
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
ఒడిశా: ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని డీజీపీ తెలిపారు.
మరోవైపు జార్ఖండ్ లోని బహరాగొరా ప్రాంతంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మరో అత్యాధునిక నిఘూ యాద్ధవిమానం కూలిపోయింది. ఈసంఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బుధవారం జరిగిన రెండుప్రమాదాల్లోనూ పైలెట్ లు సురక్షితంగా బయటపడ్డారు.