టాలీవుడ్ కపుల్ మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్‌లు జంటగా మరోసారి కెమెరా ముందుకు వచ్చారు. 20 ఏళ్ల క్రితం ‘వంశీ’ సినిమాలో అలరించిన ఈ జంట ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయిదేళ్ల పాటు ప్రేమించుకున్న మహేశ్-నమ్రతలు 2005లో పెళ్లి చేసుకుని వైవాహికి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటికే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నమ్రత పెళ్లి అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి ఇంటి వ్యవహరాలతో పాటు మహేశ్‌కు సంబంధించిన సినిమా వ్యవహరాలను చూసుకుంటోంది. ప్రస్తుతం ఈ జంటకు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమనేని ఉన్నారు.
చదవండి: Republic Review:‘రిపబ్లిక్’మూవీ రివ్యూ
ఎంతోకాలంగా తెర వెనక ఉంటూ సినిమాల పరంగా మహేశ్ సక్సెస్‌లో భాగమవుతున్న నమత్ర మరోసారి భర్తతో కలిసి ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చింది. అయితే ఇది ఏ సినిమా కోసమో కాదు. ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫొటోలకు ఫొజులు ఇచ్చారు ఈ లవ్వింగ్ కపుల్. నమ్రత వైట్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్‌తో ఫార్మల్ లుక్‌తో ఉండగా మహేశ్ బ్రెజర్ షూట్‌తో హాలో అనే మ్యాగజైన్ కవర్ పేజీ కోసం వీరిద్దరూ జంటగా ఫొజులు ఇచ్చారు.
చదవండి: ‘మా’ ఎన్నికలు: పోటీ నుంచి తప్పుకున్న బండ్ల గణేశ్
ఈ ఫొటోలో మహేశ్-నమత్రలు నెటిజన్లకు కనులవిందు కలిగించారు. ఇన్నాళ్లకు మరోసారి కెమెరా ముందు వీరిని జంటగా చూసి ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇటీవల నమత్ర మహేశ్, పిల్లలతో కలిసి ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మహేశ్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కలిసి ఆమె నటించారు. కాగా ప్రస్తుతం మహేశ్ సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కీర్తి సూరేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
చదవండి: నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల
Comments
Please login to add a commentAdd a comment