
కన్నడ హీరో కిచ్చా సుదీప్ 28 సంవత్సరాలుగా ఎన్నో సినిమాలతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆయన కూతురు సాన్వీ సుదీప్ చిత్ర పరిశ్రమలో అడుపెట్టబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు సోషల్‌మీడియాలో సాన్వీకి స్వాగతం పలుకుతున్నారు. కిచ్చా సుదీప్ నటించిన తాజా చిత్రం మ్యాక్స్ మంచి ఆదరణ పొందింది. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను ఇంకా అలసిపోలేదని అయితే ఏదో సమయంలో తాను నటన నుంచి వైదొలిగే అవకాశం ఉందని షాకింగ్ న్యూస్ చెప్పారు.
సినిమా పరిశ్రమ నుంచి కిచ్చా సుదీప్ వైదొలిగిపోతానని చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇంతలోనే ఆయన కూతురు సాన్వీ ఒక పాడ్‌కాస్ట్‌లో ఇలా చెప్పుకొచ్చింది. 'సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పటకే హైదరాబాద్‌లో 4 నెలల వర్క్‌షాప్‌లో శిక్షణ కూడా పూర్తి చేశాను. నా సొంతంగా అవకాశాలు తెచ్చుకోవాలని ఎదురుచూస్తున్నాను. నాన్న పేరు చెప్పుకుంటే అవకాశాలు వెంటనే దొరుకుతాయి. కానీ, నాకు అలా అవకాశం దక్కించుకోవడం ఇష్టం లేదు. అందుకే నేను నటి అయ్యేందుకు మరికొంత సమయం పట్టొచ్చు. ఇంతలో నేను దర్శకత్వం, స్క్రిప్ట్ రైటింగ్‌లో రాణించే ప్రణాళికలు పెట్టుకున్నాను. పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాల్లోనూ నేను ప్రయత్నించాలనుకుంటున్నాను. కానీ, నా అసలైన టార్గెట్ నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే..' అని ఆమె చెప్పింది.

తాను చాలా కాలంగా అధిక బరువుతో బాధపడుతున్నానని, అందువల్ల నటిగా చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని సాన్వీ సుదీప్ నిజాయితీగానే చెప్పంది. ఈలోగా, తాను కెమెరా వెనుక జరిగే పనుల్లో ఉంటానని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు పలు పాటలు పాడిన ఆమె హీరోయిన్‌గా మాత్రమే నటించాలని కోరిక తనకు లేదని కూడా చెప్పింది. ఎలాంటి పాత్ర వచ్చినా సరే చేస్తానని ఆమె తెలిపింది. అయితే, ఫైనల్‌గా సాన్వీ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసింది.
సాన్వీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి సింగర్ కూడా. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా ఆమె పాడింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజం చేస్తూ.. సినిమా ప్రపంచంలో తన ఎంట్రీ ఉంటుందని సాన్వీ పేర్కొంది. ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment