
2 South Korea Air Force Planes Collide: దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణా విమానాలు శుక్రవారం గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్‌లు మరణించగా, మరోకరు గాయపడినట్లు అధికారులు తెలపారు. రెండు కేటీ-1 శిక్షణా విమానాలు ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు.
మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment