Keerthy Suresh: వెరైటీ చీరకట్టులో కీర్తిసురేష్‌ ఫోటోషూట్‌ | Marakkar: Keerthy Suresh Shares Inspiration Of Her Looks As Aarcha | Sakshi
Sakshi News home page

Keerthy Suresh: వైరల్‌గా మారిన కీర్తిసురేష్‌ లెటెస్ట్‌ ఫోటోషూట్‌

Published Thu, Dec 2 2021 2:51 PM | Last Updated on Thu, Dec 2 2021 3:14 PM

Marakkar: Keerthy Suresh Shares Inspiration Of Her Looks As Aarcha - Sakshi

Keerthy Suresh Latest Photo Shoot Goes Viral:ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా క్రేజ్‌ సందించుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్‌ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా గడపుకున్న కీర్తి సురేష్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పడు తన లేటెస్ట్‌ అప్‌డేట్స్‌తో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్‌ షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెరైటీ చీరకట్టులో కీర్తి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి నటించిన మలయాళ  చిత్రం ‘మరక్కర్‌: లయన్‌ ఆఫ్‌ ది అరేబియన్‌ సీ’.నేడు(డిసెంబర్‌2)న రిలీజైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఆమె తొలిసారిగా మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్‌ మోహన్‌లాల్‌ (మోహన్‌లాల్‌ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement