thrashes
-
తోటి విద్యార్థిపై దాడిచేసిన బండి సంజయ్ కుమారుడు
-
లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు... వైరల్ వీడియో
Man Snatches Cop's Baton: కొంతమంది అధికారులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే...మరికొంతమంది అత్యంత సౌమ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు అధికారులు అన్న భయం గానీ ఏమీ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత అధికారుల ఆగ్రహానికి గురై ఊచలెక్కెడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్ అనే కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి దాడి చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. పోలీసుల కథనం ప్రకారం .... దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్ బైక్‌తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ మోటార్ బైక్‌ని ఢీ కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ దినేష్‌తో బైక్ జాగ్రత్తగా నడుపు అన్నాడు. అంతే కోపంతో ఆ కానిస్టేబుల్ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడకి కానిస్టేబుల్ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు కూడా. కానీ దినేష్ మాత్రం కానిస్టేబుల్ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq — Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022 (చదవండి: మహిళా అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్) -
ఊరంతా ఏకమై.. మహిళను చితకబాది, జుట్టు కత్తిరించి
కోల్‌కతా: ఊరి జనమంతా కలిసి పట్టపగలు నడి రోడ్డు మీద ఓ మహిళను చితకబాదారు. జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ నేత బాబుల్ సుప్రియో ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో స్త్రీలపై ఇంత అరాచకంగా ప్రవర్తించడం నిజంగా దారుణం.. ఇదేనా మనం కోరుకున్న బంగ్లా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. బాబుల్ సుప్రియో ట్వీట్ చేసిన ఈ వీడియోలో ఓ మహిళ నేల మీద పడి ఉంటుంది. ఇక గ్రామంలోని ఆడ, మగ ఆమెను కొడతారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకు వస్తారు. తనను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఇంతలో కొందరు మహిళలు బాధితురాలి దగ్గరకు వచ్చి.. ఆమె జుట్టు పట్టుకుని కత్తిరిస్తారు. మరో దారుణమైన విషయం ఏంటంటే పట్టపగలే ఈ సంఘటన చోటు చేసుకుంది. జనాలు గుమికూడి చోద్యం చూశారు తప్ప ఏ ఒక్కరు ఆమెను కాపాడలేదు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీయడంలో బిజీ అయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే సదరు మహిళపై ఇలా దాడి చేశారని సమాచారం. Atrocities against women of Bengal continue from Moynaguri to Kumargram, as politically biased authorities turn a blind eye... Now a woman has been physically assaulted in front of the whole village for allegedly having an affair...Is this the Bengal of our dreams?@narendramodi pic.twitter.com/60uTKDCw4i — Babul Supriyo (@SuPriyoBabul) June 17, 2021 దీనిపై స్పందిస్తూ బాబుల్ సుప్రియో ‘‘బెంగాల్ మహిళలపై దురాగతాలు మొయినాగురి నుండి కుమార్గ్రామ్ వరకు కొనసాగుతున్నాయి. రాజకీయ నేతల చెప్పు చేతల్లో నడిచే అధికారులు కళ్లుండి గుడ్డివారయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలపై సదరు మహిళను శారీరకంగా హింసించారు. ఇదేనా మనం కలలు కన్న బెంగాల్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 8 ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు...అందుకే పథకం ప్రకారం -
అసభ్య సందేశాలు.. బాస్‌ను చితకబాదిన మహిళ
బీజింగ్: ఆడవాళ్లు ఇంటి పట్టునే ఉండాలి.. కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి.. వారికి కావాల్సినవన్ని అమర్చి.. ఆమె జీవితాన్ని కుంటుంబానికే అంకితం చేయాలి. ఉద్యోగాలు చేయడం అంటే పెద్ద నేరం చేసినట్లే. స్త్రీ అంటే నేటికి సమాజంలో చాలా మందికి ఇదే భావం. ఇక ఈ బంధనాలు తెంచుకుని ఉద్యోగాలు చేసే మహిళలు ఎదుర్కొనే సమస్యలు కోకొల్లలు. పనిలో ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఆఫీసుకు కాస్త లేటుగా వెళ్లినా.. కొందరు పురుష ఉద్యోగులు ఇంటి పట్టున ఉండక.. వీరికి ఇవన్ని ఎందుకు అంటూ ఎద్దేవా చేస్తారు. ఇక బాస్ "మగానుభావుడైతే" ఆ కష్టాలు ఇంకో రకం. ఆ పెత్తనంతో ఆడవారిని వేధింపులకు గురి చేస్తారు. తమ మాట వినకపోతే.. టార్చర్ పెడతారు. బాస్ అనే కారణం చెప్పి ఫోన్ చేసి.. అసభ్య సందేశాలు చేస్తూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తారు. చాలా మంది ఆడవారు వీటన్నింటిని మౌనంగా భరిస్తారు. కానీ కొందరు మాత్రం ఎదురుతిరుగారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే బాగా అర్థం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ యువతిని ఆమె బాస్ వేధింపులకు గురి చేస్తాడు. ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సహనం కోల్పోయిన సదరు ఉద్యోగిణి మాబ్ కర్ర తీసుకువచ్చి.. బాస్‌ను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని సుయిహువా, బీలిన్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగ సంస్థలో ఈ సంఘటన జరిగిందని చైనా టైమ్స్ న్యూస్ మీడియా తెలిపింది. ఈ వీడియోలో ఓ మహిళ తన బాస్ తనను ఎలా హింసించాడో వివరిస్తూ అతడిపై మాబ్ కర్రతో దాడి చేస్తుంది. తనకు అసభ్య సందేశాలు పంపాడని.. వార్నింగ్ ఇచ్చినా ఆగలేదని.. దాంతో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశానని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఎన్ని చేసినా బాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఓపిక నశించిన సదరు యువతి మాబ్ కర్రతో బాస్‌పై దాడి చేస్తుంది. చితకబాదుతుంది. ఇక సదరు బాస్ తన మొహం కనిపించకుండా చేతులు అడ్డుపెట్టుకుని తనను వదిలి వేయాల్సిందిగా బతిమిలాడతాడు. తాను జోక్ చేద్దామని భావించి మెసేజ్ చేశానని తెలుపుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనులు సదరు ఉద్యోగిణిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఇంతే ధైర్యంగాఉండాలని కామెంట్ చేస్తున్నారు. చదవండి: హనీమూన్ కోసం రూ.18 లక్షలకు కొడుకును అమ్మిన తండ్రి -
వైరల్ వీడియో: బాస్‌ను చితకబాదిన మహిళ
-
బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు
ఫ్లోరిడా: దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నందుకు గాను రెస్టారెంట్ సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు నలుగురు మహిళలు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఫ్లోరిడా పామ్ బీచ్ కౌంటీలోని పొపాయ్స్ రెస్టారెంట్ డ్రైవ్-త్రూ లేన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు.. నలుగురు మహిళలు వైట్ కలర్ నిస్సాన్ కారులో పొపాయ్స్ రెస్టారెంట్‌కి వచ్చారు. వీరిలో ఓ మహిళ క్యాష్ కౌంటర్లో నుంచి డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నించింది. దాంతో రెస్టారెంట్ సిబ్బంది ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహానికి గురైన మహిళ క్యాషియర్ని బూతులు తిడుతూ.. అతడిపై దాడి చేయడం ప్రారంభించింది. ఇది చూసి మిగతా ముగ్గురు మహిళలు కూడా అక్కడికి వచ్చి సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఈ తతంగాన్ని రెస్టారెంట్లో ఉన్న మరోక కస్టమర్ తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పామ్ బీచ్ కౌంటీ పోలీసులు ఈ వీడియోని తమ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘మీలో ఎవరైనా రెస్టారెంట్ సిబ్బందిపై దాడి చేసిన ఈ మహిళలను గుర్తించగలరా. వీరు సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించి.. డబ్బుతో ఉడాయించారు’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి కోసం గాలిస్తున్నాం అని తెలిపారు. సదరు మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. చదవండి: బోనాల్ వెళ్లే దారి ఇదేనా? మాటల్లోకి దించి చోరి.. -
బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ అరెస్ట్
చంఢీగడ్: టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ అధికారిని అడ్డుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. ఈ నెల ప్రారంభంలో సోనాలి ఫోగట్ బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను సమీక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న మార్కెట్ సెక్రటరీ సుల్తాన్సింగ్తో ఆమెకు వాదులాట జరిగింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన సోనాలి అతడిని చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలయ్యింది. ఈ క్రమంలో సదరు అధికారి దుర్భాషలాడుతూ, తనను అవమానించడం వల్లే కొట్టాల్సి వచ్చిందని సోనాలి పేర్కొన్నారు. ఈ క్రమంలో సుల్తాన్ సింగ్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తానేమీ అనకముందే సోనాలి తనపై దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు బుధవారం సోనాలిని అరెస్ట్ చేశారు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫోగట్‌కు బీజేపీ గతేడాది ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు తథ్యమనుకున్నప్పటికీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఓటమిపాలైంది. -
గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి..
-
గృహిణి అదృశ్యం.. చెట్టుకు కట్టేసి
భోపాల్ : ఓ గృహిణి అదృశ్యమవ్వడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఇందుకు కారకులన్న అనుమానంతో ముగ్గురిని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు గ్రామస్తులు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. ధార్ ప్రాంతానికి చెందిన ఓ గృహిణి కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోయింది. ఓ యువకుడే ఇందుకు కారణం అని భావించిన గ్రామస్తులు అతనితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఏఎన్ఐ ప్రచురించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏఎన్ఐ పోస్ట్ చేసిన ఫోటోలో ఒక వ్యక్తిని, మహిళను చెట్టుకు కట్టేసి ఉండగా.. వారి చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఈ సంఘటన ధార్ అర్జున్ కాలనీలో సంభవించినట్లు ఏఎన్ఐ వెల్లడించింది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఓ ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశామని.. తర్వలోనే మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : గృహిణి అదృశ్యం.. అనుమానంతో చెట్టుకు కట్టేసి.. -
మహిళ పైశాచికం.. చెవి రింగుల కోసం
ముంబై : మానవత్వం మరిచిన ఓ మహిళ.. నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా హింసించిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాలు.. రిజ్వానా బేగం అనే మహిళ నాలుగేళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా కొడుతూ హింసించింది. నొప్పికి తాళలేక ఆ చిన్నారి కేకలు పెడుతున్నప్పటికి రిజ్వానా మనసు కరగలేదు. అంతటితో ఆగక చిన్నారి కేకలు బయటకు వినపడకుండా ఉండేందుకుగాను ఏకంగా ఆ చిన్నారిపై కూర్చుంది రిజ్వానా. ముంబై సబర్బన్ ట్రాంబే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. రిజ్వానా బాలికను కొడుతున్న దృశ్యాలు లిఫ్ట్‌లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ముంబై పోలీసులు రిజ్వానాను అరెస్ట్ చేశారు. బాలిక చెవి రింగులు దొంగతనం చేయడం కోసమే రిజ్వానా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రిజ్వానా దగ్గర నుంచి బాలికకు చెందిన చెవి రింగులను స్వాధీనం చేసుకున్నారు. HORIBLE #crime! Rizwana Begum the woman in the CCTV footage brutally assaulted a 4-yr-old girl in the lift. She later sat on the girl & prevented people to rescue her too. @MumbaiPolice has arrested her. Hope she’s dealt severely for this inhuman behaviour. @ChemburChapters pic.twitter.com/rpA6NsT31h — #PotholeWarriors4SafeMumbai🇮🇳🕳🛵👷♂️🚧💡🕯👍🌴 (@PotholeWarriors) November 15, 2018 -
ఉన్నతాధికారులపై దాడి చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు
పాట్నా : లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సిన పోలీసులే.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమ సహోద్యోగి మృతికి కారణమయిన ఓ కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను చితక్కొట్టడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ట్రైనింగ్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌కి డెంగ్యూ వచ్చింది. దాంతో సదరు మహిళ సెలవు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. కానీ వారు అంగీకరించలేదు. దాంతో ఆ మహిళా కానిస్టేబుల్ మరణించింది. సెలవు మంజూరు చేయకపోవడం వల్లే సదరు ఉద్యోగిని మరణించిందని తేలిసి ఆగ్రహం చెందిన మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారుల మీద దాడికి దిగారు. అసభ్య పదజాలంతో తిడుతూ.. పదునైన ఆయుధాలతో దాడి చేయడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అంతటితో ఊరుకోక కొన్ని ప్రభుత్వ వాహనాలతో పాటు ఫర్నిచర్‌ని కూడా ధ్వంసం చేశారు. Patna: Police personnel protest and create ruckus allegedly after an ailing woman constable passed away due to lack of treatment.Protesters claim the commandant did not grant her an adequate leave period to get treated.The commandant was injured after being thrashed by protesters pic.twitter.com/GtJbgN1owL — ANI (@ANI) November 2, 2018 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో బిహార్ సీఎం నితిష్ కుమార్ దృష్టికి చేరింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా నితిష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
వైరల్ వీడియో : ఎస్సైపై బీజేపీ నేత దాష్టీకం
లక్నో : ఇన్నాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీస్ అధికారుల మీద దాడి చేయడం చూశాం. కానీ ఈ మధ్య అధికార పార్టీ నాయకలు కూడా పోలీస్‌ల మీద దాడి చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్ మనీష్ డ్యూటీలో ఉన్న ఎస్సై మీద చేయి చేసుకున్నారు. వివరాలు.. సదరు ఎస్సై ఓ మహిళా న్యాయవాదిని తీసుకుని మనీష్ హోటల్‌కి వచ్చాడు. ఆ సమయంలో ఎస్సైకి, వెయిటర్‌కి మధ్య వివాదం జరిగింది. దాంతో మనీష్ సదరు ఎస్సైపై పలు మార్లు చేయి చేసుకున్నారు. అంతటితో ఊరుకోక ఎస్సైని బూతులు తిట్టడం ప్రారంభించాడు. ప్రసుత్తం ఈ కౌన్సిలర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. -
మార్కులు తక్కువ వచ్చాయని చితకబాదిన టీచర్
-
టీచర్ దెబ్బలకు స్పృహ కోల్పోయిన విద్యార్థిని
-
ప్రాజెక్టు వర్క్ చేయలేదని..
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు కొల్లాపూర్: ప్రాజెక్టు వర్క్ చేయలేదని ఓ విద్యార్థిని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు చితకబాదాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో బుధవారం జరిగింది. ఫిజిక్స్, మ్యాథ్స్ ప్రాజెక్ట్ వర్క్ చేయలేదంటూ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థి గంగాధర్‌ను ఉపాధ్యాయుడు బోనీఅజాక్ చితకబాదాడు. దీంతో గంగాధర్ తొడలు, వీపు, చేతులు వాచిపోయాయి. చొక్కా చిరిగింది. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. బోనీఅజాక్‌తో తోపులాటకు దిగారు. విద్యార్థి ఒంటిపై ఉన్న దెబ్బలను ఎంఈవో కుర్మయ్యకు చూపించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అయితే, తమ పాఠశాల ఉపాధ్యాయులపై వారు దాడికి పాల్పడ్డారని యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేం దుకు సిద్ధమయ్యారు. దీంతో మధ్యవర్తులు రంగంలోకి దిగి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది.