photo shoot
-
ప్రెగ్నెన్సీ ప్రకటించిన గేమ్ ఛేంజర్ బ్యూటీ (ఫోటోలు)
-
మరింత యంగ్‌గా మాధురీ దీక్షిత్.. 57 ఏళ్లు అంటే నమ్ముతారా..? (ఫోటోలు)
-
గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్
-
'మేరే హస్బెండ్‌కి బివీ' సినిమా ప్రమోషన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఫోజులు (ఫోటోలు)
-
జీ20 సదస్సులో ఫొటో.. బైడెన్, ట్రూడో మిస్సింగ్!
ప్రపంచ దేశాధినేతలు కలిసి దిగిన ఓ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఈ పరిమాణం వెలుగుచూసింది. ఈ సమ్మిట్‌లో భాగంగా సోమవారం దేశాధినేతలంతా కలిసి ఓ ఫోటో దిగారు. ఇందులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా తదితర నేతలంతా ఉన్నారు. వారందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు.అయితే ఈ ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు లేరు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌కు చివరి జీ20 సదస్సు అయినందున ఆయన లేకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మరోవైపు ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గైర్హాజరు కావడం గమనార్హం. తాజాగా ఈ ఫోటోపై అమెరికా అధికారులు స్పందిస్తూ.. తీవ్రంగా త ప్పుబట్టారు. ఫోటో దిగే సమయంలో బైడెన్.. కెనడా ప్రధాని జస్టిన్ట్రూడోతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు. చర్చలు ముగించుకొని వస్తుండగా బైడెన్ రాకముందే తొందరగా ఫోటో తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫొటో దిగేశారని, అందుకే అందరూ నేతలు అక్కడ లేరని చెప్పారు. కాగాఫోటోలో మిస్ అయిన బైడెన్, ట్రూడో, మెలోనీలు తరువాత ప్రత్యేకంగా ఫొటో దిగారు.ఇదిలా ఉండగా మరో రెండు నెలల మాత్రం అమెరికా అధ్యక్ష హోదాలో కొనసాగనున్నారు బైడెన్.. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆయనకు ఇదే చివరి జీ 20 సదస్సు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. -
అటు విడాకుల పుకార్లు : ఇటు నటి నిమ్రత్ కౌర్ ఫోటోషూట్ వైరల్
బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ ఎర్ర గులాబీ రంగు డ్రెస్ ఫోటోషూట్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చింది. బోల్డ్ అండ్ బాడీ-హగ్గింగ్ రెడ్ ఎంసెట్‌లో డేరింగ్ స్టైల్‌తో చేసిన ఫోటో షూట్, వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ ప్రీమియర్‌లో కనిపించి ఫ్యాషన్ ప్రపంచాన్ని అలరించింది. తాజాగా "సవాల్: మిషన్ కా క్యా నామ్ హై? జవాబ్: కోడ్ లాల్ గులాబ్" అనే క్యాప్షన్‌తో గ్లామరస్ రెడ్ గౌనులో క్లాసిక్ లుక్‌లో దర్శనిమిచ్చింది. ఏకవర్ణ థీమ్‌తో,మ్యాచింగ్ రెడ్ హీల్స్‌ను జోడించింది. దీంతో అభిమానులు లోలెడన్ని లైక్‌లు , కామెంట్లతో స్పందించారు. కాగా నిమ్రత్‌తో ప్రేమాయణం కారణంగానే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోవడం ఖాయమన్న పుకార్లు జోరుగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nimrat Kaur (@nimratofficial) ఇదీ చదవండి: ఫ్యాషన్ ప్రపంచాన్నే ఊపేస్తున్న పేదింటి అమ్మాయిలు -
సమంత కిల్లింగ్ లుక్స్.. ఘాటు పోజులిస్తూ ఆ హీరోతో ఫొటోషూట్ (ఫొటోలు)
-
‘‘నా ఆధార్, నా ఫోటో..’’ క్యూట్ బేబీ ఫోజులు వైరల్ వీడియో
భారత దేశంలో అపుడే పుట్టిన శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.సాధారణంగా ఆధార్ కార్డులో ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు. ఇలాంటి ఫోటోలపై చాలా జోక్స్ వినే వింటాం. ఈ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్ గౌన్‌లో చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా క్యూట్ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. < View this post on Instagram A post shared by BabyNaysha (@gungun_and_mom) బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది. దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి గున్‌గున్ అండ్ మామ్అనే ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది. అంతే ఇది వైరల్ అయిపోయింది.‘పార్లే జీ గర్ల్’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్ ఫోటో అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే ఒక యూజర్ కమెంట్ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. -
Tamannaah Bhatia: బార్బీ బొమ్మలా మెరిసిపోతున్న తమన్నా!
-
దిమ్మతిరిగే ఫొటోస్ వదిలిన హీరోయిన్ సమంత (ఫొటోలు)
-
రష్మిక స్టయిలిష్ లుక్..ఎవరికోసం అంత ప్రేమ?
సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్ సక్సెస్ జోష్‌లో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ స్టైలింగ్‌లో కూడా తన ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ మూమెంట్స్, స్టయిలిష్ పిక్స్‌తో ఎపుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక తాజాగా లవ్లీ ఫోటోలతో సందడి చేస్తోంది. తనదైన స్టయిల్లో, నార్మల్ లుక్ దుస్తులతో రష్మిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆమె తన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఫ్యాన్స్ మాత్రం ఎవరికోసం అంత ప్రేమ అంటున్నారు. లైట్ బ్లూకలర్ ఫుల్-స్లీవ్ బ్లేజర్, స్ట్రెయిట్-ఫిట్ టైలర్డ్ ప్యాంట్‌తో చేసిన ఫోటో షూట్‌తో పాటు, చెవులకు ధరించిన వెండి ఇయర్‌కఫ్‌లు, లవ్ సింబల్స్ మరింత ఎట్రాక్టివ్‌గా మారాయి. అంతకుముందు, ముదురు ఎరుపు రంగు ప్యాంట్సూట్లోనూ, ఇటీవల రెడ్ చీరలోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ami Patel (@stylebyami) -
బేబీ బంప్‌తో అమలాపాల్.. భర్తతో హ్యాపీ మూమెంట్స్ (ఫోటోలు)
-
నది మధ్యలో ఫోటోషూట్: అనుకోని అతిథిని చూసి భయంతో యువతి..
ఈరోజుల్లో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్‌ని గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. కళ్లు చెదిరే లొకేషన్లలో అద్భుతమైన సెట్టింగులతో, ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేనకడుగు వేయడం లేదు. సినిమా స్టైల్‌ను తలపించే లైటింగ్స్, ఎఫెక్ట్స్, రిచ్‌నెస్‌తో ఫోటోషూట్స్ పెట్టుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. తమ క్రియేటివిటీకి పదును పెట్టి ఢిపరెంట్ స్టైల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు అందరి దృష్టని ఆకర్షిస్తున్నాయి. రీసెంట్గా ఓ జంట తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ నదిలో కాబోయే జంట అందంగా ఫోటోలకు ఫోజులిస్తుండగా పాము అనుకోని అతిథిలా ఫ్రేమ్‌లోకి వచ్చింది. దీంతో యువతి భయపడి కేకలు వేయగా, ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పాడు. కాసేపట్లోనే ఆ పాము అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం తతంగాన్ని ఫోటోగ్రాఫర్ కెమెరాలో బంధించాడు. వైల్డ్ ఫోటోషూట్ అంటూ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఇప్పటికే 53 లక్షల మంది ఆ వీడియోను చూశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. పాము ఒంటిపై నుంచి వెళ్లినా అదరకుండా, బెదరకుండా చాలా చిల్ మూడ్‌లో ఉన్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పామును చూసి ఆ అమ్మాయి భయపడినప్పుడు ఆమె కాబోయే భర్త ధైర్యం చెప్పిన విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅟🅐🅡🅢🅗🅤 🅚🅞🅣🅐🅜🅔 🅟🅗🅞🅣🅞🅖🅡🅐🅟🅗🅨 (@parshu_kotame_photography150) -
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్‌పై అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
Janhvi Kapoor Latest Photos: జాన్వీ కపూర్ అందాల వయ్యారాలు..చూస్తే మైండ్ బ్లాకే! (ఫోటోలు)
-
Shakeela: ఒకప్పుడు గ్లామర్ డాల్.. ఇప్పుడు ట్రెడిషనల్ అవతార్ (ఫోటోలు)
-
గ్లామర్‌తో మెరిసిపోతున్న తెలుగు అందం స్రవంతి చొక్కారపు (ఫొటోలు)
-
మురికి కాలువలో రొమాంటిక్ ఫోటోషూట్.!
-
నటి నగ్న ఫోటోలు.. ఫ్రెండ్ చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
సినిమా ఫీల్డ్ అంటేనే గ్లామర్‌తో నిండిన ప్రపంచం. అవకాశాలు రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ కూడా అలానే ఉంటోంది. కాస్త గ్లామర్ ఒలకబోస్తేనే చూసేవారు కష్టమైపోయారు. అలాంటి ఈ ఫీల్డ్‌లో నగ్న ఫోటో షూట్లకు సైతం నటీమణులు వెనుకకాడడం లేదు. అలానే గతంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్న ఓ నటి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆమె ఫ్రెండ్ చేసిన పనికి ఎమోషనలైంది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్లో షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో పని మనిషిగా నటించిన మరాఠీ నటి వనితా ఖరత్. ఆమె చేసిన నగ్న ఫోటోషూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె చేసిన పనికి పలువురు విమర్శించారు కూడా. అయితే తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది. ఇదే ఫోటోలను చూసిన ఆమె ఫ్రెండ్ చాలా అసభ్యంగా ప్రవర్తించాడట. ఆమె ఫోటోలను తన గదిలో గోడకు తగిలించుకుంటానని అడిగాడట. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయినట్లు వెల్లడించింది. నగ్న ఫోటో షూట్ కోసం ఎలాంటి స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తనకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటే ఇష్టమని.. ఆయనతో కలిసి పని చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు మనసులో మాట బయటపెట్టింది. View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) View this post on Instagram A post shared by Vanita Kharat (@vanitakharat19) -
ఇంటర్నెట్‌ని షేక్‌చేస్తున్న విద్యాబాలన్ బోల్డ్ ఫోటోషూట్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెండ్ సినిమాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె బోల్డ్ ఫోటోషూట్ ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ కోసం విద్యాబాలన్ సెమీ న్యూడ్‌గా ఫోటోలకు ఫోజులిచ్చింది. కేవలం న్యూస్ పేపర్‌ను అడ్డుపెట్టుకొని కూర్చీలో కూర్చొని ఒక చేతిలో న్యూస్ పేపర్.. మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని రొమాంటిక్ స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం విద్యాబాలన్ దిగిన ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 40ఏళ్ల వయసులో ఇలాంటివి అవసరమా అంటూ విద్యాబాలన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇది మరో డర్టీ పిక్చర్‌లా ఉందంటూ తిట్టిపోస్తున్నారు. మరోవైపు ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీని కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. హీరోయిన్లను ఇలా నగ్నంగా చూపించడంలో క్రియేటివిటీ ఏముంది అంటూ అతడ్ని కూడా ఏకిపారేస్తున్నారు. View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
సింగర్ గీతా మాధురి ఫోటో షూట్
-
ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంట్రీ?
దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ వార్త నిజం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత హీరో ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నారని సమాచారం. గత వారం జాన్వీ హైదరాబాద్ వచ్చారని తెలిసింది. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్‌లో పాల్గొనడానికే భాగ్యనగరంలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టారట. ఇక ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా నటించడం కోసం ఓ బాలీవుడ్ మూవీని కూడా జాన్వీ వదులుకున్నారని టాక్. సో... జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే అని ఊహించవచ్చు. ఈ నెల 24న ఎన్టీఆర్ సినిమా ప్రారంభం కానుందట. మరి ఆ రోజు హీరోయిన్ని ప్రకటిస్తారేమో చూడాలి. -
హీరో గోపీచంద్ చిన్నకొడుకును చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నాడో..
మ్యాచో హీరో గోపీచంద్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరన్న సంగతి తెలిసిందే. సినిమాలు తప్ప ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించారు. ఫోటోలకు ఫోజులిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వియన్ క్యూట్ లుక్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
దీపికా పదుకొనె ఫోటోషూట్‌పై రణ్వీర్ సింగ్ కామెంట్
హీరోయిన్ దీపిక పదుకొనె తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకంది. స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. ఇక దీపికా ఫ్యాషన్ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్‌తో మెస్మరైజ్ చేసే దీపిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోషూట్‌ని షేర్ చేసింది. లూయిస్ విటాన్ బ్రాండ్‌కు చెందిన అవుట్‌ఫిట్‌లో ఫిదా చేసింది. ఈ ఫోటోపై ఆమె భర్త రణ్వీర్ సింగ్ హార్ట్ ఎమోజీ షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. కాగా కొంతకాలంగా రణ్వీర్-దీపికల మధ్య విబేధాలు తలెత్తాయంటూ పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీపిక పోస్టుకు రణ్వీర్ కామెంట్ చేయడంతో అలాంటి రూమర్స్‌లో నిజం లేదంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక దీపిక ఫోటోషూట్ చూసి ఆలియాభట్ సహా పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్స్.. ఫోటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలె ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు త్వరలోనే గాడ్ ఫాదర్ సినిమాతో అలరించనున్నారు. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే చిరంజీవి లేటెస్ట్గా ఫోటోషూట్‌లో సందడి చేశారు. ఇందులో భాగంగా పలు కాస్ట్యూమ్స్ ధరించి కెమెరాకి ఫోజులిచ్చారు. యమ స్టైలిష్ట్‌గా కనిపిస్తున్న చిరు తన లుక్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. -
అందుకే రణ్వీర్ నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేశాడేమో: ఆర్జీవీ
ఓ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేయించుకున్నాడు. ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయింది. దీనిని కొంతమంది సమర్థిస్తుంటే..మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ముంబైలో రణ్‌వీర్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. ఇలాంటి తరుణంలో రణ్‌వీర్‌గా మద్దతుగా నిలిచాడు సంచనల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లింగ సమానత్వానికి న్యాయం చేయడం కోసమే రణ్వీర్ ఇలా ఫోటో షూట్ చేసి ఉండోచ్చని అభిప్రాయపడ్డాడు. (చదవండి: పవన్‌తో సినిమాకి భయపడుతున్న దర్శకులు...కారణం?) మహిళలు తమ శరీరాన్ని ప్రదర్శించగా లేనిది.. పురుషులు ఎందుకు అలా చూపించొద్దని ప్రశ్నించాడు. మహిళలతో సమానంగా మగవారికీ హక్కులు ఉన్నాయని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా.. మగవాళ్లు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి అమ్మాయిలు ఎక్కువ ఆనందం పొందుతారనేది నిజమా? కాదా? అంటూ ఓ పోల్ క్వశ్చన్ కూడా పెట్టాడు. I personally applaud and I am also thrilled to see the majority applauding @RanveerOfficial ‘s new age boldness💪💪💪 ..and I hope that the same majority will applaud a woman as much if she does the same ..There has to be a GENDER EQUALITY 💐💐💐 pic.twitter.com/9kVGMrYro1 — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 In the context of the new age nude pics of @RanveerOfficial ,here’s a question…Do women enjoy watching a man’s nude pics as much as men enjoy watching a woman’s nude pics? — Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022 -
పచ్చని ఆకులే డ్రెస్‌గా.. అదాశర్మ రచ్చ.. ఫోటోలు వైరల్
‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. ఆ తర్వాత అడపదడప సినిమాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మకి యమ క్రేజీ ఉంది. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఆకులతో డిజైన్ చేసిన గౌను ధరించి ఫోటోషూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ.. ‘‘ప్రకృతి చాలా గొప్పది. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనిస్తుంది. అన్ని జీవరాసులను స్వీకరించే శక్తి మానవులకే ఇచ్చింది’’ అని రాసుకొచ్చారు. అదా షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
ఫొటోషూట్‌లో లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే
ఈ పదాలను సినిమా షూటింగ్లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్ షాట్స్‌తో సినిమా షూటింగ్‌ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఫొటోషూట్‌ను సినిమా షూటింగ్ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్‌ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్‌లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్ షాట్స్, క్రేన్ షాట్స్‌తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్వేరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాన్డెట్ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. జవహర్‌నగర్‌లో 200 స్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్లు రావడంతో పాటు మార్కెట్ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్‌నగర్ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఉన్నాయి. తక్కువ ఖర్చులోనే.. తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్ షాట్స్ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. – శ్రీకాంత్‌యాదవ్, జవహర్‌నగర్ ఎంతో మందికి ఉపాధి.. ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. – సంపత్, అంబేడ్కర్‌నగర్ -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్‌నైట్ సెన్సేషన్స్‌కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
Keerthy Suresh: వెరైటీ చీరకట్టులో కీర్తిసురేష్ ఫోటోషూట్
Keerthy Suresh Latest Photo Shoot Goes Viral:ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా క్రేజ్ సందించుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడపుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన లేటెస్ట్ అప్డేట్స్తో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెరైటీ చీరకట్టులో కీర్తి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’.నేడు(డిసెంబర్2)న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె తొలిసారిగా మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. -
‘అదేమన్నా పిక్నిక్ స్పాటా’.. మోడల్‌పై ప్రధానికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్ గురుద్వారా దర్బార్ సాహిబ్ వద్ద ఫోటోషూట్ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్ మోడల్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్ కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్ చేసింది. దీనిలో నటించిన మోడల్ తలపై వస్త్రం ధరించకుండా షూట్లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సదరు కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్‌పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్ షూట్ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు. (చదవండి: కుక్క హెయిర్ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!) ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్ నేత (ఎస్ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మినిస్టర్ పవాద్ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు) వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఫోటో షూట్ చేసింది తాము కాదని.. థర్డ్ కంపెనీ వారు తమ మన్నత్ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్ షూట్ చేశారని’’ తెలిపారు. The Designer and the model must apologise to Sikh Community #KartarPurSahib is a religious symbol and not a Film set….. https://t.co/JTkOyveXvn — Ch Fawad Hussain (@fawadchaudhry) November 29, 2021 చదవండి: మోడల్ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి -
వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్‌షూట్.. కొంచెం బొద్దుగా ఉండటంతో..
ఈ మధ్య కాలంలో ఫంక్షన్ ఏదైనా ఫోటో షూట్లు మాత్రం పక్కా ఉండాల్సిందే. బర్త్‌డే అయినా, పెళ్లి అయినా చిరకాలం గుర్తుండి పోవాలంటే ఫోటో షూట్ తప్పనిసరి. ఇక పెళ్లి ముందే అయితే వెడ్డింగ్ షూట్ల శర మామూలు అయిపోయాయి. లక్షలు ధారపోసి మరీ ప్రదేశాలకు వెళ్లి మరీ వీడియోలు, ఫోటోలు తీయించుకుంటున్నారు. అచ్చం ఓ ఇలాగే ఓ యువతి ఫోటో షూట్ ప్లాన్ చేసింది. ఇది తన జీవితంలో ఎప్పటికీ మధురానుభూతిగా మిగిలిపోవాలనుకుని నది దగ్గర ఫోటో షూట్ ఏర్పాటు చేసింది. కెమెరామెన్, అసిస్టెంట్, మెకప్‌మెన్.. ఇలా అందరూ రెడీగా ఉన్నారు. చదవండి: వీడియో వైరల్: ప్రియుడితో పారిపోయిందని.. సీరా పూసి.. గుండు కొట్టించి యువతి కూడా అందమైన గులాబి రంగు గౌనులో మరింత అందంగా ముస్తాబు అయ్యింది. నది ఒడ్డున కొన్ని అడుగుల లోతు నీటిపై క్రేన్ సాయంతో అమర్చిన సన్నని ఊయల మీద కూర్చొని ఫోటోషూట్‌కు ఫోజిచ్చింది. పక్క నుంచి ఓ వ్యక్తి యువతి గౌనులో గాలో ఎగిరేలా ప్రయత్నిస్తున్నాడు.. అయితే యువతి కొంచెం బొద్దుగా ఉండటం, బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా ఊయల మీద నుంచి జారీ అమాంతం నీళ్లలో పడిపపోయింది. చదవండి: ఫెయిల్ అవ్వడం ఎలా ?: ఫన్నీ వైరల్ వీడియో అనంతరం నీటి నుంచి బయటకు వచ్చిన యువతి, అక్కడి వారంతా జరిగింది తలుచుకొని పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో నెటిజన్లు తెగ నవ్వుకకుంటున్నారు. అయితే ‘ రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తలు పాటించకుంటే ఇలాంటి మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలా ఇంకొంచెం కావాలా’అఅంటూ పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by punjabi industry (@punjabi_industry__) -
చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?
ఇటలీ: గతంలో వేషధారణకు ఒక ప్రత్యేకతే ఉండేది. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఇప్పటి వరకు మగవాళ్లు వేసుకునే బట్టలను ఆడవాళ్లు వేసుకున్నారు. కానీ ఆడవాళ్లు ధరించే వాటిని మగవాళ్లు ఎప్పుడూ వేసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్ల వేషధారణను మగవాళ్లు ధరించటం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే హ్యారీ స్టైల్స్, రణవీర్ సింగ్ మరియు కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ వంటి స్టార్లు సైతం ఈ ఫ్యాషన్ ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చారు గానీ ఆచరణ సాధ్యం కాలేదు. (చదవండి: హృదయాన్ని కదిలించే "స్వీట్ రిక్వస్ట్") అయితే ఈ ఫ్యాషన్‌ని ఆండ్రోజినస్ ఫ్యాషన్‌గా పిలుస్తారు. అంతేకాదు కొల్‌కతాకు చెందిన వ్యక్తి ఈ ఫ్యాషన్ అనుకరించేలా ఇంటర్నెట్లో ఒక విప్లవాన్ని తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురుచేస్తున్నారు. ఏంటి ఇందంతా అని అనుకోకండి. అసలు విషయం ఏంటంటే కోల్‌కతాకు చెందిన పుష్పక్ సేన్ ఎరుపు రంగు చీర, నలుపు కళ్ల జోడు ధరించి పాతకాలంలో మాదిరిగా కూడా ఒక గొడుగు వెంట తెచుకుని ఫ్యాషన్ రాజధానులుగా పేరుగాంచిన వీధులో తిరుగుతాడు. అయితే ఈ విధంగా సేన్ ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ హబ్‌లలో ఒకటైన మిలన్ వీధుల్లో ఫోటోషూట్లకి ఫోజు ఇస్తాడు. అంతేకాదు సేన్ ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థి కావడం విశేషం. ఈ మేరకు సేన్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలతో పాటుగా "చీరలో ఉన్న మనిషిని ఎవరు తమతో పాటు తీసుకువెళ్లరు. ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ రాజధానులలో ఒకటైన వీధుల్లో ఎవరు నడుస్తున్నారో ఊహించండి?" అంటూ క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిన్లు సేన్‌ని ఎంత అద్భతంగా కనిపిస్తున్నాడో అంటూ తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) -
మృత వలయం చుట్టూ నగ్నప్రదర్శన
Spencer Tunick Dead Sea Naked Photo Shoot Viral: వందల మంది. ఆడా మగా తేడా లేకుండా అంతా నగ్నంగా మారిపోయారు. ఒంటిపై నూలు పోగు లేకుండా కేవలం వైట్ పెయింట్‌తో ఎక్కడి నుంచో వస్తున్న ఆదేశాల్ని పాటిస్తూ.. ముందుకు నడుస్తున్నారు. ఆ ఆదేశాలు ఇస్తున్న వ్యక్తి పేరు స్పెన్సర్ ట్యూనిక్. అమెరికన్ ఫొటోగ్రఫీ ఆర్టిస్ట్ అయిన ట్యూనిక్ పేరు, ఆ ఫొటోలు గత రెండోరోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తోంది. అయితే అలా వాళ్లతో నగ్న ప్రదర్శన చేయించడానికి ఓ ప్రత్యేకమైన కారణం అంటూ ఉంది కూడా.. ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌బ్యాంక్ మధ్యనున్న డెడ్‌సీ(మృత సముద్రం) ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. గత రెండు దశాబ్దాల్లో 30 శాతం ఎండిపోయిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అట్లాస్) తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా డెడ్‌సీ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాలనే స్పెన్సర్ ట్యూనిక్ అలా 200 మందితో నగ్నంగా ఫొటోషూట్ చేయించాడు. అఫ్కోర్స్.. ఈ ఫొటోషూట్‌పై ఇజ్రాయెల్‌లో పెద్ద ఎత్తున్న అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా. కానీ, ఆయనకు వివాదాలు-విమర్శలు కొత్తేం కాదు. 1992 నుంచి కెమెరా పట్టిన ట్యూనిక్.. పర్యావరణహితం కోసం ఎంతదాకా అయినా తెగిస్తూ వస్తున్నాడు. నగ్నత్వాన్ని.. దానికి ఓ మంచి పనికోసం ఉపయోగించడాన్ని గౌరవంగా భావిస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన్ని బహిష్కరించాలనే పిలుపు కూడా చట్టసభ్యుల నుంచి వినిపిస్తోంది. డెడ్‌సీ గురించి.. భూగోళంపై అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఉంది డెడ్‌సీ. డెడ్‌సీ అంటే ఓ సరస్సు. ఈ సరస్సు నీటిలో 34 శాతం ఉప్పు ఉండటం వల్ల ఇందులో మనుషులు మునగరు.. తేలుతారు. మామూలు సముద్రాల్లో ఉండే ఉప్పుకన్నా 9.6 శాతం ఈ నీటిలో ఎక్కువ. ఈ నీటిని నోట్లో పోసుకుంటే ఉప్పులాగా కాకుండా విషంలా ఉంటుంది. ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌సీ అని పేరు వచ్చింది. అయితే ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ పోతాయన్నది వారి నమ్మకం. ఒడ్డున బురదను ఒంటికి రాసుకుని మర్దనా చేసుకుంటారు. డెడ్‌సీ చేసే బిజినెస్ కూడా భారీగానే ఉంటోంది. కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది. సమస్య ఏంటంటే.. ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాల మూకుమ్మడి చేష్టల వల్లే డెడ్‌సీకి ఈ పరిస్థితి ఎదురైంది. ముఖ్యంగా ఈ సరస్సు తరిగిపోవడానికి ప్రధాన బాధ్యత జోర్డాన్ దేశానిదని చెప్పొచ్చు. డెడ్‌సీ సరస్సుకు నీరు వచ్చి చేరేది ఎక్కువగా జోర్డాన్ రివర్ నుంచే!. అయితే కొన్నేళ్ల క్రితం ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాల కోసం జోర్డాన్ నది నుంచి పైప్‌లైన్ వేసి నీటిని మళ్లించడం వల్ల ఆ నది నుంచి డెడ్‌సీకి నీరొచ్చే మార్గం నిలిచిపోయింది. దానికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే వేడి, పొడి వాతావరణం కూడా నీరు ఎక్కువగా ఆవిరై పోవడానికి కారణం అవుతోంది. దీన్ని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్ దేశాల మధ్య 1994లోనే 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు పనులు ఎంతదూరం వచ్చి ఆగిపోయాయో ప్రపంచ దేశాలకు తెలియదు. ఇక పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య జగడం కూడా మృత సముద్రం.. మృత్యువు ఒడిలోకి జారడానికి మరో కారణంగా చెప్పొచ్చు. చదవండి: అవాక్కయేలా చేద్దాం అనుకుంటే.. అదిరిపోయే ట్విస్ట్! -
హాలో మ్యాగజైన్ కోసం తన ‘సూపర్ ఉమెన్’తో సూపర్ స్టార్ ఫొటోలు వైరల్
-
స్టైలిష్ లుక్‌లో మహేశ్-నమ్రతల జంట, వైరల్ అవుతున్న మ్యాగజైన్ ఫొటో
టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్లు జంటగా మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల క్రితం ‘వంశీ’ సినిమాలో అలరించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయిదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేశ్-నమ్రతలు 2005లో పెళ్లి చేసుకుని వైవాహికి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నమ్రత పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి ఇంటి వ్యవహరాలతో పాటు మహేశ్‌కు సంబంధించిన సినిమా వ్యవహరాలను చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ జంటకు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేని ఉన్నారు. చదవండి: Republic Review:‘రిపబ్లిక్’మూవీ రివ్యూ ఎంతోకాలంగా తెర వెనక ఉంటూ సినిమాల పరంగా మహేశ్ సక్సెస్‌లో భాగమవుతున్న నమత్ర మరోసారి భర్తతో కలిసి ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చింది. అయితే ఇది ఏ సినిమా కోసమో కాదు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫొటోలకు ఫొజులు ఇచ్చారు ఈ లవ్వింగ్ కపుల్. నమ్రత వైట్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో ఫార్మల్ లుక్‌తో ఉండగా మహేశ్ బ్రెజర్ షూట్‌తో హాలో అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిద్దరూ జంటగా ఫొజులు ఇచ్చారు. చదవండి: ‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్ ఈ ఫొటోలో మహేశ్-నమత్రలు నెటిజన్లకు కనులవిందు కలిగించారు. ఇన్నాళ్లకు మరోసారి కెమెరా ముందు వీరిని జంటగా చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇటీవల నమత్ర మహేశ్, పిల్లలతో కలిసి ఓ యాడ్ షూట్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహేశ్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి ఆమె నటించారు. కాగా ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. చదవండి: నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల -
‘ఎన్నిసార్లు ఇలా దర్శనమిస్తావు కియారా’.. అది టాప్‌లెస్ ఫొటో కాదు!
Dabboo Ratnani Reaction On Kiara Advani Photoshoot: కంటికి కనిపించేదంతా నిజం కాదంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రతాని. చూసే విధానం మీదే అంతా ఆధారపడి ఉంటుందని, మన కళ్లే మనల్ని మోసం చేస్తాయంటున్నాడు. తన క్యాలెండర్ ఫోటోషూట్ కోసం ఎంతో మంది టాప్ హీరోయిన్లు, సెలబ్రిటీలను డబూ రతాని కెమెరా కంటిలో బంధిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ కియారా అద్వానీతో ఇప్పటికే మూడుసార్లు ఫొటోషూట్ నిర్వహించాడు. ఎటువంటి ఆచ్చాదన లేకుండా ఆకు చాటున కియారా నిల్చున్న ఫొటోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఇక మూడు నెలల క్రితం.. ఈ బాలీవుడ్ బ్యూటీ మరోసారి డబూ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) ‘‘ఎన్నిసార్లు ఇలా టాప్‌లెస్‌గా ఫోజులిస్తావు’’ అంటూ ఘాటు కామెంట్లు చేశారు. బీచ్ ఒడ్డున కియారా నగ్నంగా ఉన్నట్లు ఫొటో కనిపించడమే ఇందుకు కారణం. అయితే, ఇదంతా తన పనితనమే తప్ప.. అందులో నిజం లేదంటున్నాడు డబూ రతాని. ట్రోల్స్ గురించి తాజాగా స్పందిస్తూ.. ‘‘అవును.. చాలా నెగటివ్ కామెంట్లు చదివాను. అయితే, ఈసారి తను టాప్‌లెస్‌గా షూట్ చేయలేదు. చాలా మంది అది న్యూడ్ షూట్ అని ఊహించుకున్నారు. నిజానికి అదంతా కెమెరా మ్యాజిక్. అదొక బ్లాక్ అండ్ వైట్ ఫొటో’’ అంటూ డబూ రతాని కౌంటర్ ఇచ్చాడు. చదవండి: నా దగ్గర బికినీ ఉన్న విషయం నాకే తెలియదే: నటి View this post on Instagram A post shared by Dabboo Ratnani (@dabbooratnani) -
అద్భుత ఫోటో షూట్..విషయం తెలిస్తే కన్నీళ్లొస్తాయ్!
సాక్షి, న్యూఢిల్లీ: మరికొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన భార్య అర్థాంతరంగా ఈ లోకాన్ని వీడితే.. ఆ బాధ చెప్పడానికి మాటలుండవు. కానీ భార్యకు నివాళిగా ఆమె జ్ఞాపకాలతో జేమ్స్ అల్వారెజ్ షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో సంచలనంగా మారాయి. సంవత్సరం క్రితం గర్భంతో ఉన్న భార్యతో కలిసి మెటర్నిటీ షూట్ చేసుకున్న ప్రదేశంలోనే తన ఏడాది పాపతో ఫోటోషూట్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పుట్టెడు దుఃఖంలో.. ఒకింత సంతోషం.. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్న ఈ ఫోటోలు కంట తడి పెట్టించక మానవు. వివరాలను పరిశీలిస్తే జేమ్స్ అల్వారెజ్, యెసేనియా అగిలార్ భార్యాభర్తలు. యెసేనియా గర్భం దాల్చింది. మరికొన్ని రోజుల్లో పుట్టబోయే బిడ్డకోసం కలలు కంటున్న తరుణంలో ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. వాకింగ్ కోసం వెళ్లిన నిండు గర్భిణి యెసేనియాను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది. అత్యవసర సిజేరియన్ చేసిన వైద్యులు గర్భంలోని ఆడ శిశువును కాపాడగలిగారు. ఆ పాపే అడలిన్. అయితే తమ కలల కంట మొదటి పుట్టిన రోజు సందర్భంగా జేమ్స్ తన భార్యకు నివాళిగా ఫోటో షూట్ చేశారు. మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకున్న ప్రదేశంలోనే, తల్లి ధరించినట్లుగా పింక్ దుస్తుల్లో, చిన్నారితో కలిసి అదే ఫోజులతో ఫోటోలో తీయించుకున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చదవండి : హర్ష్ గోయెంకా ఫన్నీ వీడియో, లక్కీ ఫెలో అంటున్న నెటిజన్లు ‘‘అడలిన్, మీ మమ్మీ ఇపుడు ఉండి ఉంటే చాలా సంతోషించేది. నీ మొదటి పుట్టినరోజు వేడుకకు ఎంతో సంబరపడేది’’ అంటూ జేమ్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గులాబీ రంగు దుస్తుల్లో.. ఇక్కడే మెటర్నటీ షూట్ చేసుకున్నాం.. మళ్లీ అదే ప్లేస్‌లో.. తను లేకపోయినా.. అచ్చం అలాగే చేయడానికి ప్రయత్నించాం. నిజంగా అద్భుతంగా ఉన్నాయంటూ జేమ్స్ తన భార్యను గుర్తు చేసుకున్నారు. అడలిన్కు ఉత్తమ తండ్రిగా ఉండటానికి ప్రయత్నిస్తాననీ, తన భార్య గర్వపడేలా చేయాలనుకుంటున్నానని తెలిపారు. పింక్ దుస్తుల్లో ముద్దులొలికే చిన్నారి అద్భుత ఫోటోలు అందరినీ కదిలిస్తున్నాయి. స్వీట్ అడలిన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్వర్గంలో ఉన్న మీ భార్య తప్పకుండా ప్రౌడ్‌గా ఫీలవు తుందంటూ జేమ్స్‌కు నెటిజన్లు అభినందనలు తెలిపారు. చదవండి : Mirabai Chanu: ట్రెడిషనల్ ఔట్ఫిట్, ట్వీట్ వైరల్ View this post on Instagram A post shared by James Alvarez (@__jamesalvarez) -
మెడల్ గెలిస్తే మరో బంపర్ ఆఫర్..
టోక్యో: ఒలింపిక్స్‌లో పతకం సాధించే అథ్లెట్లకు నిర్వహకులు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. పతకం గెలిచాక అథ్లెట్లు పోడియంపై నిల్చున్న సమయంలో ఫొటోలకు పోజులివ్వడానికి 30 సెకన్ల పాటు మాస్కులు తీసివేసే అవకాశం కల్పించారు. అయితే ఈ అవకాశాన్ని అథ్లెట్లు దుర్వినియోగం చేయొద్దని నిర్వాహకులు కోరారు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సోమవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. కాగా, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అథ్లెట్లు బరిలో ఉన్నప్పుడు మినహా అన్ని సమయాల్లో మాస్కులు ధరించే ఉండాలని నిబంధనలు జారీ చేశారు. అయితే మాస్కుల విషయంలో తాజాగా లభించిన వెసులుబాటుకు అథ్లెట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒలింపిక్ గ్రామంలో అథ్లెట్లకు రోజూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. -
‘అంతా మోసం’.. చైనా పరువుపాయే!
‘గ్జియాపు కౌంటీ.. ఫూజియన్ ప్రావిన్స్‌లోనే సుందరమైన ప్రదేశం. చిన్న ఊరే అయినప్పటికీ ఆహ్లాదానికి కలిగించే అందాలు ఆ ఊరి సొంతమ’ని చాటింపు వేయించుకుంది చైనా ప్రభుత్వం. ఆ ఫొటోలు చూసి అక్కడికి వెళ్తున్న టూరిస్టులకు.. తీరా అలాంటి అందాలేవీ తారసపడకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అయితే అక్కడి యవ్వారమంతా ఉత్తదేనని ఆధారాలతో సహా బయటపెట్టారు కొందరు నెటిజన్స్. అదీ చైనావాళ్లే కావడం విశేషం. బీజింగ్: ఒడ్డు నుంచి చూస్తే సుందరంగా కనిపించే దృశ్యాల నడుమ చేపలు పట్టే జాలర్లు, పచ్చదనం మధ్య పశువుల మందలు, పొగమంచులో పక్షుల సందడి, అమాయకపు రైతులు.. వెరసి చైనాలోని రూరల్ టౌన్ గ్జియాపు కౌంటీని సుందర ప్రాంతంగా ప్రకటించుకుంది చైనా టూరిజం శాఖ. అంతేకాదు ఫారిన్ టూరిస్టులకు స్పెషల్ ప్యాకేజీలతో రాయితీలు కూడా ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు వెబో(చైనా వెర్షన్ ట్విటర్) యాప్‌లలో కూడా ఆ ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఆ యవ్వారం పైన పటారం.. లోన లొటారం అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఫేక్ ఫొటో షూట్‌తో తీసిన ఆ ఫొటోల గుట్టును అక్కడి యువతే సోషల్ మీడియాలో లీక్ చేసింది. అంతేకాదు అందులో ఉంది నిజం రైతులు, కూలీలు కాదని, వాళ్లు మోడల్స్ అని, ఒక్కొక్కరికి 30 డాలర్ల చొప్పున చెల్లించారని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం కూడా ప్రచురించింది. కరోనాతో ఆర్థికంగా దిగజారిని ఆ ఊరిని.. టూరిస్ట్ ఆదాయం ద్వారా తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా ప్రమోట్ చేసుకుందని ఆ కథనం వెల్లడించింది. అయినప్పటికీ మోసంతో ఆదాయం రాబట్టడం.. దేశం పరువు తీసే అంశమని అక్కడి యువత భావించింది. అందుకే ఆ షూట్ ఫొటోల్ని బయటపెట్టింది. -
నగ్నంగా దర్శనమిచ్చి షాకిచ్చిన స్టార్ హీరోయిన్
Kiara Advani : కాలంతో పాటు సినీ తారల నిర్ణయాల్లోనూ మార్పులు వచ్చాయి. పాత్ర డిమాండ్ చేయాలే కానీ నగ్నంగా నటించేందుకు సై అంటున్నారు. సినిమాల్లో కాదు ఫోటో షూట్లో కూడా నగ్నంగా కనిపించి షాకిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకు అయితే న్యూడ్‌గా, సెమీ న్యూడ్‌గా కెమెరా ముందుకు రావడానికి కామన్ అయిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ నగ్నంగా దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. బాలీవుడ్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ తన క్యాలెండర్ ఫోటో షూట్ కోసం టాప్ మోస్ట్ హీరోయిన్లను తన కెమెరాలో బంధిస్తుంటాడు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని కొన్ని ఫొటోస్ తీశాడు. ఇందులో ఆమె నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా బీచ్ ఒడ్డున న్యూడ్ లుక్‌లో పోజిచ్చింది కియారా. ఈ ఫోటోని తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. అయితే నగ్నంగా కనిపించడం కియరాకి కొత్తేమి కాదు. గతంలో కూడా ఇదే డబూ రత్నానీ ఫొటో షూట్ కోసం టాప్ లెస్ గా పోజులిచ్చింది. కేవలం ఓ ఆకును అడ్డంగా పెట్టుకొని, కియరా అప్పట్లో ఇచ్చిన పోజులు తెగ వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) -
జంగిల్ సఫారీలో కృతి
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంగిల్ సఫారీలో షికారు చేస్తోంది. వైల్డ్ అనిమల్స్తో కలిసి డిజైనర్ వేర్స్‌లో స్పెషల్ ఫోటో షూట్ జరిపింది. తెలుగులో మహేశ్ సరసన నంబర్ 1 నేనొక్కడే సినిమాలో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్షయ్ కుమార్‌తో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కృతి. అంతకు ముందు బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో బాక్సాఫీస్ హిట్లు అందుకుంది కృతి. క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన హీరోయిన్గా ఎంపికైంది కృతి. -
ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్ ఫోటో షూట్.. వీడియో వైరల్
Angelina Jolie: హీరోయిన్లు ఫోటో షూట్లో పాల్గొనడం సర్వసాధారణం. అందుకోసం గ్లామర్ షో చేయడం కూడా కొత్తేమి కాదు. పోటీ ప్రపంచంలో తోటి హీరోయిన్లను తట్టుకొని సీనీ ఇంటస్ట్రీలో ముందుకు సాగాలంటే అప్పుడప్పుడు వెరైటీ ఫోటో షూట్లు చేయడం తప్పనిసరి. అందుకే నేటితరం నటీమణులు ఫోటో షూట్లపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ట్రెండ్‌కి తగ్గటు డ్రెస్సింగ్ స్టైల్‌ని మారుస్తూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతూ.. సినీ అవకాశాలు చేజిక్కుంచుకుంటున్నారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన ఫోటో షూట్ చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటో షూట్ ఇలా కూడా చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ నటి నటి ఏంజెలీనా జోలి ఒంటి నిండా తేనెటీగలతో ఫోటో షూట్లో పాల్గొంది. దాదాపు 18 నిమిషాల పాటు తేనెటీగలను తన శరీరంపై ఉంచుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? అవి కుడితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సందేహాలపై ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ క్లారిటీ ఇచ్చాడు. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ సహకారంతో ఈ ఫోటో షూట్ చేశామని తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న సిబ్బంది రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు. అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధం.. చీకటిగా ఉండేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ‘ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుంచి అనుమతి తెచ్చుకున్నాము. ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసింది’ అంటూ డాన్ వింటర్స్ చెప్పుకొచ్చాడు. View this post on Instagram A post shared by Dan Winters (@danwintersphoto) -
రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా..
యాంకర్ అనసూయ భరద్వాజ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటూ బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే.. అటూ వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. కాగా అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా యాక్టివ్ ఉంటోంది. అంతేగాక నిత్యం ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లకు కనులవిందు అందించే ఈ భామ ఈసారి మరింత రెచ్చిపోయింది. మోకాళ్లపైకి ఉన్న బ్లాక్ డ్రెస్ ధరించి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి కుర్రకారు మతి పోగోడుతుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇద్దరూ పిల్లల తల్లైన ఈ భామ సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటూ సినిమమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనసూయ. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక తమిళంలో విజయ్ సేతుపతితో, మాలయాళంలో మోహాన్ లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ కూడా కొట్లెసింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
చీరకట్టులో యాంకర్ శ్రీముఖి
-
బ్లాక్ సారీలో మెరిసిపోతున్న'ఈషా రెబ్బా'
-
ప్రముఖ క్యాలెండర్ షూట్లో విజయ్ దేవరకొండ
ముంబై : టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న విజయ్‌కు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. 'లైగర్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న విజయ్..ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ షూట్లో తొలిసారిగా పాల్గొన్నాడు. ప్రతీ ఏడాది ప్రముఖ స్టార్ హీరో, హీరోయిన్లతో డబూ రత్నాని కాలెండర్ షూట్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్యరాయ్, కియారా అద్వానీ, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్ , అభిషేక్ బచ్చన్ వంటి పాపులర్ స్టార్స్ డబూ రత్నాని ఫోటోలకు ఫోజులివ్వగా, ఈ ఏడాది 2021 కాలెండర్ షూట్లో విజయ్ హ్యాండ్సమ్గా కనిపించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ పూర్తి చేసినట్లు డబూ రత్నాని తెలిపారు. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ‘లైగర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు తమిళం కన్నడ మాలయాళ బాషాల్లో సెప్టెంబర్ 9న విడుదల కానున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్, శివ నిర్వాణ దర్శకత్వాల్లో విజయ్ దేవరకొండ నటించనున్నారు. చదవండి (ఫ్యాన్ మూమెంట్: విజయ్‌తో సారా సెల్పీ) (బాలీవుడ్ హీరోయిన్లతో విజయ్ దేవరకొండ పార్టీ!) #btswithdabboo 🖤❤️👌🏼✨ Phenomenal Debut Shot of @TheDeverakonda for #dabbooratnanicalendar 2021 ✨ @DabbooRatnani @ManishaDRatnani Makeup VeerababuChuman Hair NagireddyChinnapureddy Trainer KuldeepSethi Styling harmann Prop @indiatriumph Prod @Dabboo #VijayDevarakonda pic.twitter.com/lnwKaWlg6z — Dabboo Ratnani (@DabbooRatnani) February 23, 2021 -
ఈషా రెబ్బా బ్యూటీఫుల్ పిక్స్
-
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు..
-
ఫోటోషూట్: నిజమైతే వీళ్లంత మూర్ఖులు ఉండరు..
సెల్ఫీలు, ఫోటోలపై జనాలకు మోజు ఎక్కువైపోతుంది. ఎక్కడికి వెళ్లానా అక్కడ జ్ఞాపకంగా ఓ ఫోటో తీసుకోవడం అలవాటైపోయింది. ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వడం కోసం పాకులాడుతూ ప్రమాదకరమైన ప్రదేశాల్లో చిత్ర విచిత్ర ఫోజుల్లో ఫోటోలు దిగుతూ జీవితాన్ని ఇరకాటంలో పడేసుకుంటున్నారు. సెల్ఫీల కారణంగా అనేకమంది ప్రాణాలు బలైపోయిన ఎన్నో సంఘటనలు మన కళ్ల ముందుకు వస్తూనే ఉన్నాయి. అయిప్పటికీ మనుషుల్లో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా అలాంటి ఓ దృశ్యమే వెలుగులోకి వచ్చింది. ఫోటోషూట్‌లో భాగంగా ఓ జంట ఎత్తైన కొండ అంచు భాగంపై ఫోటో దిగిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో అమ్మాయి కొండపై నిలబడి.. కొండ అంచుపై భాగంలో ఒక కాలు పెట్టి మరో కాలు గాలిలో ఉంచి నిలబడిన వ్యక్తి చేతిని తను పట్టుకున్నట్లు కనిపిస్తోంది. కింద చాలా దూరంలో ఓ రహదారి తప్ప ఏం కినిపించడం లేదు. ‘ఇలా చేయకుండా మిమ్మల్ని ఆపేదెవరు’ అంటూ ఓ ట్విటర్ యూజర్ దీనిని షేర్ చేశారు. కానీ ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది మాత్రం వెల్లడించలేదు. ఈ పోస్టును ఇప్పటికే 5 వేల మంది లైక్ చేయగా వేల మంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వాస్తవమేనా లేక ఫోటోషాప్ పనితనమా అని నెటిజనులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజమే అయితే ఫోట్ షూట్ కోసం ఇంకింత జ్ఞానం లేకుండా ఇలా చేస్తారా అని, ఈ జంట అంతా పిచ్చోళ్లు మరెవరూ ఉండరని మండిపడుతున్నారు. అయితే కెమెరా కోణం వల్ల మాత్రమే ఫోటో ప్రమాదకరంగా కనిపిస్తోందని మరికొంత మంది వాదిస్తున్నారు. చదవండి: షాకింగ్: నటికి సర్జరీ మిస్‌ఫైర్ కావడంతో చదవండి: ఒక్కసారిగా పాములన్నీ మీద పడ్డాయి! Whats stopping you from doing this? pic.twitter.com/XwSBJScSrU — Shreela Roy (@sredits) February 2, 2021 -
'హూషారు' చిత్రం హీరోయిన్ దక్షా నగార్కర్ లేటెస్ట్ ఫోటోలు..
-
నవీన రెడ్డి లేటెస్ట్ ఫోటోలు.
-
వైరల్ అవుతున్న సితార తాజా ఫొటోలు
సాక్షి, హైదరాబాద్: స్టార్ కిడ్స్ పిల్లలు ఏం చేసినా అవి వార్తల్లో నిలుస్తుంటాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని ముందంజలో ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే సితార ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటిగా మారింది. సూపర్ స్టార్ కూతురుగానే కాక, డ్యాన్స్, పాటలు పాడటం వంటి మల్టీ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సితార. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఫొటో షూట్లో పాల్గొన్న సితార లైట్ పింక్ ఫ్రాక్‌లో అచ్చం బార్బిడాల్లా కనిపిస్తోంది. ఎంతో అందంగా ముద్దు ముద్దుగా ఫొటోలకు ఫొజులు ఇచ్చిన ఈ ఫొటోలను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా సందడి చేస్తున్నాయి. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాం’
కొత్త ఏడాది ప్రారంభంలోనే క్యూట్ క్యూట్ ఫొటోలతో కీర్తి సురేశ్ అభిమానులను ఫిదా చేశారు. 2021 తొలి ఫొటోషూట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘మహానటి’ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెంపుడు కుక్కతో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె బుమారాంగ్‌లో పంచుకున్నారు. డిజైనర్ అర్చామెహతా, హేర్, మేకప్ స్టైలిస్ట్ రేచెల్‌లను ట్యాగ్ చేశారు. అంతేగాక వారితో కలిసి సరదాగా కెమెరాకు ఫొజులిస్తున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు. ‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాము’, చాలా అందంగా ఉన్నారు’ అంటూ అభిమానులు హర్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్ ఒత్తిడి ?) కాగా కీర్తి ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్ తెరకెక్కించనున్న ‘సర్కారు వారి పాట’లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఆమె వెంకీ అట్లూరి రూపొందిస్తున్న రంగ్‌దేలో నితిన్ సరసన నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ మార్చి 26న ‘రంగ్‌దే’ విడుదలకానుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. దీనితో పాటు జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించిన ‘గుడ్ లక్ సఖి’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మరక్కర్’ కీర్తీ కీలక పాత్ర పోషిస్తోంది. (చదవండి: దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
షేపవుట్..? ఫొటోషూట్..
‘నాకో మంచి పోర్ట్ ఫోలియో చేసిపెట్టండి’ అంటూ అభ్యర్థిస్తూ ఫొటో గ్రాఫర్లను కలిసేవారిలో సాధారణంగా గ్లామర్ రంగంలో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక యువతే ఎక్కువ.. అయితే ప్రపంచంలోని అందరి రూట్లనూ అన్ని సంప్రదాయాలనూ మార్చేసిన కరోనా దెబ్బకి ఇదీ మారిపోయింది. దీంతో ఇప్పటికే గ్లామర్ రంగంలో తమకంటూ ఒక ప్లేస్ ఉన్నవారు సైతం ఫిర్ ఏక్‌బార్ అంటూ ఫొటో షూట్స్ కోసం క్యూ కడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘అవకాశాలు రావడం మొదలయ్యాక సదరు అవకాశాలు ఇచ్చిన వారి కోసం పాత్రలకు అనుగుణంగా ఫొటో షూట్స్ గ్లామర్ రంగంలో సర్వసాధారణం. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి అప్‌కమింగ్ నటి/మోడల్ మళ్లీ తమని తాము మొదటి నుంచీ పరిచయం చేసుకోవాల్సి వస్తోంది. అందుకే మరోసారి పోర్ట్ ఫోలియో ప్లీజ్ అంటున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో స్టూడియో నిర్వహిస్తున్న ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల. ఒత్తిడితో అధిక బరువు.. ⇔ అనూహ్యంగా వచ్చిపడిన మహమ్మారి దెబ్బకు అందాల తారల రొటీన్ మొత్తం తలకిందులైంది. మొదట్లో ఇది ఒక రోజో, ఒక వారమో ఉండిపోయేది అనుకుని తేలిగ్గా తీసుకున్న కొందరు.. రోజులు, నెలల తరబడి లాక్డౌన్ కొనసాగడంతో జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ⇔ నాలుగ్గోడల మధ్య ఉండటమనే అలవాటు లేని వారు, కొత్తగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకున్నవారు అంతలోనే ఈ దెబ్బ తగలడంతో ఒత్తిడికి లోనై, ఈటింగ్ డిజార్డర్‌కు గురై బరువు పెరిగిపోయారు. ⇔ యోగా వంటివి చేసినప్పటికీ జిమ్స్‌లో తప్పనిసరిగా చేయాల్సిన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి బాడీ టోనింగ్ వ్యాయామాలు చేయకపోవడంతో మరికొందరిలో ఆ మేరకు కండరాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ‘రూపు’దిద్దుకోండి.. నగరంలో గ్లామర్ రంగం ఇప్పడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్స్, యాడ్ షూట్స్.. నిదానంగానే అయినా పుంజుకుంటున్నాయి. దీంతో తారలు మళ్లీ తమ ‘పాత్ర’లు పోషించడం కోసం సిద్ధమవుతున్నారు. ⇔ సిద్ధమవుతున్న వారు.. తమలో ఎలాంటి మార్పులూ రాలేదని రుజువు చేసుకోవాల్సిందిగా నిర్మాతలు, రూపకర్తల నుంచి ఆదేశాలు అందుతున్నాయి. దీంతో వీరంతా.. జిమ్‌లలో కసరత్తుల టైమ్ పెంచడంతో పాటు సరికొత్త పోర్ట్ ఫోలియోలను రూపొందించమని ప్రముఖ ఫొటోగ్రాఫర్లను కలుస్తున్నారు. ⇔ విచిత్రం ఏమిటంటే.. తమను తాము పరిచయం చేసుకోవడానికి మంచి ఆల్బమ్ రూపొందించమని అడగాల్సిన ఔత్సాహికులు.. కోవిడ్ పుణ్యమాని ఇప్పుడు కొత్త అవకాశాలు దక్కించుకునే పరిస్థితి లేకపోవడం పోర్ట్ ఫోలియోలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ చిత్రమైన పరిస్థితులు ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొలత.. కలత.. ⇔ నిత్యం తీసుకుంటున్న కార్బొహైడ్రేట్లను, కేలరీలను కొలుచుకుంటూ ఆ ప్రకారం ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాన్ని రోజువారీ పనుల్లో భాగంగా మార్చడం వగైరాలు గ్లామర్ రంగంలో పనిచేస్తున్న వారికి మరీ ముఖ్యంగా యువతులకు ఎంత ముఖ్యమో తెలియంది కాదు. ⇔ రూపురేఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే రంగం కాబట్టి.. అవకాశాలు అందించడంలో ఫిజికల్ ఫిట్నెస్, మెజర్మెంట్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే అంగుళాలతో సహా లెక్కించుకుని, శరీరపు కొలతల్లో ఎటువంటి తీవ్రమైన మార్పు చేర్పులూ చోటు చేసుకోకుండా కేర్ తీసుకుంటారు గ్లామర్ తారలు. పోర్ట్‌ఫోలియో తప్పదు.. కొత్తగా అవకాశాలు అందుకోవాలనుకున్నవారు మాత్రమే కాదు లాక్డౌన్ తర్వాత అందరూ కొత్త తారలే అయ్యారు. ఫ్రెష్ ఫొటోషూట్ ద్వారా మాత్రమే వారు తమ లుక్ మీద కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతున్నారు. లాక్డౌన్ సడలింపుల తర్వాత నేను చేసిన వర్క్స్‌లో తారల పోర్ట్ఫోలియోలే ఎక్కువగా ఉన్నాయి. – షరీఫ్ నంద్యాల, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ -
ఫొటో షూట్.. లోకల్ స్పాట్
ఒకప్పుడు పెళ్లి వేడుకకు సంబందించి ఫొటోలు, వీడియోలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లికి ముందే జంటలు ‘ప్రీ వెడ్డింగ్’ ఫొటోషూట్ తీయించుకుంటున్నారు. ప్రస్తుతం ఫొటోషూట్‌కు విపరీతమైన క్రేజీ పెరిగింది. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు అంతటా విస్తరించింది. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు నచ్చి నిశ్చితార్థం జరిగిందంటే చాలు.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లకు సిద్ధమవుతున్నారు. ఫొటో, వీడియోగ్రాఫర్లను తీసుకుని తమకు ఇష్టమైన స్పాట్లకు వెళ్లి అందమైన కాస్టూమ్తో నచ్చే విధంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుంటున్నారు. వీటికి సినీ, జానపద పాటలను కూడా కలుపుతున్నారు. ఇందుకోసం వేలు, లక్షల్లో డబ్బు ఖర్చుపెడుతున్నారు. నగర శివార్లలోని రిసార్ట్స్‌లు, దేవాలయాలు, పార్కులు, ఫాంహౌస్‌లు, లేక్‌లు ఫొటోషూట్‌కు ఔట్‌డోర్ లొకేషన్లుగా మారాయి. మాయాబజార్లో ఓ జంట స్టిల్.. శంషాబాద్, మొయినాబాద్: నగర శివారు ప్రాంతాలు ఫొటోషూట్ స్పాట్స్‌గా మారాయి. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, గండిపేట, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, మేడ్చల్ తదితర మండలాల్లోని రిసార్ట్స్, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు, లేక్‌లలో ఫొటోషూట్లు అధికంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మొయినాబాద్ మండలంలోని మృగవనితో పాటు మరో రెండు రిసార్ట్స్, మృగవని పార్కు, చిలుకూరు బాలాజీ దేవాలయం సమీపంలో గండిపేట చెరువు, హిమాయత్‌సాగర్ చెరువు, పలు ఫాంహౌస్‌లు, శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి దేవాలయం, గండిపేట, గోల్కొండ సమీప ప్రాంతాలు ఇందుకు వేదికగా మారాయి. అదేవిధంగా మహేశ్వరం మండలంలోని వండర్లా, కీసర మండలంలోని కీసరగుట్ట ఆలయం, శామీర్‌పేట మండలంలోని పలు రిసార్ట్లు, శామీర్‌పేట పెద్ద చెరువు ఫొటోషూట్ స్పాట్స్‌గా నిలుస్తున్నాయి. మాయాబజార్లో జంట సందడి స్పెషల్‌గా ‘మాయాబజార్’ సినీ షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే శంషాబాద్ ఇప్పుడు ఇలాంటి వేడుకలకు సంబంధించిన షూటింగ్లలో కూడా అగ్రస్థానంలోనే ఉంది. పట్టణంలోని ఫోర్ట్గ్రాండ్.. సిద్దులగుట్ట దేవాలయం, అమ్మపల్లి దేవాలయం పరిసరాల్లో ఫొటోషూట్లు జరుగుతున్నాయి. నర్కూడ సమీపంలో ఏర్పాటు చేసిన ‘మాయాబజార్’.. ప్రత్యేకంగా ప్రీ వెడ్డింగ్, పుట్టినరోజు, సీమంతాలు తదితర షూటింగ్‌ల కోసం ఇద్దరు మహిళల నిర్వహణలో కొనసాగుతోంది. ఇందులో 20 ఔట్‌డోర్, ఇండోర్ లొకేషన్లను అందంగా తీర్చిదిద్దారు. సినిమా షూటింగ్‌లతో పాటు ప్రముఖుల వివాహవేడుకలకు కన్వెన్షన్‌గా ఉన్న ఫోర్ట్గ్రాండ్లో ఈ షూటింగ్‌లు కొనసాగుతున్నాయి. మొఘల్ శైలిలో నిర్మాణం చేసిన ఈ కోట అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ సినిమాలకు సెంటిమెంట్‌గా ఉన్న అమ్మపల్లి దేవాలయంలో కోనేరు పరిసరాలో ఇలాంటి షూటింగ్‌లు నిత్యం జరుగుతున్నాయి. ఇక్కడ చిత్రీకరణ జరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమంతో పాటు బంధువులు, స్నేహితుల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో వివిధ జిల్లాలతో పాటు బయటి రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఎంతో ఆసక్తితో ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీయించుకుంటున్నారు. ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదు. ఫొటో, వీడియోగ్రాఫర్లకు పెరిగిన డిమాండ్.. యువతలో ఫొటోషూట్లకు క్రేజీ పెరగడంతో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు డిమాండ్ పెరిగింది. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు బిజీ అవుతున్నారు. గతంలో పెళ్లి సమయంలోనే ఫొటోలు, వీడియోలు తీసేపని ఉండేది. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్, పెళ్లి సమయంలో, పెళ్లి తరువాత కూడా ఫొటోషూట్ తీయిస్తుండడంతో వారికి పని పెరిగిపోయింది. శివారుల్లోనే మంచి లొకేషన్లు ఫొటోషూట్లకు నగర శివారు ప్రాంతాల్లోనే మంచి లొకేషన్లు ఉన్నాయి. హైదరాబాద్‌కు అతి సమీపంలోనే చాలా రిసార్ట్స్‌లు, చెరువులు, టెంపుల్స్, ఫాంహౌస్‌లు, పార్కులు ఉండటంతో వాటిలోనే చాలా ఫొటోషూట్లు చేస్తున్నాము. యువత ఆసక్తిని బట్టి లొకేషన్లు మారుస్తుంటాము. – నందు, వీడియోగ్రాఫర్ కొత్తదనాన్ని ఇష్టపడుతున్నారు.. ఫొటోగ్రఫీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెళ్లికే ప్రాధాన్యత ఇచ్చి ఫొటోలు, వీడియోలు తీయించుకునేవారు. కానీ, ఇప్పుడు పెళ్లికి ముందు, పెళ్లి తరువాత కూడా తమకు నచ్చిన విధంగా ఫొటోలు తీయించుకుంటున్నారు. ఇప్పుడు యువత కొత్తదనాన్ని కోరుకుంటోంది. అందుకు అనుగుణంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలోనూ మార్పులు వచ్చాయి. – రమేష్‌గౌడ్, ఫొటోగ్రాఫర్ -
ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం
కాలిఫోర్నియా: నూతన వధువరులకు ఫొటోషూట్ అనేది ఎప్పటికి మిగిలిపోయే మధుర జ్ఞాపకం. కానీ అమెరికాకు చెందిన ఓ జంటకు ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ జంట వివాహ అనంతరం లగునా బీచ్‌కు ఫొటో షూట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు బీచ్ తీరంలో ఓ పెద్ద రాయిపై నిలుచుని ఫొటోకు ఫోజ్ ఇస్తుండగా ఒక్కసారిగి ఓ పెద్ద అలా వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. (ఒక్క ఫోన్‌కాల్: ప్రకంపనలు సృష్టించింది..) అది చూసిన స్థానికులు వధూవరులను రక్షించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫొటో షూట్ కోసం అంత సాహసం చేయడం అనవసరం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ లగునా బీచ్ ప్రసిద్ది చెందింది. ఇక్కడ తరచూ వధువరూలు ఫొటో షూట్‌కు వస్తుంటారని సందర్శకులు తెలిపారు. (వేడుకలు ఆరంభం) -
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు
-
హాట్ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీముఖి
బుల్లితెరపై తన ప్రతిభతో మెప్పించిన శ్రీముఖి బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఓ వైపు టీవీ షోలో అలరిస్తూనే మరోవైపు సినిమాల్లోనూ కనిపిస్తున్నారు. ఇప్పటికే జులాయి, నేను శైలజ, జెంటిల్మన్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ’ పోల్‌లో శ్రీముఖి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్3లో రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె ఓ ఫొటో షూట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఆ ఆంగ్ల ప్రతిక నిర్వహించిన పోల్‌లో వర్షిణి 4వ స్థానంలో, రష్మి 5 స్థానంలో, మంచు లక్ష్మి 12వ స్థానంలో, అనసూయ 14 స్థానంలో నిలిచారు. అయితే ఇప్పటి వరకు కనిపించని విధంగా శ్రీముఖి తన హాట్ లుక్స్‌తో నెటిజన్ల హృదయాలను దోచేస్తుంది. బిగ్‌బాస్ భామ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. ఇప్పటి వరకు సంప్రదాయమైన దుస్తులతో కనిపించిన శ్రీముఖి ఒక్కసారిగా హాట్ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో భారీ స్థాయిలో అభిమానుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. View this post on Instagram Well thanks 2020!! ❤️☺️ PC @chinthuu_klicks Outfit @rekhas_couture Styling @kirthana_sunil Make up @nookesh.malla Hair @gopi_bridal_makeovers #sreemukhi A post shared by Sreemukhi (@sreemukhi) on Jan 30, 2020 at 10:25pm PST View this post on Instagram Well thanks 2020!! ❤️☺️ PC @chinthuu_klicks Outfit @rekhas_couture Styling @kirthana_sunil Make up @nookesh.malla Hair @gopi_bridal_makeovers #sreemukhi A post shared by Sreemukhi (@sreemukhi) on Jan 30, 2020 at 10:22pm PST View this post on Instagram Well thanks 2020!! ❤️☺️ PC @chinthuu_klicks Outfit @rekhas_couture Styling @kirthana_sunil Make up @nookesh.malla Hair @gopi_bridal_makeovers #sreemukhi A post shared by Sreemukhi (@sreemukhi) on Jan 30, 2020 at 10:17pm PST -
జస్ట్ ఫోటోషూట్
‘రెడ్’ సినిమాను రెడీ చేసే పనిలో ఉన్నారు రామ్. తాజాగా మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందుకు కారణం రామ్ తాజా ఫోటోషూట్ స్టిల్సే. ఈ ఫోటోషూట్ స్టిల్స్‌లో యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు రామ్. ఇది కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ అని అనుకున్నారంతా! కానీ ఓ క్యాలెండర్ కోసం ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ హీరో రామ్‌ను ఇలా రాయల్ లుక్‌లోకి మార్చారు. విశేషం ఏంటంటే రామ్ పదేళ్ల వయసులో తన పోర్ట్‌ఫోలియో కోసం కార్తిక్ శ్రీనివాసే ఫొటోషూట్ చేశారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ఫొటోషూట్ కోసం కలిశారు ఇద్దరూ. ఇక ప్రస్తుతం రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకుడు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మాత. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. -
నీ మోకాలు ఎటు పోయింది.. ఇది చెత్త ఫోటోషాప్..
ముంబై : నాలుగు పదుల వయసులోను ఏమాత్రం చెక్కు చెదరని అందాలతో ఇప్పటికీ టాప్ మోస్ట్ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. అయితే అప్పుడప్పుడు తాము ఆరాధించే హీరోలు, హీరోయిన్లు చేసే పనులు అభిమానులను నిరాశ చెందిస్తాయి. వాళ్లను అభిమానులు ఎంతగా ఆరాధిస్తారో.. ఒక్కోసారి వారు చేసే పనులు నచ్చకుంటే అంతే విమర్శిస్తారు. తాజాగా కరీనా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు. ఇటీవల ఓ మ్యాగజైన్ ఫోటోషూట్‌కు హాజరైన కరీనా.. తన అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. దీంతో ఫోటోషూట్‌కు సంబంధించిన ఓ ఫోటోను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. కరీనా అభిమానులు సైతం ఈ ఫోటోపై ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ఫోటో ఏ మాత్రం బాలేదంటూ, ఎడిట్ చేయంలో విఫలమైందంటూ మండిపడుతున్నారు. ఫోటోలో తన మోకాలు కనిపించకుండా ఎడిట్ చేశారని, ఎడిట్ చేసే ముందు సరి చూసుకోవాలి కదా అని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంత అందంగా ఉంటావ్ కరీనా నీ కాలుకు అంతా ఫోటోషాప్ ఎడిటింగ్ ఎందుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఈ ఫోటోలో నీ మోకాలు ఎటు పోయింది. ఇది చెత్త ఫోటోషాప్. దిండుపై పడ్డ కాళ్ల నీడను సరిచూసుకోవాల్సింది ఉంది’’ అని నెటిజన్లు సూచిస్తున్నారు. ఇక ఇలాంటి నెగిటీవ్ కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ అంతా నిండిపోయింది. మరీ ఈ విషయంపై కరీనా ఎలా స్పందిస్తారో చుడాలి. View this post on Instagram Monday mood 💁🏻♀️ ________________________________________________________ #KareenaKapoorKhan #MondayMood #CelebStyle #KareenaKapoor #Vibe #MajorMood #MondayBlues A post shared by GRAZIA India (@graziaindia) on Jan 6, 2020 at 3:14am PST -
అలా బోర్ కొట్టింది
సినిమా : అలా బోర్ కొట్టింది. అందుకే ఇలా అని చెప్పుకొచ్చింది నటి నిధి అగర్వాల్. ఇటీవల టాలీవుడ్లో బాగా వార్తల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంటోంది. మున్నా మైఖెల్ అనే హిందీ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ జాణ ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. ఆ తరువాత నటించిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ కేరీర్‌ను టర్నింగ్ తిప్పిందనే చెప్పాలి. రామ్ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. అంతే నిధిఅగర్వాల్కు కోలీవుడ్‌లో కాలింగ్ బెల్ మ్రోగింది. ఇప్పుడీ బ్యూటీ లక్కీ హీరో జయంరవితో భూమి అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఇంతకు ముందు గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసి నెటిజన్లకు మంచిపని చెప్పిన నిధి అగర్వాల్ తాజాగా తమిళ సంప్రదాయం ఉట్టి పడేలా చీరను సింగారించుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. ఇంతలో ఇంతమార్పు ఏమిటమ్మా అన్న నెటిజన్ల ప్రశ్నకు ఏంలేదు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసి బోర్ కొట్టిందనీ, అందుకే ఒక మార్పు కోసం చీర కట్టిన ఫొటోలను విడుదల చేసినట్లు చాలా సింపుల్‌గా బదులిచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి సారించడంతో ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమే ఇదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇకపోతే నటి నిధి అగర్వాల్ గురించి మరో ప్రచారం ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం తను పోస్ట్ చేసిన ఒక వీడియోనే. ఖరీదైన పోర్చే కారును డ్రైవ్ చేస్తున్న వీడియోనే అది. దాని విలువ కోటి రూపాయలు. ఒకేఒక్క చిత్రం హిట్ అవ్వడంతోనే కోటి రూపాయల ఖరీదైన కారును నిధి అగర్వాల్ కొనుగోలు చేయడంతో ఇతర హీరోయిన్లకు కంటగింపుగా మారింది. లక్కుకంటే ఈ అమ్మడిదేగా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. కాగా ప్రస్తుతం నిధి అగర్వాల్ జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం పక్కా పల్లెటూరి యువతిగా మారిపోయ్యింది. ఇంతకు ముందు రోమియో జూలియట్, బోగన్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించిన లక్ష్మణ్ దీనికి దర్శకుడు. అంతేకాదు ఇది నటుడు జయంరవికి 25వ చిత్రం. భూమి చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. నటి నిధి అగర్వాల్ కూడా కోలీవుడ్‌లో తన భవిష్యత్ గురించి కాస్త ఎక్కువే కలలు కంటోందని సమాచారం. -
మహేశ్ అభిమానుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్పై హీరో మహేశ్‌బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో మహేశ్‌బాబుతో ఫొటో దిగడానికి రమ్మని తమను తీవ్రంగా అవమానించారని మండి పడుతున్నారు. స్టార్ హీరోకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదని వాపోయారు. మహేశ్‌బాబుతో ఫొటో దిగాలనుకుంటే గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీకి రావాలని నిర్వాహకులు ఆన్లైన్లో ప్రచారం చేయడంతో తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో తోపులాట జరిగి పలువురు అభిమానులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు విరిగినట్టు తెలుస్తోంది. బౌన్సర్లు దురుసుగా వ్యవహరించారని, తమపై చేయి చేసుకున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు. తమను ఎందుకు కొట్టారో అర్థం కావడం లేదని వాపోయారు. అభిమానులను కొట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. రైళ్లో సీట్లు దొరక్కపోయినా రాత్రంతా ప్రయాణం చేసి 30 మందితో కలిసి వచ్చామని, ఇక్కడి వచ్చాక తమను కొట్టి తరిమేశారని ఒక అభిమాని వాపోయాడు. ఎవరి పైరవీలు వాళ్లవి జరుగుతున్నాయని ఆరోపించాడు. కార్యక్రమం రసాభాసగా మారడంతో బ్యారికేడ్లు విరిగిపోయాయి. కోపంతో అభిమానులు కుర్చీలు విరగొట్టారు. అయితే అనుమతి తీసుకుంటే భద్రతా ఏర్పాట్లు చేసేవాళ్లమని పోలీసులు చెబుతున్నారు. అనుమతి తీసుకోకుండా కార్యక్రమం చేపట్టిన నిర్వాహకులపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. (మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస) -
ఇక ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉండవు..!
భోపాల్ : ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధించడాన్ని మధ్యప్రదేశ్ పౌర సంబంధాల మంత్రి పీసీ శర్మ సమర్థించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్‌లోని గుజరాతి, జైన్, సింధ్ మతాల సమాఖ్యలు ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సనాతన పద్ధతులను పాటించి పెళ్లిళ్లు జరిగితే బాగుంటుందని మంత్రి శర్మ అభిప్రాయపడ్డారు. అప్పుడే వివాహ బంధం బలంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక సామాజిక కోణంలోనే నిషేధం నిర్ణయం తీసుకున్నట్టు ఆయా మత సమాఖ్యల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇకపై ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉండవని పేర్కొంటూ ఇటీవల ఇక్తాత్ (ఉత్తర్వు) కూడా జారీ చేశారు. గుజరాతి సమాజ్ జాతీయ కార్యదర్శి సంజయ్ పటేల్ మాట్లాడుతూ.. ‘ప్రీ వెడ్డింగ్ షూట్లు సరైనవి కావు. ఈ రోజుల్లో పెళ్లైన మూణ్నాళ్లకే దంపతులు విడిపోతున్నారు. అలాంటిది పెళ్లికి ముందే ఫొటోలు, వీడియోలు మంచి పద్ధతి కాదు. అందుకే గుజరాతి సమాజ్ కార్యనిర్వాహక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది’అని వెల్లడించారు. తమ మతాచారాలకు విఘాతం కలిగించేదిగా ఉంది కాబట్టే ప్రీ వెడ్డింగ్ షూట్లను బ్యాన్ చేశామని జైన్, సింధ్ సమాజ్ అధ్యక్షులు తెలిపారు. కాగా, ప్రీ వెడ్డింగ్ షూట్లపై నిషేధం విధిస్తూ గతేడాది చత్తీస్‌గఢ్ సింధ్ సమాఖ్య కూడా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
హూ ఆర్ యు?
ఆమిర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్లుగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తున్న ఫొటోషూట్ సీరిస్ నిన్నటితో పూర్తయ్యాయి. ‘హూ ఆర్ యు?’ అనే టైటిల్‌తో ఇన్నాళ్లూ ఇరా పోస్ట్ చేస్తున్న ఫొటోలు (తనవే) బోల్డ్‌గా, బ్యూటిఫుల్‌గా, ఇన్స్పైరింగ్గా ఉండటంతో బ్యూటీ లవర్స్ అంతా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌కు అంటుకుపోయారు. ముగింపు చిత్రాలలో చీరను పోలిన వస్త్రధారణతో, నుదుటిపై బొట్టుతో ఇరా మెరుపులు కురిపించారు. View this post on Instagram APPRECIATION POST! I'm so lucky to get to work with these amazing women! They made my shoot possible and they were so enthusiatic! It was beautiful. Pizza and waffle team! Thanks a tonne❤❤❤ 📸 @photographybyroozbeh . . . #appreciationpost #grateful #collaboration #behindthescenes #art #fashion #photography #photoshoot #fun A post shared by Ira Khan (@khan.ira) on Aug 20, 2019 at 12:27am PDT -
ట్రైన్లో ఫోటోషూట్.. వైరలవుతోన్న వీడియో
వాషింగ్టన్: ఫోటో షూట్ అనగానే.. సినిమా తారలు, మోడల్స్ మాత్రమే గుర్తుకు వస్తారు. ఈ ఫోటో షూట్లు జరిగే ప్రదేశాలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే స్మార్ట్ఫోన్లు వచ్చాక సాధరణ జనాలు కూడా ఈ ఫోటోషూట్లకు బాగా అలవాటు పడిపోయారు. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు క్లిక్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. మురిసిపోతుంటారు. అయితే ఇప్పడు మీరు చదవబోయే ఫోటోషూట్ మాత్రం వీటన్నింటికి కాస్త భిన్నమైంది. ఎందుకంటే ఈ ఫోటోషూట్ జరిగింది ఓ రైలులో కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అంతేకాక ఫోటోషూట్ చేసిన మహిళ ధైర్యాన్ని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. న్యూయార్క్ లోకల్ ట్రైన్లో చోటు చేసుకున్న ఈ వైరటీ ఫోటోషూట్ వివరాలు.. జెస్సికా జార్జ్ అనే మహిళ లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ ఫోటోషూట్ చేసింది. ఇందుకు గాను జెస్సికా తన స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీ టైమర్‌ను సెట్ చేసి రకరకాల ఫోజుల్లో ఫోటోలు దిగుతూ సందడి చేసింది. ఆ సమయంలో రైలులో జెస్సికాతో పాటు మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఆమె వారిని పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ పోయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న బెన్ యహర్ ఈ తతంగాన్నంతా వీడియో తీసి తన ట్విటర్లో షేర్ చేశాడు. తెగ వైరలవుతోన్న ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు జెస్సికా ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ‘అంత మందిలో సెల్ఫీ ఫోటోషూట్ చేసిన నీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం’.. ‘పబ్లిక్‌లో ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. This woman giving it ALL to the selfie cam on the train is SENDING ME pic.twitter.com/i3JoSPKj3I — Ben Yahr (@benyahr) August 17, 2019 -
అసంపూర్ణమైన సంపూర్ణం
‘‘సినిమా స్టార్స్‌ని చూసి అలానే ఉండాలనే ఆలోచనను సమాజం ఏర్పరచుకుంది. దీని ద్వారా చాలా మంది అనవసరమైన ఒత్తిడిని కొనితెచ్చుకుంటున్నారు. ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టాలనుకుంటున్నాను’’ అన్నారు సమీరా రెడ్డి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం ఈత కొలనులో ఫొటోషూట్ చేయించుకోవడమే. గర్భంతో ఉండి, ఇలా పొట్ట కనిపించేట్లు ఫొటోలు దిగుతారా? అని కొందరు సమీరాను విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు సమీరా సమాధానం ఇచ్చారు. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తన ఆలోచనలను పంచుకున్నారామె. రెండోసారి తల్లి కాబోతున్న సమీరా రెడ్డి బాడీ పాజిటివిటీ, మనల్ని మనం ప్రేమించుకోగలగడం, మూస ధోరణి ఆలోచనల గురించి అవగహన కలిగించాలనుకున్నారు. ఈ విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ – ‘‘బాడీ షేమింగ్ ఎదుర్కొన్నవాళ్ల కోసమే అండర్ వాటర్ ఫొటోషూట్ చేసుకున్నాను. ఇంతకు ముందు బికినీ ధరించాలంటే ఎంతో ఆలోచించేదాన్ని. ఎన్నో ఆలోచనలు. కానీ తొమ్మిదో నెల ప్రెగ్నెంట్‌గా ఉంటూనే బికినీలో ఎంత కంఫర్ట్‌బుల్‌గా ఉన్నానో చెప్పలేను. మొదటిసారి గర్భవతిని అయినప్పుడు నా వంతు ట్రాలింగ్ (విమర్శలు) ఎదుర్కొన్నాను. ‘ప్రెగ్నెంట్ అయినప్పుడు సమీర బరువు పెరిగింది. గ్లామర్ తగ్గింది’ అనే కామెంట్స్ విన్నాను. కానీ ఈసారి దాన్ని పట్టించుకోదలుచుకోలేదు. వాటిని తిప్పికొట్టి కాన్ఫిడెంట్‌గా ఉండాలనుకున్నాను. మన శరీరాన్ని మనమే అంగీకరించకపోతే ఎలా? అన్ని వయసుల ఆడవాళ్లకు చెప్పేది ఏంటంటే.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ శరీరతత్వాన్ని అర్థం చేసుకొని, అంగీకరించండి’’ అన్నారు. -
బాక్సరమ్మా ఏమిటీ వాలకం!
సినిమా: బాక్సరమ్మా ఏమిటీ వాలకమమ్మా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతగా విమర్శంచడానికి ఆమె ఏం చేసిందనేగా మీ ప్రశ్న. ఆ కథేంటో చూద్దాం రండి. రియల్ బాక్సర్ అయిన రితికాసింగ్ ఇరుదిచుట్రు చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అందులో నిజ జీవిత వృత్తి అయిన బాక్సర్‌గానే నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు అదే చిత్ర తెలుగు రీమేక్‌లోనూ నటించి అక్కడ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తరువాత కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లోనూ నటించే అవకాశాలను అందుకుంది. ఆ చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. అయినా రితికకు ఎందుకనే పెద్దగా క్రేజ్ రాలేదు. అలా 2017 తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అసలు అవకాశాలు కూడా లేవు. దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్న రితికాసింగ్‌కు ఇటీవలే వణంగాముడి అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదీ నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించే పాత్ర. కాగా ఇప్పటి వరకూ తన నటించిన చిత్రాల్లో దాదాపు గ్లామర్‌కు దూరంగా నటించి మెప్పించింది. అయితే అదే తనకు మైనస్ అనుకుందో ఏమోగానీ, ఆ ఇమేజ్ను పోగొట్టడానికన్నట్టుగా చిన్న చిన్న పీసులను ఒంటికి చుట్టుకున్నట్లు దిగిన ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసింది. చాలా గ్లామరస్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా బాక్సరమ్మా ఈ దుస్తులేమిటి? ఈ వాలకం ఏమిటి? అంటూ నెటిజన్ల విమర్శల దాడి చేస్తున్నారు. అయితే రితికాసింగ్ కోరుకుంది ఇదేనేమో..ఈ అమ్మడు ఏం స్పందించలేదు. -
‘నీ చదువు నీకిదే నేర్పిందా?’
బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాత్యంహకారి అంటూ నెటిజన్లు సారాపై మండిపడుతున్నారు. సారా పోస్ట్ చేసిన ఓ మ్యాగ్జైన్ కవర్ ఫోటో ఈ విమర్శలకు కారణం అయ్యింది. వివరాలు.. సారా తొలిసారి ‘ఫిల్మ్‌ఫేర్’ అనే మ్యాగ్జైన్ కవర్ పేజీ మీద కనిపించింది. ఈ ఫోటో షూట్లో భాగంగా సారా ఓ మసాయి తెగ వ్యక్తితో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోల పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ చదువు నీకిదే నేర్పిందా. ఇతరులు మన సంస్కృతిని గౌరవించాలని ఎలా భావిస్తామో.. అలానే మనం కూడా ఇతరుల సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని తెలీదా’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ‘పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను, వారి సంస్కృతులను కించపర్చడం మంచిది కాదు. ఇలాంటి పిచ్చి చేష్టలతో జనాలకు విసుగు తెప్పించకు. నీ ఫోటోలు జాత్యంహకారానికి నిదర్శనంగా నిలిచాయం’టూ మండిపడుతున్నారు. -
హీరోయిన్ ఫోటోషూట్ : విశేష స్పందన
కర్ణాటక, కృష్ణరాజపురం : పర్యావరణ కాలుష్యంపై స్వచ్ఛంద సంస్థలు, సమాజ సేవా సంఘాలు అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో ఏమాత్రం మార్పు రాకపోవడంతో గాలి, నీరు, భూమి కాలుష్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ కోవలోనే బెంగళూరు నగరంలో అత్యంత పెద్ద చెరువైన బెళ్లందూరు చెరువు కూడా పాలకులు, ప్రజల సంయుక్త నిర్లక్ష్యానికి పూర్తిగా కలుషిత కోరల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో నీటి కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రముఖ యువ హీరోయిన్ రష్మిక మందన్న బెళ్లందూరు చెరువు నీటిలో ఫోటోషూట్ చేయించుకున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డీ.సన్మతి నేతృత్వంలో బెళ్లందూరు చెరువు నీటి లోపల తీయించుకున్న ఫోటోలను తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన రష్మిక ఫోటోలతో పాటు సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బెళ్లందూరు చెరువులో ఇటువంటి పరిస్థితి నెలకొందనే విషయం ఫోటోషూట్ చేయించుకునే వరకు తమకు తెలియలేదంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఎంతో అందంగా ఉన్న బెళ్లందూరు చెరువులో ప్రస్తుతం నెలకొన్న కాలుష్యాన్ని చూసిన అనంతరం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానంటూ రష్మిక తెలిపారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోని చెరువుల్లోనూ బెళ్లందూరు చెరువులో నెలకొన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని అటువంటి చోట నేను ఉండదలచుకోవడం లేదని జల కాలుష్యంపై అవగాహన కల్పించడానికి బెళ్లందూరు చెరువులో ఫోటోషూట్ చేయించుకున్నట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ట్విట్టర్లో రష్మిక మందన్న పోస్ట్ చేసిన ఫోటోలు, సందేశానికి అభిమానులు, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. -
‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు’
పెరుగుతున్న జనాభాతో పాటు మన దేశంలో కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. తినే తిండే, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతీది కాలుష్యం బారిన పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో గాలి కూడా విషమవడం చూస్తూనే ఉన్నాం. ఈ నగరాల చుట్టూ ఉన్న చెరువులు కాలుష్య కాసారాలు అవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ఈ కాలుష్య భుతాన్ని మాత్రం అదుపు చేయలేకపోతుంది. అయితే సమస్యకు కారణమవుతోన్న మనుషుల్లో మార్పు రానవంత వరకూ.. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఇదే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు హీరోయిన్ రష్మిక మందన్న. నీటి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు ఓ వినూత్న ప్రయత్నం చేశారు రష్మిక. కర్ణాకటలోని అతి పెద్ద చెరువైన బెళ్లందూర్‌లో ఫోటో షూట్ చేశారు. అనంతరం ఈ ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. ‘గొప్ప టీమ్‌తో కలిసి నీట కాలుష్యం పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాను. బెల్లందూర్ చెరువు దగ్గరకు వచ్చి చూసే వరకూ దీని పరిస్థితి ఇంత దారుణంగా ఉందని అనుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ చెరువు ఎంత అందంగా ఉండేదో గుర్తొచ్చి నా గుండే బద్దలయ్యింది. ప్రతి చోట ఇలానే ఉంది. ఇలాంటి చోట ఉండాలని నేనైతే అనుకోను. మీతో పంచుకోవాలి అనిపించి చెబుతున్నా’ అంటూ రష్మిక ట్వీట్ చేశారు. Well wasn't aware of this till we had to actually go and shoot this in Bellandur lake..which like really broke my heart,and imagine few years down the line..it’s the same case everywhere else..😱 I’d rather not want to be in that space.. I just wanted to share 🤷 (2/2) pic.twitter.com/zshJLDwW6s — Rashmika Mandanna (@iamRashmika) December 13, 2018 అయితే కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన చెరువుగా బెళ్లందూర్ నిలిచింది. కొన్ని రోజుల క్రితం ఈ చెరువు నుంచి మంటలు కూడా ఎగసి పడ్డాయి. -
‘నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’
హీరో, హీరోయిన్లు బయట ఎక్కడైనా జంటగా కనిపిస్తే వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేస్తారు. అంతటితో ఆగక పెళ్లి ఎప్పుడంటూ ప్రశ్నిస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రచారమే బాలీవుడ్ నటులు పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ల విషయంలో జరుగుతోంది. ప్రచారంతో ఊరుకోక ‘ఇంతకూ మీరిద్దరు వివాహం ఎప్పుడు చేసుకుంటారం’టూ నెటిజన్లు వీరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అభిమానుల అత్యుత్సాహానికి తగ్గట్టుగా పరిణితీ ‘నాకు డేట్స్ ఖాళీ లేవు’.. అంటే అర్జున్ కపూర్ ఏకంగా ‘నేనింకా చిన్న పిల్లవాడిని పెళ్లీడు రాలేదంటూ’ సమాధానమిచ్చారు. ఇంతకు విషయం ఏంటంటే ప్రస్తుతం అర్జున్ కపూర్, పరిణీతి జంటగా ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ బ్రైడ్స్ మ్యాగజైన్ ఫొటో షూట్లో పాల్గొని.. నూతన దంపతులుగా ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ‘వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారం’టూ ఓ ఆంగ్ల మీడియా కథనాల్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్, పరిణీతి కాస్తా వెరైటీగా స్పందించారు. What an amazing moment for @ParineetiChopra ! Congratulations on this amazing opportunity of sharing the cover with me !!! 👏 These newcomers I tell u...u say hi & they come sit on ur lap !!! Bachpan se godh mein utha ke chal Raha hoon tumhe... lucky girl !!! @bridestodayin Clothing : @falgunishanepeacockindia Jewellery by : @hazoorilaljewellers Editor : @nupurmehta18 Photographer : @errikosandreouphoto Fashion Editor : @ayeshaaminnigam Fashion Stylist : @shauryaathley HMU (for Arjun) : #YogeshPathare and @aalimhakim Hair Assisted by : @arsalan4331 HMU (for Parineeti) : @danielbauermakeupandhair Producer : #AnomalyProductions A post shared by Arjun Kapoor (@arjunkapoor) on Sep 1, 2018 at 4:38am PDT ఈ విషయం గురించి పరిణీతి ‘నో...అర్జున్ కపూర్ నన్ను క్షమించు. నాకు డేట్లు ఖాళీగా లేవు. నా మేనేజర్‌ను సంప్రదించు’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు బదులుగా అర్జున్ కపూర్ ‘నేనింకా చిన్నపిల్లాడినే. పెళ్లికి తొందరేం లేదు. పరిణీతి.. నాకు పెళ్లీడు వచ్చే వరకూ ఎదురుచూడు’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి ట్విటర్ సంభాషణ, ఫోటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం పరిణీతి, అర్జున్ జంటగా ‘ఇషక్జాదే’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు ‘సందీప్ ఔర్ పింకీ ఫరార్’ చిత్రంతో పాటు ‘నమస్తే ఇంగ్లాండ్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. -
ఐపీఎస్ రూప ఫ్యాషన్ ఫోటో షూట్
సాక్షి, బొమ్మనహళ్లి: ఐపీఎస్ అధికారిణి డిఐజీ డి.రూప పేరు వినగానే ముక్కుసూటి పోలీసు అధికారి అని, బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టిన నిజాయతి ఐపీఎస్ అని గుర్తుకొస్తుంది. నిత్యం ఖాకీ యూనిఫాంలో దర్శనమిచ్చే ఆమె ఇటీవల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ డిజైన్ చేసిన ముదురు బ్లూ కలర్ ఫ్రాక్ను ధరించి తమ నివాసంలో చేసిన ప్యాషన్ షూట్ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. తాను ఐపీఎస్‌నే అయినా, ప్రముఖ మోడళ్లకు తీసిపోను అన్నట్లు ఈ ఫోటో షూట్లో ఐపీఎస్ రూప సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తారు. తమ నివాసంలో తీయించుకున్న ఫ్యాషన్ ఫోటో షూట్ దృశ్యాలు సాధారణ మహిళల కోసమే: రూప ఈ సందర్భంగా తన కాలేజీ రోజులను గుర్తుకు చేసుకున్నారు. మిస్ బెంగళూరు యునివర్సిటి కిరీటం, మిస్ దావణగెరె అవార్డును విద్యార్థినిగా ఉన్న రోజుల్లో గెలుచుకున్నట్లు డి.రూప తెలిపారు. ఫోటో షూట్‌పై స్పందిస్తూ ‘నేనేమి పోలీసు విధులను వదిలి ఫ్యాషన్ షోలకి వెళ్ళలేదు. ఒక సాధారణ మహిళ సైతం ఫ్యాషన్ షోలో పాల్గొని తమలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవచ్చు. ఫ్యాషన్ మోడల్స్, సినిమా నటీమణులు మాత్రమే ఫ్యాషన్ షోలకు పరిమితం కాదని అందరికీ తెలియడం కోసం నేను కెమెరా ముందుకొచ్చాను’ అని చెప్పారు. ఈ సమయంలో తనతో పాటు మరికొంత మంది మహిళలు కూడా ఫోటో షూట్ చేయించుకున్నారని అన్నారు. కాలేజీ రోజుల్లో అందాల టైటిల్స్ గెలుచుకున్న విషయాలను ఎవరికీ చెప్పుకోనని అన్నారు. గడిచిన 10 నెలలుగా ఫ్యాషన్ డిజైనర్ మీను సరవన్ తనకు సలహాలు ఇచ్చిన తరువాత ఈ ఫోటో షూట్ చేశానని రూప తెలిపారు. -
ఆ సమయంలో నగ్నంగా ఉన్నాను: నటి
హాలీవుడ్ నటి, రియాలిటి టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ తన గ్రాండ్ మదర్ అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించమని అభ్యర్థించడం.. అందుకు పెద్ద మనస్సు చేసుకొని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంగీకరించడం తెలిసిందే. ఆ మధ్య ఓ కేసులో శిక్షపడిన బాక్సర్‌కు ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించడంతో.. తన నాయనమ్మపై కూడా కనికరం చూపాలని ఆయనను కిమ్ కోరారు. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్.. నిందితురాలు అలైస్ మేరీ జాన్సన్‌కు క్షమాభిక్ష ప్రసాదించి.. జైలుశిక్ష నుంచి విముక్తి కల్పించారు. అయితే ఈ ఉదంతానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కిమ్ తాజాగా వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. అప్పట్లో తనతో మాట్లాడటానికి ట్రంప్ ఫోన్ చేశారని, ఆ సమయంలో తాను నగ్నంగా ఉన్నానని ఒకింత సిగ్గుపడుతూ చెప్పారు. తను న్యూడ్ ఫోటో షూట్ చేస్తుండగా.. కాల్ వచ్చిందని.. తీరా చూస్తే అది అమెరికా ప్రెసిడెంట్ నుంచి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ స్టీవెన్ క్లైన్ తన న్యూడ్ ఫోటో షూట్ తీస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. -
మామా.. జాగ్రత్త సుమా..!
కృష్ణా : మామా.. ఎన్ని లైక్‌లు, ఎన్ని కామెంట్లు వచ్చాయిరా .. అబ్బబ్బా ఏం ఫొటో అప్లోడ్ చేశావ్‌రా.. ఈ రోజంతా ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్ అంతా నీ ఫొటో గురించే చర్చ. సూపర్ మామా.. అని తోటి స్నేహితుడు అంటుంటే ఫోన్ వైపు చూసుకుంటూ తన ఫొటోను మరొక్కసారి తిలకిస్తూ మురిసిపోయాడు మరో స్నేహితుడు.. ఇలాంటి ప్రశంస కోసం నేటి యువత వెర్రెక్కిపోతోంది. ఒకవైపు అర్ధరాత్రి హైవేపై జిగేల్మనే లైటింగ్‌లో సెల్ఫీలతో కుల్ఫీ అవుతోంది. మరో వైపు రయ్యిమంటూ దూసుకెళ్లే రైలు పక్కన రాజాలా ఫోజులు పెడుతోంది. ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని చిరు దరహాసం చేస్తోంది. ఎన్ని లైక్‌లు వచ్చినా, ఎన్ని కామెంట్లు ముంచెత్తినా వీటన్నింటికన్నా ప్రాణం ఖరీదైంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎంజాయ్ చేయాలి. జీవితంలో మజాను ఆస్వాదించారు. విజయవాడలో ఆదివారం యువత సీతానగరం వద్ద రైల్వే బ్రిడ్జి, కృష్ణానదిలో పడవలపైనా ఇలా ఫొటోలు దిగుతుండగా సాక్షి క్లిక్‌మనిపించింది. – ఫొటోలు, నడిపూడి కిషోర్,సాక్షి ఫొటోగ్రాఫర్ -
ఓ మోడల్‌కు.. భయానక అనుభవం
-
మోడల్‌ను నోట కరుచుకుపోయింది
ఫోటో షూట్ కోసం వెళ్లిన ఓ మోడల్‌కు.. భయానక అనుభవం ఎదురైంది. నీటిలో ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ షార్క్ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆమెను నోట కరుచుకుని లోపలికి లాక్కెళ్లేందుకు యత్నించగా.. చివరకు ఎలాగోలా ఆమె ప్రాణాలతో బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాకు చెందిన 19 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ మోడల్ కటరినా ఎల్లె జరుట్స్కీ, తన బోయ్‌ఫ్రెండ్ ఫ్యామిలీతో సరదాగా బహమాస్‌కు షికారు వెళ్లింది. అక్కడ సముద్రంలో ఫోటో షూట్‌కు సిద్ధమైంది. అయితే కాస్త వెరైటీ ఉండాలన్న ఉద్దేశంతో షార్క్‌లను పెంచే ఎన్‌క్లోజర్‌లోకి దిగింది. ఆమె ప్రియుడి తండ్రి ఆమెను ఫోటోలు తీయటం ప్రారంభించాడు. ఇంతలో ఐదడుగుల షార్క్ ఒకటి ఆమె చేతిని నోట కరిచి నీటి అడుగు భాగానికి లాక్కెల్లింది. ఆ దెబ్బకు వణికిపోయిన పెద్దాయన సాయం కోసం కేకలు వేశాడు. అయితే దానిని విడిపించుకుని బయటపడ్డ కటరినా.. వెంటనే ఒడ్డుకు పరిగెత్తింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆమె భుజంలో షార్ట్ పళ్లు బలంగా దిగినట్లు వైద్యులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో వైద్యుల సలహా మేరకు ఆమె ప్రత్యేక చికిత్స తీసుకుంటోంది. -
‘నాకు లేని అభ్యంతరం వారికెందుకు?’
సాక్షి, సినిమా : దాదాపు నాలుగేళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్లో ‘అయ్యారీ’తో ప్రేక్షకులను పలకరించబోతోంది రకుల్. ఈ క్రమంలో ఓవైపు హీరో సిధార్థ్ మల్హోత్రాతోపాటు చిత్ర ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంది. మరోవైపు హాట్ ఫోటో షూట్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సౌత్‌లో ‘కాస్త’ పద్ధతిగల పాత్రల్లో నటించిన రకుల్ ఒక్కసారిగా ‘అలా’ కనిపించేసరికి ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లతో విరుచుకుపడ్డారు. తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై రకుల్ స్పందించింది. వారికేమైనా సందేశం ఇవ్వదల్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆమె మాంచి సమాధానమే ఇచ్చింది. ‘ఆ ఫోటోషూట్‌పై కొందరు సానుకూలంగా కూడా కామెంట్లు చేశారు. ఎవరి అభిప్రాయం వారిది. పాజిటివ్ కామెంట్లకు మురిసిపోవటం.. నెగటివ్ కామెంట్లకు కుంగిపోవటం నాకు అలవాటు లేదు. కెరీర్లో ఒక్కసారైనా ప్రముఖ మాగ్జైన్ కవర్ పేజీలపై మెరవాలన్న కోరిక ప్రతీ నటీనటులకు ఉంటుంది. నాకూ ఆ అవకాశం దక్కింది.. వాడుకున్నా. అసలు ఆ కామెంట్లను చదివేందుకు నాకు ఆసక్తి, తీరిక రెండూ లేవు. నేను చేసే పని నాకు నచ్చింది. నా కుటుంబ సభ్యులకే అభ్యంతరం లేనప్పుడు.. వారికి ఎందుకు ఉంటుందో అర్థం కావట్లేదు. ఎవరేమనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు’ అని రకుల్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత కూడా తనను కొందరు విమర్శించే అవకాశం లేకపోలేదని.. కానీ, వాటిని కూడా తాను పట్టించుకోనని ఆమె తెలిపింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ తానెప్పుడూ అలాంటి వేధింపులు ఎదుర్కోలేదని.. టాలీవుడ్లో కొత్త ప్రాజెక్టులకు అంగీకరించకపోవటంపై వస్తున్న విమర్శలపై స్పందించింది. తెలుగులో మంచి కథలు దొరక్కపోవటంతోనే తాను ఏ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని.. బాలీవుడ్, కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలు వచ్చినా టాలీవుడ్ మాత్రం తనకు సొంతిల్లు లాంటిదని రకుల్ వివరించింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన అయ్యారీ ఫిబ్రవరి 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో సిధార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్‌పాయి, రకుల్ ప్రధాన పాత్రలు పోషించారు. Sending you all a little love this Feb with my cover for @maxim.india #rakulformaxim ❤️ A post shared by Rakul Singh (@rakulpreet) on Feb 6, 2018 at 11:44pm PST -
ఒక్క ఫోటో ఆమె జీవితాన్ని మార్చేసింది
సాక్షి : అతి కష్టం మీద వెలుగులోకి వచ్చే కొన్ని నిజాలు భరించటానికి కూడా కష్టంగానే ఉంటాయి. సుడాన్‌కు చెందిన ఓ మోడల్ జీవితం ఒక్క ఫోటోతో ఎలా మారిపోయిందంటే.. రాత్రికి రాత్రే ఆమెను ఈ భూమ్మీద అత్యంత అందగత్తెగా మార్చి పడేసింది. Big thank you to @thesunk for capturing this moment. Amazing photographer. Couldn't be happier A post shared by Anok (@anokyai) on Oct 22, 2017 at 5:47am PDT అనోక్ యాయి.. వాషింగ్టన్లో హోవార్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె సౌందర్య బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ క్రమంలో ఓ చిత్రం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు.. తక్కువ కాలంలోనే ఆమెను సూడాన్ లేడీ సూపర్‌గా చేసేసింది. The leaves match my skin 🍂 A post shared by Anok (@anokyai) on Oct 27, 2017 at 3:39pm PDT ఈ క్రమంలో ఎక్కడా ఆమెపై జాతి వివక్ష కామెంట్లు రాకపోవటం విశేషం. ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్లు సైతం టాప్ సెక్సీ మోడళ్లను పక్కన పడేసి ఇప్పుడు ఆమె ముఖచిత్రం కోసం ఎగబడిపోతున్నాయి. Excited to announce that I am now signed with @nextmodels Thank you to everyone that's supported me along the way; hope you follow me on this journey #TheNextNext A post shared by Anok (@anokyai) on Oct 31, 2017 at 1:50pm PDT -
ఫొటో షూట్‌తో బదులిచ్చిన మిథాలీ?
హైదరాబాద్: ఇటీవలికాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత ఫొటోలపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో సినీ తారలు, క్రీడాకారిణిలు శ్రుతి మించుతున్నారంటూ నెటిజన్లలో ఓ వర్గం విరుచుకుపడుతోంది. భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అటు మైదానంలో ఇటు బయటా ఎంతో కూల్‌గా ఉంటారు. ఒత్తిడి సమయాల్లోను సంయమనం కోల్పోరు. కానీ, ఆటల్లోనైనా వ్యక్తిగతంగానైనా తన జోలికి వస్తే మాటలతో కాకుండా చేతలతోనే బదులిస్తారు. ఇదే విషయాన్ని మిథాలీ మరోసారి రుజువు చేశారు. ఇటీవల మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఫొటో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే, ఓ మొబైల్ సంస్థకు ప్రచారకర్తగా తీసిన ఫోటో షూట్‌కు సంబందించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. #tb #PostShootSelfie #funtimes #girlstakeover pic.twitter.com/p5LSXLYwmA — Mithali Raj (@M_Raj03) September 6, 2017 అసలు ఏం జరిగింది.. సెప్టెంబర్ 5న స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను మిథాలీ రాజ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఫ్రెండ్స్ తో కలిసి ఆనందంగా ఉన్నానంటూ.. తన ఆనందాన్ని పంచుకున్నారు. అయితే ఆమె అప్పుడు వేసుకున్న డ్రెస్‌పై నెటిజన్లలో ఓ వర్గం మండిపడింది. మహిళలకు ఒక రోల్ మోడల్‌గా భావిస్తున్న సమయంలో ఇలాంటి డ్రెస్ లు వేసుకోవడమేమిటని నెటిజన్స్ మిథాలీని హేళన చేశారు. దీనికి మాటలతోకాకుండా చేతలతో లేటెస్ట్ ఫోటో షూట్‌తో మిథాలీ బదులిచ్చారని ఆమెకు మద్దతుగా నిలిచిన నెటిజన్స్ చెప్పుకుంటున్నారు. What a momentous day today was, standing with these special women!!@MabenMaben @AlNooshin @vedakmurthy08 pic.twitter.com/EsNwRN2G7N — Mithali Raj (@M_Raj03) August 20, 2017 గతంలోనూ నెటిజన్లకు మిథాలీ చురకలు ఆగష్టు 20న బెంగళూరులో మిథాలీ ఓ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు మమతా మాబెన్, నూషిన్ అల్ ఖాదిర్, వేదా కృష్ణమూర్తితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ ట్వీట్‌కు అందరి నుంచి సానుకూల స్పందన రాగా ఒకరు మాత్రం.. చెమటతో ఎబ్బెట్టుగా కనబడుతున్నావు అని ఆ ఫొటోను ఎద్దేవా చేస్తూ కామెంట్ చేశాడు. ఇందుకు మిథాలీ ‘నేను మైదానంలో చమటోడిస్తే కానీ ఈ స్థాయికి రాలేదు. దీనికి నేను సిగ్గు పడడంలేదు. ఈ అకాడమీ ప్రారంభించడానికి కూడా నేను గ్రౌండ్‌లోనే ఉన్నా’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. అంతే..ఇక అతడు మళ్లీ నోరు మెదపలేదు. మిథాలీ స్పందించిన తీరును ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు. కాగా, ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టుని ముందుండి నడిపించి అందరి మనసును దోచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో మహిళల కేటగిరీలో భారత మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. తాజా వన్డే బ్యాట్స్ఉమెన్ ర్యాంకింగ్స్‌లో ఈ హైదరాబాదీ క్రికెటర్ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు. బౌలింగ్ విభాగంలో భారత వెటరన్ పేసర్ జులన్ గోస్వామి నిలకడగా రెండో స్థానంలోనే ఉంది. గుత్తా జ్వాలా కూడా.. క్రీడాకారుల వస్త్రధారణ విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారాన్ని లెక్క చేయబోనని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ద్వేషించేవాళ్లు ద్వేషించినా కానీ, ముందు నన్నో సెల్ఫీ దిగనివ్వండి అంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ట్రోలర్స్(సోషల్ మీడియాలో కామెంట్లలో విరుచుకుపడేవారు) గురించి పట్టించుకోకండి. పాజిటివిటీ, ప్రేమని పంచండి అంటూ హ్యాష్ ట్యాగ్లు ఇచ్చారు. సెప్టెంబర్ 22న గుత్తా జ్వాలా పోస్ట్ చేసిన ఫోటో