
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep ). అక్కడ స్టార్ హీరోగా గుర్తింపు ఉన్నప్పటికీ..తెలుగులో విలన్ పాత్రతో ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈగ తర్వాత సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదల అవుతున్నాయి. కన్నడ మాదిరే ఇక్కడ కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. ఇటీవల ఆయన నటించిన మాక్స్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. థియేటర్స్‌లోనే కాదు ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది.

మాస్ హీరోగా గుర్తింపు పొందిన సుదీప్.. తెరపై చాలా ఫిట్‌గా కనిపిస్తాడు. వయసు 52 ఏళ్లు దాటినా బయట కూడా యంగ్‌గానే కనిపిస్తాయి. అందుకే సుదీప్ వయసు యాభై ఏళ్లు అంటే చాలా మంది నమ్మరు. ఇక ఈ హీరోకి 21 ఏళ్ల కూతురు ఉన్నదనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సుదీప్ కూడా తన ఫ్యామిలీ గురించి ఎక్కువగా మాట్లాడడు. అతని కూతురు గురించి కన్నడ ప్రేక్షకులకు తెలుసు కానీ..మనవాళ్లకి మాత్రం అంతగా తెలియదు. ఆమె పేరు సాన్వీ సుదీప్(Sanvi Sudeep). అందం విషయంలో హీరోయిన్‌కి మించదు.

ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి సింగర్ కూడా. ఇప్పటికే పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసింది. సుదీప్ మేనల్లుడు నటించిన ‘జిమ్మీ’ సినిమాలో ఓ పాట కూడా పాడింది. త్వరలోనే ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయబోతున్నాడట. మరోవైపు సుదీప్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అలాగే కన్నడ బిగ్‌బాస్ షోకి హోస్టింగ్‌గానూ వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment