సినిమా : అలా బోర్ కొట్టింది. అందుకే ఇలా అని చెప్పుకొచ్చింది నటి నిధి అగర్వాల్. ఇటీవల టాలీవుడ్‌లో బాగా వార్తల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారంలో ఉంటోంది. మున్నా మైఖెల్ అనే హిందీ చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ జాణ ఆ తరువాత టాలీవుడ్‌కు దిగుమతి అయ్యింది. అక్కడ సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు చిత్రాల్లో నటించింది. ఆ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. ఆ తరువాత నటించిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ కేరీర్‌ను టర్నింగ్ తిప్పిందనే చెప్పాలి. రామ్ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం అనూహ్య విజయాన్ని అందుకుంది. అంతే నిధిఅగర్వాల్‌కు కోలీవుడ్‌లో కాలింగ్ బెల్ మ్రోగింది. ఇప్పుడీ బ్యూటీ లక్కీ హీరో జయంరవితో భూమి అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ఇంతకు ముందు గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసి నెటిజన్లకు మంచిపని చెప్పిన నిధి అగర్వాల్ తాజాగా తమిళ సంప్రదాయం ఉట్టి పడేలా చీరను సింగారించుకున్న ఫొటోను పోస్ట్ చేసింది.
ఇంతలో ఇంతమార్పు ఏమిటమ్మా అన్న నెటిజన్ల ప్రశ్నకు ఏంలేదు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేసి బోర్ కొట్టిందనీ, అందుకే ఒక మార్పు కోసం చీర కట్టిన ఫొటోలను విడుదల చేసినట్లు చాలా సింపుల్‌గా బదులిచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి సారించడంతో ఇక్కడ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగమే ఇదని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇకపోతే నటి నిధి అగర్వాల్ గురించి మరో ప్రచారం ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందుకు కారణం తను పోస్ట్ చేసిన ఒక వీడియోనే. ఖరీదైన పోర్చే కారును డ్రైవ్ చేస్తున్న వీడియోనే అది. దాని విలువ కోటి రూపాయలు. ఒకేఒక్క చిత్రం హిట్ అవ్వడంతోనే కోటి రూపాయల ఖరీదైన కారును నిధి అగర్వాల్ కొనుగోలు చేయడంతో ఇతర హీరోయిన్లకు కంటగింపుగా మారింది. లక్కుకంటే ఈ అమ్మడిదేగా అని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. కాగా ప్రస్తుతం నిధి అగర్వాల్ జయంరవికి జంటగా భూమి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం పక్కా పల్లెటూరి యువతిగా మారిపోయ్యింది. ఇంతకు ముందు రోమియో జూలియట్, బోగన్ వంటి సక్సెస్‌పుల్ చిత్రాలను తెరకెక్కించిన లక్ష్మణ్ దీనికి దర్శకుడు. అంతేకాదు ఇది నటుడు జయంరవికి 25వ చిత్రం. భూమి చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. నటి నిధి అగర్వాల్ కూడా కోలీవుడ్‌లో తన భవిష్యత్ గురించి కాస్త ఎక్కువే కలలు కంటోందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment