trainer
-
జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్‌లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్‌తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్ హబ్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతి జాబ్ రోల్‌కు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీఎస్ఎస్డీసీ అంచనా వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ విధివిధానాలు (ఎస్వోపీ)ని రూపొందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో వినోద్‌కుమార్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆసక్తిగలవారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎన్ఎస్క్యూఎఫ్ ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత శిక్షకులుగా సర్టిఫికెట్ జారీచేసి ఏపీఎస్ఎస్డీసీ ఎంపానల్మెంట్లో నమోదు చేస్తామని చెప్పారు. మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్ రోల్స్‌లో శిక్షకులను నియమించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ పోర్టల్ https://skilluniverse.apssdc.in/ user®istration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎంపికైన అభ్యర్థులను ఏపీ స్కిల్ యూనివర్సల్ పోర్టల్ లేదా యాప్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో శిక్షణ అవసరమైనప్పుడు వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, శిక్షణా వ్యయంలో సుమారు 13 శాతం వరకు శిక్షకులకు పారితోషికంగా ఇస్తామని, కోర్సును బట్టి వీటి ఫీజులు మారుతుంటాయని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి పిరమిడ్ ఆకృతిలో ఒక ఎకో సిస్టమ్‌ను రూపొందించారు. ఇంటర్మీడియెట్లోపు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ హబ్స్, ఆపైన విద్యార్థులకు స్కిల్ కాలేజీలు, హైఎండ్ స్కిల్ శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
మాటే సోపానం
ఇంటిని చక్కదిద్దుకోవడంలోనే కాదు వంటలు, ఆటలు, కళలు, రకరకాల వృత్తులు, వ్యాపారాలు .. ఇదీ అన్ని చెప్పలేనంత ప్రతిభను మహిళలు మాత్రమే కనబరుస్తారు. వీటన్నింటిలో రాణించాలంటే అవసరమైనది మంచి మాట. ‘నలుగురితో ఎలా మెలగాలో తెలుసుండటంతో పాటు ‘మంచి మాట’ కూడా తోడైతే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలరు అని వివరిస్తున్నారు డాక్టర్ డి.కల్పన. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉంటున్న ఈ పబ్లిక్ స్పీకింగ్ ట్రెయినర్ గృహిణిగా ఉన్న తన జీవితమే ‘మాట’ను ఉపాధిగా మార్చుకోవడానికి ఉపకరించిందని తెలియజేశారు. ‘‘డిగ్రీ పూర్తి చేసిన నాకు పెళ్లి తర్వాత ‘మాట’ సమస్య వచ్చింది. కొన్నాళ్లు నలుగురిలో మాట్లాడటానికి జంకడం నాకు నేనుగా గమనించాను. అది గుర్తించి ఈ సమస్య నుంచి బయటపడాలనుకున్నాను. అందుకు నా కుటుంబం మద్దతుగా నిలిచింది. సమస్య నుంచి బయట పడ్డాను. నాలాగ మొదట మాట తడబడటం అనే సమస్య చాలా మందిలో ఉండటం గమనించాను. కొందరు ‘మాట’తో ఎంతగా వృద్ధిలోకి వస్తున్నారో గమనించాను. కొందరు ప్రతిభ ఉన్నా వెనకంజలో ఉంటున్నవారినీ చూశాను. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు. అప్పుడే ‘పబ్లిక్ స్పీకింగ్’ కాన్సెప్ట్‌పై శిక్షణ అవసరం గ్రహించి, ఇంట్లోవారితో చర్చించాను. అందకు నాకు పూర్తి మద్దతు లభించింది. మీడియా జంక్షన్ పేరుతో పబ్లిక్ స్పీకింగ్పైన 18 ఏళ్లుగా శిక్షకురాలిగా ఉన్నాను. తరగతులకు వచ్చేవారిలో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారి నుంచి రాజకీయాల్లోకి రావాలనుకున్నవారు, వచ్చినవారూ పాల్గొన్నారు. వారందరికీ చెప్పిన విషయాల్లో ముఖ్యమైనవి... భయం గడప దాటాలి ప్రతి ఒక్కరిలోనూ వారి మనసు పొరల్లో ఎన్నో అంశాల దాగి ఉంటాయి. కానీ, వాటిని బయటకు సరిగ్గా వ్యక్తపరచలేరు. కొందరు వ్యక్తపరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. మరికొందరి మాటలను అస్సలు వినలేం. ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించగల నేర్పుతో ‘మాట’ ఉండాలంటే సాధన అవసరం. దానికి ముందు ‘ఏం మాట్లాడితే ఏం అనుకుంటారో’ అనే భయాన్ని వదిలిపెట్టాలి. తల్లిగా పిల్లలతో కథల రూపేణా, వారి విషయాలు కనుక్కోవడంలోనూ మాట్లాడుతూ ఉండాలి. పేరెంట్ టీచర్ మీటింగ్స్‌లో పాల్గొని అక్కడి టీచర్స్‌తో మాట్లాడాలి. అలాగే, ఇంటికి ఎవరో ఒకరు అతిథులుగా వస్తారు. వారితోనూ మాట కలపచ్చు. కాలనీలు, అపార్ట్మెంట్లలో గెట్ టుగెదర్ లాంటివి ఏర్పాటు చేసుకొని, మీరు చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేయాలి. వచ్చిన చిన్న అవకాశాన్నే అయినా ఉపయోగించుకొని మాట్లాడుతూ ఉంటే అదే సరైన దారి చూపుతుంది. మాట్లాడటం అనే కళను ఒంటపట్టేలా చేస్తుంది. చిన్న చిన్న పార్టీలే మాటకు వేదికలు మాట మనపైన మనకు నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకు మహిళలకు తరచూ తారసపడేవి నలుగురైదుగురితో ఏర్పాటుచేసుకునే కిట్టీపార్టీ, బర్త్ డే పార్టీ, చిన్న చిన్న వేడుకలలో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేసి, అందులో పాల్గొనాలి. ఒక్కొక్క పాయింట్ మీద ఒక్క నిమిషం మాట్లాడాలి. ఉదాహరణకు.. క్యాండిల్ కేర్, పెన్ను, పుస్తకం, బెలూన్స్.. ఇలా మీ కళ్ల ముందు ఉన్న వస్తువులను ఉపయోగించుకుంటూ దాని ప్రాముఖ్యాన్ని బయటకు వ్యక్తపరచడం అన్నమాట. మాటతో సమస్యలు దూరం డాక్టర్ మాట ద్వారానే సగం జబ్బు తగ్గిపోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే లాయర్లు కూడా మాట ద్వారానే రాణించాలి. కొన్ని సార్లు మాట కటువుగా, కొన్నిసార్లు మృదువుగా ఉండాలి. ఎక్కడ ఆపాలి, స్వరం ఎక్కడ పెంచాలి అనే విషయాల్లో మనకు పూర్తి ఆత్మవిశ్వాసం వస్తే కోరుకున్న రంగాల్లో కోరుకున్న ప్రగతి సాధించడానికి ‘మాట’ ఎంతగానో సాయపడుతుంది. ‘మాట’ సరైన విధంగా ఉపయోగించకపోతే ఆ ‘మాట’నే వారికి అథఃపాతాళానికి చేరుస్తుంది. ఈ విషయాన్ని కూడా ఎప్పుడూ గుర్తుంచుకొని వృద్ధిలోకి రావడానికి ‘మాట’ను మంత్రంగా ఉపయోగించుకొని ఎదుగుదలకు సోపానంగా మలచుకోవాలి’’ అని వివరించారు ఈ ట్రెయినర్. బొమ్మలతో స్పీచ్ సాధ్యమే నలుగురైదుగురు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఒక చోట చేరినప్పుడు ఒక బాక్స్‌లో చిన్న చిన్న బొమ్మలు, వస్తువులు వేసి... ఎవరికి ఏ వస్తువు వస్తే ఆ టాపిక్ మీద నిమిషం సేపైనా మాట్లాడాలి. దినపప్రతికల్లో వచ్చిన ఏదైనా ఒక వార్త తీసుకొని మాట్లాడవచ్చు. మా దగ్గర నాలుగు రోజుల ప్రోగ్రామ్ స్పీకింగ్ కోర్స్‌లో, ఒకరోజు ఫుల్ డే కేటాయిస్తాం. అందుకు అందరికీ వీలున్న సెలవురోజున ఎంచుకుంటున్నాం. డాక్టర్ డి. కల్పన – నిర్మలారెడ్డి -
రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి
2 South Korea Air Force Planes Collide: దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణా విమానాలు శుక్రవారం గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు మరణించగా, మరోకరు గాయపడినట్లు అధికారులు తెలపారు. రెండు కేటీ-1 శిక్షణా విమానాలు ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు. మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది. (చదవండి: అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్) -
ట్రైనర్ పై దాడి చేసిన ఎలుగుబంటి
-
మా అమ్మ పులి
పుట్టిన బిడ్డను ఆకాశంలోకి ఎత్తి గర్వంగా ప్రపంచానికిచూపించుకుంటుంది తల్లి.అలాంటప్పుడు..బిడ్డ పుట్టాక, కడుపు మీద పడిన చారలు మాత్రంగర్వకారణం కాకుండా ఎలా ఉంటాయి?!జీవితంలోని కొన్ని మచ్చలు.. ఒక్కోసారి కొన్ని గాయాలు..అవి వదలే గుర్తులు, ఆనవాళ్లు.. గర్వించదగ్గవే అయి ఉంటాయి.ఒక మొటిమ.. ఒక మచ్చ.. ఒక చార..ఏదైనా మన ఆత్మవిశ్వాసానికే ఆనవాలు కావాలి.బిడ్డ పులిబిడ్డ అయితే.. తల్లి మీద ఉన్న చారలు పులిచారలే కదా!అప్పుడు.. ఏ బిడ్డ అనుకోదూ.. ‘మా అమ్మ పులి’ అని! టీన్స్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఉదయం నిద్రలోంచి లేవగానే అద్దం చూసుకోవాలంటే భయం! బుగ్గ మీద కొత్త మొటిమ ముత్యంలా మెరుస్తూ ఎక్కడ కనపడ్తుందోనని!ఇరవై ఏళ్ల అమ్మాయి పార్టీకి రెడీ అయ్యి... విరబోసుకున్న జుట్టుతో చెంపల మీది యాక్నేను దాచేందుకు నానా తంటాలు పడ్తూంటుంది!నెలరోజుల్లో మొహాన్ని తెల్లగా మార్చేసే క్రీమ్‌లతో కుస్తీ పడ్తూంటుంది ఓ నల్ల కలువ!చీర కుచ్చిళ్లు దోపుకుంటున్న ఓ బిడ్డ తల్లికి తన నాభి మీది స్ట్రెచ్ మార్క్స్ నిలువుటద్దంలో ప్రస్ఫుటంగా కనిపించేసరికి ఆందోళన ఆవహించేస్తుంది.మొటిమలు.. యాక్నే.. నలుపు రంగు.. స్ట్రెచ్ మార్క్స్.. ఎట్సెట్రా.. స్త్రీకి అవమానాన్ని, ఆత్మన్యూనతను కలిగించేలా తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్ చేస్తుంటాయి. కాస్మోటిక్స్‌ను ఉత్పత్తి సంస్థలు! ఇది ఎవరికి తెలియని విషయమేమీ కాదు.. ‘కాస్మోటిక్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ కాన్సిపరసీస్లో ఇదీ ఒకటి’ అని! అందుకే..క్రీమ్స్ కన్నా అత్యుత్తమ ప్రొడక్ట్ మన ఆత్మవిశ్వాసమే అని చాటిన మహిళల గురించి తెలుసుకోవాలి. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ కాబట్టి! స్ట్రెచ్ మార్క్స్‌ను పైటతో కప్పేసుకోకుండా.. కుచ్చిళ్లతో దోపేయకుండా.. తన బిడ్డ జ్ఞాపకంగా గర్వంగా భావిస్తూన్న ఓ తల్లిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం! తను సాధించిన విజయంతో ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ను ప్రైడ్‌గా భావించే క్యాంపెయిన్లాంటిది ఆ మహిళ మొదలుపెట్టారు. ఆమె పేరు మమతా సనత్‌కుమార్. వయసు 27 ఏళ్లు. బెంగళూరు నివాసి. బాడీ బిల్డర్. ఆమెకు అయిదేళ్ల కూతురు. పూర్విక. బాధ్యతల బరువు మమతది సాధారణ మధ్యతరగతి కుటుంబం. భర్త ఉద్యోగి. తను ఇంటి బాధ్యతలు చూసుకునేది. ప్రెగ్నెన్సీ ఆమెను తొంభై కిలోల బరువుకు చేర్చింది. డెలివరీ తర్వాత కూడా తగ్గలేదు. బిడ్డకు మూడో యేడు వచ్చాక.. పాపను నర్సరీలో జాయిన్ చేసి తను జిమ్‌లో చేరింది. ఆ వర్కవుట్స్‌తో 62 కేజీలకు తగ్గింది. అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వర్కవుట్స్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలోనే భర్త ఉద్యోగం పోయింది. ఆ కోపం, బాధతో చీటికిమాటికి మమతతో గొడవపడేవాడు. ఇంట్లో అశాంతి బిడ్డ మీద పడకుండా చాలా సహనంగా ఉండేది మమత. తను ఉద్యోగం చేయాలనే నిర్ణయాన్నీ తీసుకుంది. జిమ్‌లో వర్కవుట్లు ఆమెకు కొత్త అవకాశాన్ని చూపించాయి. బాడీబిల్డర్‌గా. కసరత్తు..! బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మమత. అయితే ఇంట్లో వాళ్లంతా.. ఆమె తల్లిదండ్రులు సహా మమతను వ్యతిరేకించారు. బయట కూడా సానుకూల వాతావరణమేమీ కనిపించలేదు ఆమెకు. బాడీబిల్డింగ్ పూర్తిగా పురుషుల రంగం అవడం, మమతది గ్రామీణ (బసవపుర గ్రామం) నేపథ్యం కావడం వంటివన్నీ ఆమెకు అడ్డంకులుగానే మారాయి. అయినా పట్టు వీడలేదు. బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరవడం, పాల్గొనడం స్టార్ట్ చేసింది. బాడీ బిల్డర్‌గా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. దాంతో ఆ ఫోటోలు తీసేయమని ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచి ఒత్తిడి, హెచ్చరికలు కూడా! కాని ఆమె సాహసానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు. అడ్మైర్ అవుతూ కామెంట్లు పెట్టేవారు. ‘‘గృహిణి నుంచి బాడీబిల్డింగ్కు మళ్లారు.. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తోందా?’’ అని ప్రశ్నలు. ఇంట్లోవాళ్ల సపోర్ట్ లేకుంటే వచ్చేదాన్నే కాను.. వాళ్లు నాకెప్పుడూ నో చెప్పలేదు’’ అంటూ సమాధానాలు ఇచ్చేది. ఇవన్నీ చదివిన భర్త.. వారించడం మానేశాడు. తల్లిదండ్రులూ మిన్నకుండిపోయారు. అదే ఆమె తొలి గెలుపు అయింది. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లింది. బరిలో.. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు స్పాన్సర్స్ దొరకలేదు. అలా అనేకంటే స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు అనడం సబబేమో! ధైర్యం ఆమె గుణం. కాబట్టి బెంబేలెత్తలేదు. సొంతంగా జిమ్ పెట్టుకుంది. ట్రైనర్‌గా కొలువు తీసుకుంది. బాడీబిల్డింగ్‌లో అమ్మాయిలను ట్రైన్ చేయడం మొదలుపెట్టింది. బిడ్డ తల్లులూ రావడం ప్రారంభించారు. అప్పుడే తల్లులు తమ స్ట్రెచ్ మార్క్స్ పట్ల ఇబ్బందిగా ఫీలవడం గమనించింది మమత. ఆ టాబూని తుడిచేయాలనుకుంది. తన బాడీబిల్డింగ్ పోజులను.. స్ట్రెచ్ మార్క్స్ స్పష్టంగా కనపడేలా ఫోటోలు తీసి.. ‘‘స్ట్రెచ్ మార్క్స్.. వట్టి చారలు కావు. ఎక్స్ట్రా స్కిన్ అంతకన్నా కాదు! మనల్ని నిర్వచించే గీతలు! మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయం వైపు నెట్టే స్ట్రింగ్స్! ఇంత పాజిటివ్‌గా చూడలేకపోతే.. అవి ఏర్పడ్డానికి పడ్డ కష్టాన్ని, వెంట్ త్రూ అయిన వైనాన్ని గుర్తుపెట్టుకుందాం, మనలో భాగంగా సొంతం చేసుకుందాం! వేలాడే చర్మం మీది చారలుగా చూసి కుంగిపోకుండా.. శారీరక ధృడత్వంతో మానసికంగా బలపడి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే! మనల్ని మనం ప్రేమించుకోవాలి.. సొంతం చేసుకోవాలి.. స్ట్రెచ్మార్క్స్తో సహా!’’ అంటూ కామెంట్ రాసి మరీ ఆ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది మమత. మజిల్ మామ్..! ఈ పోస్ట్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయంటే.. స్ట్రెచ్‌మార్క్స్‌ను ఓన్ చేసుకునే ఓ ప్రచారంలా భావించేంతగా! దాంతో మమతా చాలా ఫేమస్ అయిపోయింది ‘‘మజిల్ మామ్’’గా! ఇప్పటికీ రోజుకు పది గంటలు జిమ్‌లో చెమటోడుస్తుంది. ట్రైన్ అవుతూ.. ట్రైన్ చేస్తూ! గుడ్ న్యూస్ ఏంటంటే.. 2017లో ఆరంభమైన ఆమె ఈ ప్రయాణానికి ఇప్పుడు స్పాన్సరర్స్ వచ్చారు. ఓ పోటీలో.. గెలిచి ట్రోఫీ అందుకుంటున్నప్పుడు.. ఆడియెన్స్‌లోంచి తన అయిదేళ్ల (ఇప్పుడు పూర్విక వయసు) కూతురు ‘‘మమ్మీ.. ’’ అంటూ స్టేజ్ మీదకు వచ్చి ఆమె మెడకు అల్లుకుపోతుంటే ఆడియెన్స్ అంతా ‘‘మజిల్ మామ్ (సంతూర్ మామ్ స్టయిల్లో)’’ అంటూ చప్పట్లు కొట్టారట. ‘‘నా ఇన్సిపిరేషన్, నాకు ప్రేరణ లడ్డూ (కూతురి ముద్దు పేరు)నే. నా తపనంతా నేనూ తనకు ఇన్సిపిరేషన్‌గా నిలబడాలనే. నా ప్రొఫెషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇంట్లో మాత్రం నా బిడ్డకు బానిసనే. తనే నా బలం.. బలహీనత’’ అంటుంది మమత. ఒక్కో గెలుపుతో ఇంట్లో వాళ్ల పూర్తి సపోర్ట్‌ను సాధించింది. ఇప్పుడు భర్తకూ ఉద్యోగం దొరికింది. ట్రైనింగ్.. పోటీలు.. బిడ్డ పెంపకం.. స్ట్రెచ్ మార్క్స్ క్యాంపెయిన్‌తో క్షణం తీరకలేకుండా సాగిపోతోంది ఈ మజిల్ మామ్. – శరాది -
ఎన్టీఆర్ లుక్‌పై క్లారిటీ ఇచ్చిన ట్రైనర్
టాలీవుడ్లో బిగెస్ట్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్కు సంబంధించిన ప్రతీ వార్త వైరల్‌గా మారుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్‌పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ భారీకాయంతో కనిపించనున్నాడని అందుకోసం ఇప్పటికే వంద కేజీలకు పైగా బరువు పెరిగాడని ప్రచారం జరిగింది. అంతేకాదు ఎన్టీఆర్ లావుగా కనిపిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ఈవార్తలపై స్పందించిన ఎన్టీఆర్ పర్సనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ లుక్ అది కాదని, ప్రస్తుతం సొషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలు ఏడాది క్రితంవని క్లారిటీ ఇచ్చారు. బాహుబలి తరువాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్కథ అందిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈసినిమా పిరియాడికల్ జానర్లో తెరకెక్కుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. Guys please note these pictures of @tarak9999 circulating around are over 1 year old, this is NOT his current look. pic.twitter.com/R0kjP5N9Bd — Lloyd Stevens (@lloydstevenspt) 5 December 2018 -
కామాంధుడి చేతిలో 6 గంటలు నరకం
సాక్షి, న్యూఢిల్లీ: పదుల సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు. జైలుకు వెళ్లటం.. బెయిల్‌పై రావటం... మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడటం ఆ కామాంధుడికి అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న ఓ యువతిపై ఆ కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు మృగ చేష్టలతో ఆమెకు నరకాన్ని చూపించాడు. దేశ రాజధానిలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే... వసంత్ కుంజ్‌లోని రంగ్‌పూరి పహారిలో ఓ యువతి(27) ఒంటరిగా నివసిస్తోంది. మే 29వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. తాళం తీస్తున్న సమయంలో వెనకాల నుంచి వచ్చి ఓ వ్యక్తి అమాంతం ఆమెను ఇంట్లోకి ఈడ్చుకెళ్లాడు. మంచానికి కట్టేసి ఆమెతో బలవంతగా మందు తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా ఆరు గంటలపాటు అతని వికృత క్రీడలు కొనసాగాయి. చివరకు ఉదయం నాలుగు గంటల సమయంలో ఆమె ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. స్నేహితురాలి సాయంతో వసంత్ కుంజ్ పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఆమె చెప్పిన ఆనవాళ్లతో పోలీసులు ఓ వ్యక్తి ఫోటోను చూపించారు. ఫోటోలో ఉన్నదే నిందితుడిగా ఆమె అతన్ని గుర్తించటంతో గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడైన సందీప్ చౌహాన్‌ను జూన్1న పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ నేర చరిత్ర... పశ్చిమ్ విహార్‌కు చెందిన 38 ఏళ్ల సందీప్ వివాహితుడు. ఓ పాప కూడా ఉంది. గతంలో తైక్వాండో ట్రైనర్‌గా పని చేసేవాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని లైంగికంగా వేధించిన కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యాడు. దాంతో ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచి తప్పుడు మార్గంలోనే ప్రయాణిస్తూ వస్తున్నాడు. కంటికి కనిపించిన మహిళలతో అసభ్యంగా ప్రవర్తించటం, వారి వెంటపడి వేధింపులకు గురిచేయటం, దాడి చేసి వాళ్ల దగ్గరి నుంచి గొలుసులు, ఫోన్లు దొంగతనం చేయటం... అలవర్చుకున్నాడు. ఈ క్రమంలో చాలాసార్లు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటికొచ్చేవాడు. ఇప్పటిదాకా అతనిపై 30 కేసుల దాకా నమోదయినట్లు తెలుస్తోంది. ‘సందీప్ దాడి చేసిన మహిళలెవరూ అతనికి తెలీదు. అప్పటికప్పుడే వారిని లక్ష్యంగా చేసుకుని వారిపై దాడికి పాల్పడుతుంటాడు. కానీ, అత్యాచారం కేసులో అరెస్ట్ కావటం మాత్రం ఇదే తొలిసారి’ అని వసంత్ కుంజ్ ఎస్సై చెబుతున్నారు. ఇదిలా ఉంటే రెండు నెలల క్రితం తాను ఉండే ప్రాంతంలోనే ఓ మహిళ ఇంటి ముందు సందీప్ వికృత చేష్టలకు పాల్పడిన నేరంలో జైలుపాలయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఇలా అత్యాచారం కేసులో ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కిస్తున్నాడు. పోలీసులేం చేస్తున్నారు?.. కాగా, ఈ ఘటనపై పలు మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని కఠినంగా శిక్షించకపోవటం, సమాజంలో తిరుగుతున్న అతనిపై నిఘా వేయకపోవటం ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శనివారం ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించి, సందీప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
తలుపు తెరిస్తే షాక్; సీసీటీవీలో వికృతం
న్యూఢిల్లీ: సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఆ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ వికృత చర్యను చూసి పోలీసులూ నిర్ఘాంతపోయారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు బలమైన చట్టాల కిందట అతణ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. దేశరాజధానిలో సంచలనం రేపిన ఈ ఘటన గురించి పోలీసులు చెప్పిన వివరాలిలాఉన్నాయి.. తైక్వాండో ట్రైనర్‌గా పనిచేస్తోన్న వ్యక్తి ఒకరు.. వసంత్ కుంజ్ ప్రాంతానికి చెందిన పరిచయస్తురాలిని కలుసుకునేందుకు వెళ్లాడు. దర్వాజ దగ్గర నిలబడి బెల్ కొట్టాడు.. ఆ వెంటనే ప్యాంట్ విప్పేసి వికృతచర్యను మొదలుపెట్టాడు. తలుపు తెరిశాక ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన మహిళను చెరపట్టేప్రయత్నం చేశాడా మాస్టర్. క్షణాల్లో తేరుకున్న మహిళ గట్టిగా కేకలు వేయడంతో మాస్టర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆలస్యం చెయ్యకుండా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరించింది. బాధితురాలు అందించిన సమాచారంతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు.. మహిళ ఇంటి సీసీటీవీ కెమెరా దృశ్యాలనూ సేకరించారు. డోర్‌బెల్ కొట్టి వికృతానికి పాల్పడిన దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయని, లైంగికదాడి యత్నం, అసభ్యప్రవర్తన కింద నిందితుడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఇద్దరూ టీచర్లే
‘ఇలా చేస్తే ఈజీగా తగ్గొచ్చు’... ఎన్టీఆర్‌కి సలహా ఇస్తున్నారు లాయిడ్ స్టీవెన్స్, ‘ఇలా చేస్తే ఈజీగా గాలిపటం ఎగరేయొచ్చు’... స్టీవెన్స్‌కి సలహా ఇచ్చారు ఎన్టీఆర్. బాగుంది.. తగ్గే విషయంలో ఎన్టీఆర్‌కి స్టీవెన్స్ గురువు అయితే.. గాలిపటాలు ఎగరేసే విషయంలో స్టీవెన్స్‌కి గురువు అయ్యారు ఎన్టీఆర్. ఇంతకీ ఏంటి కహానీ అంటే... ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపిస్తారు. అందుకే హాలీవుడ్ నుంచి లాయిడ్ స్టీవెన్స్ ఇండియా వచ్చారు. దగ్గరుండి ఎన్టీఆర్‌కి ఫిజికల్ ట్రైనింగ్ చేయిస్తున్నారు. సంక్రాంతి పండగకి మాత్రం ఎన్టీఆర్ దగ్గరుండి స్టీవెన్స్ చేత గాలిపటాలు ఎగరేయించారు. ‘‘గాలి పటాలు ఎలా ఎగరేయాలో ఎన్టీఆర్ నేర్పించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని విదేశీ ట్రైనర్ లాయిడ్ పేర్కొన్నారు. -
యోగాకు భారత్ పుట్టినిల్లు
సాక్షి, తుర్కయంజాల్(రంగారెడ్డి): భాతరదేశం యోగాకు పుట్టినిల్లని ప్రముఖ ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు మర్నా అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడలోని సంకల్ప్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం మర్నా విద్యార్థులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మర్నా మాట్లాడుతూ.. భారతదేశంలోని విద్యార్థులకు యోగా నేర్పించడం గర్వంగా ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రామ్‌రెడ్డి, డైరెక్టర్ కందాడి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ.. సుమారు 50 దేశాలలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా శిక్షకురాలు విద్యార్థులకు శిక్షణ ఇచ్చింనందుకు ధన్యవాదాలు తెలిపారు. -
క్రికెట్ జట్టు ట్రైనర్ అనుమానాస్పద మృతి
ముంబై: భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ఫిట్నెస్ ట్రైనర్‌గా సేవలందిస్తున్న రాజేష్ సావంత్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం ఉదయం ముంబైలోని హోటల్ రూంలో ఆయన మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. సోమవారం నుంచి ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో తలపడనున్న భారత జట్టును సన్నద్ధం చేస్తున్న రాజేష్.. ఇవాళ్టి టీమ్ యాక్టివిటీస్ గురించి రిపోర్ట్ చేయలేదు. దీంతో టీం సభ్యులు ఆయన కోసం చూస్తుండగా.. హోటల్ రూంలో మృతి చెంది ఉన్నారన్న విషయం గుర్తించారని బీసీసీఐ జాయింట్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి వెల్లడించారు. రాజేష్ మృతికి గుండెపోటు కారణమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత ఏ, రెస్టాఫ్ ఇండియా జట్లకు సైతం గతంలో రాజేష్ సేవలందించారు. -
ఎనిమిదేళ్ల కష్టానికి నజరానా
ఆజానుబాహులైన అందగాళ్లను చూసిన తెలుగు తెరకి... సింహంలాంటి కండల వీరుడ్ని పరిచయం చేశాడు యంగ్ స్టార్ రానా. ఆరడుగులు దాటిన హైట్‌తో పాటు అందుకు తగినెహ ర్క్యులస్ ఫిజిక్‌తో తెలుగు సినీ హీరో లుక్‌కి కొత్త రూట్ ఇచ్చాడు. నాజూకైన కుర్రాడి నుంచి టాలీవుడ్ కండల వీరుడి దాకా రానా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో పాలుపంచుకున్న ట్రైనర్ ‘కునాల్ గిర్’ పంచుకున్న సంగతులివి... ఈజీగా సాధ్యం కాలేదు... తొలిసారి ‘లీడర్’ సినిమాకు ముందు రానాను 8 ఏళ్ల క్రితం కలిశాను. అప్పట్లో తను చాలా స్కిన్నీగా ఉండేవాడు. ఫిజికల్ ఫిట్నెస్ పరంగా రానా జెనెటిక్స్ అంత బెస్ట్ అని చెప్పలేం. జెనెటిక్స్ ప్రకారం చూస్తే ఒక తీరైన శరీరాన్ని మెయిన్‌టెయిన్ చేయడం అనేది అతనికి అంత సులభమైన విషయం కాదు. అయితే అతని ఫిజిక్‌కి వైడ్ స్ట్రక్చర్, గుడ్ ఫ్రేమ్ ఉంటుంది. కఠినమైన డైట్, వర్కవుట్ చేయాలి. అలా చేశాడు కాబట్టే ఇప్పుడు ఫిట్నెస్కి సింబల్‌గా మారాడు. 5 రోజులు... రోజుకో గంట ఎప్పటికప్పుడు కఠినంగా అనిపించడానికి రానా కోసం ప్రత్యేకంగా వర్కవుట్స్ డిజైన్ చేస్తాను. తను వ్యక్తిగతంగా హ్యాండ్స్, ఛెస్ట్ వర్కవుట్స్ ఇష్టంగా చేస్తాడు. ఎక్కువగా వెయిట్ ట్రైనింగ్ వర్కవుట్స్ చేస్తాడు. హెవీ వెయిట్స్ ద్వారా కేలరీలు బాగా ఖర్చు చేయగలడు కాబట్టి తనకి కార్డియో వర్కవుట్స్ అంత అవసరం రాదు. వారంలో 5 రోజులు ప్రతి రోజూ కనీసం గంటకు తగ్గకుండా వ్యాయామం చేస్తాడు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడాయన ఫిట్నెస్ లెవల్స్ అసాధారణంగా పెరిగాయి. తను ఊర్లో లేకున్నా కూడా వర్కవుట్స్ మిస్ అవడం ఇష్టం ఉండదు. అందుకని తన కోసం ప్రత్యేకంగా నా అసిస్టెంట్స్‌లో ఒకరిని తన వెంట పంపిస్తాను. ఇటీవలే ఆయన చెన్నైలోని ఒక మారుమూల గ్రామంలో షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నా అసిస్టెంట్స్‌లో ఒకరిని తన కోసం పంపించాను. రైట్ డైట్... తన డైట్ తన సినిమా కేరెక్టర్లను అనుసరించి అప్పుడప్పుడు మారుతుంటుంది. సాధారణంగా రోజుకు 8 సార్లు మీల్స్ తీసుకుంటాడు. అందులో చాలా వరకూ హై ప్రొటీన్ ఉంటుంది. బాగా వెజిటబుల్స్, మిల్క్ వినియోగిస్తాడు. -
ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుదాం..
సాక్షి, సిటీబ్యూరో ఆధునిక జీవనంలోని ఒత్తిడిని అధిగమించి చక్కని ఆరోగ్యాన్ని సొతం చేసుకోవాలంటే వ్యాయామమే మార్గమని పలువురు సినీ సెలబ్రిటీలు సూచించారు. జూబ్లిహిల్స్ రోడ్‌నెం:36లో నెలకొల్పిన వెంకట్ ఫిట్నెస్ ఎట్ సోల్‌ను సినీహీరో రామ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న వెంకట్ ట్రైనర్‌గా చక్కని పనితీరు కనబరుస్తారన్నారు. ట్రైనర్ వెంకట్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలు, పర్సనల్ ట్రైనింగ్ తమ ప్రత్యేకతలన్నారు. కార్యక్రమంలో టాలీవుడ్ యువ కథా నాయకులు ప్రిన్స, చరణ్‌దీప్ తదితరులు పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యంపై రాయలసీమ సైకాలజిస్ట్లకు శిక్షణ
అనంతపురం సిటీ : ఈ నెల 13 నుంచి రెండ్రోజుల పాటు వృత్తి నైపుణ్యంపై రాయలసీమ ప్రాంత సైకాలజిస్ట్‌కు శిక్షణ ఉంటుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శిక్షణ పొంద దలచిన వారు కర్నూలులోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్ దగ్గర, ఎస్ఆర్పేటకు రావాల్సిందిగా సూచించారు. మరింత సమాచారం కోసం 9441371817లో సంప్రదించాలని కోరారు. -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది. -
చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు శ్రీధర్ అరెస్ట్
రాజమండ్రి: చైతన్య ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు గుత్తుల శ్రీధర్‌ను శనివారం రాజమండ్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినులను లోబరుచుకుని సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసినా కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. గత పదిరోజులుగా శ్రీధర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
appకీ కహానీ...
నైక్ప్లస్... మీ ఫిట్నెస్ ట్రైనర్! చాలామంది ఏదో ఒక శారీరక వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది వాకింగ్, జాగింగ్ చేస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తారు. ఇక ప్రముఖులు, సినీ తారలైతే నాజూకైన శరీరాకృతి కోసం పర్సనల్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. దీనికి వారు భారీగానే వెచ్చిస్తుంటారు. మరి వీరిలా పర్సనల్ ట్రైన ర్లను ఏర్పాటు చేసుకుని ఖర్చు చేయలేనివారి సంగతేంటి? నిజానికి చక్కని శరీరాకృతిని పొందటానికి మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హెల్త్, ఫిట్నెస్ యాప్ ‘నైక్ ప్లస్ ట్రైనింగ్ క్లబ్’(ఎన్టీసీ). నైక్ సంస్థ రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ప్రత్యేకతలు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. కావలసిన, అవసరమైన వర్కవుట్లనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటుంది. శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో వర్కవుట్ అవసరమవుతుంది. నడుమును నాజూకుగా మార్చుకోవాలంటే చేతితో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే మనకు కావలసిన వర్కవుట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్కవుట్ ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే విషయాలు కూడా ఉంటాయి.మనకు అవసరమైన, డౌన్లోడ్ చేసుకున్న వర్కవుట్లను వీడియో రూపంలో, ఫొటోల రూపంలో చూడొచ్చు. మీరు మీ కసరత్తులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని సోషల్ నెట్వర్క్ సైట్ల ద్వారా మీ స్నేహితులకు కూడా షేర్ చేయొచ్చు. వర్కవుట్లకు సంబంధించి నైక్ మాస్టర్ ట్రైనర్స్, స్నేహితుల సలహాలను తీసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్, హెచ్డీఎంఐ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని ఎన్టీసీ వర్కవుట్లను టీవీలో చూసుకోవచ్చు. నైక్ ప్లస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ను ఎపుడైనా, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. యాప్‌ను ఉపయోగించాలంటే ఈ-మెయిల్ తప్పనిసరి. దీని ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.