
సాక్షి, హైదరాబాద్: మాతృశ్రీ టెన్నిస్ అకాడమీలో జరిగిన జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో సరోజిని క్రికెట్, టెన్నిస్ అకాడమీకి చెందిన ప్లేయర్ శాన్వి రెడ్డి సత్తాచాటింది. అండర్–10, 8 వయో విభాగాల్లో బాలికల కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది.
మియాపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో అండర్–10 బాలికల ఫైనల్లో శాన్వి 6–1తో శ్రేయ పాట్కర్‌పై విజయం సాధించింది. అంతకుముందు సెమీస్‌లో 4–1తో సుహానిపై, క్వార్టర్స్‌లో 4–0తో రిధిమపై గెలుపొందింది. అండర్–8 విభాగంలో శాన్వి 4–0తో సంజను ఓడించి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా అకాడమీ కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి. ఆర్. కిరణ్ ఆమెను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment