Sanvi
-
అయ్య బాబోయ్.. కిచ్చ సుదీప్‌కి ఇంత పెద్ద కూతురు ఉందా?
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep ). అక్కడ స్టార్ హీరోగా గుర్తింపు ఉన్నప్పటికీ..తెలుగులో విలన్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈగ తర్వాత సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. కన్నడ మాదిరే ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన మాక్స్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. మాస్ హీరోగా గుర్తింపు పొందిన సుదీప్.. తెరపై చాలా ఫిట్‌గా కనిపిస్తాడు. వయసు 52 ఏళ్లు దాటినా బయట కూడా యంగ్‌గానే కనిపిస్తాయి. అందుకే సుదీప్ వయసు యాభై ఏళ్లు అంటే చాలా మంది నమ్మరు. ఇక ఈ హీరోకి 21 ఏళ్ల కూతురు ఉన్నదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సుదీప్ కూడా తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడడు. అతని కూతురు గురించి కన్నడ ప్రేక్షకులకు తెలుసు కానీ..మనవాళ్లకి మాత్రం అంతగా తెలియదు. ఆమె పేరు సాన్వీ సుదీప్(Sanvi Sudeep). అందం విషయంలో హీరోయిన్‌కి మించదు. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి సింగర్ కూడా. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా పాడింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్గా పరిచయం చేయబోతున్నాడట. మరోవైపు సుదీప్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అలాగే కన్నడ బిగ్‌బాస్ షోకి హోస్టింగ్గానూ వ్యవహరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Sanvi Sudeep (@sanvisudeepofficial) -
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)
-
నిధి కోసం...
రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నూతన దర్శకుడు సచిన్ తెరకెక్కించిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. పుష్కర్ ఫిలింస్ పతాకంపై పుష్కర్ మల్లికార్జున్, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ‘దిల్’ రాజు తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ– ‘‘నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. మూడేళ్లు కష్టపడి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వంశీకృష్ణ అనే మిత్రుడి ద్వారా తెలుగుతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్గార్ల సినిమాలు చూసేవాణ్ణి. తెలుగు ప్రజలకు సినిమా అనేది సంస్కృతిలో ఓ భాగం. ఇక్కడి ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో? ప్రేమిస్తారో తెలిసింది. అందుకే మా సినిమాని తెలుగులోనూ విడుదల చేస్తున్నాం. రామజోగయ్యశాస్త్రిగారు నాలుగు పాటలకు మంచి సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రహస్యాలతో కూడిన ఫ్యాంటసీ కథ ఇది. కొంత ఆలస్యమైనా మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా’’ అన్నారు శాన్వీ. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సమావేశంలో పంపిణీదారుడు సతీష్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, ఇమ్రాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
శాన్వికి డబుల్ టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: మాతృశ్రీ టెన్నిస్ అకాడమీలో జరిగిన జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీకి చెందిన ప్లేయర్ శాన్వి రెడ్డి సత్తాచాటింది. అండర్–10, 8 వయో విభాగాల్లో బాలికల కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. మియాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలికల ఫైనల్లో శాన్వి 6–1తో శ్రేయ పాట్కర్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో 4–1తో సుహానిపై, క్వార్టర్స్‌లో 4–0తో రిధిమపై గెలుపొందింది. అండర్–8 విభాగంలో శాన్వి 4–0తో సంజను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా అకాడమీ కార్యదర్శి, టీఎస్ఆర్టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి. ఆర్. కిరణ్ ఆమెను అభినందించారు. -
నటుడి విడాకులపై క్లారిటీ వచ్చింది!
సాక్షి, బెంగళూరు : ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్. ఆయన తన భార్య ప్రియ రాధాకృష్ణన్‌తో 14 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు కోరుతూ 2015లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఈ దంపతులు మనసు మార్చుకున్నారు. కుటుంబ కలహాలతో ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన ఈ సుదీప్, ప్రియలు తమ కూతురు శాన్వి కోసం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు వెల్లడించారు. ఈ దంపతుల లాయర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుదీప్, ప్రియలు తమ వైవాహిక బంధాన్ని కొనసాగించాలనుకున్నట్లు తెలిపారు. కోర్టులో కేసు వేసినప్పటి నుంచీ సుదీప్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని చెప్పారు. భార్య ప్రియకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సిద్ధమైన సుదీప్ కూతురు శాన్వి కోసం మనసు మార్చుకున్నారని వివరించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి జీవించాలనుకున్నట్లు రాతపూర్వకంగా తెలపగా బెంగుళూరు ఫ్యామిలీ కోర్టు వారి నిర్ణయాన్ని అంగీకరించింది. వారికి మరో అవకాశం ఇచ్చనట్లు పేర్కొన్నారు. 2001లో నటుడు సుదీప్, ప్రియలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప శాన్వి ఉంది. అయితే కుటుంబ కలహాల కారణంగా 2015లో ఈ దంపతులు విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే శాన్వి కోసం తమ నిర్ణయాన్ని మార్చుకుని కలిసుండటానికి సిద్ధం కావడంతో సుదీప్ అభిమానులతో పాటు ప్రియ కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. -
పనికిరాని బోరుబావులను మూసేయండి
అన్ని జిల్లాల కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ ఆదేశం నల్లగొండలో శాన్వి మృతిపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా వల్లాల గ్రామంలోని బోరుబావిలో పడి రెండేళ్ల బాలిక శాన్వి మృతి చెందడం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. శాన్వి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శాన్వి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి కేటీఆర్.. నల్లగొండ జిల్లా కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఫోన్‌చేసి మాట్లాడారు. నిరుపయోగంగా ఉన్న, పనికిరాని బోరుబావులను మూసివేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఈ సంఘటన జరగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. ప్రమాదకరమైన బోరుబావుల విషయమై ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యజమానిపై క్రిమినల్ కేసు పెట్టండి పనికి రాని బోరుబావులను మూసేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఈ ప్రమాదానికి కారణమైన భూమి యజమానిపై క్రిమినల్ కేసు పెట్టాలని మంత్రి కేటీఆర్ నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. గతంలో పలుమార్లు అధికారుల ద్వారా, మీడియా ద్వారా బోరుబావుల విషయమై ప్రచారం నిర్వహించామని, అయినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. పనికిరాని బోరుబావుల మూసివేత కార్యక్రమాన్ని అవసరమైతే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. -
తల్లీ కూతుళ్ల బలవన్మరణం
ఘట్కేసర్/బచ్చన్నపేట : ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ ఓ తల్లి.. తన కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాల వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథ నం ప్రకారం.. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండలం గోపాల్‌నగర్‌కు చెందిన స్వప్న(25)కు కూతురు శాన్వీ(3), కుమారుడు శ్యాం ఉన్నారు. వీరు హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నివసిస్తు న్నారు. సోమవారం స్వప్న తన కూతురితో కలిసి ఇంట్లోంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఇదిలాఉండగా సాయంత్రం ఘట్కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర రైల్వే ట్రాక్‌పై తల్లీకూతురు విగతజీవులుగా పడి ఉన్నారు. స్థానికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీఆర్పీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మహిళ శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. ముఖం గుర్తించలేని స్థితిలో ఉంది. చిన్నారికి కూడా గాయాలు ఉన్నాయి. దీంతో తల్లీకూతుళ్లు గుర్తుతెలియని రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీకూతుళ్ల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామారావు తెలిపారు. -
'ప్యార్ మే పడిపోయానే' టీంతో చిట్ చాట్
-
శాన్వి బ్యూటీకి పడిపోయిన సంచలన డైరెక్టర్
శాన్వి బ్యూటీకి ఓ సంచలన డైరెక్టర్ పడిపోయాడట. ఇంతకీ ఈ శాన్వి ఎవరు? ఆ సంచలన డైరెక్టర్ ఎవరు? లవ్లీ సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ శాన్వికి అవకాశాలమీద అవకాశాలు వచ్చిపడుతున్నాయి. లవ్లీ చిత్రంలో హీరోయిన్గా నటించిన శాన్వి అందాలకు ముగ్ధుడు కాని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. జీరో సైజ్ ఫిగర్ - నాజూకు నడుం - కళ్లుచెదిరే అందాలు... కుర్రకారుని పిచ్చెక్కించింది. అందంతోపాటు మంచి నటన ప్రదర్శించింది. మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ టాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది. 'లవ్లీ' చిత్రంలో శాన్వి ఆదికి జంటగా నటించింది. ఆ తరువాత హీరో సుశాంత్ సరసన అడ్డాలో నటించింది. మళ్లీ ఆది హీరోగా నటించే 'ప్యార్ మే పడిపోయానే' చిత్రంలో నటిస్తోంది. ఈ అమ్మడు నటించిన చిత్రాల హిట్-ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ఛాన్స్‌లు కొట్టేస్తోంది. అందానికి తోడు రెమ్యూనరేషన్ విషయంలో చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉంటడంతో అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి. మరో రెండు సినిమాలలో కూడా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అవకాశాలే కాకుండా తను నటించాలని కలలు కన్న డైరెక్టర్ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కిచ్చుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించాలని ఈ అందాల బొమ్మ కలట. రామ్‌గోపాల్ వర్మ ఈ మధ్య ఈ బ్యూటీ నటించిన తెలుగు సినిమాలు చూసి, ఆ అందానికి పడిపోయాడట. అంతే ఇంకేముంది శాన్వికి తన చిత్రంలో ఛాన్స్ ఇచ్చేశారు. ఊహించని అవకాశం. తన స్వప్నం నెరవేరడంతో శాన్వి ఆనందానికి అవధులులేవు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందే రౌడీ సినిమాలో విష్ణుకి జోడీగా శాన్వి ఎంపికైంది. హీరోయిన్ల బ్యూటీని గుర్తించడంలో, వారిని అందంగా, అద్భుతంగా చూపించడంలో వర్మ దిట్ట. ప్రఖ్యాత దర్శకుడు బాపు హీరోయిన్ను ఒక రకంగా చూపిస్తే, వర్మ మరో రకంగా చూపిస్తారు. ప్రిన్స్ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో నిర్మిస్తున్న చిత్రంలో కూడా శాన్విని తీసుకోబోతున్నట్లు సమాచారం.