మహిళ ఎదురుగా ఎస్‌ఐ వికృత చర్య | UP Police Officer Masturbates in Front of Woman Gets Suspended | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్‌.. ఎస్‌ఐపై చర్యలు

Published Wed, Jul 1 2020 12:45 PM | Last Updated on Wed, Jul 1 2020 4:31 PM

UP Police Officer Masturbates in Front of Woman Gets Suspended - Sakshi

లక్నో: భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ ఎదురుగా ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ రహస్యంగా వీడియో తీసి సోషల్‌ మీడయాలో షేర్‌ చేయడంతో ఎస్సైని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని భట్ని పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి భట్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్‌ ఫిర్యాదు గురించి సదరు మహిళతో మాట్లాడాలంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎదురుగా హస్తప్రయోగం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్‌ కెమరాతో రికార్డు చేసి సోషల్‌ మీడయాలో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియో వైరల్‌ కావడం.. సదరు ఎస్సై ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్‌ చేశారు. 

ఈ క్రమంలో సదరు మహిళ మాట్లాడుతూ.. ‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్‌ పాల్‌ సింగ్‌ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్‌ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాను’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement