బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ కోసం విద్యాబాలన్ సెమీ న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
కేవలం న్యూస్ పేపర్‌ను అడ్డుపెట్టుకొని కూర్చీలో కూర్చొని ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ దిగిన ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 40ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ విద్యాబాలన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఇది మరో డర్టీ పిక్చర్‌లా ఉందంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీని కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోయిన్లను ఇలా నగ్నంగా చూపించడంలో క్రియేటివిటీ ఏముంది అంటూ అతడ్ని కూడా ఏకిపారేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment