
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్‌పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.
దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్‌ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్‌ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్‌ను స్వాగతించారు.