచ్ఎం రమణయ్యను నిలదీశారు. వారు ముందుగానే, ఎందుకైనా మంచిదనుకుని.. స్థానిక పత్రిక, ప్రసార మాధ్యమాల విలేకరులను కూడా తమ వెంట తీసుకెళ్లారు. వీరందరినీ చూసిన ఆ ‘పెద్ద’ సారు.. కోపంతో ఊగిపోయాడు. తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారంటూ చిందులేశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగలేదు. ఆయనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, కొందరు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై ఫిర్యాదు చేశాడు. పనిలో పనిగా రావినూతల పాఠశాల జూనియర్ అసిస్టెంట్ బాగం వేణుపై కూడా ఫిర్యాదు చేశాడు (ఎంఈఓ ఆదేశంతో ఓ పనిపై బోనకల్ పాఠశాలకు వచ్చిన ఇతడు.. హెచ్ఎం, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదాన్ని తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడన్నది రమణయ్య అభియోగం). బాలిక తల్లిదండ్రులు, కుటుంబీకుల ఫిర్యాదుతో ఆ ‘పెద్ద’సారుపై పోలీసులు ‘పోక్సో’ కేసు పెట్టారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీకులు తీవ్ర ఆగ్రహావేశంతో ఇలా ప్రశ్నిస్తున్నారు..బోనకల్ గ్రామస్తులు ముక్కున వేలేసుకుని, దుమ్మెత్తి పోస్తూ ఇలా నిలదీసి అడుగుతున్నారు... ఓ ‘పెద్ద’ సారూ.. ఈ ‘చిన్న’ బుద్ధేమిటి.?! మమ్మల్ని కూడా వేధించాడు..! రమణయ్య ప్రవర్తన గురించిన మరొక దిగ్భ్రాంతికరమైన విషయం కూడా వెలుగులోకొచి్చంది. పాఠశాలకు వెళ్లిన విలేకరులతో అక్కడి ఉపాధ్యాయినిలు కొందరు తమ మనోవేదన వెలిబుచ్చారు. ‘‘ఆయన ప్రవర్తనే అంత. పిల్లల్నే కాదు.. మమ్మల్ని కూడా వేధిస్తున్నాడు. మేం బయటకు చెప్పుకోలేక, లోపల దాచుకోలేక, ధైర్యంగా ఎదిరించలేక, మౌనంగా భరించలేక.. మానసికంగా ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో ఎలా చెప్పేది?’’ అని, కన్నీటిపర్యంతమయ్యారు. -
ముస్తాబాద హైస్కూల్లో ఆందోళన
ముస్తాబాద (గన్నవరం రూరల్) : ముస్తాబాద జెడ్పీ హైస్కూల్లో గురువారం తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. హెచ్ఎం ఎ.వెంకటేశ్వరరావు తమ మనుమరాలు యాదల తనూజను కొట్టాడని పేర్కొంటూ సూరంపల్లి గ్రామం నుంచి బాలిక తాత వెంకటేశ్వరరావు, తల్లి జోస్పిన్ తదితరులు పాఠశాలకు రావటంతో గందరగోళం ఏర్పడింది. మాజీ ఎంపీటీసీ దాసే బాబూరావు, స్థానిక యువకులు పాఠశాలలో తరచూ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితిలో మార్పు రావటం లేదంటూ హెచ్ఎం పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజను బడికి రాలేదని బుధవారం హెచ్ఎం కొట్టాడు. దీంతో విద్యార్థి స్పృహ కోల్పోవటంతో పీఈటీ సురేష్ బాబు ముస్తాబాద పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. బుధవారం సాయంత్రం విద్యార్థి తనూజ సూరంపల్లిలోని ఇంటి వద్ద వాంతులు చేసుకుని పడిపోవటంతో కుటుంబ సభ్యులు ఆరాతీశారు. పాఠశాలలో హెచ్ఎం కొట్టాడని చెప్పటంతో, ఆ విషయం తెలుసుకునేందుకు తాత, బంధువులు గురువారం పాఠశాలకు వచ్చారు. తనూజ పాఠశాలలో మళ్లీ పడిపోవటంతో ముస్తాబాద పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్ ఆనంద్‌బాబు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించటంతో హైస్కూల్‌కు చేరుకుని, అక్కడి నుంచి 108 వాహనంలో చిన్నఆవుటపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై గ్రామస్తులు, తనూజ తాత డీఈవో సుబ్బారెడ్డికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయటంతో ఆయన విచారణకు ఆదేశించారు. నూజివీడు డీవైఈవో రవిసాగర్ మధ్యాహ్నం పాఠశాలకు వచ్చి తనూజ సహచర విద్యార్థులను జరిగిన సంఘటపై విచారణ చేశారు. డీవైఈవో ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి నివేదిక రూపొందించి డీఈవోకు పంపుతామని చెప్పారు. తనూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాలిక బంధువులు తెలిపారు. -
టీచర్ దెబ్బలకు స్పృహ కోల్పోయిన విద్యార్థిని
-
ఆ భయం ఉండాలి... ఆ బెత్తం కావాలి!
ఆచార్య దేవోభవ మా వీధిలో ఒక మాస్టారు ఉండేవారు. పేరు శ్యామ్ సుందర్. అప్పటికి ఆయనకు ఓ నలభయ్యేళ్లుంటాయి. రోజూ సాయంత్రాలు ప్రైవేటు(ట్యూషన్) చెప్పేవారు. ఆయనకు కాస్త కాలు అవుకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్). గొడుగు కర్రను పోలి ఉండే ఒక చేతికర్ర సాయంతో నడిచేవారు. చెప్పిన పాఠం సరిగా అప్పజెప్పలేని పిల్లలు భయంతో వెనక్కి వెనక్కి వెళిపోతుంటే... ఆ కర్రనే తిరగేసి మెడకో, కాలికో వేసి తన దగ్గరగా లాక్కునేవారు. దగ్గరగా వెళ్లేసరికే సగం పాఠం గుర్తొచ్చేసేది. లేకపోతే ఒక్క తొడపాశం, మరుసటిరోజు పాఠం అప్పజెప్పేవరకు గుర్తుండేది. బడినుంచి ఇంటికొచ్చాక పుస్తకం ముట్టుకోని పిల్లల్ని ఆయన దగ్గర ప్రైవేటుకు పంపేవాళ్లు. స్కూల్లో మాట వినని అల్లరోళ్లని అక్కడికే పంపించమని తల్లిదండ్రులకు టీచర్లే రికమండ్ చేసేవాళ్లు. పిల్లల్ని చదివించడంలో... చదువును దారిలో పెట్టడంలో ఆయనకు అంత పేరు. హైస్కూల్లో సుబ్బారావుగారు కూడా అంతే. హెడ్ మాస్టర్. టేబుల్ మీద ఎప్పుడూ రూళ్ల కర్ర, చెక్క స్కేలు మెరుస్తూ ఉండేవి. దెబ్బ బాగా తగలడానికి రోజూ మాస్టారు వాటికి ఏదో కొత్తరకం నూనె రాస్తున్నారని మేమంతా చెప్పుకునేవాళ్లం. మాస్టారు కంటే ముందు మేము వాటినే చూసేవాళ్లం. ఆయన చేతికి అవి ఎంత దగ్గరగా ఉంటే మేము ఆయనకు అంత దూరంగా నిలబడేవాళ్లం. సుబ్బారావు మాస్టారు ఉన్నారన్న ఉనికే స్కూల్ మొత్తాన్ని అటెన్షన్ లో ఉంచేది. దెబ్బ తినేంత తప్పు చేసినవాళ్లు, మెచ్చుకునేంత ఒప్పు చేసినవాళ్లు తప్ప ఆయనకు చేతికందే దూరంలో నిలబడిన విద్యార్థులు ఎవరూ లేరు. అలాగని బాగా కొట్టి భయపెట్టేవారా అంటే కాదు. ఆయన పిల్లల చేతిమీద కొట్టిన దానికంటే బల్లమీద కొట్టిందే ఎక్కువ. ఆ శబ్దం చాలు క్లాసురూము లైబ్రరీగా మారడానికి, చేతులు కట్టుకుని దూరంగా నిలబడిన విద్యార్థి కాళ్లు వణకడానికి. ఇప్పుడు స్కూల్లోనే టీచరు. అప్పుడు ఊళ్లోనూ టీచరే. వాళ్లు తిరిగే వీధిలో ఆటల్లేవు.. వాళ్లు ఎక్కిన బస్సుల్లో అల్లరిలేదు. కాలం మారింది. ఇప్పుడంతా ఫ్రెండ్లీ కల్చర్. ఈ ఫ్రెండ్లీ కల్చర్ గురుశిష్యులు కలిసి సరదాలు పంచుకోడానికి ఎంత పనికొస్తుందో, విద్యార్థులకు విలువల్ని నేర్పడానికి ఉపాధ్యాయులకు అంతగా అడ్డొస్తోంది. భయం, బెత్తం లేక ఫ్రెండ్లీ కల్చర్ కారణంగా ఏర్పడిన దగ్గరతనం వల్ల కొన్నిసార్లు వినకూడని విషయాల్లో ఉపాధ్యాయుల పేర్లు వినాల్సి వస్తోంది. మంచి చెడు తేడా తెలియని పసివాళ్లను, ఆడపిల్లల్ని తమ ఒడినుంచి బడికి పంపిస్తున్న కన్నవాళ్ల గుండెల్ని కుదిపేసే దారుణాలు చూడాల్సివస్తుంది. ఒక ఘోరం జరిగింది అనే బాధకంటే, అందుకు ఒక టీచర్ కారణం అనే వేదన సమాజాన్ని తొలిచేస్తుంది. ఆచార్యదేవోభవః అనడానికి నాలుక తడబడుతుంది. ఊళ్లో పిల్లలు ఎవరైనా తప్పుచేస్తే నువ్వు ఎవరి తాలూకు అని అడగడంకంటే ముందు ‘నీకు చదువు చెప్పింది ఎవర్రా?’ అనేవారు. అదీ సమాజంలో టీచర్ స్థానం. ఇప్పుడు అదే ప్రశ్న చెవుల్లో తిరుగుతోంది. టీచరంటే కాస్త భయం.. ఆ టేబుల్ మీద ఒక బెత్తం రేపటి సమాజానికి అవసరమనిపిస్తోంది. బెత్తంతో ఒక్క దెబ్బ కొడితే మారిపోయే జీవితాలు... చట్టంతో, సంకెళ్లతో భయపెట్టినా పట్టనంత ఘోరంగా మారిపోయాయి. దేశ భవిష్యత్తే కాదు... మనిషిలో సరైన ఆలోచనా నిర్మాణం కూడా తరగతి గదుల్లోనే రూపుదిద్దుకోవాలి. అదే సరైన సమాజాన్ని నిర్మిస్తుంది. అందుకోసం... ఉపాధ్యాయుల ముందు చేతులు కట్టుకునేంత భయం, ఆ భయాన్ని గుర్తుచేసే బెత్తం కావాల్సిందే! ఉపాధ్యాయ వృత్తిని ఉద్యోగంగా కాక, సామాజిక బాధ్యతగా, కొన్ని తరాలను నడిపించే దిక్సూచిగా భావించి ప్రేమిస్తున్న ప్రతి గురువుకు వందనం. - పూడి శ్రీనివాసరావు -
కీచక హెచ్ఎంకు ఏడేళ్ల జైలు శిక్ష
విజయవాడ లీగల్ : అక్షర బుద్ధులు నేర్పాల్సిన టీచరే కీచకుడైనట్లు దాఖలైన కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 9 లక్షల జరిమానా విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి (ప్రత్యేక న్యాయస్థానం) ఎ.గిరిధర్ సోమవారం తీర్పు చెప్పారు. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా, ఉయ్యూరు నగర పంచాయతీలో నిందితుడు పోరంకి యతిరామశర్మ(52) నివాసముంటూ పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామ శివారు ముదిరాజుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆ పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినుల (10) పట్ల నిందితుడు అసభ్యకరంగా ప్రవర్తించడమే కాక లైంగికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీన్ని ఓ విద్యార్థి గమనించి గత ఏడాది సెప్టెంబర్ 8న పెద్దవాళ్ళకు తెలియజేశాడు. విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లగా నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున సి.ఎం.ఎస్. పోలీసులు 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ఏపీపీలు గడ్డం రాజేశ్వరరావు, సాదు ప్రసాదు విచారణ నిర్వహించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పుచెప్పారు. జరిమానాలోని ఏడు లక్షలను నలుగురు విద్యార్థినులు ఒక్కొక్కరికి రు.1,75,000 ఇవ్వాలని తీర్పు చెప్పారు. నిందితుడు సెప్టెంబర్ 30 లోపు జరిమానా చెల్లించాలని, లేనిపక్షంలో అక్టోబర్ 31 లోపు ప్రభుత్వం నిందితుని ఆస్తులను జప్తు చేసి కోర్టులో చెల్లించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు. -
విధులకు డుమ్మాకొట్టిన హెచ్ఎం
♦ యువతితో పాఠశాల నిర్వహణ ♦ పొట్టి నాగన్నదొరపాలెంలో ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చిన గ్రామస్తులు ♦ విద్యాశాఖ అధికారులు పట్టించుకోనందునే ఈ దుస్థితి అని ఆవేదన ♦ చర్యలు తీసుకుంటాం: ఎంఈవో సాయిశైలజ నాతవరం : మారుమూల గిరిజన గ్రామంలో పాఠశాలకు వెళ్లకుండా విధులకు డుమ్మా కొడుతున్న హెచ్ఎం ఉదంతం వెలుగులోకి వచ్చింది. మండలంలోని పొట్టి నాగన్నదొరపాలెంలో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఒకరిని జాలారిపేట పాఠశాలకు డిప్యూటేషన్‌పై విద్యాశాఖ అధికారులు నియమించారు. మిగిలిన హెచ్ఎం రమణ మాత్రం వారం రోజుల్లో రెండు మూడు రోజులు మాత్రమే పాఠశాలకు వస్తున్నారని మిగతా రోజుల్లో ఓ యువతితో నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఎక్సైజ్ సీఐ రాజు, నాతవరం ఎస్ఐ అశోక్‌కుమార్ నిర్వహించిన సారా నిర్మూలన అవగాహన సదస్సులో గ్రామస్తులు ఉపాధ్యాయుల పనితీరుని వారి దృష్టికి తీసుకువచ్చారు. సభ అనంతరం ఎస్ఐ, విలేకరులను గ్రామస్తులు పాఠశాలకు తీసుకువెళ్లి చూపించారు. ఆ సమయంలో హెచ్ఎం లేరు. ఓ యువతి, 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దీనిపై ఎస్ఐ ఆరా తీయగా హెచ్ఎం సక్రమంగా పాఠశాలకు రావడం లేదని గ్రామస్తులు చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలుకావడం లేదని వారు ఆరోపించారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులను బయట ప్రాంతాలకు పంపించడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. విద్యాశాఖ అధికారులు తనిఖీ చేయనందున ఉపాధ్యాయుల పనితీరు ఇష్టారాజ్యంగా ఉందని గ్రామస్తులు ధ్వజమెత్తారు. దీనిపై ఎంఈవో సాయిశైలజను వివరణ కోరగా హెచ్ఎం రమణ సెలవు పెట్టలేదన్నారు. దీనిపై పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. -
గంట ముందే బడికి తాళం: హెచ్ఎం సస్పెండ్
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సి.రాజుపాలెంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను డిఈవో ప్రతాప్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే అప్పటికే హెచ్ఎం సహా టీచర్లందరూ పాఠశాలకు తాళం వేసి వెళ్లిపోయారు. సాయంత్రం 4.45 గంటల వరకూ పాఠశాల తరగతులు నిర్వహించాల్సి ఉండగా గంట ముందే బడికి తాళం వేసి వెళ్లిపోవడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీమోహన్ను సస్పెండ్ చేయాలని ఆర్డేడీకి సిఫార్సు చేశారు. విధి నిర్వహణలో బాధ్యతారహితంగా వ్యవహరించిన హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో చెప్పారు. -
కీచక ప్రధానోపాధ్యాయుడి అరెస్ట్
తిరుమలాయపాలెం: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా విద్యార్థినిని లొంగదీసుకుని, ఆమె జీవితంతో ఆటలాడుకున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వేధింపుల వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ ఉపాధ్యాడు హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో ఉండగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అరెస్టు చేసినట్లు తిరుమలాయపాలెం పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని చింతకాని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాడిగా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. గతంలో ఇదే జిల్లాలోని తిరుమలాయపాలెం పాఠశాలలో పనిచేసినప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థినితో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఆ తరువాత విద్యార్థినిపై చదువుల కోసం సహకరిస్తున్నట్లు నటించాడు. పదోతరగతి తర్వాత పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించి హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో చేర్పించాడు. ఓ గది అద్దెకు తీసుకుని ఆమెను అక్కడే ఉంచి, కావాల్సినవన్నీ కొనిస్తూ శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ హైదరాబాద్ వచ్చిపోతూ ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. చదువు పూర్తి చేసుకుని ఆ యువతి ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. అయితే, శంకర్‌రెడ్డి ఆమెను కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడనివ్వకుండా, ఆమెపై లైంగిక దాడి కొనసాగిస్తూ ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరిస్తుండడంతో బాధిత యువతి తల్లిదండ్రులతో కలసి వారం క్రితం తిరుమలాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి శంకర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. -
విద్యార్థిని చితకబాదిన ప్రధానోపాధ్యాయురాలు
మహాముత్తారం (కరీంనగర్): హోం వర్క్ చేయలేదనే నెపంతో పదో తరగతి విద్యార్థినిని ప్రధానోపాధ్యాయురాలు చితకబాదింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో శనివారం జరిగింది. వివరాలు.. పదోతరగతి చదువుతున్న సమ్మక్క (15) హోం వర్క్ చేయలేదని ప్రధానోపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టింది. దీంతో విద్యార్థిని రెండు రోజుల నుంచి హాస్టల్ గదికే పరిమితమైంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వచ్చిన బాలిక కుంటుంతుండటం గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. విద్యార్థిని తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయురాలని వివరన కోరారు. -
విద్యార్థినిపై హెడ్మాస్టర్ అత్యాచారం
రాయ్‌పూర్ : చదువు చెప్పే గురువు స్థానంలో ఉండి ఆ వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్... చదువుకోసం నానా కష్టాలు పడి పాఠశాలలో చేరిన గిరిజన బాలిక(15)పై గత మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో గర్భవతి అయిన బాలిక.. గత నెలలో ఓ చిన్నారిని ప్రసవించింది. అయితే కీచక టీచర్ బెదిరింపులతో విషయాన్ని దాచిపెట్టిన బాధితురాలు.. ఎట్టకేలకు కుటుంబసభ్యులతో కలసి ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. కొండగావ్ ఏఎస్పీ నివేదితా శర్మ తెలిపిన వివరాల ప్రకారం... కొండగావ్ జిల్లాలోని ఝాకర్పారాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మాధవ్ నాగ్(52) అనే వ్యక్తి హెడ్మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గిరిజన బాలికను.. వార్షిక పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానంటూ లోబరుచుకుని ఆమెపై గత మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడాన్ని గుర్తించి, విషయాన్ని బయటకు చెప్పొద్దంటూ తీవ్రస్థాయిలో బెదిరించాడు. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితురాలు.. ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు మాధవ్ నాగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేయనున్నట్లు నివేదితా శర్మ వెల్లడించారు. -
టీచర్‌పై ప్రధానోపాధ్యాయురాలి యాసిడ్ దాడి
చెన్నై: ఉపాధ్యాయలోకం నివ్వెరపోయే ఘటన ఒకటి సోమవారం తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది. ఓ ఉపాధ్యాయురాలిపై ప్రధానోపాధ్యాయురాలు యాసిడ్ దాడికి పాల్పడింది. చెన్నై వలసరవాక్కంలో సియోన్ కిడ్స్ పార్క్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంజూసింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సోమవారం పాఠశాలకు వెళ్లింది. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయురాలు ఫ్లోరాకు ఆమెకు మధ్య వాగ్వాదం చోట చేసుకుంది. దీంతో ఫ్లోరా అకస్మాత్తుగా మంజూసింగ్పై యాసిడ్ పోసేసింది. తీవ్రగాయాల పాలైన ఆమెను పాఠశాల సిబ్బంది ఓ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఫ్లోరాపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
బైక్‌ను ఢీకొన్న కారు : ఇద్దరు హెచ్ఎంల మృతి
తూప్రాన్: బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో విధి నిర్వహణలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) దుర్మరణం చెందారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. మండలంలోని బ్రాహ్మణపల్లి, శివ్వంపేట మండలం పంబండ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్‌రెడ్డి (52), చంద్రయ్యలు పదోతరగతి పరీక్షలకు డిపార్టుమెంట్ ఆఫీసర్‌గా ఒకరు, చీఫ్ సూపరింటెండెంట్‌గా మరొకరు నియామకమయ్యారు. విధుల్లో భాగంగా సోమవారం కాళ్లకల్‌లో నూతనంగా ఎంపికైన పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు బైక్‌పై బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బైక్.. మనోహరాబాద్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, చంద్రయ్యను జీఎంఆర్ అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. -
ఈ హెడ్మాస్టర్ మాకొద్దు
‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెడ్మాస్టర్ విలువలు మరచి ప్రవరిస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెస్తున్నారు. మేము ఆడపిల్లలమే కాని ఆటబొమ్మలం కాము. మాతో అసభ్యంగా ప్రవరిస్తున్నారు. పాఠశాలకు రావాలంటేనే భయమేస్తోంది. ఈ హెచ్ఎం మాకొద్దు. ఆయన ఉంటే పాఠశాలకు రాం.’పులివెందులలోని రవీంద్రనగర్ పాఠశాల విద్యార్థినుల ఆవేదన ఇది. పులివెందుల టౌన్: పులివెందులలోని రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణానాయక్ సార్ మా కొద్దంటూ బుధవారం విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో అసభ్యంగా మాట్లాడుతున్న హెడ్మాస్టర్ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వివరాల్లోకెళితే.. పులివెందుల పట్టణంలోని న్యాక్ బిల్డింగ్ వద్ద ఉన్న రవీంద్రనాథ పాఠశాల హెడ్మాస్టర్గా కృష్ణానాయక్ ఈ ఏడాది మే 24న బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన చక్రాయపేట మండలం మహదేవపల్లి జెడ్పీ పాఠశాలలో పలు ఆరోపణలతో సస్పెండయ్యారు. అనంతరం కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు ఈయన ర వీంద్రనాథ పాఠశాలకు హెడ్మాస్టర్గా వచ్చారు. ఆయన తీరులో ఏమాత్రం మార్పులేదని.. తమను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని.. తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తమ తల్లిదండ్రులు వచ్చి హెడ్మాస్టర్ను అడిగినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నిత్యం నరకం అనుభవించలేక ఆందోళనకు దిగామని వారు చెప్పారు. హెడ్మాస్టర్ డౌన్ డౌన్.. ఈ హెడ్మాస్టర్ మాకొద్దు..ఆయన ఉంటే పాఠశాలకు రామంటూ ఫ్లకార్డులు చేతబట్టుకుని నినాదాలు చేశారు. ఎంఈవో విలియం రాజు విచారణ : హెడ్మాస్టర్ కృష్ణానాయక్ తీరుకు నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఎంఈఓ విలియం రాజు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఈ హెడ్మాస్టర్ ఉంటే తాము పాఠశాలకు రామని విద్యార్థులు తెగేసి చెప్పారు. దీంతో ఆయన ఈ విషయాన్ని డీఈఓకు ఫోన్ ద్వారా వివరించారు. హెడ్మాస్టర్ను వివరణ కోరగా తనకెలాంటి పాపం తెలియదన్నారు. కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా హెడ్మాస్టర్ మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పారు. అలాగే రాయచోటి అసిస్టెంట్ డీఈఓ రంగారెడ్డి కూడా బుధవారం మధ్యాహ్నం పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఆడపిల్లలమా.. ఆటబొమ్మలమా పాఠశాలకు చదువుకొనేందుకు వస్తున్నాము, మా హెడ్మాస్టర్ మాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. మేము ఆడపిల్లలమా లేక ఆటబొమ్మలం అనుకున్నారా. గురువంటే తండ్రితో సమానం. ఇలాంటి వారు పాఠశాలలో ఉంటే మే ము ఎట్లా చదువుకోవాలి..మాకు పాఠశాలకు రావాలంటేనే భయంగా ఉంది. ఈ హెడ్మాస్టర్ను ఇక్కడి నుంచి పంపిం చాల్సిందేనని విద్యార్థులు తమ ఆవేదనను అధికారుల ఎదుట వ్యక్తం చేశారు. -
విద్యార్థిని చితకబాదిన హెడ్మాస్టర్: పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు హైస్కూల్ హెడ్ మాస్టర్ విద్యార్థిని చితకబాదాడు. ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగార్జున అనే విద్యార్థి మంచినీళ్లు తాగడానికి బయటకు వెళ్లాడు. ఆ విద్యార్థి మంచినీళ్లు తాగి స్కూల్‌కు తిరిగి వచ్చిన తరువాత హెడ్ మాస్టర్ పెద్దిరాజు, క్లర్క్ వెంకటేశ్వర్లు కలిసి చితకబాదారు. దాంతో ఆ విద్యార్థి బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గత వారం రోజులుగా హెడ్ మాస్టర్, క్లర్క్ కలిసి తమని కొడుతున్నారని, వేధిస్తున్నారని ఆ ఫిర్యాదులో తెలిపారు. -
42 మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఎంఈఓలు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని 42 మండలాల్లో ఇన్చార్జి ఎంఈఓలు కొనసాగుతున్నారు. ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న వీరిని పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కూడా పాఠశాలలకు పంపకపోవడం విచారకరం.ప్రధానోపాధ్యాయులు లేని ప్రభావం పాఠశాలలపై తప్పక ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. ఆయా మండలాల్లోని ఉన్నతపాఠశాలల్లోని సీనియర్ ప్రధానోపాధ్యాయులను ప్రభుత్వం ఇన్చార్జ్ ఎంఈఓలుగా ఏళ్ల తరబడి నియమించింది. ఇన్‌చార్జ్‌లు అంటే సాధారణంగా తాత్కాలికంగా నెల, రెన్నెళ్లో అనుకోవడం సర్వసాధారణం. అయితే విద్యాశాఖలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఏళ్లతరబడి ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలు కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రధానోపాధ్యాయులు వారానికి 8 పీరియడ్లు తమ సబ్జక్టులను బోధించాలి. వివిధ రకాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, నివేదికల సమర్పణ, పాఠశాలల పర్యవేక్షణ తదితర వాటికే వీరికి సమయం సరిపడలేదు. దీంతో వీరు తమ సొంత పాఠశాలలవైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. జిల్లాలోని చాపాడు, మైలవరం, కొండాపురం, కడప, ఖాజీపేట, చిట్వేలు, బద్వేలు, సుండుపల్లి, గాలివీడు మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన పేరు కృష్ణఫర్. రాజుపాళెం మండలం వెలవలి జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 2010 జూలై నుంచి మండలానికి ఇన్చార్జ్ ఎంఈఓగా కొనసాగుతున్నారు. అప్పుడప్పుడూ పాఠశాల ఎలా ఉందో అని వెళ్లి చూసుకోవడం తప్ప దాని స్థితిగతులను కూడా పర్యవేక్షించలేని పరిస్థితి. -క్రిష్టఫర్, రాజుపాళెం ఇన్చార్జి ఎంఈఓ -
ఆడ్కిచర్ల హెచ్ఎంకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
పెద్దేముల్ మండలం ఆడ్కిచర్ల కేం ద్ర ప్రాథమికోన్నత పాఠశాల(సీయూపీఎస్) ప్రధానోపాధ్యాయుడు పి.శివకుమార్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు(2012)కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం రోజున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకోనున్నారు. ఈమేరకు ఈనెల 12న కేం ద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నుంచి ఆడ్కిచర్ల పాఠశాలకు లేఖ అం దింది. తాండూరు మండలం చిట్టిఘనాపూర్కు చెందిన శివకుమార్ 1989లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆడ్కిచర్ల సీయూపీఎస్లో ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్నారు. 2006లో జిల్లా, 2010లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శివకుమార్ అవార్డులను అం దుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత నిర్మూలన, బాలకార్మికుల విముక్తికి ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం శివకుమార్‌కు ఈ అవార్డును ప్రకటించింది. ప్రస్తు తం యోగా గురువుగా కూడా శిక్షణనిస్తున్న ఆయన సామాజిక రుగ్మతను రూపుమాపడానికి నాటకాల ద్వారా ప్రదర్శనలు కూడా ఇచ్చారు. శివకుమార్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంపై తోటి ఉపాధ్యాయులు, సన్నిహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.