అందంగా తయారవడానికి పార్లర్‌లో ఐబ్రోస్, ఫేషియల్, వ్యాక్సింగ్ ఇలా చాలానే చేయించుకోవచ్చు కానీ.. సన్నగా అవ్వాలంటే మాత్రం వ్యాయామం ఒక్కటే మార్గం. నాజూకు నడుము ఇచ్చే లుక్కే వేరు. ఎన్ని డైటింగ్ చిట్కాలు పాటించినా తగ్గని నడుము, పొట్ట భాగాలు.. ‘హూలా హూప్ గేమ్’ ఆడితే వేగంగా తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. ‘హూలా హూప్’.. గుండ్రటి పెద్ద రింగ్‌ని నడుము భాగంలో ఉంచి.. మనిషి కదలకుండా నడుముని మాత్రమే తిప్పుతూ.. రింగ్ కిందపడకుండా ఆడే ఆట. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు మీరూ ఆడే ఉంటారు ఈ ఆట. అమ్మో చాలా కష్టం అంటారా? అందుకే దీనికి టెక్నాలజీని జోడించి.. కింద పడిపోకుండా నడుముకి పట్టి ఉండే ‘వెయిటెడ్ హూలా స్మార్ట్ హూప్’ అనే డివైజ్‌ని మార్కెట్‌లోకి తెచ్చాయి పలు కంపెనీలు.
ఈ స్మార్ట్ రింగ్ 47.2 ఇంచులు ఉంటుంది. మొత్తం 16 మసాజ్ హెడ్స్‌తో ఈ రింగ్‌ని రెడీ చేసుకోవచ్చు. ఒక్కో హెడ్ 2.95 ఇంచులు ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, నడుము సైజుని బట్టి.. ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ రింగ్ మాదిరి మార్చుకోవచ్చు. అంటే 10 మసాజ్ హెడ్స్ కలిపితే 24.7 ఇంచులు, 12 మసాజ్ హెడ్స్ కలిపితే 32.1 ఇంచులు, 14 మసాజ్ హెడ్స్ కలిపితే 39.6 ఇంచులు, 16 మసాజ్ హెడ్స్ కలిపితే 47.2 ఇంచులు లూజ్ ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రింగ్‌కి పొడవుగా వేలాడే వెయిట్ బాల్ ఒకటి అటాచ్ చేసుకోవల్సి ఉంటుంది.
ఈ డివైజ్‌ని నడుముకి సరిగ్గా బిగించుకుని, గిర్రున తిరుగుతున్నంత సేపు.. వెయిట్ బాల్ 360 డిగ్రీస్ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో ఒక్కో మసాజ్ హెడ్‌ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో వేగంగా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అయితే అనుభవం మీద.. కొన్ని మసాజ్ హెడ్స్ తగ్గించి ఈ రింగ్‌ని తొడ, చేతులు వంటి భాగాల్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment