Air Force aircraft
-
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్
-
జో బైడెన్ వార్నింగ్ బేఖాతరు.. చైనా కవ్వింపు చర్యలు
తైవాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొద్దిరోజుల క్రితం చైనాను హెచ్చరించిన విషయం తెలిసిందే. తైవాన్‌లో చైనా ఆక్రమణకు పాల్పడితే డ్రాగన్ కంట్రీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా హెచ్చరించిన కొద్ది రోజులకే.. చైనా తన అసలు స్వరూపాన్ని చూపించింది. తైవాన్ పరిసర ప్రాంతాల్లో చైనా తన వైమానిక కార్యకలాపాలను పెంచింది. తైవాన్ వైమానిక దళంలోకి చైనా 30 యుద్ధ విమానాలను పంపింది. దీంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకున్నది. అయితే, చైనా కవ్వింపు చర్యకు తైవాన్ ధీటుగానే స్పందించింది. తైవాన్ కూడా యుద్ధ విమానాలను మోహరించినట్లు తాజాగా వెల్లడించింది. అయితే, తన చర్యలను చైనా సమర్ధించుకుంది. సైనిక శిక్షణలో భాగంగానే వైమానిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైనా పేర్కొంది. కాగా, చైనా వ్యాఖ్యలపై తైవాన్ మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తోంది. తైవాన్ వైమానిక రక్షణ క్షేత్రంలో ఉన్న ప్రటాస్ దీవుల వద్దకు చైనా యుద్ధ విమానాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో 20 ఫైటర్ జెట్స్ ఉన్నట్టు సమాచారం. చైనా చర్యలో తర్వలో మరో యుద్ధాన్ని చూడాల్సి వస్తుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. #China has made the second largest incursion into #Taiwan’s air defense zone this year with 30 jets reportedly entering the area, including more than 20 fighters https://t.co/N4yunKUje8 pic.twitter.com/J9vno2kT4H — Arab News (@arabnews) May 31, 2022 ఇది కూడా చదవండి: నా దుస్తులు అమ్మి అయినా ప్రజలకు చౌకగా గోధుమపిండి అందిస్తా! -
రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి
2 South Korea Air Force Planes Collide: దక్షిణ కొరియా వైమానిక దళానికి చెందిన రెండు శిక్షణా విమానాలు శుక్రవారం గాలిలో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పైలెట్లు మరణించగా, మరోకరు గాయపడినట్లు అధికారులు తెలపారు. రెండు కేటీ-1 శిక్షణా విమానాలు ఢీకొన్న తర్వాత ఆగ్నేయ నగరమైన సచియోన్ పర్వతంపై కూలిపోయిందని వైమానిక దళ అధికారులు చెప్పారు. మూడు హెలికాప్టర్లు, 20 వాహనాలు, డజన్ల కొద్దీ అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కేటీ-1 రెండు సీట్ల విమానమని, విమానంలో పైలెట్లు సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించారని వైమానిక దళం ప్రకటించింది. (చదవండి: అందుకే రష్యా బలగాలు వెనక్కి మళ్లాయి: ఉక్రెయిన్) -
కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్: ఫైలట్ మృతి
గాంధీనగర్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద మంగళవారం ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఫైలట్, ఎయిర్ కమాండర్ దుర్మరణం చెందారు. ముంద్రా వద్ద పొలాల్లో జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. #Gujarat: An aircraft has crashed in Kutch's Mundra, pilot missing. More details awaited. pic.twitter.com/2Q1SPxvMF0 — ANI (@ANI) June 5, 2018 -
ఏఎన్-32 అక్కడుందా..?
- 22 అనుమానిత ప్రాంతాల గుర్తింపు - ఎన్ఐఓటీ, జీఎస్‌ఐల నేతృత్వంలో త్వరలో గాలింపు - సముద్రంలో లక్ష చదరపు కిలోమీటర్ల మ్యాపింగ్ పూర్తి సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో గల్లంతైన ఎయిర్‌ఫోర్స్ (ఏఎన్-32) విమాన శకలాలను గుర్తించేందుకు మరో ప్రయత్నం మొదలుకానుంది. రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాలను ఉపయోగించి కొన్ని అనుమానిత ప్రాంతాల్లో విమాన శకలాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమానిత ప్రాంతాల గుర్తింపు, రిమోట్ యంత్రాల గుర్తింపునకు రెండు నిపుణుల బృందాలు పనిచేస్తున్నాయి. దాదాపు రెండు మూడు రోజుల్లో గాలింపు చర్యలు ప్రారంభమవుతాయి. గత జూలై 22న దాదాపు 29 మందితో చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయల్దేరిన వాయుసేన విమానం సుమారు 150 మైళ్ల దూరంలో గల్లంతైన విషయం తెలిసిందే. విమాన శకలాలను గుర్తించేందుకు అప్పట్నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ)లు తాజాగా మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేశాయి. వీటికి చెందిన సాగర్ రత్నాకర్, సాగర్ నిధి నౌకలు దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల సముద్రగర్భాన్ని సోనార్ టెక్నాలజీ ద్వారా మ్యాప్ సిద్ధం చేసింది. ఈ విస్తీర్ణంలో దాదాపు 70 ప్రాంతాల నుంచి కొంచెం అనూహ్యమైన సంకేతాలు అందుతున్నట్లు ఈ మ్యాప్‌ను అధ్యయనం చేసిన ఎన్ఐఓటీ గుర్తించింది. వేర్వేరు టెక్నాలజీలతో మరింత క్షుణ్నంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాంతాల సంఖ్యను 22కు తగ్గించింది. రిమోట్ కంట్రోలర్ల సాయంతో పనిచేసే యంత్రాల ద్వారా ఈ ప్రాంతాల్లో శకలాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని ఎన్ఐఓటీ డెరైక్టర్ ఎస్ఎస్సీ షెణాయ్ ‘సాక్షి’కి తెలిపారు. రొబోటిక్ యంత్రాల వాడకం.. ఎన్ఐఓటీ నౌక సాగర్ నిధిలో ఉండే రిమోట్ కంట్రోలర్ యంత్రాలు పొడవాటి ఇనుప తీగల ద్వారా సముద్రపు లోతుల్లో పరిశీలిస్తుంది. దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల లోతుకు వెళ్లగల ఈ యంత్రాల్లో ఒక రొబోటిక్ చేయి, శక్తిమంతమైన కెమెరా ఉంటాయి. ఈ యంత్రాలు ఒకసారి దాదాపు పది మీటర్ల వైశాల్యంలోని ప్రాంతాన్ని పరిశీలించగలదని షెణాయ్ తెలిపారు. ప్రస్తుతం తాము అనుమానిత ప్రాంతాల సంఖ్యను మరింత నిశితంగా పరిశీలిస్తున్నామని, సముద్రగర్భంలోని సహజ నిర్మాణాల ద్వారా వచ్చే సంకేతాలను తొలగించి.. శకలాలు ఉన్న ప్రాంతాలను కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రిమోట్ యంత్రాలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుందని, కాబట్టి ఈ కచ్చితత్వం అవసరమని వివరించారు. ఈ పరిస్థితుల్లో చెల్లాచెదురైన శకలాలను గుర్తించడం కూడా అంతే కష్టమవుతుందని పేర్కొన్నారు. -
ఆ బాధ.. తెలుసు
ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన - జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి - పార్లమెంటులో మా ఎంపీలు ఈ విషయంపై మాట్లాడుతున్నారు - బాధితులకు న్యాయం జరిగేలా రక్షణ శాఖపైనా ఒత్తిడి తీసుకువస్తాం సాక్షి, విశాఖపట్నం : ‘‘ఆరోజు సెప్టెంబర్ 2వ తేదీన నా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ అదృశ్యమైన రోజు నేను ఎంతటి నరకయాతన అనుభవించానో ఇప్పుడు ఈ విమాన ప్రమాదంలో గల్లంతైనవారి కుటుంబాలు అంతే వేదన అనుభవిస్తున్నాయి’’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆ నెల 22న చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్‌కు బయలుదేరి అదృశ్యమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంతోపాటు ఆచూకీ లేకుండాపోయిన ఎనిమిదిమంది విశాఖ ఎన్ఏడీఉద్యోగుల కుటుంబాలను వై.ఎస్.జగన్ సోమవారం కలిసి ధైర్యం చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో విమాన ప్రయాణాల భద్రతపై ప్రశ్నించాల్సి వస్తోందని, ఇప్పటికే మూడుసార్లు మరమ్మతులకు గురైన విమానాన్ని మనుషుల తరలింపునకు ఎలా వినియోగించారని ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. ఈ విషయంపై పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గట్టిగా నిలదీస్తున్నారన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఆ రోజు నాన్న వస్తాడనుకున్నాం ‘‘భారతదేశం విమానాలను నడుపుతున్న తీరును ప్రశ్నించాల్సి వస్తోంది. ఈ కుటుంబాలు పడుతున్న బాధలు అందరికన్నా బాగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఆ రోజు కూడా నాన్న ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయిన 15, 20 నిమిషాలకే ఆచూకీ తెలియని పరిస్థితి. రెండు రోజుల పాటు నాన్న వస్తాడు, ఎక్కడో దిగే ఉంటాడు.. ఎక్కడో ఎవరికో కనిపించాడు..నడుస్తున్నాడు, వస్తున్నాడు అంటూ రకరకాల ఊహాగానాల మధ్య.. బతికున్నాడో చనిపోయాడో తెలియని పరిస్థితుల్లో కాలం గడిపాం. ఈ కుటుంబాలు కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లో బతుకుతున్నాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఏమైంది, ఎక్కడ ఉన్నారో తెలిసే పరిస్థితులు లేవు. విమానాలు నడుపుతున్న తీరు బాధాకరం విమానాలను నడుపుతున్న తీరు ఇంకా బాధాకరం. తాము పడుతున్న బాధను ఆ కుటుంబాలవారు చెబుతుంటే అర్ధమవుతోంది. ‘అన్నా దాదాపు ప్రతి సంవత్సం ఇదే జరుగుతోందన్నా.. మూడేళ్లు తప్ప ప్రతి సంవత్సరం ఓ విమానం కూలిపోతూనే ఉందన్నా, మనుషులు చనిపోతూనే ఉన్నారన్నా’ అని వారు చెబుతున్నారు. నిజంగా మానవ జీవితం వెలకట్టలేనిది. కానీ విమానం నడుపుతున్నప్పుడు విమానం బాగా పనిచేయలేదు, మూడుసార్లు ఆ విమానాన్ని రిపేరు చేశామని తెలిసినా అదే విమానాన్ని మనుషులను తిప్పడానికి ఉపయోగించడం చూస్తే ఇంకా బాధనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. జరిగిన ఈ ఘటనకు పూర్తి భాధ్యత తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చాలా చాలా గట్టి చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ బాగుపడదు. పార్లమెంటులోనిలదీస్తున్నాం పార్లమెంటులో ఇవాళ(సోమవారం) మా ఎంపీలందరూ కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇక్కడికి వచ్చే ముందు ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల తో ఇదే విషయం మాట్లాడాను. పార్లమెంటులో గట్టిగా అడగండని, డిఫెన్స్ మినిస్టర్ వద్దకు వెళ్లమని చెప్పాను. ఆయనపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం గురించి వారికి గట్టిగా చెప్పాను. నిజంగా ఒత్తిడి తీసుకురావాలి. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే అప్పుటికప్పుడు పట్టించుకోవడం, ఆ తర్వాత మళ్లీ మర్చిపోవడం, మళ్లీ అవే సంఘటనలు పునరావృతం కావడం జరుగుతోంది. మన దేశంలో విమానాలైనా అంతే.. ట్రైన్లైనా అంతే.. అప్పటికప్పుడు రియాక్ట్ అవుతారు. తర్వాత కథ మామూలే. ఏటా జరుగుతూనే ఉంటున్నాయి. ఈ వ్యవస్థను నిజంగా బాగుచేయాలంటే మనలో కూడా చైతన్యం రావాలి. మనం కూడా ప్రశ్నించడం మెదలుపెట్టాలి. మళ్లీ మళ్లీ గుర్తు చేసి అడుగుతుండాలి. దీనిలో మా వంతు పాత్ర ఖచ్చితంగా నిర్వహిస్తాం. ఎంపీల ద్వారా ఏం చేయాలో అదంతా చేయిస్తాను. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో బాధనేది ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిని కాబట్టి.. దీనికి మీడియా సహాయం కూడా కావాలని కోరుతున్నాం. ఇలాంటివి మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే మీరంతా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ తప్పులు సరిదిద్దితేనే వ్యవస్థ మారుతుంది.’’అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రాణానికి విలువలేని పరిస్థితులున్నాయి ‘రక్షణ రంగంలోనే కాలం చెల్లిన విమానాలు కొని నడుపున్నారంటే, వాటిలోనే మనుషులను ఎక్కించుకుని తిప్పుతున్నారంటే మానవ జీవితాలకు విలువ లేదన్న పరిస్థితికి ఇది స్పష్టంగా అద్దం పడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు నడుస్తున్నాయంటే నిజంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ అన్నారు. విశాఖకు వచ్చిన సీఎం బాధితులందరి ఇళ్లకు వెళ్లకుండా ఇద్దరి, ఇళ్లకు వెళ్లి మరొకరిని ఎయిర్‌పోర్టుకు రప్పించుకుని పరామర్శించడాన్ని ఏ విధంగా తీసుకోవాలని విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందిస్తూ ‘ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టులో పరామర్శించి వెళ్లిపోయారేంటని ఆయనను మీరే అడగండి. ఆయనకే తగలాలి. అప్పుడైనా ఆయనలో మార్పు వస్తుందని ఆశిద్దాం’ అని అన్నారు. భూపేంద్ర సింగ్ మినహా మిగతా ఏడుగురిలో ఎవరికీ విమానం ఎక్కే అర్హత లేకపోయినా తీసుకువెళ్లారని, ఎవరికీ ఇన్సూరెన్స్ కూడా లేదని, ఇలాంటి వాళ్లకి ఇన్సూరెన్స్ అర్హత వచ్చేలా ఏమైనా చేయిస్తారా అనే మరో ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ప్రతి ఏటా ఉద్యోగులు వెళుతున్నందున వాళ్ల భద్రత కోసం గట్టి చర్యలు తీసుకోవాలని తప్పకుండా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ధైర్యం కోల్పోవద్దు.. అండగా మేమున్నాం విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమాన ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాలను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం విశాఖలో వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. వారి కన్నీళ్లను తుడిచి ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మరింత గట్టిగా గాలించేలా కేంద్రం, రక్షణ శాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నామని బాధితులకు భరోసా ఇచ్చారు. అయితే ఇంత కష్టం వస్తే, అయిన వారు ఏమయ్యారోననే ఆందోళనలో మీరుంటే కనీసం సమాచారం కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమన్నారు. అదృశ్యమైన వారంతా క్షేమంగా తిరిగిరావాలని దేవుడ్ని ప్రార్థ్ధిద్దామని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామని అన్నారు. ప్రమాదం జరిగింది సముద్రంలో గనుక విమానంలో లైఫ్‌గార్డ్స్ ఉంటాయి గనుక అందరూ క్షేమంగా ఉంటారని ఆ కుటుంబాలకు జగన్ ధైర్యం చెప్పారు.జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న జగన్ సాయంత్రం 7 గంటలకు పర్యటన ముగించుకుని తిరిగి విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. -
ఆ బాధ.. తెలుసు
-
వీడని ఉత్కంఠ..
- ఇంకా ఆచూకీ తెలియని ఎయిర్‌ఫోర్స్ విమానం - గాలింపు మరింత తీవ్రం చేస్తామన్న కోస్ట్‌గార్డ్స్ న్యూఢిల్లీ/చెన్నై: బంగాళాఖాతంలో గల్లంతైన భారత వాయుసేన విమానం ఏఎన్ 32 ఆచూకీపై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తమ వారి క్షేమ సమాచారం తెలియని బాధిత కుటుంబాల్లో ఆవేదన తీవ్రమవుతోంది. గాలింపును ముమ్మరం చేశామని, అయితే, విమానానికి సంబంధించిన శకలాలేవీ లభించలేదని కోస్ట్‌గార్డ్ కమాండర్ ఇన్స్పెక్టర్ జనరల్ రాజన్ బర్గోత్రా సోమవారం తెలిపారు. గాలింపు ప్రాంత విస్తీర్ణాన్ని పెంచుతున్నామని, కొన్ని శిథిలాలు లభించాయి కానీ అవి గల్లంతైన విమానానివి కావని తెలిపారు. విమానం నుంచి ఎమర్జెన్సీ సిగ్నల్స్ రాకపోవడం ఆందోళనకర అంశమేనని, సంబంధిత ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్మిటర్ ఉత్పత్తిదారులతో ఈ అంశంపై చర్చించనున్నామని చెప్పారు. ఉపరితలంపై గాలింపు అనంతరం సముద్రం లోతుల్లో గాలింపు జరుపుతామన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ(ఎన్ఐఓటీ), నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సాయం తీసుకుంటున్నామని, అవసరమైతే ఎన్‌ఐఓటీకి చెందిన సాగర్ నిధి నౌకను గాలింపు కోసం వాడుతామని, ఆ నౌక మారిషస్ నుంచి బయలుదేరిందని తెలిపారు. గాలింపునకు సహకరించని ప్రతికూల వాతావరణం.. ఆదివారం నుంచి నెమ్మదించిందన్నారు. విమాన గాలింపు చర్యల్లో నావికాదళానికి చెందిన 13 నౌకలు, కోస్ట్‌గార్డ్ విభాగానికి చెందిన 4 నౌకలతో పాటు 18 విమానాలు పాల్గొంటున్నాయని నేవీ ప్రధానాధికారి అడ్మిరల్ సునీల్ లాంబ తెలిపారు. ఏఎన్ 32 సేవలు అపూర్వం ఏఎన్32 విమాన సామర్థ్యంపై వస్తున్న విమర్శలపై ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా స్పందించారు. గత 30 ఏళ్లుగా వైమానిక దళంలో ఏఎన్ 32 విమానాలు గొప్పగా సేవలందిస్తున్నాయని, గల్లంతైన విమానానికి గత ఏడాదే పూర్తిస్థాయి మరమ్మతులు చేశామన్నారు. విమాన చోదకులుగా సమర్థులే ఉన్నారన్నారు. -
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
-
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
ఒడిశా: ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని డీజీపీ తెలిపారు. మరోవైపు జార్ఖండ్ లోని బహరాగొరా ప్రాంతంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మరో అత్యాధునిక నిఘూ యాద్ధవిమానం కూలిపోయింది. ఈసంఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బుధవారం జరిగిన రెండుప్రమాదాల్లోనూ పైలెట్ లు సురక్షితంగా బయటపడ్డారు.