Saira Banu Recalls Her 22 Inch Waistline As She Shares Rare Picture From Younger Days, Deets Inside - Sakshi
Sakshi News home page

Saira Banu Throwback Photo: నా నడుము అలా ఉండేది.. ఆ క్షణాలు మాత్రమే మిగిలాయి: సైరా భాను

Published Sun, Jul 9 2023 7:55 PM | Last Updated on Mon, Jul 10 2023 12:07 PM

Saira Banu Recalls Her 22 Inch Waistline As She Shares Rare Pictures - Sakshi

ప్రముఖ సీనియర్ బాలీవుడ్ సైరా భాను పేరు ఇప్పటివారికి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 1961లో జంగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సైరా భాను దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తనకు 22 ఏళ్ల వయసులోనే నటుడు దిలీప్‌ కుమార్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాల్లో కొనసాగింది. అయితే ఇటీవల సైరా భాను సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. 

(ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!)

ప్రముఖ నటి సైరా భాను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన  త్రోబాక్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఆమె తాజాగా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ ఓ ఆసక్తికర నోట్ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఫోటోలో తన నడుమును ప్రదర్శించింది.

ఇన్‌స్టాలో సైరా రాస్తూ.. ' ఆ రోజుల్లో 22 అంగుళాల నడుము ఉన్న రోజులు గడిచిపోయాయి. ఓహ్.. ఆ రోజుల్లో గడిచిన సమయమే శాశ్వతంగా నిలిచిపోతుంది.' అంటూ పోస్ట్ చేసింది.  సైరా ఆ ఫోటోలు సల్వార్ కమీజ్ ధరించి కనిపించింది. అయితే సైరా పోస్ట్‌ను ఆమె అభిమానులు ఇప్పటికీ ఎంత అద్భుతంగా ఉందో అంటూ గుర్తు చేసుకున్నారు. ఆ ఫోటో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేశారు. 

(ఇది చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement