ప్రభాస్‌ హీరోయిన్‌కి వేధింపులు.. రంగంలోకి పోలీసులు! | Actress Nidhhi Agerwal Files Cybercrime Complaint Against Social Media Harassment | Sakshi
Sakshi News home page

చంపేస్తానంటూ బెదిరింపులు.. కేసు పెట్టిన హీరోయిన్‌

Published Thu, Jan 9 2025 11:56 AM | Last Updated on Thu, Jan 9 2025 12:53 PM

Actress Nidhhi Agerwal Files Cybercrime Complaint Against Social Media Harassment

సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది చేసింది హీరోయిన్ నిధి అగర్వాల్( Nidhhi Agerwal). సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని ఫిర్యాదులో  పేర్కొంది. సదరు వ్యక్తి తనతో పాటు తనకు ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలిపింది. 

ఆయన బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, సదరు నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ తన ఫిర్యాదులో కోరింది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు నిధి అగర్వాల్ కంప్లైంట్ తీసుకుని, విచారణ చేపట్టారు.

వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నిధి
బాలీవుడ్‌ నుంచి వచ్చి టాలీవుడ్‌లో రాణిస్తున్న హీరోయిన్లలో నిధి అగర్వాల్‌ ఒకరు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది నిధి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను అనే సినిమా చేసింది. ఆ సినిమా కూడా నిరాశపరిచింది. దాంతో ఈ బ్యూటీకి ఇక అవకాశాలు రావడం కష్టమే అని అనుకున్నారు అంతా.. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో నటనతో పాటు గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా చాన్స్‌లు వచ్చాయి. ఇప్పుడు రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లతో నటిస్తోంది.

‘రాజాసాబ్‌’తో రొమాన్స్‌
మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్‌’(The Raja Saab). కామెడీ హారర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే మిగతా హీరోయిన్లలో పోలిస్తే నిధి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఎక్కువే ఉందట. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘వీరమల్లు’కి జోడీగా
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu). క్రిష్‌ సారథ్యంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో రానుంది.  ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిధి నటిస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ తొలిభాగం ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది. అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌,  నోరాహి ఫతేహి, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 28న ఈ చిత్రం మొదటి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement