తలుపు తెరిస్తే షాక్‌‌; సీసీటీవీలో వికృతం | Taekwondo Trainer Of Delhi Arrested For Harassing Women | Sakshi
Sakshi News home page

తలుపు తెరిస్తే షాక్‌‌; సీసీటీవీలో వికృతం

Apr 15 2018 5:51 PM | Updated on Jul 23 2018 9:15 PM

Taekwondo Trainer Of Delhi Arrested For Harassing Women - Sakshi

న్యూఢిల్లీ: సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఆ మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్‌ వికృత చర్యను చూసి పోలీసులూ నిర్ఘాంతపోయారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు బలమైన చట్టాల కిందట అతణ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలిలాఉన్నాయి..

తైక్వాండో ట్రైనర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ఒకరు.. వసంత్‌ కుంజ్‌ ప్రాంతానికి చెందిన పరిచయస్తురాలిని కలుసుకునేందుకు వెళ్లాడు. దర్వాజ దగ్గర నిలబడి బెల్‌ కొట్టాడు.. ఆ వెంటనే ప్యాంట్‌ విప్పేసి వికృతచర్యను మొదలుపెట్టాడు. తలుపు తెరిశాక ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన మహిళను చెరపట్టేప్రయత్నం చేశాడా మాస్టర్‌. క్షణాల్లో తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేయడంతో మాస్టర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యం చెయ్యకుండా సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించింది.

బాధితురాలు అందించిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. మహిళ ఇంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలనూ సేకరించారు. డోర్‌బెల్‌ కొట్టి వికృతానికి పాల్పడిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయని, లైంగికదాడి యత్నం, అసభ్యప్రవర్తన కింద నిందితుడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement