Kiccha Sudeep
-
ఓటీటీ కంటే ముందే టీవీలోకి రాబోతున్న కన్నడ సూపర్ హిట్ మూవీ
ఈ మధ్యకాలంలో ఓ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సరే నాలుగైదు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్ని సినిమాలు అయితే థియేటర్లో రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీల్లోకి వదిలేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత ఆ సినిమా టీవీల్లోకి వచ్చేస్తుంది. ముందు థియేటర్ తర్వాత ఓటీటీ, చివరిగా శాటిలైట్.. కొనుగోలు చేసినప్పుడు ఈ విధంగా ఒప్పందం చేసుకుంటారు. ఏ సినిమా అయినా సరే ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా తర్వాతే టీవీల్లో ప్రసారం అవుతాయి. కానీ ఓ సూపర్ హిట్ సినిమా మాత్రం ముందుగానే టీవీల్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.యూఐ బాటలో మ్యాక్స్కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'(Max Movie). వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబర్ 25న థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ.. టీవీకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. అంటే ఓటీటీ కంటే ముందే ఈ సినిమా టీవీలో ప్రసారం కానుంది. ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ నెట్వర్స్ సొంతం చేసుకుంది. దీంతో ఈ మధ్యే జీ కన్నడ ఛానెల్ లో 'మ్యాక్స్' మూవీ త్వరలోనే అంటూ ఓ ప్రోమో తీసుకొచ్చింది. ఇది చూసి ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ మూవీ డిజిటల్ హక్కులకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే విషయంలోనూ స్పష్టత లేదు. ఓటీటీ కంటే ముందే టీవీలో వచ్చే అవకాశం ఉంది. కన్నడలో మ్యాక్స్ ఒక్కటే కాదు మరో పెద్ద సినిమా కూడా నేరుగా టీవీల్లోకే రాబోతుంది. ఉపేంద్ర దర్శకత్వం వహించిన నటించిన ఈ చిత్రం కూడా జీ ఛానెల్లోనే ప్రసారం కానుంది. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేసింది.మాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.#MaxTheMovie Coming soon Zee Kannada.@KicchaSudeep 👑 pic.twitter.com/7vSn4yX3Gs— 𝔸𝕒𝕕𝕚 𝕊𝕦𝕕𝕖𝕖𝕡𝕚𝕒𝕟 (@AadiSudeepian) February 1, 2025 -
కన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..?
కన్నడలో బిగ్‌బాస్ సీజన్ 11 (Kannada Bigg Boss 11) ముగిసింది. మొదటిసారి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ విజేతగా నిలిచాడు. సుమారు 120 రోజులుగా కొనసాగిన ఈ సీజన్లో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగారు. జనవరి 26న బిగ్‌బాస్ ఫైనల్ ముగిసింది. దీంతో ట్రోఫీతో పాటు నగదును విజేతకు సుదీప్ అందించారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది.బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత(Hanumantha) విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా ఆట మొదలపెట్టిన అతను ఏకంగా టైటిల్ విన్నర్ కావడంతో అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మంచి గుర్తింపు పొందాడు. సంగీతంతో పరిచయం లేకుండానే 2018 సారిగమప కన్నడ 15వ సీజన్లో హనుమంత రన్నరప్‌గా నిలిచాడు. దీంతో చాలామంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారు. ఆపై మరుసటి ఏడాదిలో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో పాల్గొన్న హనుమంత ఇక్కడ కూడా తన టాలెంట్తోనూ మెప్పించాడు. ఈ గుర్తింపుతో బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా 21వ రోజున హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ఆట, మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించాడు. చివరకు కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 విజేతగా నిలిచాడు.ప్రైజ్‌మనీ ఎంత..?ట్రోఫీ రేసులో హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు టాప్-5లో ఉన్నారు. అయితే, గట్టిపోటీ తట్టుకుని హనుమంత విజేత కాగా.. రన్నరప్‌గా త్రివిక్రమ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో రజత్, మోక్షిత, మంజు వరుసగా ఉన్నారు. విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. తెలుగు బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm— Colors Kannada (@ColorsKannada) January 26, 2025 -
కిచ్చా సుదీప్ ‘మాక్స్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాక్స్ నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులునిర్మాత: కలైపులి ఎస్. థానుదర్శకత్వం: విజయ్ కార్తికేయసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్రఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబువిడుదల తేది: డిసెంబర్ 27, 2024కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఎవరెలా చేశారంటే.. కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' హంటింగ్ ట్రైలర్ విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది. -
బిగ్‌బాస్ షోకు గౌరవం దక్కట్లేదు.. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై
కన్నడలో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్లు విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న ఆయన పదకొండో సీజన్‌ను కూడా తనే నడిపిస్తున్నాడు. అయితే ఇకమీదట రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని, ఇదే తన చివరి బిగ్‌బాస్ సీజన్ అని అక్టోబర్‌లో ప్రకటించాడు.మనసుకు అనిపించింది చెప్పాఅందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్తున్నానంటూ ట్వీట్ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో!ఆలోచన వచ్చిన వెంటనే..అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. కన్నడ బిగ్‌బాస్‌కు..మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్‌కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ప్రస్తుతం మ్యాక్స్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 చదవండి: Bigg Boss Telugu 8: ఆ రెండూ జరగకపోయుంటే ఫినాలే వేరేలా ఉండేది! -
బిగ్ ఫైట్.. కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' కూడా ఆ రోజే విడుదల
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. మ్యాక్స్ చిత్రం తెలుగులో డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రానుంది.'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి. క్రిస్మస్ రేసులు ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉండనుంది. -
నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఆయన తల్లి సరోజా సంజీవ్ (86) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్ కుటుంబం శోకసంద్రంలో ఉంది.బెంగళూరు జేపీ నగర్‌లోని సుదీప్ నివాసంలో సరోజ భౌతికకాయాన్ని చివరి చూపు కోసం ఉంచనున్నారు. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజకు నటుడు సుదీప్తో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరోజ మృతి పట్ల సుదీప్ అభిమానులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, బంధువులు సంతాపం తెలిపారు. జేపీ నగర్ నివాసానికి ఇప్పటికే సుదీప్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మంగళూరుకు చెందిన సుదీప్ తల్లి సరోజ సినిమా పరిశ్రమకు దూరంగానే ఉండేవారు. అయితే, తన తల్లితో పాటు మంగళూరుకు కొద్దిరోజుల క్రితమే సుదీప్ వెళ్లిన విషయం తెలసిందే. -
బిగ్ బాస్‌కు షాకిచ్చిన సుదీప్.. హౌస్ట్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటన
బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 కొద్దిరోజుల క్రితమే ప్రారంభమైంది. సెప్టెంబర్ 29 నుంచి మొదలైన ఈ సీజన్లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా కొనసాగుతున్నారు. అయితే, ఈ సీజన్ తర్వాత హోస్ట్‌గా తాను వ్యవహరించలేనని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. వాస్తవంగా ఈ సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కానీ షో నిర్వాహకులు సుదీప్ ఇంటికి వెళ్లి రిక్వెస్ట్ చేయడంతో ఆయన తిరిగి సెట్లో అడుగుపెట్టారు.బిగ్ బాస్‌తో కిచ్చా సుదీప్‌కు పదేళ్ల అనుబంధం ఉంది. కన్నడలో ఈ రియాలిటీ షో ప్రారంభ సమయం నుంచి ఆయనే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. కలర్స్ ఛానల్లో ప్రసారం అయ్యే ఈ షో కోసం చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ సీజన్ తర్వాత తాను హోస్ట్‌గా కొనసాగలేనని సోషల్‌మీడియా ద్వారా ఇలా ప్రకటించారు. 'బిగ్ బాస్ పట్ల ఆదరణ చూపుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ నామీద చూపుతున్న ప్రేమ ఏ రేంజ్లో ఉందో ఈ షో కోసం వస్తున్న రేటింగ్ చెబుతుంది. మీ ప్రేమకు ఫిదా అవుతున్నాను. అయితే, బిగ్ బాస్‌తో నా ప్రయాణం ఇప్పటికి పదేళ్లు పూర్తి అయింది. 11వ ఏడాది కూడా కలిసి ప్రయాణం చేస్తున్నా. కానీ, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఎంతో ఉంది. దీంతో బిగ్ బాస్‌తో నా ప్రయాణాన్ని ముగించాల్సిన పరిస్థితి ఉంది. ఇదే నా చివరి సీజన్‌గా ఉండబోతుంది. ఇన్నేళ్లపాటు మీరందరూ నన్ను ఆదరించారు. ప్రస్తుతం నేను తీసుకున్న నిర్ణయాన్ని కూడా గౌరవిస్తారని కోరుకుంటున్నాను. ఈ సీజన్‌ని అత్యుత్తమమైనదిగా ఉండేలా నా వంతు ప్రయత్నం చేస్తా.' అని సుదీప్ తెలిపారు.బిగ్ బాస్ కన్నడతో సుదీప్ అనుబంధం ఒక దశాబ్దం పాటు కొనసాగింది. బిగ్ బాస్ షోకు ఆయన పేరు పర్యాయపదంగా మారింది. తనదైన స్టైల్లో హోస్టింగ్, చమత్కారమైన వ్యాఖ్యలతో పోటీదారులను మాత్రమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించారు. సుదీప్ ముందు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో ఈ షో నుంచి ఆయన తప్పుకుంటున్నారని తెలుస్తోంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 -
గౌరవ డాక్టరేట్‌కు నో చెప్పిన కిచ్చా సుదీప్.. అభినందిస్తున్న ఫ్యాన్స్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. సుమారు 28 ఏళ్లుగా అక్కడ చిత్ర పరిశ్రమకు ఆయన సేవలు అందిస్తున్నారు. అందుకు గుర్తింపుగా అందివచ్చిన డాక్టరేట్‌ను ఆయన కాదన్నారు. టాలీవుడ్లో ఈగ సినిమాతో ఇక్కడ వారికి బాగా దగ్గరయిన కిచ్చా సుదీప్ ఆ తర్వాత బాహుబలి సినిమాతో మెప్పించారు. దీంతో గతేడాది విడుదలైన విక్రాంత్ రోణా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఆధరించారు.వినోదం, నటనలో నటుడు కిచ్చా సుదీప్ చేసిన సేవలను కర్ణాటకలోని తుమకూరు విశ్వవిద్యాలయం గుర్తించింది. దీంతో ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. వీవీ సిండికేట్ సమావేశంలో జరిగిన ఈ చర్చను సుదీప్ పీఏ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల తర్వాత సుదీప్ రిప్లై ఇచ్చారు. అయితే, అందివచ్చిన గౌరవాన్ని కిచ్చా సుదీప్ వదులుకున్నారు. యూనివర్శిటీ నిర్ణయం పట్ల సుదీప్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా చెప్పారు. 'సమాజానికి సేవ చేస్తున్నవారు ఎందరో ఉన్నారు. నాకంటే కూడా వాళ్లే ఎక్కువ చేస్తున్నారు. వారిని గుర్తించి ఈ డాక్టరేట్ ఇస్తే బాగుంటుంది. నాకు ఇంకా అంతటి స్థాయి రాలేదు అనుకుంటున్నాను.' అంటూ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవాన్ని సుదీప్ నిరాకరించారు. యూనివర్సిటీ స్నాతకోత్సవ విలేకరుల సమావేశంలో తుమకూరు యూనివర్సిటీ ఛాన్సలర్ వెంకటేశ్వర్లు ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 17న తుమకూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానోత్సవం జరగనుంది. తుమకూరు యూనివర్సిటీ నుంచి ఈసారి ముగ్గురు గౌరవ డాక్టరేట్లను ప్రకటించారు. -
ఫోన్ పేతో వివాదం.. కన్నడిగులకు మద్దతుగా సుదీప్
కర్ణాటకలోని స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకించిన ఫోన్ పే సంస్థపై బహిష్కరణ ప్రచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఫోన్ పేపై కన్నడిగులు చేస్తున్న పోరాటానికి హీరో సుదీప్ మద్దతు తెలిపారు. ఫోన్ పేతో చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకోవాలని సుదీప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.కర్ణాటకలో ఉండే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల్లో స్థానికులకే ప్రాముఖ్యత ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అయితే, దీనిని పోన్ పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుబట్టారు. దీంతో అక్కడి ప్రజల నుంచి ఫోన్ పే పట్ల తీవ్రమైన వ్యతిరేఖత వచ్చింది.నటుడు సుదీప్ కర్ణాటకలో ఫోన్ పే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అక్కడ వినియోగదారులు డబ్బును పంపుతున్న సమయంలో 'థ్యాంక్యూ బాస్' అంటూ సుదీప్ వాయిస్ వినిపిస్తుంది. అయితే, కన్నడిగుల పట్ల ఫోన్ పే వ్యవహరించిన తీరుతో ఆ సంస్థ మీద అక్కడ ప్రజలు ఫైర అవుతున్నారు. ఈ నేపథ్యంలో కిచ్చ సుదీప్ ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నాడు. తనను ఆదరించిన కన్నడిగుల పక్షాన నిలబడేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. కన్నడిగులకు క్షమాపణలు చెప్పకుంటే ఫోన్ పే సంస్థతో తాను చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుదీప్ రేపు అధికారికంగా తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.తమ ఫోన్లలో ఫోన్ పే యాప్‌ను అన్ఇన్స్టాల్ క్యాంపెయిన్‌ను అక్కడి ప్రజలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కన్నడిగులకు సపోర్ట్ చేసేందుకు సుదీప్ ముందుకు వచ్చినట్లు ఆయన టీమ్ నుంచి సమాచారం అందుతోంది. అయితే, కన్నడిగులకు ఉద్యోగ రిజర్వేషన్లను చాలా మంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు. దీంతో ఆయా పారిశ్రామికవేత్తలపై నిరసన కూడా వ్యక్తమైంది. ప్రైవేట్ సంస్థల్లో కన్నడిగులకు రిజర్వేషన్ తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఫోన్ పే సీఈవో సమీర్ నిగమ్ మొదటగా వ్యతిరేకించారు. అందుకే, కన్నడిగుల అతనికి గుణపాఠం చెప్పాలని ప్రచారం జరుగుతోంది.రిజర్వేషన్ల విషయంలో వెనక్కు తగ్గిన కర్ణాటక ప్రభుత్వంకర్ణాటకలోని ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ గ్రేడ్ పోస్టుల్లో కన్నడిగులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై ప్రభుత్వం వెనకడుగు వేసింది. అక్కడి పరిశ్రమవర్గాల నుంచి భారీగా వ్యతిరేకత రావడంతో బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా పరిశీలించి రానున్న రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయ వెల్లడించింది. -
Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం!
సాక్షి, బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల నాటికి ఆపరేషన్ హస్తం చేపట్టి బీజేపీ, జేడీఎస్‌లలోని బలమైన నేతలను చేర్చుకుని ఎక్కువ సీట్లను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తోంది. కానీ చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ హస్తం తలుపు తట్టకపోవడంతో కేపీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకు అన్ని అవకాశాల్ని వాడుకుంటున్నారు. శనివారం రాత్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు బీసీ పాటిల్, రాజుగౌడ, మరికొందరితో చర్చలు జరిపారు. ప్రముఖ నటుడు నటుడు కిచ్చ సుదీప్ ఒక హోటల్లో జరిపిన పుట్టిన రోజు విందు ఇందుకు వేదికైంది. ఈ వేడుకకు హాజరైన బీజేపీ నాయకులతో డీకే మాటలు కలిపినట్లు సమాచారం. నేను బీజేపీని వీడను: రాజుగౌడ ఆపరేషన్ హస్తం చేసేందుకు నాకు క్యాన్సర్ గడ్డ ఏమీ లేదు, నాకు బీజేపీలో సరైన స్థానం ఇవ్వలేదని అసంతృప్తి ఉంది, అయినా పార్టీనీ వీడను అని రాజుగౌడ చెప్పారు. నియోజకవర్గంలో మంచి పనులు చేపట్టినా కూడా ఎందుకు ఓటమి పాలయ్యారని డీకే అడిగారు. సుదీప్ పుట్టినరోజు కంటే శివకుమార్‌తో మేము మాట్లాడిందే పెద్ద వార్త అయ్యింది అని చమత్కరించారు. చదవండి: అదనపు కట్నం కోసం పోలీస్ అకృత్యాలు.. భార్యపై లాఠీచార్జీ -
ట్రిపుల్ బొనాంజా
‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ వంటి సినిమాలతో కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. శనివారం (సెప్టెంబరు 2) సుదీప్ బర్త్ డే. ఈ సందర్భంగా సుదీప్ మూడు చిత్రాలను ప్రకటించి, తన అభిమానులకు ట్రిపుల్ బొనాంజా ఇచ్చారు. సుదీప్ హీరోగా ఆర్. చంద్రు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలకు కథ అందించిన రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ విజన్ చేస్తుండటం విశేషం. ఆర్సీ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. 2024లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. పదేళ్ల తర్వాత... ఇప్పటివరకూ సుదీప్ ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘మాణిక్య’ (2014) తర్వాత దర్శకుడిగా సుదీప్ మరో సినిమాకు మెగాఫోన్ పట్టలేదు. అయితే పదేళ్ల తర్వాత సుదీప్ నటిస్తూ, ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు టాక్. మ్యాక్స్ సుదీప్ హీరోగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘మ్యాక్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వి క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకాలపై కలైపులి యస్. ధాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి!
కిచ్చా సుదీప్ ఈ పేరు వింటే చాలా తెలుగువారికి రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ఏడాది ఆయన నటించిన విక్రాంత్ రోణ అభిమానులను పెద్ద ఆకట్టుకోలేదు. అయితే ఇటీవల సుమలత అంబరీష్ బర్త్ డే పార్టీలో కిచ్చా సుదీప్ కనిపించారు. ప్రస్తుతం ఆయన కిచ్చా46 చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నెక్స్ట్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా కోసం కిచ్చా సుదీప్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా తన న్యూ లుక్‌తో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. (ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా) కిచ్చా తన ఇన్‌స్టాలో సిక్స్ ప్యాక్‌తో బాడీని ప్రదర్శిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అయితే ఇదంతా కిచ్చా46 సినిమా కోసమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం సుదీప్ ఇలా రెడీ అయ్యారంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం సుదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పైల్వాన్ సినిమా కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'వర్కవుట్ చేయడం నా సంతోషకరమైన క్షణాలలో ఒకటి. ఇది నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. మిమ్మల్ని దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. కిచ్చా46 చిత్రం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కోసం మరో నెల సమయం ఉంది. దానికి ముందే ఈ వర్కవుట్.' అని సుదీప్ రాసుకొచ్చారు. కాగా.. తుపాకి, కబాలి, కర్ణన్, అసురన్‌తో సహా తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలైపులి ఎస్ తాను ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: పిల్లల ఫోటోలు రివీల్ చేసిన నయనతార.. ఈరోజే ఎందుకంటే?) View this post on Instagram A post shared by KicchaSudeepa (@kichchasudeepa) -
ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. కేపీసీసీ చీఫ్ సెటైర్లు..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 12 రోజులే గడువున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కన్నడ హీరో కిచ్చ సుదీప్తో బీజేపీ జోరుగా ప్రచారం చేయించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అలాగే మరో సీనియర్ హీరో దర్శన్‌తో కూడా ప్రచారం చేయించేందుకు సిద్ధమైంది. ఇద్దరి హీరోల జనాకర్షణతో మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. అయితే ఈ ఇద్దరు హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సెటైర్లు వేశారు. వారు బీజేపీలో చేరలేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తున్నారని గుర్తు చేశారు. వీరిద్దరి వల్ల కమలం పార్టీకి ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉంటుందని తాను భావించడం లేదన్నారు. కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని మరోసారి స్పష్టం చేశారు. కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13 కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. తాము మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుండగా.. ఈసారి 150పైగా స్థానాలు కైవసం చేసుకుని అధికారం చేజిక్కించుకుంటామని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. #WATCH | BJP star campaigner, Actor Kichcha Sudeepa holds a roadshow in Hubli-Dharwad Central Assembly constituency, ahead of the upcoming Karnataka elections on 10th May#KarnatakaElections pic.twitter.com/NspKhG3ilo — ANI (@ANI) April 28, 2023 చదవండి: ప్రధాని విషసర్పం.. తాకితే అంతే -
కర్ణాటకలో కిచ్చ సుదీప్ రోడ్ షో
-
ఆ ప్రసారాలు ఆపండి.. కోర్టును ఆశ్రయించిన కన్నడ స్టార్ హీరో!
యశవంతపుర(బెంగళూరు): అపరిచిత వ్యక్తి రాసిన లేఖపై వస్తున్న వదంతులను పత్రికల్లో, టీవీల్లో ప్రసారం చేయరాదని కోరుతూ ప్రముఖ నటుడు సుదీప్ కోర్టు తలుపు తట్టారు. నగరంలో మెయో హాల్లోని కోర్టులో పిటిషన్ వేశారు. అపరిచిత వ్యక్తి రాసిన లేఖలోని వివరాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్‌కోర్టును కోరారు. ఇటీవల సుదీప్ సీఎం బొమ్మైను కలిసి మద్దతు ప్రకటించడం, ఆ వెంటనే నీ ప్రైవేటు వీడియోలను బయటపెడతామని రెండు బెదిరింపు లేఖలు రావడం తెలిసిందే. ప్రాణహాని బెదిరింపులతో పాటు సుదీప్ కుటుంబసభ్యుల పేర్లను అపరిచితులు లేఖలో రాశారు. వీటిపై అనేక రకాలుగా మాధ్యమాలలో వార్తలు వస్తుండగా, వాటిని నివారించాలని ఆయన లాయర్లు కోరారు. మరోవైపు సుదీప్‌కి గన్‌మాన్ రక్షణ కల్పించాలని నిర్మాత మంజు పోలీస్ కమిషనర్‌కు విన్నవించారు. -
ఓటీటీలోకి ఉపేంద్ర ‘కబ్జ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జ’. శ్రియ హీరోయిన్గా నటించింది. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 17న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో ఈ చిత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఏప్రిల్ 14 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెసాన్ ప్రైమ్ వీడియో ట్వీట్ చేసింది. 1960 ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ కథ ఇది. కేజీయఫ్ సినిమా తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన తొలి రోజే ఈ చిత్రం డిజాస్టర్ టాక్ని తెచ్చుకుంది. అయితే కర్ణాటక విషయం పక్కన పెడితే మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి. a tale of unforeseen circumstances transforming an innocent young man into the most dreaded gangster ever! 🔥#KabzaaOnPrime, Apr 14 pic.twitter.com/wCRRyIDeAI — prime video IN (@PrimeVideoIN) April 11, 2023 -
కిచ్చా సుదీప్ ప్రైవేట్ వీడియో.. అతని పనేనా?
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ వివాదం కర్ణాటక రాజకీయాల్లో దుమారం లేపుతోంది. ఇటీవల ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే సుదీప్ ఇంటికి బెదిరింపు లేఖ వచ్చింది. ‘బీజేపీలో చెరితే నీ ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు బహిరంగంగా ప్రజలందరి ముందు పెడతాం’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సీరియస్‌గా తీసుకున్న సుదీప్.. తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. అయితే ఇదంతా చేసింది సుదీప్ కారు డ్రైవరే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ కారు డ్రైవర్ ను పనిలోనుంచి తీసేశారట సుదీప్. అతనే కక్ష్య పెంచుకొని ఈ పని చేసి ఉంటాడని సుదీప్ అండ్ టీమ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదీప్ కారు డ్రైవర్ ను పట్టుకుంటే లేఖకు సంబంధించి పూర్తి వివరాలు బయటకొస్తాయని భావిస్తున్నారు పోలీసులు. అయితే సుదీప్ ప్రైవేట్ వీడియో నిజంగానే అతడి దగ్గర ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియో అతడి దగ్గర ఉండొచ్చని సుదీప్ కూడా అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు ఆ కారు డ్రైవర్ పరారీలో ఉండడం.. ఆ అనుమానాలకు మరితం బలం చేకూరినట్లైంది. అతని ఫోన్ కూడా స్విచాఫ్ లో ఉంది. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు ఆ కారు డ్రైవర్ని వెతికే పనిలో పడ్డారని సమాచారం. అతను దొరికితేగానీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్! ఎన్నికల్లో పోటీపై నటుడి క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు. పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు. ‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ.. -
బీజేపీలోకి కిచ్చా సుదీప్, దర్శన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పలువురు తారలు రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నా కూడా. తాజాగా కన్నడ స్టార్ హీరోలు సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటకలోని ఓ ప్రైవేట్ హోటల్లో వీళ్లు బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సమక్షంలోనే వీళ్లు పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్టార్ క్యాంపెయినర్లుగా వీళ్లిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారని సమాచారం. ‘కిచ్చా’ సుదీప్ నాయక(ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సుదీప్‌ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడు కూడా. 2020లో ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్ ప్రచారం నిర్వహించారు. ఆపై అంబరీష్ మరణం తర్వాత.. జరిగిన మాండ్యా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర సుమలత అంబరీష్‌కు మద్దతు ప్రకటించాడు దర్శన్. తాజాగా.. సుమలత బీజేపీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుండగా.. అది ఫేక్ అని బీజేపీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరుగుతుండగా.. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
కబ్జ ట్విటర్ రివ్యూ
కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్ హీరోయిన్గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని నేడు(మార్చి 17) తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచాలను పెంచేసింది. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో కబ్జ ఒకటి. కేజీయఫ్ తరహాలో గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దీంతో యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారితో పాటు ఉపేంద్ర ఫ్యాన్స్ కబ్జ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కబ్జ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. #Kabzaa is another Eldorado of Kannada cinema🔥.R.Chandru's direction was fantastic🔥. #Upendra's acting was next level⭐.#Kicchasupeep's on-screen presence was lit🔥#Shivanna surprising entry gave me goosebumps.surely this is first blockbuster of 2023 Rating:4.5/5#kabzaareview pic.twitter.com/LD6jfZWcvI — Amith A (@AmithA59767744) March 16, 2023 కన్నడ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ చిత్రం కబ్జ. చంద్రు డైరెక్షన్ అదిరిపోయింది. ఉపేంద్ర యాక్టింగ్ నెక్ట్లెవల్. కిచ్చా సుదీప్ స్క్రీన్ ఫెర్మార్మెన్స్ బాగుంది. శివరాజ్‌కుమార్ ఎంట్రీ గూస్బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా 2023లో మొదటి బ్లాక్ బస్టర్‌గా కబ్జ నిలుస్తుందని చెబుతూ 4.5 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. Walkout feels.. Watched kgf 1,2? you can AVOID #Kabzaa Cheap version of KGF, same screenplay , same editing pattern. Not engaging at all. Bad dubbing n bad performance from upendra. Sudeep just cameo, other actors, nothing great. 2/5 FINALLY WATCH KGF AT HOME#Kabzaareview pic.twitter.com/L4Pa0YPiXv — Raghu436 (@436game) March 17, 2023 కబ్జ అస్సలు బాగాలేదు. కేజీయఫ్ 1,2 చూసినవాళ్లు కబ్జను అవైడ్ చేయ్యొచ్చు. కేజీయఫ్‌కి చీప్ వెర్షన్ ఈచిత్రం. అదే తరహా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్. ఉపేంద్ర నటన కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిదంటూ 2 రేటింగ్ ఇచ్చాడు మరో నెటిజన్. #Kabzaa What's wrong with Darshan fans! It's clear that KFI's only back draw is Darshan and his fans... — Thor (@HemsworthStarc) March 17, 2023 #KabzaaReview Mass Entertainment Mass Comeback Of #Upendra and introduction of #KicchaSudeep𓃵 & #ShivarajKumar VereLevel Entry Goosebumps Treat for Fans Story Lineup is More exited with return Gift for fans.. Overall Rating - 4/5 ⭐⭐⭐⭐@nimmaupendra @KicchaSudeep #Kabzaa — SOUTH DIGITAL MEDIA ™ (@SouthDigitalM) March 17, 2023 You have worked very hard for this @rchandru_movies .. wishing you to be blessed wth the success you deserve. Best wshs team #Kabzaa and @nimmaupendra sir . 🥂 pic.twitter.com/PJqRIBGCr8 — Kichcha Sudeepa (@KicchaSudeep) March 17, 2023 KABZAA MOVIE MADE SANDALWOOD PROUD AGAIN 😍🔥 DON'T BELIEVE IN ANY NEGATIVITY🔥 KICCHA BOSS CAMEO🥵💥💥 + INTERVAL BANG & CLIMAX😻😻 FIRE HAI BHAI MOVIE 😎#KabzaaFromTomorrow #Kabzaa #BlockBusterKabzaa pic.twitter.com/29C36MPTQ8 — Vinay (@Thapaswe) March 17, 2023 As Kannada Cinema continues its spectacular journey to mark its footprint across the world, #Kabzaa looks like another Grandeur & Raw attempt. All the best @nimmaupendra Garu @KicchaSudeep sir #ShivaRajkumar sir @shriya1109 Garu @rchandru_movies Garu & @RaviBasrur Garu & team. pic.twitter.com/lLFT7AtzuZ — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 16, 2023 #Kabzaa (Kannada|2023) - THEATRE. Upendra’s show. Kiccha’s 10Mins Cameo disappoints. Shreya gud. Shivanna 1 scene. Has heavy KGF flavour. Dull color tone. Music ok. Poor VFX. Narration s not so gripping. Usual Gangster Action stuff. Cliffhanger climax with a Part2 lead. AVERAGE! pic.twitter.com/FD7fHc61EA — CK Review (@CKReview1) March 17, 2023 -
పునీత్ జయంతి రోజునే ఉపేంద్ర సుదీప్‌ల కబ్జా రిలీజ్
తమిళసినిమా: కేజీఎఫ్ పార్టు–1, పార్టు–2, కాంతార, 777 చార్లీ, విక్రాంత్ రోమా వంటి కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించి భారతీయ సినిమానే తమ వైపు తిప్పుకున్నాయి. తాజాగా అదే బాణీలో రూపొందిన కన్నడ చిత్రం కబ్జా. బహు భాషా నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కథానాయకులుగా నటించిన ఇందులో నటి శ్రియ కథానాయకిగా నటించారు. మురళి శర్మ, సుధ ముఖ్యపాత్రలు పోషించారు. శిద్దేశ్వరా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఆర్.చంద్రశేఖర్ నిర్మించిన భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ప్రముఖ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ చిత్రం ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని 7 భాషల్లో కన్నడ చిత్ర పరిశ్రమ అప్పు అని అభిమానంతో పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలకు సంబంధించి దర్శకుడు మాట్లాడుతూ గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం కబ్జా అని తెలిపారు. 1947 ప్రాంతంలో ఒక స్వాతంత్య్ర సమరయోధుడు వేధింపులకు గురవుతాడన్నారు. ఆయన కుమారుడు గ్యాంగ్‌స్టర్ ముఠాలో చిక్కుకుంటాడని ఆ తర్వాత జరిగే కథే ఈ కబ్జా చిత్రం అని చెప్పారు. -
సుదీప్ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ
బెంగళూరు: నటుడు కిచ్చ సుదీప్ కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పార్టీ మాజీ ఎంపీ రమ్య సుదీప్తో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే విధానసభ ఎన్నికల నాటికి ప్రముఖ సినీ నటులను చేర్చుకోవాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రమ్య సినీ నటులతో చర్చలు సాగిస్తున్నారు. ఈ చర్చల్లో సుదీప్ స్పందన ఏమిటనేది ఉత్కంఠగా ఉంది. చదవండి: (చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు) -
రష్మికపై ట్రోలింగ్.. రాళ్లు కూడా విసురుతారన్న కన్నడ స్టార్
రష్మిక మందన్నాను ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం కిరిక్ పార్టీ. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు రావడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదగడం చకచకా జరిగిపోయాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిన రష్మిక ఇటీవల వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే! కిరిక్ పార్టీ దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా చూడలేదని అనడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ సినిమా దేశమంతా చూస్తే నువ్వొక్కదానివే చూడలేదని చెబుతున్నావని, నీకు గర్వం తలకెక్కిందని విరుచుకుపడ్డారు. రష్మిక మందన్నాపై జరిగిన ట్రోలింగ్‌పై కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ స్పందించాడు. కొన్నింటిని మనం మార్చలేం. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది. దీనివల్ల ఏ చిన్న విషయమైనా దావానంలా వ్యాపిస్తోంది. కానీ 15-20 ఏళ్ల క్రితం కేవలం టీవీలోనే ఇంటర్వ్యూలు వచ్చేవి. ఇంకా వెనక్కి వెళ్తే దూరదర్శన్, వార్తాపత్రికలు మాత్రమే ఉండేవి. అప్పుడూ సెలబ్రిటీల గురించి రాసేవాళ్లు. సెలబ్రిటీలన్నాక ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. మనం వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది నేర్చుకోవాలి. అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్లిపోవాలి. ఒక్కసారి సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందంటే నీకు పూలదండలు వేస్తారు. అదే చేత్తో టమాటలు, గుడ్లు, రాళ్లు కూడా విసురుతారు అని చెప్పుకొచ్చాడు. చదవండి: బిగ్‌బాస్ 6కు దారుణమైన రేటింగ్, అన్ని సీజన్ల కంటే తక్కువ సమంతను కాపాడుకుంటా: రష్మిక ఎమోషనల్ -
తెలుగులో కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ ‘హెబ్బులి’
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎమ్. మోహన శివకుమార్ సమర్పణలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కెప్టెన్ పాత్రను సుదీప్ స్టయిలిష్‌గా చేయడంతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతంగా నటించారు. తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. -
ఓటీటీలోకి వచ్చేసిన 'విక్రాంత్ రోణ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Vikrant Rona OTT : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై భారీ విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. The wait is over 🕛 Inspector #VikrantRona is here! Watch #VikrantRonaOnHotstar Streaming Now ▶️ https://t.co/ok2CxJAI9h@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @JackManjunath @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss pic.twitter.com/0pSL5HRcDR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 15, 2022 #VikrantRona is streaming now on #DisneyplusHotstar #VikrantRonaOnDisneyplusHotstar pic.twitter.com/Z2psTtmuBq — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) September 15, 2022 -
గో సంరక్షణ రాయబారిగా హీరో కిచ్చా సుదీప్
యశవంతపుర: గో సంరక్షణ రాయబారిగా నటుడు సుదీప్‌ను ఎంపిక చేసినట్లు పశు సంవర్థక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ తెలిపారు. పశుపాలనకు ప్రాధాన్యం కల్పించి పశు సంరక్షణకు ప్రభుత్వం తీసుకువచ్చిన పుణ్యకోటి దత్తు యోజన రాయబారిగా ఎంపికైన సుదీప్‌కు లేఖ రాసి అభినందనలు చెప్పినట్లు మంత్రి వివరించారు. గో సంరక్షణ రాయబారిగా సుదీప్తో శాఖకు మంచి బలం చేకూరినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంలో సుదీప్ పుట్టిన రోజు కావడంతో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. సుదీప్ ఇంటి వద్ద సందడి నటుడు సుదీప్ పుట్టినరోజు పురస్కరించుకుని ఇక్కడి జేపీ నగరలో గురువారం రాత్రి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా పోస్టర్‌ను విడుదల చేశారు. -
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా..
Kiccha Sudeep Vikrant Rona Enters Rs 100 Crore Club In 4 Days: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం 'విక్రాంత్ రోణ'. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. అత్యంత భారీ అంచనాల మధ్య జులై 28న పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది విక్రాంత్ రోణ. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరినట్లు సమాచారం. ఈ చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులోని నైజాం ఏరియాలో అతి తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నైజాం ఏరియాలో తొలిరోజు నుంచే మంచి బజ్ రావడంతో వీకెండ్లో చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. దీంతో 4 రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'విక్రాంత్ రోణ'ను నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. కన్నడ చిత్రసీమలో 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత అంత భారీ హిట్ సాధించిన చిత్రంగా 'విక్రాంత్ రోణ' రికార్డుకెక్కింది. కాగా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
విక్రాంత్ రోనతో ప్రేక్షకుల ముందుకు కిచ్చా సుధీప్
-
కిచ్చా జర్నీ
-
Vikrant Rona Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
టైటిల్ : విక్రాంత్ రోణ నటీనటులు :కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మధుసూదన్ రావు తదితరులు నిర్మాత: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ దర్శకత్వం: అనూప్ భండారి సంగీతం : అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్ విడుదల తేది: జులై 28, 2022 కథేంటంటే.. కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్ గంభీర్(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్నాథ్ గంభీర్(రమేశ్ రాయ్)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్ రోణ(కిచ్చా సుధీప్). ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్ రోణ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విక్రాంత్ రోణ..ఇదొక యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్, టీజర్లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్ పెరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్‌ట్రాక్, మదర్ సెంటిమెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎవరెలా చేశారంటే.. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్ బండారి పర్వాలేదు. క్లైమాక్స్‌లో అతని పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్ ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘విక్రాంత్ రోణ’ మూవీ ట్విటర్ రివ్యూ
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి భారీ స్పందన లభించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 28) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #VikrantRona one of the best 3 D movie in India,,, Best thrill with suspence ,,, what a experience in 3 d totally paisa vasool,,, Kannada industry is in Another level 🔥 🔥 🔥 And collection don't worry guys it will be another level because movie is on 🔥🔥 — Rakesh appu (@Kotresh57392792) July 28, 2022 త్రీడీలో వచ్చిన చిత్రాల్లో విక్రాంత్ రోణ ఒక మంచి చిత్రమని, సుదీప్ పెర్ఫామెన్స్ అద్భుతమంటూ కామెంట్ చేస్తున్నారు. కన్నడ పరిశ్రమని మరోస్థాయిలో నిలబెట్టిన చిత్రమిదని అంటున్నారు. En production design guru!! This is no less than a Hollywood film. Sudeep is stunning, 1st half superb with great interval bang #VikrantRona — Arun (@KfiTalks) July 28, 2022 హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది అంటున్నారు. My opinion Indian best 3D movie after #RRR is #VikrantRona It's impossible to do such a visuals with in 100 cro Kudos to #VikrantRona team#KicchaSudeep𓃵 #SalmanKhan #Sandalwood #Bollywood #Tollywood pic.twitter.com/VXmNsAr5WM — Sri Murali (@Sri_since_1998) July 28, 2022 #VikrantRona Ultimate comedy movie 😂 Every scene is dark. Biggest horror comedy gone wrong lol Biggest disaster from Side actor hero 😂#VikrantRonaFDFS #VikrantRonaReview #VikrantRonaOnJuly28 #KichchaSudeep — Jack (@HoxJack) July 28, 2022 Block Buster Review All Over 💥💥💥💥💥 VikrantRona Mania All Over 🔥 Record Breaking VikrantRona Movie 🔥#VikrantRona#VikrantRonaToday#VikrantRonaCelebration Megaa Block Buster VikrantRona 🔥@KicchaSudeep ❤@VikrantRona 🔥 pic.twitter.com/xWKf3z2CY2 — The Name Is Kiccha👑 (@TheNameIsKiccha) July 28, 2022 #VikrantRona one word @KicchaSudeep steal the show ,,,, Nirup excellent,,,, Ravishankar gowda ,, neetha everybody super jst wow that it ,,,,, Director is the real hero kudos — Vamshi Paidipally (@dir_vamsi) July 28, 2022 Interval twist ge Theaters full havali , one of the best interval scenes , Kiccha Boss Screen presence & Very Good quality , very very rich Making 💥💥 Eagerly Waiting for 2nd half 🤘🤘#VikrantRona #VikrantRonaFDFS @KicchaSudeep @VikrantRona — HITMAN ROCKY 😎 (@HITMANROCKY45_) July 28, 2022 @VikrantRona Interval@anupbhandari Anna Director Driving Till now , Great Senses of Comics, Mannerism he filled into inspector #VikrantRona The Swag of @KicchaSudeep Package Unexpected Interval Block Panna n Sanju Lived Up🙌 No Spoilers🤗 3D is Very Good.Still it's a Trailer pic.twitter.com/jJ3ydosC6j — TeAm SpiRiT (@TheRkBoss) July 28, 2022 #VikrantRona First half Report: 🛑 Interval Bang is Woww🔥 🛑 @KicchaSudeep 's Style & Swag is the big highlight of the cinema 🛑 BGM, Cinematography, production design is top notch. 🛑 @anupsbhandari 's #Rangitaranga flavour#VikrantRonaReview — Rakshith Reviews🎬 (@RakshithReviews) July 28, 2022 #VikrantRona 1st half: Commercial film blended up with Amazing visuals,BGM,Screenplay,looks everything positive👍,Interval is predictable but good👍 Good 1st half 2nd half: screenplay picks up,@KicchaSudeep action💥,Not like a routine thriller💥,Climax anthem and visuals💥 — OTT Thankan 2.0 (@ott_thankan) July 28, 2022 #VikrantRona -best ever storytelling in Sandalwood, @KicchaSudeep sir stole with his ultimate performance& screen presence it's going to be another feather in Kiccha's Acting cap, @anupsbhandari hatts off to u,one of best interval blocks in KFI 💥 1st half finished BLOCKBUSTER — Box Office Karnataka (@Karnatakaa_BO) July 28, 2022 Hands Down to @anupsbhandari ♥️ Happy tears man 🔥 First Half Done, all set for an epic second half 🔥♥️#VikrantRonaReview#VikrantRonaFDFS #KicchaSudeep @KicchaSudeep #VikrantRona #VRin3D — Kiccha Sudeep CULT™ (@KicchhaCult) July 28, 2022 -
విక్రాంత్ రోణతో ఆ కల తీరింది: కిచ్చా సుదీప్
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని అనూప్ భండారీ దర్శకత్వంలో మంజూనాథ్ గౌడ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైకి వచ్చింది. ఇందులో పాల్గొన్న నటుడు కిచ్చా సుదీప్ మాట్లాడుతూ చెన్నైకి ఎప్పుడు వచ్చినా అత్యధిక గౌరవం ఇచ్చి పని ఇచ్చి అభిమానం చూపుతున్నారన్నారు. విక్రాంత్ రోణ భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్, అడ్వెంచర్, ఫాంటసీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మంచి ఇంటెన్స్‌తో కూడిన కథా చిత్రాన్ని చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. విక్రాంత్ రోణతో ఆ కల తీరిందన్నారు. (చదవండి: కొత్త రకం హెయిర్ స్టయిల్లో రజనీకాంత్!) ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. మంచి కంటెంట్‌తో కూడిన కథ కావడంతో తనకు బాగా నచ్చిందన్నారు. దీనిని ఇంకా ఎలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లవచ్చు అన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. దీంతో త్రీడీ ఫార్మెట్ రూపొందించినట్లు చెప్పారు. దర్శకుడు మంచి ఇంటెన్స్‌తో ఫుల్ ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ చిత్రం విడుదల అనంతరం దర్శకుడి గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. కాగా ఈ చిత్రాన్ని గత 20 ఏళ్ల క్రితం త్రీడీ ఫార్మెట్ వచ్చిన మై డీయర్ కుట్టి చేతన్ చిత్రంతో పోల్చవద్దని అన్నారు. అది ఒక హిస్టరీ అని పేర్కొన్నారు. ఆ చిత్రం అందించిన త్రీడీ ఎఫెక్ట్ మరే చిత్రం ఇవ్వలేదన్నారు. అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా దర్శకుడు కొత్త ఇమేజినేషన్, విజన్‌తో తీశారన్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా బాగా రూపొందించినట్లు తెలిపారు. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకోవడమే సక్సెస్ అని నటుడు కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. -
మీడియాకి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ నేపథ్యంలో నేడు(జులై21)న హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, తనను క్షమించాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే త్వరలోనే అందరినీ కలుస్తాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date. Looking forward to meeting u all. 🥂 Love & Regards, Kichcha❤️ — Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022 -
విషమంగా నిర్మాత ఆరోగ్యమంటూ వార్తలు, క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత జాక్ మంజునాథ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో బెడ్‌పై ఆయన నిద్రపొతున్న ఫొటోలు కొన్ని ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆయన ఆరోగ్యం విషయంగా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్వీట్ చేశాడు. ‘మై డియర్ ప్రెండ్ అండ్ బ్రదర్ జాక్ మంజునాథ్ ముందు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యం ఉన్నారు. ఈ రోజు ఆయన ఆయన డిశ్చార్జీ. ముందస్తు జాగ్రత్తగా సాధారణ సాధారణ చెకప్ కోసం ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బెడ్‌పై ఆయన నిద్రపోతున్న ఫొటోలను లీక్ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు , బంధువులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంజునాథ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరసరం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతులు’ అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటరైన జాక్ మంజునాథ్ సుదీప్ తాజా పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’కు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ జులై 28న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, యలయాళ భాషలో విడుదల కానుంది. My dear brother and friend @JackManjunath is fine and getting discharged today. He was admitted on precautionary grounds and nothing serious. Few leaked pics taken by staff while he was sleeping is doing rounds making it look serious. Thanks to all fo ua wshs and prayers.🙏🏼 — Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2022 -
k3 kotikokkadu: ‘కే3 కోటికొక్కడు’ వచ్చేస్తున్నాడు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా శివ కార్తిక్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘కే3 కోటికొక్కడు’. గుడ్ సినిమా బ్యానర్‌పై గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది. సుదీప్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు కూడా భారీ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ చిత్రంపై తెలుగులో మంచి అంచనాలు ఉండటంతో సరైన డేట్ కోసం వేచి చూసిన నిర్మాతలు.. తాజాగా జూన్ 17న చిత్రాన్ని గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ఇప్పటికే విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సింగల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్ లో బాగంగా మరో మూడు పాటలని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అజయ్ దేవగణ్, సుదీప్‌ల ట్విటర్ వార్‌పై సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌ల మధ్య నెలకొన్న ట్విటర్ వార్ గురించి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా నటుడు సోనూసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ ఏమన్నాడంటే 'భారతదేశం అంతటా ఒకే భాష ఉంది. అదే ఎంటర్టైన్మెంట్. నువ్వు ఏ చిత్ర పరిశ్రమ నుంచి అనేది ఇక్కడ అనవసరం. కానీ నువ్వు ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచగలిగితే చాలు వారు నిన్ను ఆదరిస్తారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అదే విధంగా దక్షిణాది చిత్రాల ప్రభావం మాత్రం భవిష్యత్తు హిందీ సినిమాలపై ఉంటుందన్నాడు. అలానే 'ప్రేక్షకుడి అభిరుచుల్లో కూడా కొంత మార్పు వచ్చింది. వారు ప్రతి సినిమాలోనూ కంటెంట్‌ను కోరుకుంటున్నారు. ఓ యావరేజ్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తమ వేల రూపాయలను ఖర్చు చేయాలని అనుకోవడం లేదు' అంటూ సోనూసూద్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. -
హీరోల మధ్య ట్వీట్ల వార్, బాలీవుడ్ స్టార్స్‌పై వర్మ సంచలన కామెంట్స్
హిందీ భాషపై కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమల్లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. హిందీ జాతీయ భాష కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్‌కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అజయ్, సుదీప్‌ల మధ్య బుధవారం ట్వీట్ల వార్ నెలకొంది. ఈ వార్‌పై తాజాగా వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఈ మేరకు సుదీప్‌కు మద్దతు ఇస్తూ ఉత్తరాది హీరోలు దక్షిణాది హీరోలను చూసి అసూయ పడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశాడు. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ Nothing can drive the point better than ur question on ,what if you answer in Kannada to a Hindi tweet from @ajaydevgn .. Kudos to you and I hope everyone realises there’s no north and south and india is 1 https://t.co/g0IOvon8nV — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 ‘సౌత్, నార్త్ అనేది ముఖ్యం కాదు. భారతదేశం అంతా ఒకటే అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి’ అని తొలుత హితవు పలికాడు వర్మ. అనంతరం తన వ్యాఖ్యలకు అర్థం అది కాదని, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారని సుదీప్ చేసిన ట్వీట్‌కు ఆర్జీవి రీట్వీట్ చేశాడు. ‘మీ అభిప్రాయం ఏదైనా కావచ్చు సుదీప్ సర్. కానీ మీరు ఈ కామెంట్స్ చేసినందుకు సంతోషం. ఎందుకంటే బాలీ(నార్త్)వుడ్, శాండల్(సౌత్)వుడ్ మధ్య ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉండటం సరికాదు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 అనంతరం మరో ట్వీట్ చేస్తూ.. ‘అసలు నిజం ఏంటంటే... బాలీవుడ్లో కేజీయఫ్ 2 రూ. 50 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్‌తో రికార్డు క్రియేట్ చేయడంతో బాలీవుడ్ స్టార్స్, సౌత్ స్టార్స్‌ను చూసి అసూయతో ఉన్నారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. ఇకపై బాలీవుడ్ చిత్రాల ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో మనం కూడా చూద్దాం. బాలీవుడ్లో బంగారం ఉందా?, కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్‌వే 34’ ఓపెనింగ్ కలెక్షన్స్‌తో అర్థమైపోతుంది’ అంటూ వరుస ట్వీట్స్ చేశాడు వర్మ. ప్రస్తుతం వర్మ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వర్మ కామెంట్స్‌పై బాలీవుడ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి నెలకొంది. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో Whether u intended or not am glad u made this statement ,because unless there’s a strong stir , there cannot be a calm especially at a time when there seems to be a war like situation between Bolly(north)wood and Sandal(South) wood https://t.co/SXPqvrU8OV — Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022 కాగా కేజీయఫ్ 2 సక్సెస్ మీట్లో సుదీప్ మాట్లాడుతూ.. ఒక కన్నడ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కించారని ఎవరో అంటున్నారని, ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందంటూ ‘హిందీ ఇక నుంచి ఏమాత్రం జాతీయ భాష కాదు’ అన్నాడు. అలాగే బాలీవుడ్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలను నిర్మించి తెలుగు, తమిళంలో డబ్ చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారంటూ కామెంట్ చేశాడు. దీనికి అజయ్ దేవగన్ ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌కు కౌంటర్ ఇచ్చాడు. -
కిచ్చా సుదీప్ చెప్పింది కరెక్ట్.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య తలెత్తిన హిందీ భాషా వివాదం ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి వరకు చేరింది. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్‌కు మద్దతుగా సీఎం బసవరాజ్ బొమ్మై నిలిచారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ప్రాంతీయ భాషలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. సుదీప్ మాటలు సరైనవేనని, దానిని అందరూ అర్థం చేసుకొని గౌరవించాలని సీఎం బొమ్మై సూచించారు. కాగా ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం సిద్ధ రామయ్య, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కిచ్చ సుదీప్‌కు అండగా నిలిచారు. బాలీవుడ్, కన్నడ సూపర్ స్టార్ల మధ్య హిందీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న సుదీప్.. దక్షిణాది సినిమాలు బాక్సాఫిస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్నాయని, హిందీలోకి డబ్ అయి బాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నాయని అన్నారు. అలాగే ఇకపై హిందీ జాతీయ భాషగా ఉండబోదని చెప్పారు. దీంతో సుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. .@KicchaSudeep मेरे भाई, आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं? हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी। जन गण मन । — Ajay Devgn (@ajaydevgn) April 27, 2022 సుదీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ వ్యంగ్యంగా స్పందించారు. బ్రదర్ కిచ్చా సుదీప్... మీ అభిప్రాయం ప్రకారం హిందీ జాతీయ భాష కానప్పుడు... మీ మాతృభాష సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఇంతకమందు, ఇప్పుడు, ఎప్పటికీ మన జాతీయ భాషే. జన గణ మన' అని ట్వీట్ చేశారు. మరోవైపు వీరిద్దరి మాటల యుద్ధంపై పలువురు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చదవండి👉 Kichcha Sudeep Vs Ajay Devgan: చిచ్చు పెట్టిన హిందీ భాష, స్టార్ హీరోల మధ్య ట్వీట్ల వార్ And sir @ajaydevgn ,, I did understand the txt you sent in hindi. Tats only coz we all have respected,loved and learnt hindi. No offense sir,,,but was wondering what'd the situation be if my response was typed in kannada.!! Don't we too belong to India sir. 🥂 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 మరోవైపు తాను మాట్లాడిన మాటలు ట్రాన్స్లేషన్ పొరపాటు వలన తప్పుగా అర్థం చేసుకున్నారనీ సుదీప్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అజయ్ సార్.. మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థం అయ్యింది. అందరం హిందీని గౌరవిస్తాము. కాబట్టి హిందీని ప్రేమించాము, నేర్చుకున్నాను. గౌరవించాము. మనమందరం నేను హిందీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కేవలం ట్రాన్స్లేషన్ వల్ల పొరపాటు జరిగింది. కానీ నేను ఇప్పుడు కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనమంతా కూడ భారతదేశానికి చెందిన వాళ్లమే కదా సార్’ అంటూ రీట్వీట్ చేశారు. Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn't to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6 — Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022 అలాగే ‘ మన దేశంలోని ప్రతి భాషను నేను ప్రేమిస్తాను సార్. నేను ఆ మాటలను పూర్తిగా భిన్నమైన సందర్భంలో చెప్పాను. అది మీ దగ్గరకు వేరే రకంగా చేరింది. త్వరలో మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. అప్పుడు అసలేం జరిగిందో మీకు వివరిస్తాను. ఇది ఎవరినీ బాధపెట్టడానికి, రెచ్చగొట్టడానికి లేదా ఇలాంటి చర్చను ప్రారంభించడానికి కాదు. ఇక ఈ అంశం ఇక్కడితో ముగిసిపోవాలని ఆశిస్తున్నాను. అనువాదం, వివరణలు, దృక్కోణాలు అసలు మేటర్ సర్… పూర్తి విషయం తెలియకుండా స్పందించకపోవడానికి కారణం అదే దీనికి నేను మిమ్మల్ని నిందించను. ఒక సృజనాత్మక కారణంతో నేను మీ నుంచి ట్వీట్‌ను స్వీకరించి ఉంటే బహుశా అది సంతోషకరమైన క్షణం అయ్యేది” అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. -
జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో
BB Kannada Host Gift To Dhee 14 Judge Jani: టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫర్స్‌లో జానీ మాస్టర్ ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్‌కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌కి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు సుదీప్. ఖరీదైన థార్ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సుదీప్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ థార్ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. View this post on Instagram A post shared by Jani Master (@alwaysjani) -
హీరోగా 'ఈగ' విలన్ సుదీప్ టాలీవుడ్ ఎంట్రీ..
‘ఈగ’ ఫేమ్ సుదీప్ ‘కే3 కోటికొక్కడు’ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కే3’. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో గుడ్ సినిమా గ్రూప్‌పై ‘కే3 కోటికొక్కడు’ పేరుతో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో సుదీప్ రెండు విభిన్న పాత్రల్లో మెప్పించారు. మడోన్నా సెబాస్టియన్–సుదీప్ జోడి చూడముచ్చటగా ఉంది. ‘కే3’ చిత్రం కన్నడలో తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ చంద్ర, సంగీతం: అర్జున్ జెన్యా. -
తెలుగులో సుదీప్ ‘కే3: కోటికొక్కడు’, రిలీజ్ ఎప్పుడంటే..
‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా నటించిన చిత్రం ‘కే3: కోటికొక్కడు’. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించారు. కన్నడంలో ‘కే3’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ‘కే3: కోటికొక్కడు’ పేరుతో నవంబర్ 12న తెలుగులో విడుదల కానుంది. స్పందన పాశం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే విడుదల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కన్నడంలో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు సాధించింది. సుదీప్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. యాక్షన్ మూవీ లవర్స్‌ను మా సినిమా కచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు. -
సుదీప్ బర్త్ డే సందర్బంగా జంతుబలి ఇచ్చిన ఫ్యాన్స్
-
వృద్ధ దంపతులకు అండగా కన్నడ హీరో కిచ్చ సుదీప్
బెంగళూరు: కన్న కొడుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను అనాథలను చేసినా కన్నడ హీరో కిచ్చ సుదీప్ తానున్నానంటూ వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచిన సంఘటన దొడ్డ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలో నివసిస్తున్న శ్రీనివాస్ (78), కమలమ్మ(70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు దివ్యాంగుడు. మరో కుమారుడు తనపాలిట తల్లితండ్రులు లేరనుకుని మైసూరులో స్థిరపడిపోయాడు. దీంతో బెంగళూరులో నివసిస్తున్న వీరు ఉన్న కాస్త ఆస్తి అమ్ముకుని బెంగళూరు నుండి దొడ్డ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కమలమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరి గురించి తెలుసుకున్న సుదీప్ కమలమ్మకు బెంగళూరులోని జైన్ ఆస్పత్రిలో చికిత్స ఇప్పించడంతోపాటు వారి పూర్తి బాధ్యత తీసుకున్నారు. -
Prabhas: ‘ఆదిపురుష్’ క్రేజీ అప్డేట్.. కీలక పాత్రలో స్టార్ హీరో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆదిపురుష్’. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుంది. ముంబైలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ మూవీలో నటించబోతున్నారని సమాచారం. తనది పాజిటివ్ రోల్ అని తెలుస్తోంది. రావణుడి తమ్ముడు విభీషణుడి ప్రాతలో సదీప్ నటించబోతున్నాడని సమాచారం. కాగా, గతంలో ‘బాహుబలి’లో ప్రభాస్‌తో కలిసి సుదీప్ నటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈగ, సన్నాఫ్ సత్యనారాయణ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాడు. ఎక్కువగా నెగెటీవ్ రోల్స్‌లో కనిపించే సుదీప్.. ఆదిపురుష్‌లో మాత్రం చాలా పాజిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడట. చదవండి: త్రివిక్రమ్‌కు అసిస్టెంట్‌గా మారనున్న హిట్ డైరెక్టర్! ఏడుపొస్తోంది రాహుల్.. నువ్వు ఎప్పటికీ స్పెషల్: అషూ -
‘ఆచార్య’లో కన్నడ స్టార్ హీరో!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య విడుదల కానుంది. ఆ రోజు మెగా అభిమానులకు పండుగ చేసుకోనున్నారు. ఆచార్యలో హీరో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణలోనిప్పటికే చరణ్ జాయిన్ అయ్యారు. చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్గా నటిస్తున్నారు. చదవండి: ‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్ తాజాగా ఆచార్యలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్ల తెలుస్తోంది. అయితే సుదీప్ తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ఈగ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించిన సుదీప్ ఆ తరువాత ప్రభాస్ నటించిన బాహుబలిలోనూ ఓ పాత్ర పోషించారు. అంతేగాక చిరంజీవి సైరా నర్సింహరెడ్డి సినిమాలో కూడా సుదీప్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆచార్యలో కూడా నటించాల్సిందిగా సినిమా యూనిట్ కోరడంతో.. నటించేందుకు సుదీప్ ఒకే చెప్పినట్లు వినికిడి. కాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. చదవండి: బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ -
నేను ఎలిమినేట్ అయ్యాను: అవినాష్ భావోద్వేగం
బిగ్‌బాస్ నాల్గో సీజన్ పన్నెండో వారాంతంలో స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తన మాటల గారడీతో ఆకట్టుకున్నారు. నవ్విస్తూ, పంచ్‌లు వేస్తూ, కలిసిపోతూ కాసేపటివరకు హోస్ట్‌గా అందరినీ మైమరిపించారు. మరోవైపు నిన్న నాగ్ చేతులెత్తి వేడుకోవడాన్ని చూసి బాధపడ్డ కంటెస్టెంట్లు ఆయన్ను సంతోషరిచేందుకు డ్యాన్స్‌లతో హోరెత్తించారు. నాగ్‌తో తిట్టించుకున్న అభి తన స్టెప్పులతో మెప్పు పొందాడు. ఇక ప్రేక్షకులు తక్కువ ఓట్లతో అవినాష్‌ను ఫెయిల్ చేసినా బిగ్‌బాస్ ఇచ్చిన పాస్‌తో అవినాష్ ఎలిమినేషన్ నుంచి గట్టెక్కాడు. మరి వినోదాల మేళవింపుగా మారిన నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా కొనసాగిందో చదివేయండి.. గుండె ఆగిపోతుందని ఏడ్చేసిన అరియానా నాగార్జున కోపాన్ని చల్లార్చేందుకు ఇంటి సభ్యులు నాగ్ సాంగ్స్‌కు చిందేస్తూ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ -అరియానా, అభిజిత్ -మోనాల్, సోహైల్ -హారిక జంటలుగా కలిసి డ్యాన్స్ చేశారు. వీరి మాస్ డ్యాన్స్ చూసి నాగ్ సైతం సంతోషించారు. తర్వాత నాగ్ 'చీకటిలో ధైర్యం స్థైర్యం' టాస్క్‌తో మరోసారి కంటెస్టెంట్లను భయపెట్టించే ప్రయత్నం చేశారు. మొదటగా అరియానా దెయ్యం గదిలోకి వెళ్లడానికి వెళ్లడానికి నిరాకరించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని ఏడ్చేయడంతో ఆమెను పక్కన పెట్టేశారు. తర్వాత సోహైల్.. లోపలకు వెళ్లగా భయపడుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గజ్జెల శబ్ధం వినపడేసరికి గజగజ వణికిపోయాడు. అఖిల్ భయాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. (చదవండి: బిగ్‌బాస్ : తొలిసారి అభిజిత్ భావోద్వేగం) లోపల భయపడ్డాను: అభిజిత్ అభిజిత్ అయితే ఈలలు వేసుకుంటూ మరీ వెళ్లాడు కానీ లోపల కొంచెం భయంగా ఉండేనని అసలు విషయం చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపులకు దడుసుకుంటూనే రూమ్ అంతా కలియతిరిగాడు. లోనికి వెళ్లిన హారిక, మోనాల్ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు. మొన్నటి దెయ్యం టాస్కులో సోహైల్, అఖిల్ భయమంటే ఏంటో తెలీదంటూ బయటకు ఫోజులు కొట్టినప్పటికీ చీకటి గదిలోకి వెళ్లాక చిన్నపిల్లల్లా దడుసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అంతటినీ నాగ్ కంటెస్టెంట్లకు చూపించి వారి పరువు తీశారు. తర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంటరిగా చీకటి గదిలోకి వెళ్లి రాగా, భయాన్ని జయించానని సంబరపడిపోయింది. (చదవండి: నీతో రిలేషనే వద్దు: తేల్చేసిన అఖిల్) కంటెస్టెంట్ల ఆట కట్టించిన కిచ్చా సుదీప్ తర్వాత కన్నడ బిగ్‌బాస్ ఏడు సీజన్లను వరుసగా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. వస్తూనే ఈ కంటెస్టెంట్ల వల్ల చాలా అలిసిపోయాను అని నాగ్ సర్ వెళ్లిపోయారు అని చెప్పారు. కానీ వాళ్లు నమ్మకపోవడంతో, నాగ్ ఎందుకు వెనక్కు రావాలో సరైన కారణాలు చెప్తే లోనికి రానిస్తానన్నారు. దీంతో ఒక్కొక్కరు నాగ్ గురించి చెప్పడం మొదలు పెడుతూ ఉండగా వారందరికీ సుదీప్ కౌంటర్లు ఇస్తూ వచ్చారు. నాగ్ సర్ మా మీద కేరింగ్‌తో స్వెటర్లు, డ్రైఫూట్లు, డ్రెస్సులు తీసుకువచ్చారు అని అరియానా చెప్పగా ఒకవేళ నేను స్వెటర్ ఇస్తే నేనూ ఇక్కడే ఉండొచ్చా అని పంచ్ వేశారు. కంటెస్టెంట్లపై కౌంటర్ల పర్వం ముగిసిన తర్వాత నాగ్ స్టేజీ మీదకు విచ్చేశారు. (చదవండి: ట్రోలింగ్: అప్పుడు నాని, ఇప్పుడు నాగార్జున) గెలుపు కన్నా విధేయతే ముఖ్యం: హారిక ఇక సుదీప్.. అవినాష్‌ను ఇరకాటంలో పడేసే చిలిపి ప్రశ్న అడిగారు. ఎవరితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? అని ప్రశ్నించారు. మోనాల్‌తో డేట్, హారికతో పెళ్లి, కానీ అరియానాను మాత్రం చంపుతానని చెప్పారు. హారికను నీకు విధేయతా ముఖ్యమా? గెలుపు ముఖ్యమా? అన్న ప్రశ్నకు ఆమె విధేయతే ముఖ్యమని సమాధానమిచ్చింది. అభిజిత్‌కు హారిక షార్ట్ హెయిర్‌తో ఉంటే ఇష్టమా? పొడువు జుట్టుతో ఉంటే ఇష్టమా? అన్న ప్రశ్నకు చిన్న జుట్టు ఉంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అరియానాను ఒక్కరోజు నువ్వు అవినాష్‌లా నిద్రలేస్తే చేసే మొదటి పని ఏంటి? అని అడగ్గా తానసలు నిద్రలో నుంచే లేచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సోహైల్‌కు మటన్ లేదా చికెన్‌లో ఏది ఎక్కువ ఇష్టమంటే మటన్ అని జవాబిచ్చాడు. (చదవండి: అభిజిత్‌కే ఓటేస్తా: జబర్దస్త్ కమెడియన్) అఖిల్‌ను సేఫ్ చేసిన సుదీప్ తర్వాత సుదీప్ మోనాల్‌ను పిలవబోయి అఖిల్‌ను పిలిచారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరిని అడిగినా ఒకటేలే అని నాగ్ ఇద్దరికీ ముడి పెట్టేశారు. తర్వాత.. నీకు ఇంట్లో ఒక హౌస్‌మేట్‌ను మాయం చేయగల శక్తి ఉంటే ఎవరిని చేస్తావన్న ప్రశ్నకు అఖిల్.. మోనాల్ పేరు చెప్పాడు. ఒకవేళ నీగురించి నువ్వు ఏదైనా పుకారు మొదలుపెట్టాలనుకుంటే అది ఏంటి? అన్న ప్రశ విసిరగా దానికి మోనాల్.. నేను ఏడవను అని చాటింపు చేస్తానని చెప్పింది. గుజరాతీ అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు సుదీప్ ఆమెను మెచ్చుకున్నారు. పనిలో పనిగా నాగ్‌ను చూస్తూ ఒక డైలాగ్ చెప్పమన్నారు. దీంతో ఆమె నువ్వు నాకు చాలా ఇష్టం అని నాగ్‌తో చెప్పి సిగ్గుల మొగ్గయింది. కానీ అది ఇద్దరికీ చెప్పినట్లు అనిపించింది. తర్వాత సుదీప్.. అఖిల్ సేఫ్ అయినట్లు వెల్లడించారు. అనంతరం తెలుగు బిగ్‌బాస్ షోకు వీడ్కోలు తీసుకుంటూ తాను థియేటర్లో చూసిన మొదటి సినిమా గీతాంజలి అని చెప్పారు. ప్రేక్షకులు నన్ను ఎలిమినేట్ చేశారు చివరగా అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో అతడు ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. అయితే ప్రేక్షకుల దృష్టిలో మాత్రం తాను ఎలిమినేట్ అయ్యానని అవినాష్ బాధపడ్డాడు. ఇప్పుడు నేను ముందుకెళ్లాలా? ఆగిపోవాలా? అనేది అర్థం కావట్లేదన్నారు. దీంతో నాగార్జున అతడికి ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కు రాకముందు ఉన్న అవినాష్ వేరు, హౌస్‌లోకి వచ్చాక అవినాష్ వేరని అతడిని ఆకాశానికెత్తారు. నీ దగ్గర పాస్ ఉందనే ఓట్లు వేయలేదు అనుకోవచ్చు కదా అని పాజిటివిటీని నూరి పోశారు. కానీ కొత్తగా ఇలాంటి మాటలతో సింపథీ మాత్రం మొదలు పెట్టొద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. అందరూ ఎవరి ఆట వారే ఆడండని మరోసారి స్పష్టం చేశారు. (చదవండి: కెప్టెన్‌గా విఫలమైన హారిక!) -
నువ్వంటే నాకు చాలా ఇష్టం: మోనాల్
బిగ్‌బాస్ ప్రయాణం ముగింపుకు చేరుతుండటంతో షోకు మరింత వన్నె తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్లో నాగార్జునకు బదులుగా కన్నడ స్టార్ హీరో, కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ప్రత్యక్షం అయ్యారు. ఆయనను చూసి ఇంటిసభ్యులు సర్ప్రైజ్ అవుతూనే నాగ్ సార్ కనిపించట్లేదే అని గాబరా పడ్డారు. ఇంతలో అరియానా ధైర్యం చేసి నాగ్ సార్ ఎక్కడ? అని సుదీప్‌ను నిలదీసింది. దీంతో వారిని కాసేపు ఆడుకుందామనుకున్న సుదీప్ ఆయన ఇంటికెళ్లారని అబద్ధం చెప్పారు. మీ వల్ల ఆయన చాలా అలిసిపోయారని చెప్పుకొచ్చారు. కానీ కంటెస్టెంట్లు మహా ముదుర్లు.. ఆయన మాటలను అస్సలు నమ్మలేదు. దీంతో అసలు నాగ్ ఎందుకు రావాలో సరైన కారణం చెప్పమని సుదీప్ అడగ్గా నాగ్ సర్ కింగ్, ఆయనే బెస్ట్ అని తెలిపారు. వారి మాటలతో ఏకీభవించిన స్పెషల్ గెస్ట్ సుదీప్ హోస్ట్ నాగార్జునను స్టేజీ మీదకు పిలిచారు. (చదవండి: మోనాల్‌తో లింక్ చేయకండి: అభి వేడుకోలు) తర్వాత సుదీప్ అవినాష్‌కు ఓ చిలిపి ప్రశ్న వేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్‌కు వెళ్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? అని అడగ్గా అవినాష్ ఏం చెప్పేదిరా దేవుడా? అని జుట్టు పట్టుకున్నాడు. ఇంతలో నాగ్ అందుకుని అవినాష్ పెద్ద పులిహోర అని అతడి పరువు తీశారు. అవినాష్ మాత్రం నోటితో సమాధానం చెప్పకుండా డేట్ అన్నప్పుడు హారిక వైపు, మ్యారేజ్ అన్నప్పుడు మోనాల్ వైపు, కిల్ అన్నప్పుడు అరియానా వైపు చేయి చూపించాడు. దీన్ని కన్నడ హోస్ట్ పసిగట్టి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. తర్వాత మోనాల్‌కు బదులు సుదీప్ పొరపాటున అఖిల్ పేరు పిలిచారు. అయితే వాళ్లిద్దరిలో ఎవర్ని అడిగినా ఒకటే అని నాగ్ ఇద్దరికీ ముడేశారు. తర్వాత మోనాల్ లేచి తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పడంతో నాగ్‌తో సహా సుదీప్ ఉబ్బితబ్బిబయ్యారు. మరి ఆయన ఏం సమాధానం చెప్తారో ఏమో? ఏదేమైనా ఒకే స్టేజీ మీద ఇద్దరు స్టార్లు కలిసి చేసిన సందడి చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: నేడు నో ఎలిమినేషన్!) -
చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్
ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై.. అంటూ శాశ్వత వీడ్కోలు పలికి, మరికాసేపటికే తాను బాగున్నానంటూ వివరణ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ, కన్నడ నటి జయశ్రీ రామయ్య అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె తాజాగా ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా తాను అలా ఎందుకు మాట్లాడారో చెప్పుకొచ్చారు. ఒత్తిడిని జయించలేకే చావును కోరుకున్నానని పేర్కొన్నారు. అయితే అలాంటి క్లిష్ట సమయంలో తన బాగోగులు చూసుకుంటూ, తనను చావు నుంచి కాపాడిన నటుడు కిచ్చా సుదీప్, అతని టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (ప్రపంచానికి, డిప్రెషన్‌కు గుడ్‌బై: నటి) అలాగే అభిమానులను భయాందోళనలకు గురి చేసినందుకు క్షమాపణలు తెలిపారు. ఒత్తిడికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. కాగా ఈ నెల 22న జయశ్రీ "నేను వెళ్లిపోతున్నా.. ప్రపంచానికి, ఒత్తిడికి గుడ్‌బై" అంటూ పోస్ట్ పెట్టారు. అనంతరం కాసేపటికే దాన్ని తొలగించారు. అయితే అప్పటికే అభిమానులు ఆమెకు ధైర్యం నూరిపోస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ఆమె బాగానే ఉన్నానని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఆస్తి కోసం మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ గతేడాది ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే (మేనమామ వేధిస్తున్నాడు) -
ఆర్ఆర్ఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్
బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు స్పందించిన ఓ వార్తపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్ స్పందించారు. రాజమౌళి సినిమాలో సుదీప్ ఉన్నారంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుదీప్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నేను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు విని సంతోషం వ్యక్తం చేసిన వారికి ఓ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు విన్న ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సినిమాకు సంబంధించి నాతో ఎవరూ ఎటువంటి సంప్రదింపులు కూడా జరపలేదంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో సుదీప్ నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి బహుబలి-2 తర్వాత తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ తెలంగాణా యోధుడు కొమరం భీంగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. With due respect to the film,,,and to all those who r excited to hear this news,,, I wanna being this to everyone's notice tat this isn't a fact tats floating. I haven't been approached,,nor has there been any discussion. pic.twitter.com/V48y6jYoyu — Kichcha Sudeepa (@KicchaSudeep) January 18, 2020 -
సల్మాన్‌తో అది రుజువైంది: సుదీప్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు సల్మాన్ ఖరీదైన కారును బహమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని సుదీప్ తన అధికారిక ట్విటర్లో పేర్కొన్నాడు. ‘మనం మంచి చేస్తే తిరిగి మనకు మంచే జరుగుతుందని నేను ఎక్కువగా నమ్ముతాను. ఆ నమ్మకం సల్మాన్ ఖాన్‌తో మరోసారి రుజువైంది. మా ఇంటికి సర్ప్రైజ్(బీఎండబ్ల్యూ ఎమ్5తో) గిఫ్ట్‌తో సల్మాన్ వచ్చారు. నాపై నాకుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు సర్. మీతో వర్క్ చేయడం అదే విధంగా మమ్మల్ని కలవడానికి మీరు రావడం నాకెంతో గర్వంగా ఉంది’అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా సల్మాన్ ఇచ్చిన కారుతో పాటు అతడితో దిగిన ఫోటోలను కూడా సుదీప్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ‘నా అనుకున్న వారిపై సల్మాన్ చూపించే ప్రేమ అనంతం’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఇటీవలే విడుదలైన దబాంగ్-3 చిత్రంలో సల్మాన్‌తో కలిసి సుదీప్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నెగటీవ్ రోల్ పోషించిన సుదీప్ తన దైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంతోనే సల్మాన్, సుదీప్‌ల మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడిందని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సల్మాన్ ఇలా తన సన్నిహితులకు, స్నేహితులకు బహుమతులు ఇవ్వడం కొత్తేం కాదు. అంతేకాకుండా వారితో చాలా సరదాగా ఉంటాడు. ఆటలు ఆడుతుంటాడు. ఇక గతంలో తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేడయం, తన మేనల్లుడితో కలిసి అల్లరి చేయడం వంటి విషయాలు తెలిసినవే. Good always happens when u do good.@beingsalmankhan made me believe this line further with this surprise landing at home along with him. BMW M5 🤗. Thank u for the luv u have showered on me n my family sir. It was an honour to have worked with u n to have had u vist us.🤗🤗🥂 pic.twitter.com/tavTR07M29 — Kichcha Sudeepa (@KicchaSudeep) January 7, 2020 -
తమిళ్లో ‘పహిల్వాన్’
భారతీయ సినిమాలో విలక్షణ నటుల్లో కిచ్చా సుధీప్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. పాత్ర స్వ భావం కోసం తనను తాను మార్చు కోవడానికి ఎంత దాకా అయినా వెళ్లే నటుడు కిచ్చా సుధీప్. స్వతహాగా కన్నడీయుడైన ఈయన మాతృభాషతో పాటు తమి ళం, తెలుగు భాషల్లోనూ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు రామ్‌గోపాల్ వర్మ చిత్రాల ద్వా రా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరితుడైన కిచ్చా సుధీప్ తాజాగా ‘పహిల్వాన్’గా మారారు. అవును కిచ్చా సుధీప్ తాజా చిత్రానికి పహిల్వాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం కోసం మారిన రూపం చూస్తే అందుకోసం ఎంత కసరత్తులు చేశారో, అందుకు ఎంత శ్రమించారో మీకే అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంతో కిచ్చా సుధీప్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పహిల్వాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్ఆర్ఆర్ మోషన్ పిక్చర్స్ పతాకంపై స్వప్నకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఎమోషనల్, కామెడీ అంశాలతో కూడిన క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఒక మల్ల యుద్ధక్రీడాకారుడైన కిచ్చా సుధీప్ ఆ క్రీడలో ఎదుర్కొనే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాడు అన్న కథతో తెరకెక్కిస్తున్న చిత్రం పహిల్వాన్ అని తెలిపారు. దీనికి హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం అని అన్నారు. నటి ఆకాంక్ష కథానాయకిగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నటుడు సుశాంత్ సింగ్, కబీర్ దుహాన్ సింగ్, శరత్ లోకిదాస్, అవినాష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గత జనవరిలో విడుదల చేయగా కిచ్చా సుధీప్ బేర్ బాడీతో కూడిన సన్నివేశాలకు అనూహ్యా స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్ర కథను తెరకెక్కించే ముందే నటుడు కిచ్చాసుధీప్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని భావించానన్నారు. అలా తాను ఊహించిన దానికంటే నటుడు కిచ్చా సుధీప్ సిక్స్ ప్యాక్, 8 ప్యాక్‌లను మించి తన బాడీని తయారు చేసుకున్నారని దర్శకుడు కృష్ణ చెప్పారు. మరో విశే షం ఏమిటంటే కిచ్చా సుధీప్ బాక్సర్ గెటప్లోని పోస్టర్‌ను ఐదు భాషల్లోని ప్రముఖ నటులు చిరంజీవి తెలుగు పోస్టర్‌ను, హిందీ పోస్టర్‌ను సునీల్ శెట్టి, తమిళ పోస్టర్‌ను విజయ్‌సేతుపతి, మలయాళ పోస్టర్‌ను మోహన్‌లాల్ ఆవిష్కరించారని తెలిపారు. దీనికి అర్జున్ జాన్యా సంగీతాన్ని, కరుణాకర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
సుదీప్ హ్యాపీ బర్త్ డే స్పెషల్ మోషన్ పోస్టర్
-
‘సైరా’ నుంచి మరో ఆకట్టుకునే పోస్టర్
తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఇప్పటికే సంచలనం నమోదు చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ నటుడు కిచ్చ సుదీప్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. శుక్రవారం సుదీప్ బర్త్‌డే సందర్భంగా సైరా టీమ్ ఓ స్పెషల్ మోషన్ పోస్టర్ విడుదల చేసింది. ‘హ్యాపీ బర్త్ డే అభినయ చక్రవర్తి’ అంటూ విష్ చేసింది. ఒంటినిండా నల్లని వస్త్రాలతో, చేతిలో ఆయుధంతో పోజిచ్చిన సుదీప్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. -
విడాకులపై మనసు మార్చుకున్న హీరో
బెంగళూరు : ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కుటుంబ కలహాలు పరిష్కరించుకుని భార్య ప్రియా రాధాకృష్ణన్ తో కలిసి ఉండాలని నిశ్చయించుకున్నారు. కుటుంబ కలహాలతో కోర్టు మెట్లు ఎక్కిన సుదీప్, ప్రియ ఇద్దరూ తమ విభేదలు మరచిపోయి కలిసుండాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల మధ్య హర్షం వ్యక్తం అవుతోంది. మరోవైపు ఈ విషయంలో సుదీప్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. సుదీప్...భార్య ప్రియతో విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసినప్పటి నుంచి అతడు న్యాయస్థానానికి హాజరు కాలేదు. గతంలో కూడా రెండు నెలల సమయం కావాలని కోర్టుకు సుదీప్ తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కేసు విచారణను న్యాయస్థానం మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా సుదీప్, ప్రియ 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలరీత్యా విడిపోయేందుకు వీరిద్దరూ న్యాయస్థానం ఆశ్రయించారు. అంతేకాకుండా భార్యకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సుదీప్ సిద్ధపడ్డాడు. అయితే ఈ నేపథ్యంలో సుదీప్, ప్రియ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. -
సూపర్‌స్టార్ సినిమానే కాదంది!!