
దేవీ దగ్గర చాలా కళలున్నాయి
దేవీ శ్రీ ప్రసాద్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. యువ హీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్, అప్పుడప్పుడు తెర మీద కూడా...
దేవీ శ్రీ ప్రసాద్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్. యువహీరోలతో పాటు స్టార్ హీరోలకు కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన దేవీశ్రీ ప్రసాద్, అప్పుడప్పుడు తెరమీద కూడా కనిపిస్తుంటాడు. తన చేసిన ఆల్బమ్స్కు ప్రమోషనల్ సాంగ్స్తో పాటు స్టేజ్ పర్ఫామెన్స్లతోనూ అలరిస్తుంటాడు. అంతేకాదు ఈ మధ్యే విడుదలైన కుమారి 21 ఎఫ్ సినిమా కోసం కొరియోగ్రాఫర్గా కూడా మారాడు దేవీ.
ఇలా మల్టీ టాలెంటెడ్గా ప్రూవ్ చేసుకున్న దేవీ శ్రీ ప్రసాద్ తాజాగా తనలోని మరో టాలెంట్ను ప్రదర్శించాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో తానే స్వయంగా ఓ ఫొటో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. లావణ్య త్రిపాఠీ కూడా దేవీ చేసిన ఫోటో షూట్తో తెగ మురిసిపోతుంది. 'దేవీకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, నాతో ఓ క్యాజువల్ ఫోటో షూట్ చేస్తానని చాలా కాలంగా అడుగుతున్నాడు. ఇప్పటికి కుదిరింది. దేవీ నిజంగా అమేజింగ్ ఫోటోగ్రాఫర్' అంటూ పొగిడేస్తోంది.