
బాలీవుడ్ విద్యా బాలన్ గతేడాది భూల్ భూలయ్యా-3 మూవీతో అభిమానులను అలరించింది. ఈ హారర్ కామెడీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రల్లో మెప్పించారు. భూల్ భూలయ్యా సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే విద్యా బాలన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో పెద్దఎత్తున తనకు సంబంధించిన వీడియోలపై ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. అవన్నీ ఫేక్ అనీ.. కేవలం ఏఐ సాయంతో రూపొందించారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తప్పుదారి పట్టించేలా ఉన్న వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా అని తెలిపింది.
విద్యాబాలన్ తన పోస్ట్‌లో రాస్తూ.. 'నేను మీకు ఇష్టమైన విద్యాబాలన్. ప్రస్తుతం సోషల్ మీడియా, వాట్సాప్‌లో అనేక వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అంతేకాకుండా అవీ నన్ను టార్గెట్ చేసేలా ఉన్నాయి. అయితే ఆ వీడియోలు ఏఐ సాయంతో రూపొందించినవి. అవన్నీ ఫేక్ అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నా. వాటిని క్రియేట్ చేయడం, వ్యాప్తి చేయడంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి కంటెంట్‌ను నేను ఏ విధంగానూ ఆమోదించను. వీడియోలలో చేసిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇలాంటివీ నా అభిప్రాయాలు, నా పనిని ప్రభావితం చేయలేవు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని షేర్ చేసేముందు ధృవీకరించుకోండి. ఎందుకంటే ఏఐ సాయంతో రూపొందించిన కంటెంట్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇలాంటివాటితో జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా.' అని రాసుకొచ్చింది. కాగా.. గతంలో విద్యాబాలన్ కంటేముందే రష్మిక మందన్న, దీపికా పదుకొణె, అలియా భట్, కత్రినా కైఫ్, రణ్‌వీర్ సింగ్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ సైతం డీప్‌ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment