Masturbate
-
తల్లి చూస్తుండగానే.. వికృత చేష్టలు
ఢిల్లీ: మరోసారి ఢిల్లీ మెట్రో రైలు వార్తల్లో నిలిచింది. ఈసారి అతి జుగుప్సాకరమైన ఘటన వెలుగు చూసింది. తల్లితో రైలులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై ఓ వ్యక్తి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అది గమనించిన ఆ తల్లి కూతురితో సహా కిందకు దిగిపోగా.. సదరు నీచుడ్ని మెట్రో సిబ్బందికి అప్పగించారు తోటి ప్రయాణికులు. బుధవారం ఢిల్లీ మెట్రో రైలు రెడ్ లైన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రక్షాబంధన్ కావడంతో నిన్న సాయంత్రం అంతా మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో.. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్ లైన్లో ప్రయాణిస్తున్న రైలులో ఓ ప్రయాణికుడు.. ఆ తోపులాటలో పక్కనే ఉన్న బాలికను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమైంది. ఈ లోపు పక్కనే ఉన్న ప్రయాణికులు అతన్ని గమనించి.. నిలదీయసాగారు. దీంతో ఆందోళనకు లోనైన ఆ తల్లి ఆ కూతురిని తీసుకుని సీలంపూర్ స్టేషన్లో దిగిపోయింది. అయితే.. పక్కనే ఉన్న ప్రయాణికులు మాత్రం అతన్ని పట్టుకుని షాహ్దరా స్టేషన్లో మెట్రో అధికారులకు అప్పగించారు. ఆపై స్టేషన్ సిబ్బంది ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. ఆ కామాంధుడి స్వస్థలం పశ్చిమ బెంగాల్ అని, పని కోసం ఢిల్లీకి వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇదీ చదవండి: వీడు అన్న కాదు.. కామపిశాచి! -
మహిళ ఎదురుగా ఎస్ఐ వికృత చర్య
లక్నో: భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ ఎదురుగా ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడయాలో షేర్ చేయడంతో ఎస్సైని సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ డియోరియాలోని భట్ని పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఓ మహిళ భూ వివాదం గురించి ఫిర్యాదు చేయడానికి భట్ని పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడ పని చేసే ఎస్సై భీష్మ్ పాల్ సింగ్ ఫిర్యాదు గురించి సదరు మహిళతో మాట్లాడాలంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఎదురుగా హస్తప్రయోగం చేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఈ దరిద్రాన్ని సదరు మహిళ సీక్రెట్ కెమరాతో రికార్డు చేసి సోషల్ మీడయాలో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడం.. సదరు ఎస్సై ప్రవర్తన మీద ఆగ్రహం వ్యక్తం కావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ మాట్లాడుతూ.. ‘భూ సమస్య పరిష్కారం కోసం నేను ఇప్పటికి పలుమార్లు ఈ పోలీసు స్టేషన్‌కు వచ్చాను. గతంలో 2, 3 సార్లు ఆ ఎస్సై ఇలానే ప్రవర్తించాడు. దీని గురించి నా స్నేహితురాలికి చెప్పాను. అప్పుడు ఆమె గతంలో భీష్మ్ పాల్ సింగ్ తన ముందు కూడా ఇలానే ప్రవర్తించాడని చెప్పింది. అందుకే ఈ సారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పడు సీక్రెట్ కెమరా తీసుకెళ్లాను. అతడి నీచ బుద్ధిని అందరికి తెలియజేయాలని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాను’ అన్నారు. -
బస్‌లో వికృత చేష్ట..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతంలో బస్సులో విద్యార్థిని పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా వ్యవహరించాడు. సీటులో కూర్చున్న మహిళ వద్దకు వెళ్లి జననాంగాన్ని చూపుతూ అమర్యాదకరంగా వ్యవహరించాడు. బాధితురాలు తేరుకుని దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. సాయాన్ని కోరుతూ అరిచినా తోటి ప్రయాణీకులు స్పందించలేదు. ధైర్యంగా అతడిని ఎదుర్కొన్న యువతి పోలీసులను పిలవడంతో పాటు కామాంధుడిని తీవ్రంగా కొడుతూ బస్సు నుంచి కిందకు తోసేసింది. మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఈ తరహా ఘటనలు ఇటీవల పలుమార్లు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బస్సులో ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని ఎదుట ఓ వ్యక్తి ఇలాగే వ్యవహరించగా, బాధితురాలు వీడియోలో రికార్డు చేసి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో ఊబర్ ప్రయాణీకురాలి ఎదుట డ్రైవర్ అసభ్యంగా వ్యవహరించాడు. అదే నెలలో వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ టైక్వాండో ట్రైనర్ మహిళ ఎదుట ఇలాగే వ్యవహరించాడు. -
వెంటపడి మరీ వికృత చేష్టలు...
టెక్సాస్: సైకిల్‌పై వృద్ధురాలి వెంటపడి మరీ వికృత చేష్టలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. అయితే అతని వ్యవహారాన్ని భరించలేకపోయిన సదరు వృద్ధురాలు అతన్ని తుపాకీతో కాల్చేసింది. టెక్సాస్ రాష్ట్రంలోని హౌస్టన్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రానీ జీన్(68) అనే వృద్ధురాలు మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సైకిల్‌పై ఆమెను వెంబడించాడు. కాస్త దూరం వెళ్లాక ప్యాంట్ విప్పి ఆమెను చూస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. భయంతో ఆమె ఇంటికి పరిగెత్తగా.. ఆమెను వెంటాడాడు. చివరకు ఆమె ఇంటి డోర్ వద్దకు చేరి మరీ తన చేష్టలను కొనసాగించాడు. భయంతో సదరు వృద్దురాలు అతన్ని హెచ్చరించినట్లు చెబుతోంది. ‘ఆ సమయంలో ఇంట్లో నా మనవరాలు ఒక్కతే ఉంది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. వెళ్లిపో.. లేకపోతే కాల్చి పడేస్తా అని చెప్పాను. అతను అయినా వినలేదు. భయంతో అతన్ని కాల్చేశా’ అని జీన్ చెబుతున్నారు. గాయపడ్డ అతను కాస్త దూరం వెళ్లాక కుప్పకూలిపోయాడు. కాగా, గాయపడిన సదరు వ్యక్తి(38) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్నాక అతన్ని అరెస్ట్ చేస్తామని ‘ల్యారీ క్రౌసన్’ అనే అధికారి వెల్లడించాడు. గతంలో ఓసారి నగ్నంగా రోడ్లపై తిరిగిన నేరంలో అతగాడిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జీన్‌పై ఎలాంటి కేసును నమోదు చేయలేదు. -
రైల్వే స్టేషన్లో వికృత చర్య.. ఫేస్బుక్లోలైవ్!
బందెల్ : రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి వికృత చర్యను ఓ మహిళా ఫేస్బుక్లో లైవ్ పెట్టింది. ఈఘటన పశ్చిమబెంగాల్లోని బందెల్ రైల్వే స్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. ఆ మహిళా ట్రైన్లో కూర్చొని ఉండగా.. ఆ వ్యక్తి మహిళల కంపార్ట్మెంట్ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే వికృత చర్యకు పాల్పడ్డాడు. దీంతో ఇబ్బెట్టుగా ఫీలైన ఆ మహిళ ఇతర ప్రయాణీకులను అప్రమత్తం చేసి రైలు దిగి అతన్ని బెదిరించే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన రైల్వే పోలీసుల.. అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా అక్కడి నుంచి పరారయ్యాడు. సాక్ష్యం కోసమే ఫెస్‌బుక్‌లో లైవ్‌లో పెట్టినట్లు ఆ మహిళ తెలిపింది. రైల్వే పోలీస్ ఆఫీస్ ముందే అతను అందరు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, తను వీడియో తీయడాన్ని గమనించే పోలీసులు అప్రమత్తమయ్యారని ఆమె వెల్లడించారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం గమనార్హం. కోల్‌కతాలో కూడా ఓ బస్సులో ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఓ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. -
డబ్బులిచ్చి మరీ ఆ పని చేయిస్తున్నారు: నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి విమర్శలను ఎదుర్కుంటున్నారు. ఆమె తాజాగా నటించిన వీరే ది వెడ్డింగ్ చిత్రంలో ఆమె ఓ సంచలన సన్నివేశంలో నటించారు. అయితే ఈ సన్నివేశంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా మంది ‘తమ ఇంట్లోని అడవాళ్లతో చిత్రానికి వెళ్లామని, కానీ, ఆ సన్నివేశం రాగానే థియేటర్ నుంచి బయటకు వచ్చేశామని’ ట్వీట్లు చేశారు. మరోవైపు చిత్రంపై మొదటి నుంచి వ్యతిరేకత కనబరుస్తున్న హిందూ అతివాదులు అయితే స్వరపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ట్రోలింగ్‌పై స్వర భాస్కర్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. ‘కొందమంది డబ్బులు ఇచ్చిమరీ సోషల్ మీడియాలో ఈ చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు సినిమా చూడడానికి, ఇలాంటి ట్వీట్స్ పెట్టడానికి ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ఉంటారు’ అంటూ కౌంటర్ వేశారు. స్పెల్లింగ్ కూడా రాదా?... ఇక స్వర భాస్కర్‌కు మద్ధతుగా నిలుస్తున్న కొందరు.. ట్రోలింగ్ చేసే వారికి రిటార్ట్ ఇస్తున్నారు. ‘మాస్టర్బేషన్(స్వయంతృప్తి) స్పెల్లింగ్ కూడా సరిగ్గా రానివాళ్లు.. వాళ్ల ఇంట్లో మహిళలతో సినిమాలు వెళ్తున్నారా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. శశాంఖ్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కరీనా కపూర్ పాటు సోనమ్ కపూర్, స్వరా భాస్కర్, శిఖాలు ప్రధాన పాత్రల్లో నటించారు. తమ స్నేహితురాలి వివాహం కోసం కలుసుకున్న యువతులు.. వ్యక్తిగత విషయాలను దర్శకుడు బోల్డ్‌గా చూపించిన యత్నమే వీరే ది వెడ్డింగ్ కథ. Why are so many sanskari people watching #VeereDiWedding with their grandmothers? — Rahul Pandita (@rahulpandita) 2 June 2018 -
బస్సులో మహిళల ముందే వికృత చేష్టలు
-
యువతులను చూస్తూ...
సాక్షి, కోల్‌కతా: బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి ఫేస్బుక్లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్ అయి పోలీసులకు చేరింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హూగ్లీ జిల్లా వైద్యపతి ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి ఓ చిరు వ్యాపారి. శనివారం శ్యామ్‌పుకర్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ.. మహిళా ప్రయాణికులను చూస్తూ యువతులను చూస్తూ అసభ్య చేష్టలకు దిగాడు. అది గమనించిన ఇద్దరు మహిళలు కండక్టర్‌తో చెప్పారు. కానీ, అతని నుంచి స్పందన లేకపోవటంతో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఓ యువతి ఆ వ్యాపారి చేష్టలను వీడియో తీసి ఫేస్బుక్లో అప్ లోడ్ చేసింది. ఎవరూ పట్టించుకోలేదని, మహిళలకు భద్రత ఏదంటూ పోస్టు చేసింది. అది కాస్త గంటల్లో వైరల్ అయి కోల్‌కతా పోలీసులకు చేరింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, అతన్ని శనివారం సాయంత్రమే అరెస్ట్ చేసినట్లు కోల్‌కతా పోలీసులు ఫేస్బుక్లో తెలియజేశారు. -
తలుపు తెరిస్తే షాక్; సీసీటీవీలో వికృతం
న్యూఢిల్లీ: సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఆ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వికృత చర్యను చూసి పోలీసులూ నిర్ఘాంతపోయారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు బలమైన చట్టాల కిందట అతణ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలిలాఉన్నాయి.. తైక్వాండో ట్రైనర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ఒకరు.. వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన పరిచయస్తురాలిని కలుసుకునేందుకు వెళ్లాడు. దర్వాజ దగ్గర నిలబడి బెల్ కొట్టాడు.. ఆ వెంటనే ప్యాంట్ విప్పేసి వికృతచర్యను మొదలుపెట్టాడు. తలుపు తెరిశాక ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన మహిళను చెరపట్టేప్రయత్నం చేశాడా మాస్టర్. క్షణాల్లో తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేయడంతో మాస్టర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యం చెయ్యకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించింది. బాధితురాలు అందించిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. మహిళ ఇంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలనూ సేకరించారు. డోర్‌బెల్ కొట్టి వికృతానికి పాల్పడిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయని, లైంగికదాడి యత్నం, అసభ్యప్రవర్తన కింద నిందితుడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఆ వేస్టుగాడిని పట్టిస్తే పాతిక వేలు
సాక్షి, న్యూఢిల్లీ : బస్సులో వెళుతున్నప్పుడు ఓ అమ్మాయిపక్కన కూర్చొని అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పట్టించిన వారికి రూ.25,000 బహుబతిగా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కనీసం ఎవరు సమాచారం అందించినా వారికి రూ.25వేలు ఇస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీలోని డీటీసీ బస్సులో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఒకరు ప్రయాణిస్తున్నప్పుడు తన పక్కన కూర్చున్న వ్యక్తి అసభ్య చేష్టలకు దిగాడు. ఆమెను తడిమేందుకు కూడా ప్రయత్నించాడు. ఫిబ్రవరి 7న చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఆమె వీడియోను కూడా రికార్డు చేసింది. ఆ సమయంలో బస్సులో ఏ ఒక్కరూ అతడిని పట్టించుకోలేదు. ఆమెకు సహాయం కూడా చేసేందుకు కూడా ముందుకు రాలేదు. దీంతో ఈ విషయంపై గత సోమవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి వసంత విహార్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు అతడికోసం తీవ్రంగా గాలిస్తున్నారు. -
బెడ్రూమ్లో కూడా టార్గెట్స్ గుర్తొస్తున్నాయ్...
ప్రైవేట్ కౌన్సెలింగ్ పురుషుల సందేహాలకు సమాధానాలు యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు. నా వయసు 42 ఏళ్లు. మా ఆవిడకు ఇబ్బంది వద్దని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నేనే చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకొని కూడా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు నా వృషణాల్లో బరువుగా అనిపిస్తోంది. ఈమధ్య మెడ, తల నొప్పిగా ఉంటోంది. అలసట వస్తోంది. సెక్స్ కూడా చక్కగా చేయలేకపోతున్నాను. ఈ సమస్యలన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - కె.వి.ఎస్. ఒంగోలు మీరు చెప్పిన సమస్యలతో 39, 40 ఏళ్ల వయసులో చాలామంది మగవాళ్లు బాధపడుతూ ఉంటారు. మీలాగే అపోహ చెంది వాళ్ల సమస్యలను వాసెక్టమీకి ఆపాదిస్తుంటారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. దీర్ఘకాలిక సమస్యలేమీ రావు. వాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేగాని... వృషణాలు బరువు అనిపించడానికీ, వ్యాసెక్టమీకీ ఎలాంటి సంబంధమూ ఉండదు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలిసి మీ సమస్యలకు చికిత్స తీసుకోండి. మీ సమస్యలన్నీ మామూలు చికిత్స ప్రక్రియలతో చక్కదిద్దగలిగేవే. నా వయసు 23 ఏళ్లు. గత మూడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. ఇటీవల నా బరువు బాగా తగ్గినట్లు అనిపిస్తోంది. హస్తప్రయోగం తర్వాత విపరీతమైన నీరసంగా ఉంటోంది. హస్తప్రయోగం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందా? - డి.కె.ఆర్., కరీంనగర్ యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు. మీలోని కోరికను బట్టి, మీలో కలిగే సెక్స్ ప్రేరేపణలను బట్టి హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసినా దానివల్ల మీకు ఏమాత్రం హాని లేదు. అయితే బరువు తగ్గినట్లుగా అనిపించడం మీ అనుమానమైతే, హస్తప్రయోగం పట్ల మీకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నిజంగానే మీ బరువు తగ్గి ఉంటే దానికి అసలు సమస్య ఏమిటోతెలుసుకొని దానికి చికిత్స తీసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా అవుతారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి. నా వయుసు 30 ఏళ్లు. నా వృషణాలు చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. నాకు ఉన్న సవుస్య ఏమై ఉంటుంది? దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కె., కందుకూరు చాలామంది తమ వృషణాల సైజ్ గురించి, పురుషాంగం పరిమాణం గురించి ఆందోళన పడుతుంటారు. అలాంటి ఆందోళన ఉన్నప్పుడు అవి చిన్నగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ అది వాళ్ల అపోహ మాత్రమే. కొందరిలో మాత్రం వేరికోసిల్ వల్ల వుుందు పెద్దవిగా ఉన్న వృషణాలు ఆ తర్వాత సైజ్ తగ్గవచ్చు. వాళ్లలో నొప్పి కూడా ఉండవచ్చు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్ష చేరుుంచి, నిజంగానే సమస్య ఉందా అన్న విషయాన్ని యాండ్రాలజిస్ట్ నిర్ధారణ చేస్తారు. మీ సమస్యను బట్టి చికిత్స ఉంటుంది. మా బాబుకు పదకొండేళ్లు. ఒకరోజు రాత్రి అతడికి అకస్మాత్తుగా వృషణంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వృషణం పూర్తిగా డ్యామేజీ అయ్యిందని, దాన్ని వెంటనే తొలగించాలని అన్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు మా అబ్బాయి పెద్దయ్యాక పెళ్లిచేస్తే ఈ ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టడానికి ఏమైనా సమస్య వస్తుందా? - వై.కె.ఆర్., విజయవాడ మీరు చెప్పిన సమస్యను టెస్టిక్యులార్ టార్షన్ (వృషణం తిరగబడటం) అంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆరు గంటలలోపు ఆపరేషన్ చేస్తే తిరగబడ్డ వృషణాన్ని సాధారణ స్థితిలోకి పెట్టవచ్చు. అలా చేస్తే వృషణాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. మీరు చెప్పినట్లుగా ఇది వైద్యపరంగా అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషనే. ఒక్క వృషణమే ఉన్నప్పటికీ మీ బాబుకు భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి ఆ అంశం ఏమీ సమస్య కాబోదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నా వయసు 47 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉన్నందువల్ల తీవ్రమైన ఒత్తిడితో ఉంటాను. పైగా అధిగమించాల్సిన టార్గెట్స్ కూడా ఉంటాయి. ఇటీవల కొంతకాలం నుంచి సెక్స్‌లో పాల్గొనలేకపోతు న్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. - జీ.వి.ఎమ్., హైదరాబాద్ సాధారణంగా నలభై ఏళ్లకు పైబడ్డ పురుషుల్లో వృత్తిరమైన, సామాజిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో వారు సెక్స్‌లో అనుకున్నట్లుగా పెర్ఫార్మ్ చేయలేకపోవడం చాలా సాధారణమైన సమస్య. సాధారణంగా ఈ వయసులో వారు వారానికి రెండుమూడు సార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటుంటారు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మీరు ప్రతిరోజూ యోగా, ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ చేయండి. దాంతో ఒత్తిడి తొలగిపోవడంతో పాటు ఫిట్సెస్ చేకూరుతుంది. మీ సెక్స్ పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొన్నాళ్లు మందులు వాడటం ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు. నాకు 39 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతంగా మంట వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని చెప్పారు. నాకు మంట మినహా ఇతర ఏ సమస్యా లేదు. దీనికి ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే ఏవైనా సెక్స్ సమస్యలు వస్తాయా? నాకు ఇప్పుడు సెక్స్ సామర్థ్యం బాగానే ఉంది. ఆపరేషన్ తర్వాత సామర్థ్యం తగ్గుతుందేమోనని భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. - ఎమ్.ఆర్., ఖమ్మం మూత్రాశయంలో రాళ్లు ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు ఎంతమాత్రమూ నష్టం జరగదు. పైగా అవి చాలా దూరంగా ఉంటాయి కూడా. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇన్ఫెక్షన్ను ఇలాగే వదిలేస్తే అది కీడ్నీకి కూడా పాకడానికి అవకాశం ఉంది కాబట్టి. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి. -
అందువల్లే మొటిమలు వస్తున్నాయా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయుస్సు 17 ఏళ్లు. గత రెండేళ్లుగా హస్తప్రయోగం అలవాటు ఉంది. అది అలవాటైనప్పటి నుంచి నాకు ముఖం, భుజాలు, వీపు మీద మొటిమలు బాగా వస్తున్నారుు. డాక్టర్‌ను సంప్రదించి రకరకాల మందులు వాడాను. అయినా అవి వస్తున్నాయి, తగ్గుతున్నారుు. హస్తప్రయోగం చేయుడం ఆపితే మొటివులు రావడం లేదు. కానీ ఆపుకోలేక వారానికి రెండుసార్లరుునా హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాను. మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయూలి. మొటిమల వల్ల ఎవరికీ నా ముఖం చూపించుకోలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - కే.ఆర్. చిత్తూరు మీ వయుస్సు పిల్లల్లో హార్మోన్ల ప్రభావం (ప్రధానంగా టెస్టోస్టెరాన్) వల్ల మొటివులు రావడం సాధారణం. ఈ వయుస్సులోనే హస్తప్రయోగం చేయుడం కూడా అలవాటవుతుంది. అరుుతే... హస్తప్రయోగం వల్ల మొటివులు రావు. అసలు హస్తప్రయోగానికీ, మొటివులు రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే... పరీక్షల్లాంటి టెన్షన్లు ఉన్నా, ఏవైనా ఇతర ఒత్తిళ్లు ఉన్నా మొటివులు ఎక్కువ కావచ్చు. ఇలా మొటివులు వచ్చినప్పుడు తరచూ వుుఖం కడుక్కోకపోవడం వల్ల, వుుఖం శుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అవి వురీ పెద్దగా వూరడానికి అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల మొటివులు కొందరిలో వురీ ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉంటారుు. మొటివులు వస్తే అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం తప్ప... వాటికి ఇతరత్రా ఏవిధమైన చికిత్స అవసరం లేదు. అరుుతే వాటిని గిల్లడం వంటి పనులు అస్సలు చేయుకూడదు. నా వయుస్సు 26 ఏళ్లు. నాకింకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి ఒంగుతోంది. అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం అరటిపండు ఆకారంలో ఉంటోంది. దీన్ని కార్డీ అంటారని పేపర్లో చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. ఆపరేషన్ ద్వారా సరి అవుతుందా? ఏ డాక్టర్‌ను సంప్రదించాలి. పెళ్లిచేసుకోవచ్చా? - పి.వి.కె., నలొండ అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. కానీ ఆ ఒంపు కాస్తా... వుూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉన్నంతగా వంగి ఉంటే ఆ పరిస్థితిని కార్డీ అంటారు. వుూత్రనాళం (యుురెథ్ర)గానీ, అంగస్తంభన కలిగించే ఎరెక్టైల్ బాడీస్లోగానీ సరిగ్గా పెరుగుదల లేక తేడాలు (డిస్పారిటీస్) రావడం వల్ల ఈ కార్డీ అనే కండిషన్ వస్తుంది. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ ఆపరేషన్‌తో ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తారు. అరుుతే ఈ సర్జరీకి వుుందు యుూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత ఎంత ఉందో నిర్ధరణ చేస్తారు. దాన్ని బట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణరుుస్తారు. నాకు వరిబీజం వచ్చింది. ఆపరేషన్ అంటే భయుం. ఒక ఆర్ఎంపీని కలిస్తే ఆయున సిరంజీతో నీరు తీసేశాడు. ఇప్పుడు పొట్టలో ఎడవుపక్కన, వెనకభాగంలో వాచినట్లు అనిపిస్తోంది. ఒకసారి స్కానింగ్ కూడా తీయించుకున్నాను. టౌన్లో డాక్టర్ సవుస్య ఏమీ లేదన్నారు. కానీ నాకు వృషణాల వాపు వస్తూనే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. మీరు తగిన సలహా ఇవ్వగలరు. - జే.వి.వి., విజయవాడ వరిబీజం (హైడ్రోసిల్) అంటే వృషణాల చుట్టూ నీరు చేరడం. ఈ సవుస్య ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి అక్కడ చేరిన నీరు తొలగిస్తారు. అంతేకాదు... డాక్టర్లు ఆ నీరు వచ్చే పొరను కూడా తీసివేయుడం, లేదా వుళ్లీ వుళ్లీ నీరు రాకుండా ఆ పొరను వెనక్కు వుడతపెట్టడం కూడా చేస్తారు. ఇలా శస్త్రచికిత్స చేరుుంచుకోకుండా సిరంజీతో నీటిని తీస్తే తాత్కాలికంగా నీరు తొలగి వృషణాల సంచి సైజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అరుుతే కొద్దిరోజుల్లోనే వుళ్లీ నీరు చేరడం, ఒక్కోసారి రక్తం కూడా చేరడం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతారుు. అందువల్ల సిరంజీ ద్వారా నీరు తీరుుంచడం ఏవూత్రం వుంచిది కాదు. హైడ్రోసిల్ సవుస్య ఉంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేరుుంచుకోవాలి. నా వయుస్సు 41 ఏళ్లు. నాకు 22 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి? - ఎన్ఆర్జీ, ఖమ్మం పురుషాంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సవుస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సవుస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్‌కు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గుతుంది. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సవుస్య వల్ల మీకు ఎలాంటి సవుస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిజీజ్తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నా పురుషాంగంపైన అంటే ముందు ఉండే గుండ్రటి భాగంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఎందువల్ల వచ్చాయో తెలియడం లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సీహెచ్.ఎస్., కరీంనగర్, పురుషాంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి అవి చుట్టూరా తెల్లగా బుడిపెలు, బుడిపెలుగా సాధారణం కంటే పెద్దగా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ చాలా సాధారణం. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.