లావణ్యా త్రిపాఠి(Lavanya Tripathi) టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. మలయాళ నటుడు దేవ్ మోహన్ మరో లీడ్ రోల్ చేస్తున్నారు. తాతినేని సత్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఎమ్. నాగమోహన్ బాబు, టి.రాజేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం సోమవారం జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ టీఎల్‌వీ ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. తాతినేని సత్య మాట్లాడుతూ– ‘‘మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామా ‘సతీ లీలావతి’. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో తెరకెక్కుతోంది. సోమవారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణప్రారంభిస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఈ స్క్రిప్ట్ వినగానే నేటి తరం ఆడియన్స్కు కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందనిపించింది’’ అన్నారు నిర్మాతలు ఎమ్. నాగమోహన్ బాబు, టి. రాజేష్.
Comments
Please login to add a commentAdd a comment