appకీ కహానీ...
నైక్‌ప్లస్... మీ ఫిట్‌నెస్ ట్రైనర్!
చాలామంది ఏదో ఒక శారీరక వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది వాకింగ్, జాగింగ్ చేస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తారు. ఇక ప్రముఖులు, సినీ తారలైతే నాజూకైన శరీరాకృతి కోసం పర్సనల్ ట్రైనర్లను నియమించుకుంటున్నారు. దీనికి వారు భారీగానే వెచ్చిస్తుంటారు. మరి వీరిలా పర్సనల్ ట్రైన ర్లను ఏర్పాటు చేసుకుని ఖర్చు చేయలేనివారి సంగతేంటి? నిజానికి చక్కని శరీరాకృతిని పొందటానికి మనకూ కొన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హెల్త్, ఫిట్‌నెస్ యాప్ ‘నైక్ ప్లస్ ట్రైనింగ్ క్లబ్’(ఎన్‌టీసీ). నైక్ సంస్థ రూపొందించిన ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్లో ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. ప్రత్యేకతలు
యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
కావలసిన, అవసరమైన వర్కవుట్లనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిని కస్టమైజ్ చేసుకునే వెసులుబాటుంది. శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో వర్కవుట్ అవసరమవుతుంది. నడుమును నాజూకుగా మార్చుకోవాలంటే చేతితో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తే ఉపయోగం ఉండదు. అందుకే మనకు కావలసిన వర్కవుట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వర్కవుట్ ఎంతసేపు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే విషయాలు కూడా ఉంటాయి.మనకు అవసరమైన, డౌన్‌లోడ్ చేసుకున్న వర్కవుట్లను వీడియో రూపంలో, ఫొటోల రూపంలో చూడొచ్చు.
మీరు మీ కసరత్తులకు సంబంధించిన ఫొటోలను తీసుకొని, వాటిని సోషల్ నెట్‌వర్క్ సైట్ల ద్వారా మీ స్నేహితులకు కూడా షేర్ చేయొచ్చు.
వర్కవుట్లకు సంబంధించి నైక్ మాస్టర్ ట్రైనర్స్, స్నేహితుల సలహాలను తీసుకోవచ్చు. క్రోమ్‌కాస్ట్, హెచ్‌డీఎంఐ కేబుల్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లోని ఎన్‌టీసీ వర్కవుట్లను టీవీలో చూసుకోవచ్చు. నైక్ ప్లస్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకొని ఫ్రెండ్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ను ఎపుడైనా, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ చేయొచ్చు. యాప్‌ను ఉపయోగించాలంటే ఈ-మెయిల్ తప్పనిసరి. దీని ద్వారా అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవలసి ఉంటుంది.