వైరల్‌ వీడియో : ఎస్సైపై బీజేపీ నేత దాష్టీకం | Uttar Pradesh BJP Councillor Thrashes A Sub-Inspector | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో : ఎస్సైపై బీజేపీ నేత దాష్టీకం

Published Sat, Oct 20 2018 1:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

Uttar Pradesh BJP Councillor Thrashes A Sub-Inspector - Sakshi

ఎస్సైని కొడుతున్న బీజేపీ కౌన్సిలర్‌ మనీష్‌

లక్నో : ఇన్నాళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోలీస్‌ అధికారుల మీద దాడి చేయడం చూశాం. కానీ ఈ మధ్య అధికార పార్టీ నాయకలు కూడా పోలీస్‌ల మీద దాడి చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ మనీష్‌ డ్యూటీలో ఉన్న ఎస్సై మీద చేయి చేసుకున్నారు.

వివరాలు.. సదరు ఎస్సై ఓ మహిళా న్యాయవాదిని తీసుకుని మనీష్‌ హోటల్‌కి వచ్చాడు. ఆ సమయంలో ఎస్సైకి, వెయిటర్‌కి మధ్య వివాదం జరిగింది. దాంతో మనీష్‌ సదరు ఎస్సైపై పలు మార్లు చేయి చేసుకున్నారు. అంతటితో ఊరుకోక ఎస్సైని బూతులు తిట్టడం ప్రారంభించాడు. ప్రసుత్తం ఈ కౌన్సిలర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement