Kiccha Sudeep Clarifies Producer Jack Manjunath Health Condition - Sakshi
Sakshi News home page

Kiccha Sudeep: విషమంగా నిర్మాత ఆరోగ్యమంటూ వార్తలు, స్పందించిన స్టార్‌ హీరో

Published Wed, Jun 15 2022 12:04 PM | Last Updated on Wed, Jun 15 2022 3:51 PM

Kiccha Sudeep Clarifies Producer Jack Manjunath Health Condition - Sakshi

ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత జాక్‌ మంజునాథ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో బెడ్‌పై ఆయన నిద్రపొతున్న ఫొటోలు కొన్ని ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆయన ఆరోగ్యం విషయంగా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి.

 దీంతో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ ట్వీట్‌ చేశాడు. ‘మై డియర్‌ ప్రెండ్‌ అండ్‌ బ్రదర్‌ జాక్‌ మంజునాథ్‌ ముందు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యం ఉన్నారు. ఈ రోజు ఆయన ఆయన డిశ్చార్జీ. ముందస్తు జాగ్రత్తగా సాధారణ సాధారణ చెకప్‌ కోసం ఇటీవల ఆయన  ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బెడ్‌పై ఆయన నిద్రపోతున్న ఫొటోలను లీక్‌ చేశారు.

దీంతో అభిమానులు, స్నేహితులు , బంధువులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంజునాథ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరసరం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతులు’ అంటూ సుదీప్‌ ట్వీట్‌ చేశాడు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటరైన జాక్‌ మంజునాథ్‌ సుదీప్‌ తాజా పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’కు  నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ జులై 28న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, యలయాళ భాషలో విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement