ఉపాధ్యాయుడి దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాదు జిల్లా పరిషత్ పాఠశాలలో చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తనూజ అనే విద్యార్థిని బుధవారం పాఠశాలకు హాజరు కాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించాడు. దెబ్బలకు తట్టుకోలేక విధ్యార్థిని కిందపడిపోవడంతో హుటాహుటిన దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరావు పరారయ్యాడు.
Published Thu, Oct 20 2016 2:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:56 PM
Advertisement
Advertisement
Advertisement