waist
-
కుండంత పొట్ట : ఇలా కొలుచుకొని జాగ్రత్త పడండి!
శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ పొట్ట పెద్దగా ముందుకు వచ్చి కనిపిస్తుంటే అది కాస్తంత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోవాలి. ఇదెంత ప్రమాదకరం, పొట్టను ఏ మేరకు తగ్గించుకోవాలి అనే విషయాలు ఓ టేప్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇలా కొలిచే సమయంలో పొట్టను బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలి. ఆ కొలతకూ, పిరుదుల కొలతకు నిష్పత్తిని లెక్కగట్టాలి. అంటే నడుము కొలతని హిప్ కొలతతో భాగించాలి. అదెప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. పురుషులకు ఇది 0.9 కంటే తక్కువగా రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోవాలి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. (స్నానం చేయడు.. గంగాజలం చల్లుకుంటాడు.. నా కొద్దీ పెనిమిటి!)ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండెసమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్ట చుట్టుకొలతను (పొట్టని) తగ్గించుకోవడమన్నది గుండెకూ, ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. ఇదీ చదవండి: పెళ్లైన ఇన్నాళ్లకు, ఇంటిపేరు మార్చుకున్న అలియా -
నడుం ఆకృతి మార్చే మత్స్యాసనం!
బాడీ ఫిట్నెస్ కోసం వివిధ రకాల డైట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. ముఖ్యంగా యోగాసనలు శరీరాకృతిని మంచిగా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి. అందుకే చాలమంది యోగాసనాలు వేసేందుకే ఆసక్తి చూపిస్తారు. అందులో మత్స్యాసనం ది బెస్ట్ ఆసనంగా పేరు. ముఖ్యంగా నడుం ఆకృతిని మంచిగా ఉంచడంలో కీలకంగా ఉంటుంది. దీన్నీ చేపల భంగిమ లేదా చేప ఆకృతి వ్యాయామం అని అంటారు. ఈ వ్యాయమం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి నిపుణులు సైతం చెబుతున్నారు. ఏమంటున్నారంటే..కిగాంగ్ నిపుణుడు బామా కిమ్ ఈ వ్యాయమం వెన్నుముక అమరికను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుందని అన్నారు. ఈ వ్యాయామం బరువు తగ్గడానికే కాకుండా నడుము ఆకృతిని నాజుగ్గా మారుస్తుందని చెప్పారు. ఈ మత్స్యాసనం శరీరానికి చాల ప్రయోజనాలని అందిస్తుందని అన్నారు. ఇది భారీ బరువుతో కూడిన ఆసనం కాదు కాబట్టి నడుమపై పరిమిత వ్యవధిలోనే బరువుని ప్రభావితం చేస్తుంది. అందులనూ ఈ భంగిమలో కాళ్లను బాగా విస్తరించి చేతులు, తలపై బరువును బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనంలో ఎక్కవ భారాన్ని తలపై మోపకుండా చేతులపై బ్యాలెన్స్ అయ్యేలా చూసుకోవాలి. కలిగే ప్రయోజనాలు..జీర్ణ ఆరోగ్యం: ఇది ఉదర అవయవాలను ప్రేరేపించి జీర్ణక్రియ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. వెన్నెముక అమరిక: ఇది వెన్నెముక మెరుగ్గా ఉండేలా చేస్తుంది. నడుమ వద్ద కొవ్వు పేరుకోకుండా చూస్తుంది. నరాల పనితీరు: మెడ,వెనుక భాగాన్ని సాగదీయడం ద్వారా, ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.రక్త ప్రసరణ: ఇది గుండె,ఊపిరితిత్తులకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.జాయింట్ పెయిన్ రిలీఫ్: ఇది కీళ్ల చుట్టూ ఉన్న కండరాలను సాగదీయడం, సడలించడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యల నుంచి మంచి ఉపశమనం అందిస్తుంది.సురక్షితమేనా?"చేపల భంగిమ సాధారణంగా ప్రారంభకులకు సురక్షితం.కానీ వారు అదనపు మద్దతు కోసం కుషన్ వంటి ఆధారాలను ఉపయోగించాలి. ఐతే మెడ సమస్యలు, తీవ్రమైన వెన్ను సమస్యలు లేదా గుండె సమస్యలు ఉన్నవారు దీనిని ప్రయత్నించే ముందు వ్యక్తిగత వైద్యుల సలహాలు, సూచనల మేరుకు ప్రయత్నించాలి.గర్భిణీ స్త్రీలు లేదా వెన్నెముక గాయాలు ఉన్నవారు ఈ భంగిమను నివారించాలి ఈ ఆసనంలో తలపై ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. అలాగే లోతుగా శ్వాస తీసుకుని కొద్దిసేపు అలానే ఉండాలి. ఈ క్రమంలో అసౌకర్యం లేదా నొప్పి వస్తే తక్షణమే వ్యాయామం ఆపేసి ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: అలియా-రణబీర్ ఇష్టపడే వంటకాలివే..!) -
నా నడుము 22.. ఆ రోజులు కనుమరుగై పోయాయి: స్టార్ హీరోయిన్
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ సైరా భాను పేరు ఇప్పటివారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 1961లో జంగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సైరా భాను దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తనకు 22 ఏళ్ల వయసులోనే నటుడు దిలీప్ కుమార్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాల్లో కొనసాగింది. అయితే ఇటీవల సైరా భాను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!) ప్రముఖ నటి సైరా భాను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన త్రోబాక్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఓ ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోలో తన నడుమును ప్రదర్శించింది. ఇన్‌స్టాలో సైరా రాస్తూ.. ' ఆ రోజుల్లో 22 అంగుళాల నడుము ఉన్న రోజులు గడిచిపోయాయి. ఓహ్.. ఆ రోజుల్లో గడిచిన సమయమే శాశ్వతంగా నిలిచిపోతుంది.' అంటూ పోస్ట్ చేసింది. సైరా ఆ ఫోటోలు సల్వార్ కమీజ్ ధరించి కనిపించింది. అయితే సైరా పోస్ట్‌ను ఆమె అభిమానులు ఇప్పటికీ ఎంత అద్భుతంగా ఉందో అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. (ఇది చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Saira Banu Khan (@sairabanu) -
ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే!
టార్చిలైట్ చేత్తో పట్టుకుంటే గాని, చీకట్లో ముందుకు అడుగేయడం కష్టం. గనుల్లో పనిచేసేవాళ్లు నెత్తికి ధరించే హెల్మెట్‌కు టార్చ్‌లైట్ పెట్టుకుంటారు. చేతికి పనిలేకుండా నడుముకు బెల్టులా చుట్టేసుకునే టార్చిని చైనాకు చెందిన బహుళజాతి కంపెనీ ‘నైట్‌కోర్’ ఇటీవల ‘నైట్‌కోర్ యూటీ05’ పేరిట అందుబాటులోకి తెచ్చింది. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని తేలికగా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని బరువు కూడా చాలా తక్కువ– కేవలం 39 గ్రాములే! నడుము బెల్టులాగ ధరిస్తే, ఏమాత్రం అసౌకర్యంగా ఉండదు. అవసరమైనప్పుడు స్విచాన్ చేసుకుంటే, దీని ముందువైపు ఉండే రెండు ఎల్ఈడీ లైట్ల నుంచి వెలుతురు వస్తుంది. చుట్టూ 160 డిగ్రీల పరిధిలో వెలుతురు వ్యాపించడంతో పొద్దునే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లకు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. కరెంటులేని చోట్ల నడుస్తూ ముందుకు సాగడానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర 63.85 డాలర్లు (రూ.5,105). దీనిని కొనుగోలు చేస్తే, దీనికి తగిలించుకోవడానికి వీలయ్యే కీచైన్ ఉచితంగా లభిస్తుంది. చదవండి: వారెవ్వా, సూపర్ ట్రాక్టర్.. డ్రైవర్ లేకపోయినా పని చేస్తుంది! -
ఇంప్లాంట్ ఉందన్నా బట్టలిప్పించి తనిఖీ
గౌహతి: నడుము భాగంలో ఇంప్లాంట్ (మెటల్ ప్లేట్) వేయించుకున్న 80 ఏళ్ల వృద్ధురాలిని బట్టలిప్పించి తనిఖీ చేసిన ఘటన అస్సాంలోని గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో గురువారం చోటుచేసుకుంది. వృద్ధురాలి నడుముకు గత ఏడాది శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు మెటల్ ప్లేట్ వేశారు. ఢిల్లీకి వెళ్లడానికి నాగాలాండ్ నుంచి గౌహతికి చేరుకుంది. మనవరాలితో కలిసి చక్రాల కుర్చీలో ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగింది. దీంతో సీఐఎస్ఎఫ్ మహిళా సిబ్బంది ఆమెను ఆపారు. బట్టలు ఇప్పించి తనిఖీ చేశారు. శరీరంలో ఇంప్లాంట్ ఉందంటూ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. వృద్ధురాలిని అవమానించినట్లు ఫిర్యాదు అందడంతో అందుకు కారణమైన మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. గౌహతి ఎయిర్‌పోర్టులో వృద్ధురాలికి అవమానం -
హూలా హూప్.. ఇక మీ సోకు నాజూకు
అందంగా తయారవడానికి పార్లర్లో ఐబ్రోస్, ఫేషియల్, వ్యాక్సింగ్ ఇలా చాలానే చేయించుకోవచ్చు కానీ.. సన్నగా అవ్వాలంటే మాత్రం వ్యాయామం ఒక్కటే మార్గం. నాజూకు నడుము ఇచ్చే లుక్కే వేరు. ఎన్ని డైటింగ్ చిట్కాలు పాటించినా తగ్గని నడుము, పొట్ట భాగాలు.. ‘హూలా హూప్ గేమ్’ ఆడితే వేగంగా తగ్గిపోతాయంటున్నారు నిపుణులు. ‘హూలా హూప్’.. గుండ్రటి పెద్ద రింగ్‌ని నడుము భాగంలో ఉంచి.. మనిషి కదలకుండా నడుముని మాత్రమే తిప్పుతూ.. రింగ్ కిందపడకుండా ఆడే ఆట. గుర్తొచ్చిందా? చిన్నప్పుడు మీరూ ఆడే ఉంటారు ఈ ఆట. అమ్మో చాలా కష్టం అంటారా? అందుకే దీనికి టెక్నాలజీని జోడించి.. కింద పడిపోకుండా నడుముకి పట్టి ఉండే ‘వెయిటెడ్ హూలా స్మార్ట్ హూప్’ అనే డివైజ్‌ని మార్కెట్లోకి తెచ్చాయి పలు కంపెనీలు. ఈ స్మార్ట్ రింగ్ 47.2 ఇంచులు ఉంటుంది. మొత్తం 16 మసాజ్ హెడ్స్‌తో ఈ రింగ్‌ని రెడీ చేసుకోవచ్చు. ఒక్కో హెడ్ 2.95 ఇంచులు ఉంటుంది. శరీరతత్వాన్ని బట్టి, నడుము సైజుని బట్టి.. ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ రింగ్ మాదిరి మార్చుకోవచ్చు. అంటే 10 మసాజ్ హెడ్స్ కలిపితే 24.7 ఇంచులు, 12 మసాజ్ హెడ్స్ కలిపితే 32.1 ఇంచులు, 14 మసాజ్ హెడ్స్ కలిపితే 39.6 ఇంచులు, 16 మసాజ్ హెడ్స్ కలిపితే 47.2 ఇంచులు లూజ్ ఏర్పడుతుంది. అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రింగ్‌కి పొడవుగా వేలాడే వెయిట్ బాల్ ఒకటి అటాచ్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ డివైజ్‌ని నడుముకి సరిగ్గా బిగించుకుని, గిర్రున తిరుగుతున్నంత సేపు.. వెయిట్ బాల్ 360 డిగ్రీస్ తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతున్న సమయంలో ఒక్కో మసాజ్ హెడ్‌ని ప్రెస్ చేస్తూ వెళ్తుంది. దాంతో వేగంగా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అయితే అనుభవం మీద.. కొన్ని మసాజ్ హెడ్స్ తగ్గించి ఈ రింగ్‌ని తొడ, చేతులు వంటి భాగాల్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. -
పాట కోసం రక్తం చిందించాను
‘ఛయ్యా ఛయ్యా’ పాటతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి మలైకా అరోరా. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ బాలీవుడ్లో రాకెట్లా దూసుకెళ్లిపోయింది. అయితే ఈ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె చాలా తీవ్రంగా గాయపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు మలైకా. ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. ‘పాట మొత్తం కదులుతున్న రైలు పైనే చిత్రీకరించారు. గాలి బలంగా వీస్తుండటంతో నేను చాలా సార్లు పట్టుతప్పి పడిపోయాను. దాంతో నేను పడిపోకుండా ఉండటానికి నేను ధరించిన గాగ్రాకి తాడు కట్టి, రైలుకు కట్టేశారు. ఆ తాడు కట్టుకునే డ్యాన్స్ చేశాను. పాట షూటింగ్ అయిపోయాక తాడు విప్పుతుంటే నడుమంతా రక్తమోడుతోంది. తాడు కట్టడం వల్ల రాసుకుపోయి ఇలా జరిగింది. దాంతో సెట్లో ఉన్న వారంతా కంగారుపడిపోయారు’ అని తెలిపారు మలైకా. మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని ఈ పాటకు ఫరాఖాన్ డ్యాన్స్ కంపోజ్ చేశారు. బెస్ట్ కొరియోగ్రఫీ కేటగిరీలో ఫరాఖాన్‌కు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది. ఇప్పటికీ పాటకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. -
గింజలతో నాజూకు నడుము!
మీరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? నడుం చుట్టూ ఉన్న కొవ్వు ముడతలను తొలగించుకుని నాజూకుగా తయారవ్వాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఆహారంలో గింజల వాడకాన్ని పెంచేయండి. అతిగా ప్రాసెస్ చేసిన వాటి కంటే గింజలన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలగడమే కాకుండా నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని అంటోంది డెన్మార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. అంతేకాకుండా ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు/మంట) తగ్గడమే కాకుండా మధుమేహాన్ని కూడా నిరోధించవచ్చు అంటున్నారు వీరు. గుండెజబ్బులు, అధిక చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు, పొట్టవద్ద కొవ్వు పేరుకుపోవడం వంటి లక్షణాలున్న కొందరిపై వీరు ప్రయోగాలు చేశారు. వీరిని రెండు వర్గాలుగా విభజించి వారికి అందించే ఆహారాన్ని రెండుసార్లు మార్చారు. ఒక వర్గం ముందుగా ఎనిమిది వారాలు గింజధాన్యాలను ఆహారంగా తీసుకుంది. ఆ తరువాత ఆరు వారాల పాటు సాధారణ ఆహారం.. మళ్లీ ఎనిమిది వారాలు బాగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకున్నారు. ఇంకో వర్గం ముందుగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఆ తరువాత ఆరువారాలు సాధారణ ఆహారం... మళ్లీ ఎనిమిది వారాలు కేవలం గింజధాన్యాలు తిన్నారు. వీరి రక్తం, మలాన్ని పరిశీలించారు. మరి కొన్ని పరీక్షల ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గినట్లు తెలిసింది. మనం తినే ఆహారంలో కనీసం నాలుగోవంతు గింజలు ఉండేలా చేసుకుంటే అది బరువు తగ్గేందుకు, నాజూకు నడుముకూ ఉపకరిస్తుందన్నది ఈ పరిశోధనల సారాంశం. -
కంప్యూటర్‌తో కుస్తీ... ఆసనాలే ఆస్తి
యోగా కటి చక్రాసన కటి అనగా నడుము. నడుం పక్కలకు తిప్పడం జరుగుతుంది కనుక దీనికి కటి చక్రాసనం లేదా కమర్ చక్రాసనం అని అంటారు. ఇందులో నిలబడి చేసే కటి చక్రాసనాలతో పాటు కూర్చొని చేసే కటి చక్రాసనాలు కూడా ఉన్నాయి. విధానం1: సమస్థితిలో నిలబడి చేతులు 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరంగా ఉంచాలి. చేతుల మధ్య దూరం అలాగే ఉండేలా శ్వాస తీసుకుంటూ తల చేతులు కుడివైపునకు, శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమవైపునకు ఇలా 5 సార్లు చేయాలి. విధానం 2: సమస్థితిలో నిలబడి రెండు కాళ్ళ మధ్య భుజాల మధ్య ఎంత దూరం ఉందో అంత దూరం ఉంచి చేతులు ముందుకు తీసుకెళ్లాలి. భుజాల దూరంలో ఒక అరచేతిని ఇంకొక అరచేతికి ఎదురుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ తల రెండూ చేతులను కుడివైపుకి, శ్వాస వదులుతూ మధ్యలోకి, శ్వాస తీసుకుంటూ ఎడమవైపుకి తిరిగి శ్వాస వదులుతూ... ఇలా 5 సార్లు చేయాలి. విధానం 3: సమస్థితిలో కాళ్ళ మధ్య భుజాల మధ్య దూరం ఉంచి నిలబడాలి. చేతులు వలయాకారంగా తిప్పుతూ శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి కింద నుండి నడుము వెనుకకు, కుడి చేయి పై నుండి ఎడమ భుజం మీదకు తీసుకెళ్లాలి. తల, భుజాలు ఎడమవైపు తిప్పుతూ, శ్వాస వదులుతూ కుడి చేయి పై నుండి కుడి వైపుకి తీసుకువచ్చి కింద నుండి నడుము వెనుకకు ఎడమ చేయి పై నుండి కుడి భుజం మీదకు తల భుజాలు కుడివైపు తిప్పుతూ 5 పర్యాయాలు చేయాలి. పక్కకు తిరిగేటప్పుడు వీలుగా ఉండటానికి వ్యతిరేక కాలు మడమను పైకి లేపి మునివేళ్లను పాదాన్ని వీలుగా కుడి ఎడమ పక్కలకు తిప్పవచ్చు. వీటిలో కొన్నింటిని కుర్చీ ఆసరాతో మరింత సులభంగా చేయవచ్చు. విధానం4: (కుర్చీ ఆధారంగా) టికెఆర్ 8040: ఫొటోలో చూపినట్టు కుర్చీకి ఎదురుగా నిలబడి కుడిపాదాన్ని కుర్చీలో ఉంచి వెనుక ఉన్న కుర్చీని కుడిచేత్తో ఆధారంగా పట్టుకోవాలి. ఎడమ చేతిని కుడి మోకాలు మీద ఎడమ కాలును స్థిరంగా ఉంచి కుడి భుజమును తలను కుడి వైపుకి శ్వాస తీసుకుంటూ తిప్పాలి. 2 లేదా 3 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి ముందుకు (కుర్చీకి ఎదురుగా) రావాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. 1. పాదాంగుష్ఠాసన కుడి కాలు మీద నిలబడి ఎడమ కాలును ముందుగా కుర్చీ సీటులో, తర్వాత కుర్చీ బ్యాక్ రెస్ట్ పై ఉంచాలి. మోకాలుని నిటారుగా ఉంచి, ఎడమ చేత్తో ఎడమ కాలుని పట్టుకునే ప్రయత్నం చేస్తూ కుడి చేతిని సమంగా పక్కలకు ఉంచి 2 లేదా 3 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ కుడి చేయి కిందకు, ఎడమ కాలుని కుర్చీ సీటులోకి తెచ్చి, సమస్థితిలోకి రావాలి. ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. కాలు బ్యాక్ రెస్ట్ పైన పెట్టలేకపోతే కుర్చీ పక్కకు తిప్పి కుర్చీ చేతి మీద ఉంచవచ్చు. లేదా కుర్చీ సీటులోనే ఉంచి మోకాలు నిటారుగా పెట్టే ప్రయత్నం చేయవచ్చు. 2. తిర్యక్ పాదాంగుష్ఠాసన ఫొటోలో చూపిన విధంగా కుడికాలుని కుర్చీ బ్యాక్‌రెస్ట్ మీద ఉంచాలి. ఎడమ చేతిని కుడి షిన్ బోన్ (పిక్కల ముందు భాగపు ఎముక) మీద లేదా కుడి మోకాలు మీద సపోర్ట్ ఉంచి, శ్వాస తీసుకుంటూ తల భుజాన్ని కుడివైపు తిప్పాలి. 2 లేదా 3 సాధారణ శ్వాసల తరువాత కుర్చీకి ఎదురుగా కుడి కాలుని కిందకు తీసుకురావాలి. ఇదే విధంగా రెండవ వైపు కూడా చేయాలి. కుడి కాలు కుర్చీ పైన ఉంటే కుడికి, ఎడమకాలు పైన ఉంటే ఎడమవైపు తల, నడుమును తిప్పడం అనేది ముఖ్యంగా గమనించాలి. ఫొటోలో చూపించిన విధంగా రెండు చేతులను గాలిలో ఒకదానికి సమాంతరంగా రెండవచేతిని 180 డిగ్రీల కోణంలో ఉంచి కూడా నడుమును పక్కకు ట్విస్ట్ చేయవచ్చు. ఉపయోగాలు: కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవాళ్లు తప్పక చేయవలసిన ఆసనాలు. వీటి వల్ల నడుము, వెన్నెముకకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. బలం చేకూరుతుంది. మలబద్ధకానికి నివారిణగా పనిచేస్తుంది. చేతులు పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచడం వలన ఊపిరితిత్తులు, ఛాతీ వ్యాకోచస్థితిలో ఉంటాయి కనుక వాటి సామర్థ్యం, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. భుజాలు, వీపు భాగాలలోని అన్ని కండరాలకు టోనింగ్ జరుగుతుంది. పాదాంగుష్ఠాసనం ఒక కాలు మీద నిలబడి చేయడం వల్ల శరీరంలో కుడి ఎడమల మధ్య అసమానతలు తగ్గుతాయి. జాగ్రత్తలు: హెర్నియా, స్లిప్‌డిస్క్, లేదంటే అబ్డామినల్ ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు, వెన్నెముకకు ఈ మధ్యనే శస్త్ర చికిత్స చేయించుకున్నవారు అత్యంత జాగ్రత్తగా నిపుణుల సమక్షంలో ఈ ఆసనాలు చేయాలి. ►కంప్యూటర్ ముందు కూర్చుని నిర్విరామంగా చాలాసేపు పనిచేస్తే.. ఎదురయ్యే సమస్యలకి పరిష్కారాలు ఈ ఆసనాలు సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
లోయర్ పార్ట్‌కి... లాభం
శరీరంలో నడుముకు దిగువ భాగం అత్యంత ప్రాధాన్యత కలిగినది. మనిషిని నడిపేది, నిలబెట్టేది అదే. అంత ప్రాధాన్యత కలిగిన లోయర్పార్ట్కి అత్యంత ఉపయుక్తమైన ఆసనాలు ఈ వారం... 1. త్రికోణాసన లేదా ఉత్థిత త్రికోణాసన సమస్థితి లేదా తాడాసనంలో నిలబడాలి. కుడి పాదాన్ని ఎడమకాలుకు దూరంగా జరిపి కుడి పాదాన్ని ముందుకు, ఎడమపాదాన్ని పక్కలకు ఉంచాలి. చేతులు పక్కలకు 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరరేఖలో ఉంచి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. కుడి చేతిని కుడి పాదానికి దగ్గరగా ఎడమ చేతిని నిటారుగా పైకి తీసుకువెళ్లి, ఎడమ చేతిని చూస్తూ నడుము నుండి పై భాగం ముందుకు పడిపోకుండా పక్కలకు ఉండేటట్లుగా సరి చేసుకుంటూ ఉండాలి. పూర్తి స్థితిలో మోకాళ్లు రెండూ నిటారుగా ఉంటాయి. (మోకాలి సమస్య ఉన్నవారు కొద్దిగా మోకాళ్లను ముందుకు వంచవచ్చు. కుడిచేయి భూమికి దగ్గరగా తీసుకురాలేనివాళ్లు కుడికాలి షైన్బోన్ను పట్టుకోవచ్చు. లేదా కుడి చేతికింద సపోర్ట్‌గా ఏదైనా ఇటుకలాంటిదాన్ని ఉపయోగించవచ్చు) శ్వాస తీసుకుంటూ చేతులు పైకి 180 డిగ్రీల కోణంలో భూమికి సమాంతరంగా తీసుకువెళ్లి, చేతులు క్రిందకు తెచ్చి కుడిపాదాన్ని పక్కకు, ఎడమపాదాన్ని ముందుకు ఉంచి రెండవ వైపూ చేయాలి. ఉపయోగాలు: తొడవెనుక కండరాలు (హామ్‌స్ట్రింగ్స్) ముందు కండరాలు (క్వాడ్రోసెప్స్) నడుము దిగువ కండరాలు (గ్లూటియస్ మాక్సిమస్), సయాటికా కరెక్షన్కు మేలు. నడుమును తిప్పి ఛాతీని పక్కలకు ఉంచడంతో పొత్తికడుపునకు, ఛాతీ కండరాలకు టోనింగ్ అవుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. 2. పరివృత్త త్రికోణాసన త్రికోణాసన వర్గంలో త్రికోణాసనం చేసిన తరువాత అదే సీక్వెన్స్‌లో తదుపరి ఆసనం పరివృత్త త్రికోణాసనం. కుడిపాదం ముందుకు, ఎడమ పాదం పక్కకు ఉంచి చేతులు 180 డిగ్రీల కోణంలో ఉంచి నడుమును బాగా కుడి వైపునకు తిప్పి, శ్వాస వదులుతూ ఎడమ చేతిని కిందకు, కుడిపాదానికి దగ్గరగా కుడి చేతిని పైకి చేతులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉండే తీసుకురావాలి. ఎడమ చేయి భూమికి దగ్గరగా తీసుకు రాలేకపోతే ఎడమచేతికి సపోర్ట్‌గా ఏదైనా వస్తువు ఉపయోగించవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి 180 డిగ్రీల కోణంలో ఉంచి, శ్వాస వదులుతూ చేతులు కిందకు తీసుకురావాలి. తిరిగి ఇదే విధంగా రెండవ వైపు చేయాలి. ఉపయోగాలు: త్రికోణాసన లాభాలతో పాటు నడుము పూర్తిగా తిప్పడం వల్ల పొత్తికడుపు, కాలేయం, పాంక్రియాటీస్, పొట్టభాగానికి బాగా టోనింగ్ జరుగుతుంది. వెన్నెముక సమస్యకు పరిష్కారం. హిప్ మజిల్స్ బలోపేతం అవుతాయి. 3. పార్శ్వ కోణాసన త్రికోణాసన వర్గంలో తరువాతిది పార్శ్వకోణాసనం. చేతులు 180 డిగ్రీల కోణంలో ఉంచాక ఎడమ మోకాలును ముందుకు వంచి ఎడమపాదం నుండి ఎడమ మోకాలి వరకూ 90 డిగ్రీల కోణంలో లంబంగా ఉంచాలి. ఎడమ మోచేతిని ఎడమ మోకాలుకు సపోర్ట్‌గా ఉంచి కుడి చేతిని పైకి నిటారుగా ఆ తరువాత కుడి చేతిని ఏటవాలుగా ఉంచి స్ట్రెచ్ చేస్తూ కుడి చేతి వేళ్ల దగ్గర నుంచి కుడి పాదం చివర వరకూ ఒకే లైనులో ఉండేటట సరిచేసుకోవాలి. ఎడమచేతిని కిందకు భూమి మీద ఎడమపాదానికి బయట వైపు లేదా ఫొటోలో చూపించిన విధంగా లోపలవైపు ఉంచి ఛాతీ భూమి మీదకు శరీరం ఒరిగి పోకుండా పక్కలకు ఉండేలా చూసుకోవాలి. ఎడమచేయి భూమి మీద పెట్టలేని పరిస్థితిలో ఎడమచేతిక్రింద ఏదైనా సపోర్ట్ ఉపయోగించవచ్చు. 3 లేదా 5 సాధారణ శ్వాసల తర్వాత శ్వాస వదులుతూ ఎడమ మోచేయి ఎడమ మోకాలు మీద సపోర్ట్‌గా ఉంచి పైకి లేస్తూ చేతులు 180 డిగ్రీల కోణంలోకి ఎడమ మోకాలు నిటారుగా ఉంచుతూ సమస్థితిలోకి రావాలి. ఇదే విధంగా రెండవవైపూ చేయాలి. 4. పరివృత్త పార్శ్వ కోణాసన పైన చెప్పిన ఆసనం తరువాత కొంచెం అడ్వాన్స్డ్గా చేసే ఆసనం పరివృత్త పార్శ్వకోణాసనం. పైన చేసిన విధంగానే ఇదీ కొన్ని మార్పులతో చేయాలి. వ్యతిరేక చేయి, వ్యతిరేక పాదానికి దగ్గరగా పాదం బయటవైపునకు లేదా లోపల వైపు భూమికి దగ్గరగా తీసుకురావాలి. స్ట్రెచ్ చేసి ఉంచిన పాదాన్ని పూర్తిగా భూమి మీద ఆనించి ఉంచడం సాధ్యపడదు కనుక పాదాన్ని ముందుకు తిప్పి, కాలి మడమను పైకి లేపి, మునివేళ్ల మీద సపోర్ట్ తీసుకోవాలి ఉపయోగాలు: పార్శ్వకోణాసనంలో నడుము పక్క భాగాలకు, పక్కటెముకలకు మేలు జరిగినట్టే, ఈ ఆసనం ద్వారా నడుము ఛాతీ భాగాలను ట్విస్ట్ చేయడం వలన పొట్టలోని భాగాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. భుజాల పక్క భాగం (హ్యుమరస్), పక్కటెముకల పై కండరాలు (స్క్యాప్యులా) ట్రెపీజియస్ వంటి భుజం కండరాలకు మంచి వ్యాయామం (టోనింగ్) జరుగుతుంది. -
నడుము మంత్రసిరి
ఈ మధ్యన వడ్డాణాలు కనిపించడం లేదు. కాదు కాదు ఈ ‘నడుమ’న వడ్డాణాలు కనిపించడం లేదు. చెవులకు జూకాలు, ముక్కుకు బేసర, కంఠానికి హారం, చేతులకు గాజులు ఎలాగో... నడుముకు నాయనమ్మ వడ్డాణం అలాగ. కానీ ఇప్పుడు నాయనమ్మ వడ్డాణాలకు బదులు నయా వడ్డాణాలు వచ్చేశాయి.మధ్యలో డబ్బు వస్తే నడమంత్రపు సిరి అంటారు. అలాగే కొత్తగా వచ్చిన ఈ డిజైనర్ బెల్టులు నడుము మంత్ర సిరులు. వీటిని చుట్టుకోండి... మంత్రముగ్ధుల్ని చేయండి. ఆభరణాలలో కొన్నింటి స్థానం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. అందులో ముందుండే నగ వడ్డాణం. సన్నని నడుమును పట్టి ఉంచే ఈ నగ అందంగా, ఆకర్షణీయంగా ఆక ట్టుకుంటుంది. అయితే, ఇక్కడే చిన్న మార్పు. బంగారు వడ్డాణం అవుట్‌డేటెడ్ లిస్ట్‌లో చేరిపోయింది. దాని స్థానంలోనే స్టైల్‌ని పెంచే ఆధునిక వడ్డాణాలు బెల్ట్‌లుగా మారి డిజైనర్ల దృష్టిలో పడ్డాయి. బాలీవుడ్‌నే కాదు టాలీవుడ్ తారలనూ ఆకట్టుకున్న ఈ డిజైనర్ బెల్ట్‌లు కొత్త వడ్డాణాలుగా అందరి దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నాయి. అందంగా రూపు కట్టు... ఆరు గజాల చీర నుంచి... చిట్టి పొట్టి స్కర్టుల వరకు నడుము చుట్టూ అల్లుకొని తళుక్కుమంటూ మెరిసిపోవడానికి మెటల్ బెల్ట్ సిద్ధమైంది. స్టీల్ బెల్ట్‌గా ఫ్యాషన్ ప్రపంచం నడుమును చుట్టేస్తున్న ఇది ప్లెయిన్‌గా ఉండి, ప్లెయిన్ డ్రెస్సుల మీదకే అందంగా అమరుతోంది. దీంతోపాటు కాపర్, బ్రాస్ మెటల్స్లలో కూడా అమ్మాయిల నడుము నగల జాబితాలో ఈ బెల్ట్‌లు అందంగా అమరిపోయాయి. ‘ముడి’తో ఆకట్టు... బెల్ట్ అంటే బకిల్ ఉండాలి.. పక్కన రంధ్రాలుండాలి అనుకుంటారంతా. అంతేకాదు కేవలం ప్యాంట్ షర్ట్ల మీద మాత్రమే పెట్టుకునేది అనుకుంటారు. కానీ ఈ బెల్ట్‌లో అలాంటివేవీ కనిపించవు. ఇలాంటి డ్రెస్ మీదే పెట్టుకోవాలని రూలూ లేదు. చీరల మీద మ్యాచింగ్ అయ్యే మెటీరియల్‌తోనూ తయారుచేసినవి లభిస్తున్నాయి. వీటిని చీర, గౌన్ ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బెల్ట్ ఎంచుకుంటే చక్కగా నప్పుతుంది. సన్నని నడుము గలవాళ్లే కాదు.. లావు ఉన్న వాళ్లు కూడా మరింత నాజూకుగా కనిపించేందుకు ఈ బెల్ట్‌లను వాడుతున్నారు. జపాన్‌లో పుట్టి బాలీవుడ్ మీదుగా టాలీవుడ్‌కు అటు నుంచి అందరికీ చేరువైన ఈ బెల్ట్‌కు ఓబిఐగా పేరుంది. మనదగ్గర శుభకార్యాలలో వడ్డాణాలు ఎలా ధరిస్తారో... జపాన్‌లో పెళ్లి డ్రెస్ మీద ఓఐబి బెల్ట్‌ను అలా ధరిస్తారు. దాన్నే ముద్దుగా వారు ‘సాష్’ అని కూడా పిలుస్తారు. మంచి రంగు ఉన్న సాదా రంగు రిబ్బన్ ముక్కను నడుము చుట్టూ అందంగా ముడి వేసేది ఓబీఐ నాట్. ఈ ముడిలోనే అందమంతా దాగి ఉంటుంది. ఇవి రిబ్బన్లే కాకుండా.. లెదర్, మెటాలిక్, కాపర్, మిర్రర్.. మెటీరియల్స్‌తో తయారుచేసి ఈ తరహా బెల్ట్‌లతో మగువల మనసులు దోచేస్తున్నారు డిజైనర్లు. బాలీవుడ్, టాలీవుడ్ భామలు వీటితో సరికొత్తగా ర్యాంప్ మీద కనువిందు చేస్తున్నారు. డిజైనర్ల చేతిలో రూపుదిద్దుకొని మార్కెట్లో అందంగా కొలువుదీరిన ఇవి షాపింగ్ మాల్స్, డిజైనర్ స్టోర్స్, ఆన్లైన్ మార్కెట్లలోనూ డిజైన్, నాణ్యతను బట్టి రూ.300 నుంచి లభిస్తున్నాయి. మనదైన ‘కళ’... రాజస్తాన్ వైభవం ఉట్టిపడేలా, గిరిజన సంస్కృతి కళ్లకు కట్టేలా చేతిపనితనం నడుం పట్టీలపై కొత్తగా రూపుదిద్దుకుంటుంది. అద్దాలు,పూసలను ఉపయోగిస్తూ చేసే ఆ పనితనానికి మగువలు మరీ ముచ్చటపడి నడుమున అలంకరించుకుంటున్నారు. లేస్, జరీ మెరుపులతో తయారుచేసిన ఎంబ్రాయిడరీ బెల్టుల్లో కుందన్స్నూ మెరిపిస్తున్నారు. ఈ తరహా డిజైనరీ బెల్ట్‌లు డిజైన్‌ను బట్టి రూ.200 నుంచి లభిస్తున్నాయి. నడుము సొగసును పెంచే ఈ నవ్యాభరణం విభిన్న డిజైన్లలో అమ్మాయిల మదిని గిలిగింతలుపెడుతూ సరికొత్త స్టైల్లో కనువిందుచేస్తోంది. - ఎన్.ఆర్ -
అందమా...అందుమా!
నగరంలో కాస్మొటిక్ సర్జరీలపై పెరుగుతున్న మోజు సొట్టబుగ్గలు, నడుము, ఛాతి సర్జరీలపై అమ్మాయిల ఆసక్తి ముక్కు, బట్టతల, పొట్టను సరి చేసుకుంటున్న అబ్బాయిలు అందమంటే అమ్మాయిల సొంతం... ఒకప్పుడు ఈ మాట వింటే అబ్బాయిలు ‘నిజమే’నంటూ మెచ్చుకునేవారు. ఇప్పుడు ఈ రేసులో వారూ ముందుకు వస్తున్నారు. అందమా..అందుమా.. అంటూ తమ శరీరాకృతికి మెరుగులు దిద్దుకుంటున్నారు. మేని మెరుపులు పెంచుకునే క్రమంలో స్త్రీలు, పురుషులు పోటీ పడుతున్నారు. ఎవరికి తోచిన మార్గాల్లో వారు వెళుతున్నా... గమ్యం మాత్రం అందమే. వీరి మనసులో మాటను తెలుసుకొని... ‘మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మేమున్నామ’ంటూ అధునాతన చికిత్సలతో ముందుకొస్తున్నారు వైద్య నిపుణులు. వినూత్న పద్ధతుల్లో..విభిన్న రీతుల్లో సొబగులద్దుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ఎదుటి వారిని ఆకర్షించడంలో కళ్లు, ముక్కు, పెదవులు, సొట్ట బుగ్గలు, ఛాతి, నడుములది కీలక పాత్ర. వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకున్నా మనలో ఏదో తెలియని అసంతృప్తి. ఎంత ఐశ్యర్యవంతులైనా కంటికి అందంగా కనిపించకపోతే చెప్పలేని వెలితి. అందానికి ఉన్న స్థానమది. అందంగా లేనివారు... శారీరకంగా లోపాలు ఉన్న వారు ఒకప్పుడైతే ‘దేవుడిచ్చిన శరీర భాగాలను మనమేం చేయగలంలే’ అని సరిపెట్టుకునే వారు. మరి ఇప్పుడో... ఏదో ఒకటి చేసి... అందంగా కనిపించాల్సిందే అనుకుంటున్నారు. అందాలకు మెరుగులు దిద్దే మార్గాలను వెదుక్కుంటూ వెళుతున్నారు. ఇలాంటి వారికి కాస్మొటిక్ సర్జరీలు వరంగా మారుతున్నాయి. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా చికిత్సల వైపు ప్రస్తుతం మధ్య తరగతి వారూ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థెటిక్ ప్లాస్టిక్ సర్జరీ సర్వే ప్రకారం కాస్మొటిక్ సర్జరీల్లో మన దేశానిది నాలుగో స్థానం. అందాలకు మెరుగులు దిద్దుకోవాలని గత ఏడాది శస్త్రచికిత్సలకు క్యూ కట్టిన వారి సంఖ్య 8,94,700గా గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 20-25 శాతం మంది గ్రేటర్ వాసులే ఉండటం గమనార్హం. కోటేరు లాంటి ముక్కు కోసం ముఖం అందాన్ని నిర్ణయించేది ముక్కు. అందుకే ఏమాత్రం తేడా ఉన్నా.. చాలా మంది అమ్మాయిలు...అందులోనూ పెళ్లి కావాల్సిన వారు రైనోప్లాస్టీ సర్జరీని ఆశ్రయిస్తున్నారు. ఈ సర్జరీ చేసుకుంటున్న వారిలో 70 శాతం అమ్మాయిలు, 30 శాతం అబ్బాయిలు ఉంటున్నారు. ఇలా సర్జరీ చేయించుకునే వ్యక్తి శరీరంలోని ఏదో ఒక భాగం నుంచి కణజాలాన్ని సేకరిస్తారు. ఒక వేళ ఆ కణజాలం అతనికి సరిపోకపోతే రక్త సంబంధీకుల నుంచి సేకరించి, అమర్చుతున్నట్లు కేర్ ఆస్పత్రిలోని ఈఎన్టీ, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి చెప్పారు. నాజుకైన నడుముకు... శరీరంలో ఉండాల్సిన బరువు కన్నా 20 శాతం ఎక్కువ ఉంటే ‘అధిక బరువుగా’ భావిస్తారు. మధ్య తరగతి మగవాళ్లలో మూడో వంతు, ఆడవాళ్లలో సగానికిపైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్లు అంచనా. ఓ సర్వే ప్రకారం 2005లో నగరంలో ఈ సంఖ్య ఐదు శాతం ఉంటే.. ప్రస్తుతం 10 శాతానికి చేరుకుంది. శరీరంలోనికొవ్వును‘లైపోసక్షన్, బెరియాట్రిక్’ పద్ధతుల్లో తొ ల గిస్తారు. సినీ తారలు ఎక్కువగా లైపోసక్షన్‌ను ఆశ్రయిస్తుంటే... మధ్య తరగతి వారు ల్యాప్రోస్కోపిక్ విధానం లో చేసే బెరియాట్రిక్ సర్జరీలను ఎంచుకుంటున్నట్లు లివ్లైఫ్ ఆస్పత్రి బె రియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ చెప్పారు. బట్టతలను వదిలించుకోవడానికి... వివిధ కారణాలతో కుర్రాళ్లకు పాతికేళ్లకే తలపై జుట్టంతా ఊడిపోతోంది. పెళ్లికి ముందే ఈ పరిస్థితి ఎదురు కావడంతో అమ్మాయిలు ఇలాంటి వారిని నిరాకరిస్తున్నారు. దీంతో చాలా మంది అబ్బాయిలు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇందు కోసం రూ.లక్ష ఖర్చు చేయడానికి కూడా వెనుకాడటం లేదని కాస్మొటిక్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ వెంకటరమణ చెప్పారు. విదేశాలకు పరుగెత్తాల్సిన అవసరం లేదు: డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, ప్లాస్టిక్ సర్జన్ కాస్మొటిక్ సర్జరీ అనగానే ఖరీదైన వ్యవహారం అనుకుంటారు. తక్కువ ఖర్చుతో లోపాలను సరిచేసుకునే అవకాశం ఉంది. విదేశాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత సైతం ఇటీవల ఇక్కడికే వస్తున్నారు. నిపుణులు అందుబాటు లో ఉండటం, ఖర్చు తక్కువ ఉండటమే కారణం. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది: డాక్టర్ మురళీ మోహన్‌రెడ్డి, కాస్మొటిక్ సర్జన్, యశోద ఆస్పత్రి అందం మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుత తరంఈ విషయాన్ని తొందరగా గ్రహించారు. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అం దాలకు మెరుగుదిద్దుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మచ్చుకు కొన్ని ప్లాస్టిక్ సర్జరీలు.. రైనోప్లాస్టీ: అందమైన నాసిక కావాలనుకునే వారి చాయిస్. చప్పిడి ముక్కు, వంకరలు తిరిగిన ముక్కును సరి చేయవచ్చు. బొటాక్స్: ముఖంపై ముడుతలు పోవడానికి చక్కని పరిష్కారం. 30 దాటిన వారు బొటాక్స్ కోసం పరుగులు తీస్తున్నారు. లైపొసక్షన్: పొట్ట, నడుము భాగాల్లోని కొవ్వును కరిగించే శస్త్రచికిత్స. డింపుల్స్ క్రియేషన్స్ సర్జరీ: నవ్వినప్పుడు బుగ్గలపై సొట్టపడేలా చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్: బట్టతలపై జుట్టు మొలిపిస్తారు. చీక్ అగ్మంటేషన్: ఆకట్టుకునే ముఖాకృతి కోసం చేసే సర్జరీ. గైనకో మాస్టియా: అమ్మాయిల్లా పెరిగిపోయిన మ్యాన్బూబ్స్ తొలగించే శస్త్రచికిత్స. టమ్మీటక్: పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. సిక్స్‌ప్యాక్‌లకు దారి చూపుతుంది. బ్లైఫరోప్లాస్టీ: నాజుకైన కంటిరెప్పల కేరాఫ్ అడ్రస్ ఇది. కాస్మొటిక్ సర్జరీలుచేయించుకుంటున్న వారు... యువతులు- 70 శాతం యువకులు- 30 శాతం 25 ఏళ్ల లోపు వారు- 50 శాతం 35 ఏళ్లలోపు వారు- 30 శాతం ఆపై వయసు వారు- 20 శాతం గ్రేటర్లో ప్రతి నెలా జరుగుతున్న కాస్మొటిక్ సర్జరీలు కాస్మొటిక్ సర్జరీలు- 100 రైనో ప్లాస్టీ- 40-50 మేల్బ్రెస్ట్ సర్జరీస్- 60 లైపొసక్షన్- 150 హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్-100