
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.
ఏం జరిగిందంటే?
నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ‍్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)
ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.
నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత)
