Vikrant Rona Movie
-
ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే..
కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ బాగా పెరిగింది. ఇక థియేటర్లో వచ్చిన చిత్రాలను మళ్లీ చూడాలనుకుంటే ఓటీటీలే వేదికగా నిలుస్తున్నాయి. దీంతో తమకు నచ్చిన సినిమాను ఎప్పుడైనా, ఎక్కడైన చూసే వేసులుబాటు కల్పిస్తున్నాయి ఓటీటీలు. ఈ నేపథ్యంలో ఇటీవల బిగ్స్క్రీన్పై సందడి చేసిన పలు చిత్రాలు ఈ రోజు(సెప్టెంబర్ 16న) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వాటితోపాటు పలు వెబ్‌సిరీస్‌లు కూడా అలరించబోతున్నాయి. అలా ఈ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి అవేంటో చూద్దామా! ‘సోనిలివ్’లో రామారావు ఆన్‌డ్యూటీ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్‌డ్యూటీ. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటించారు. జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక చాలా గ్యాప్ అనంతరం నటుడు వేణు తొట్టెంపూడి ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. థియేటర్లో పెద్దగా ఆడని ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. సోనీలివ్‌లో ఈ రోజు నుంచే రామారావు ఆన్‌డ్యూటీ స్ట్రీమింగ్ అవుతుంది. ‘హాట్‌స్టార్’లో విక్రాంత్ రోణ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టింది. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్: దహన్ – సిరీస్ 1(హిందీ) అమెజాన్ ప్రైమ్: గుడ్ నైట్ మమ్మీ – ఇంగ్లీష్ ఆహా: మోసగాళ్లు(తెలుగు) కిరోసిన్(తెలుగు) సోనీ లివ్: కాలేజీ రొమాన్స్ – సిరీస్ 3(హిందీ) జీ5: టైంపాస్ 3 – మరాఠీ నెట్ ఫ్లిక్స్: జోగి – హిందీ అటెన్షన్ ప్లీజ్ – హిందీ ఫైండింగ్ హబ్బీ 2 – ఇంగ్లీష్ ఫేట్: ది వింక్స్ సాగా – సిరీస్ 2(ఇంగ్లీష్) స్కాండల్: బ్రింగింగ్ డౌన్ వైర్ కార్డ్ – డాక్యుమెంటరీ సిరీస్(ఇంగ్లీష్) శాంటో – సిరీస్ 1(స్పానిష్) లవ్ ఈజ్ బ్లైండ్ – సిరీస్ 2(ఇంగ్లీష్) జిమ్నాటిక్స్ అకాడమీ: ఏ సెకండ్ ఛాన్స్ – సిరీస్ 2(ఇంగ్లీష్) డు రివెంజ్ – ఇంగ్లీష్ ఐ యూజ్డ్ టు బి ఫేమస్ – ఇంగ్లీష్ ది బ్రేవ్ వన్స్ – ఇంగ్లీష్ డ్రిఫ్టింగ్ హోమ్ – జాపనీస్ మరి ఇంకేందుకు ఆలస్యం ఇంట్లోనే ఎంచక్కా మీకు నచ్చిన ఈ కొత్త సినిమాలను ఓటీటీల వేదికగా చూసి ఎంజాయ్ చేయండి. -
ఓటీటీలోకి వచ్చేసిన 'విక్రాంత్ రోణ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Vikrant Rona OTT : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం 'విక్రాంత్ రోణ'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో జులై 28న గ్రాండ్‌గా రిలీజై సూపర్ హిట్ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. అనూప్ భండారీ దర్శకత్వం వహించగా జాక్ మంజునాథ్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించింది. సిల్వర్‌స్ర్కీన్‌పై భారీ విజయవంతమైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్ స్టార్‌లో ఈరోజు(శుక్రవారం)నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. మరి బిగ్ స్ర్కీన్‌పై ఈ సినిమాను చూడలేకపోయిన వారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. The wait is over 🕛 Inspector #VikrantRona is here! Watch #VikrantRonaOnHotstar Streaming Now ▶️ https://t.co/ok2CxJAI9h@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @JackManjunath @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss pic.twitter.com/0pSL5HRcDR — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 15, 2022 #VikrantRona is streaming now on #DisneyplusHotstar #VikrantRonaOnDisneyplusHotstar pic.twitter.com/Z2psTtmuBq — Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) September 15, 2022 -
‘విక్రాంత్ రోణ’ తెలుగు వెర్షన్ ఈ ఓటీటీలోనే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జూలైలో విడుదలై మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీసు షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ కన్నడ వెర్షన్‌కు సంబంధించి ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(zee5)లో ఈ నెల 2(సెప్టెంబర్ 2న) నుంచి ఈ మూవీ కన్నడ వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్ దుర్మరణం ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్ 16 నుంచి తెలుగు వెర్షన్ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్ గౌడ్ నిర్మాత. ఇందులో నిరూప్ భండారి, నీతా అశోక్, రవిశంకర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నోఅంచాల మధ్య జూలై 28న కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, యలయాళ భాషల్లో విడుదలైంది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో చేరడం విశేషం. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ 'విక్రాంత్ రోణ'
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన చిత్రం విక్రాంత్ రోణ. గ్లామరస్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్గా నటించింది. అనూప్ భండారి డైరెక్ట్ చేయగా మంజునాథ్ గౌడ్ నిర్మించారు. జూలై 28న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగానే వసూళ్లు రాబట్టింది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. జీ5 విక్రాంత్ రోణ డిజిటల్ రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొద్దిరోజులు ఆగారంటే విక్రాంత్ రోణను ఎంచక్కా కూర్చున్న చోటే వీక్షించేయవచ్చు. The devil will take over @ZEE5Kannada @KicchaSudeep @anupsbhandari @JackManjunath @shaliniartss @ZeeStudios_ #VikrantRonaOnZee5 https://t.co/vjt1XW0ziw — VikrantRona (@VikrantRona) August 25, 2022 ಇದೇ September 2nd ಬರ್ತಿದ್ದಾನೆ ವಿಕ್ರಾಂತ್ ರೋಣ ನಿಮ್ಮ Zee5 ಅಲ್ಲಿ! Stay tuned@KicchaSudeep @anupsbhandari @nirupbhandari @Asli_Jacqueline @neethaofficial @AJANEESHB @williamdaviddop @shaliniartss @shivakumarart @AlwaysJani @ZeeStudios_ @ZeeKannada @RavishankarGow5 @vasukivaibhav#VR pic.twitter.com/MEpDbecYCt — ZEE5 Kannada (@ZEE5Kannada) August 25, 2022 చదవండి: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడా! పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో కీర్తి సురేష్.. ఏ సినిమాలో అంటే -
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా..
Kiccha Sudeep Vikrant Rona Enters Rs 100 Crore Club In 4 Days: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం 'విక్రాంత్ రోణ'. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. అత్యంత భారీ అంచనాల మధ్య జులై 28న పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది విక్రాంత్ రోణ. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరినట్లు సమాచారం. ఈ చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులోని నైజాం ఏరియాలో అతి తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నైజాం ఏరియాలో తొలిరోజు నుంచే మంచి బజ్ రావడంతో వీకెండ్లో చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. దీంతో 4 రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'విక్రాంత్ రోణ'ను నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. కన్నడ చిత్రసీమలో 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత అంత భారీ హిట్ సాధించిన చిత్రంగా 'విక్రాంత్ రోణ' రికార్డుకెక్కింది. కాగా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
విక్రాంత్ రోనతో ప్రేక్షకుల ముందుకు కిచ్చా సుధీప్
-
కిచ్చా జర్నీ
-
Vikrant Rona Review: విక్రాంత్ రోణ మూవీ రివ్యూ
టైటిల్ : విక్రాంత్ రోణ నటీనటులు :కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మధుసూదన్ రావు తదితరులు నిర్మాత: జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ దర్శకత్వం: అనూప్ భండారి సంగీతం : అజనీష్ లోకనాథ్ సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్ విడుదల తేది: జులై 28, 2022 కథేంటంటే.. కొమరట్టు గ్రామంలో వరుస హత్యలు జరుగుతుంటాయి. ఆ ఊర్లో ఓ పాడుబడ్డ ఇంట్లోని బావిలో శవాలు కనిపిస్తుంటాయి. బ్రహ్మరాక్షసుడే వీరందరినీ చంపుతున్నాడని గ్రామస్తుల నమ్మకం. ఊరిపెద్ద జనార్థన్ గంభీర్(మధుసూదన్‌రావు), అతని తమ్ముడు ఏక్నాథ్ గంభీర్(రమేశ్ రాయ్)కూడా గ్రామ ప్రజలకు ఇదే విషయాన్ని చెప్పి ఆ ఇంటివైపు ఎవరినీ వెళ్లకుండా చేస్తారు. అయితే ఓ సారి ఆ ఊరి ఎస్సై ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్లగా.. తెల్లారి బావిలో శవమై కనిపిస్తాడు. అతని మొండెం మాత్రమే లభిస్తుంది కానీ తల కనిపించదు. ఈ హత్య కేసును చేధించడానికి ఆ ఊరికి కొత్త ఎస్సై వస్తాడు. అతనే విక్రాంత్ రోణ(కిచ్చా సుధీప్). ఈ కేసు విచారణలో అతనికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఆ గ్రామానికి చెందిన స్కూల్ పిల్లలు పదుల సంఖ్యలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. మరి పిల్లల హత్యకు కారకులు ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆ ఊరికి కొత్తగా వచ్చిన సంజు(నిరూప్ భండారి)ఎవరు? గ్రామస్తులను భయపెడుతున్న బ్రహ్మరాక్షసుడు ఎవరు? ఎస్సై హత్య కేసుతో విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే విక్రాంత్ రోణ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. విక్రాంత్ రోణ..ఇదొక యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రమని తొలి నుంచి చిత్రబృందం చెప్పుకుంటూ వచ్చింది. ట్రైలర్, టీజర్లో కూడా ఆ విధంగానే చూపించింది. పైగా పాన్ ఇండియా మూవీ అనగానే.. కేజీయఫ్ తర్వాత కన్నడ నుంచి మరో భారీ మూవీ రాబోతుందని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఇది కూడా కేజీయఫ్ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ దర్శకుడు అనూప్ భండారి నిరాశపరిచాడు. తెరపై విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కథలో పసలేదు. అసలు దర్శకుడు ఏ జానర్లో ఈ కథను తెరకెక్కించాలనుకున్నాడో సరైన క్లారిటీ లేదనిపిస్తుంది. ఓ తల్లీకూతుళ్లు అర్ధరాత్రి కొమరట్టుకు బయలుదేరగా.. ముసుగులో ఉన్న కొంతమంది వారిని హత్య చేయడంతో కథ ప్రారంభమవుతుంది. ఆ ఊరిలో ఏదో జరుగుతుంది. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరు ఉన్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఎస్సై విక్రాంత్ రోణ ఎంట్రీతో కథలో స్పీడ్ పెరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ బాగున్నప్పటికీ.. వరుస హత్యల రహస్యాన్ని చేధించే సీన్స్ ఆసక్తికరంగా సాగవు. దానికి తోడు సంజు లవ్‌ట్రాక్, మదర్ సెంటిమెంట్ అంతగా ఆకట్టుకోకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మధ్య మధ్య వచ్చే కొన్ని భయంకర సన్నివేశాలు మినహా.. కథ ఎక్కడా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఎవరెలా చేశారంటే.. విక్రాంత్ రోణ పాత్రలో సుదీప్ ఒదిగిపోయాడు. తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. సంజుగా నిరూప్ బండారి పర్వాలేదు. క్లైమాక్స్‌లో అతని పాత్ర సర్ప్రైజ్ చేస్తుంది. అపర్ణగా నీతా అశోక్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఫక్రూగా కార్తీక్ రావు నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రక్కమ్మగా జాక్వెలిన్ తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటుల పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేకున్నా.. తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అజనీష్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. రారా రక్కమ్మ పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. శివ కుమార్ ఆర్ట్‌వర్క్ అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. విలినియం సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘విక్రాంత్ రోణ’ మూవీ ట్విటర్ రివ్యూ
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కి భారీ స్పందన లభించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జులై 28) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘విక్రాంత్ రోణ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #VikrantRona one of the best 3 D movie in India,,, Best thrill with suspence ,,, what a experience in 3 d totally paisa vasool,,, Kannada industry is in Another level 🔥 🔥 🔥 And collection don't worry guys it will be another level because movie is on 🔥🔥 — Rakesh appu (@Kotresh57392792) July 28, 2022 త్రీడీలో వచ్చిన చిత్రాల్లో విక్రాంత్ రోణ ఒక మంచి చిత్రమని, సుదీప్ పెర్ఫామెన్స్ అద్భుతమంటూ కామెంట్ చేస్తున్నారు. కన్నడ పరిశ్రమని మరోస్థాయిలో నిలబెట్టిన చిత్రమిదని అంటున్నారు. En production design guru!! This is no less than a Hollywood film. Sudeep is stunning, 1st half superb with great interval bang #VikrantRona — Arun (@KfiTalks) July 28, 2022 హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, నిర్మాణ విలువలు చాలా బాగున్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరింది అంటున్నారు. My opinion Indian best 3D movie after #RRR is #VikrantRona It's impossible to do such a visuals with in 100 cro Kudos to #VikrantRona team#KicchaSudeep𓃵 #SalmanKhan #Sandalwood #Bollywood #Tollywood pic.twitter.com/VXmNsAr5WM — Sri Murali (@Sri_since_1998) July 28, 2022 #VikrantRona Ultimate comedy movie 😂 Every scene is dark. Biggest horror comedy gone wrong lol Biggest disaster from Side actor hero 😂#VikrantRonaFDFS #VikrantRonaReview #VikrantRonaOnJuly28 #KichchaSudeep — Jack (@HoxJack) July 28, 2022 Block Buster Review All Over 💥💥💥💥💥 VikrantRona Mania All Over 🔥 Record Breaking VikrantRona Movie 🔥#VikrantRona#VikrantRonaToday#VikrantRonaCelebration Megaa Block Buster VikrantRona 🔥@KicchaSudeep ❤@VikrantRona 🔥 pic.twitter.com/xWKf3z2CY2 — The Name Is Kiccha👑 (@TheNameIsKiccha) July 28, 2022 #VikrantRona one word @KicchaSudeep steal the show ,,,, Nirup excellent,,,, Ravishankar gowda ,, neetha everybody super jst wow that it ,,,,, Director is the real hero kudos — Vamshi Paidipally (@dir_vamsi) July 28, 2022 Interval twist ge Theaters full havali , one of the best interval scenes , Kiccha Boss Screen presence & Very Good quality , very very rich Making 💥💥 Eagerly Waiting for 2nd half 🤘🤘#VikrantRona #VikrantRonaFDFS @KicchaSudeep @VikrantRona — HITMAN ROCKY 😎 (@HITMANROCKY45_) July 28, 2022 @VikrantRona Interval@anupbhandari Anna Director Driving Till now , Great Senses of Comics, Mannerism he filled into inspector #VikrantRona The Swag of @KicchaSudeep Package Unexpected Interval Block Panna n Sanju Lived Up🙌 No Spoilers🤗 3D is Very Good.Still it's a Trailer pic.twitter.com/jJ3ydosC6j — TeAm SpiRiT (@TheRkBoss) July 28, 2022 #VikrantRona First half Report: 🛑 Interval Bang is Woww🔥 🛑 @KicchaSudeep 's Style & Swag is the big highlight of the cinema 🛑 BGM, Cinematography, production design is top notch. 🛑 @anupsbhandari 's #Rangitaranga flavour#VikrantRonaReview — Rakshith Reviews🎬 (@RakshithReviews) July 28, 2022 #VikrantRona 1st half: Commercial film blended up with Amazing visuals,BGM,Screenplay,looks everything positive👍,Interval is predictable but good👍 Good 1st half 2nd half: screenplay picks up,@KicchaSudeep action💥,Not like a routine thriller💥,Climax anthem and visuals💥 — OTT Thankan 2.0 (@ott_thankan) July 28, 2022 #VikrantRona -best ever storytelling in Sandalwood, @KicchaSudeep sir stole with his ultimate performance& screen presence it's going to be another feather in Kiccha's Acting cap, @anupsbhandari hatts off to u,one of best interval blocks in KFI 💥 1st half finished BLOCKBUSTER — Box Office Karnataka (@Karnatakaa_BO) July 28, 2022 Hands Down to @anupsbhandari ♥️ Happy tears man 🔥 First Half Done, all set for an epic second half 🔥♥️#VikrantRonaReview#VikrantRonaFDFS #KicchaSudeep @KicchaSudeep #VikrantRona #VRin3D — Kiccha Sudeep CULT™ (@KicchhaCult) July 28, 2022 -
విక్రాంత్ రోణతో ఆ కల తీరింది: కిచ్చా సుదీప్
కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని అనూప్ భండారీ దర్శకత్వంలో మంజూనాథ్ గౌడ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైకి వచ్చింది. ఇందులో పాల్గొన్న నటుడు కిచ్చా సుదీప్ మాట్లాడుతూ చెన్నైకి ఎప్పుడు వచ్చినా అత్యధిక గౌరవం ఇచ్చి పని ఇచ్చి అభిమానం చూపుతున్నారన్నారు. విక్రాంత్ రోణ భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్, అడ్వెంచర్, ఫాంటసీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మంచి ఇంటెన్స్‌తో కూడిన కథా చిత్రాన్ని చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. విక్రాంత్ రోణతో ఆ కల తీరిందన్నారు. (చదవండి: కొత్త రకం హెయిర్ స్టయిల్లో రజనీకాంత్!) ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. మంచి కంటెంట్‌తో కూడిన కథ కావడంతో తనకు బాగా నచ్చిందన్నారు. దీనిని ఇంకా ఎలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లవచ్చు అన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. దీంతో త్రీడీ ఫార్మెట్ రూపొందించినట్లు చెప్పారు. దర్శకుడు మంచి ఇంటెన్స్‌తో ఫుల్ ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. ఈ చిత్రం విడుదల అనంతరం దర్శకుడి గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. కాగా ఈ చిత్రాన్ని గత 20 ఏళ్ల క్రితం త్రీడీ ఫార్మెట్ వచ్చిన మై డీయర్ కుట్టి చేతన్ చిత్రంతో పోల్చవద్దని అన్నారు. అది ఒక హిస్టరీ అని పేర్కొన్నారు. ఆ చిత్రం అందించిన త్రీడీ ఎఫెక్ట్ మరే చిత్రం ఇవ్వలేదన్నారు. అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా దర్శకుడు కొత్త ఇమేజినేషన్, విజన్‌తో తీశారన్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా బాగా రూపొందించినట్లు తెలిపారు. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకోవడమే సక్సెస్ అని నటుడు కిచ్చా సుదీప్ పేర్కొన్నారు. -
విక్రాంత్ రోణ పోస్టర్ పెట్టాలని ఉంది!
‘‘తెలుగు ప్రేక్షకులది మంచి మనసు. వారికి సినిమా నచ్చిందంటే పెద్ద హిట్ చేస్తారు. త్రీడీ సినిమాలు వచ్చి చాలా రోజులైంది. ‘విక్రాంత్ రోణ’తో ఆ ఎక్స్‌పీరియన్స్‌ను మరోసారి చూడబోతున్నారు. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు నాగార్జున. సుదీప్ టైటిల్ రోల్లో అనూప్ బండారి దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోణ’. నీతూ అశోక్, నిరూప్ బండారి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ – ‘‘సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశారు. అందరికీ సుదీప్ నటుడిగా సుపరిచితుడు. సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను మేం పెడుతుంటాం. ఆ సినిమాల్లో మేం కూడా భాగమయ్యామనే గర్వంతో అలా చేస్తాం. ఇంతకుముందు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ పెట్టాం. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ పోస్టర్ పెట్టాలని ఉంది’’ అన్నారు. ‘‘నేను థియేటర్స్‌లో చూసిన తొలి సినిమా నాగార్జునగారి ‘శివ’. అప్పట్లో సైకిల్ చైన్‌తో కొట్టడం అనేది స్టయిల్‌గా మారిపోయింది. నేనూ సైకిల్ చైన్‌ను బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇక ‘విక్రాంత్ రోణ’ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లోనే జరిగింది. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాల్లో యాక్టర్‌గా నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ‘విక్రాంత్ రోణ’ను కూడా ఆద రించి, హిట్ చేయాలి’’ అన్నారు సుదీప్. ‘‘నాగార్జునగారి ‘గీతాంజలి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఇక నా తొలి స్క్రిప్ట్ సుదీప్గారి కోసమే రాసుకున్నాను. ‘విక్రాంత్ రోణ’ నా ఇరవయ్యేళ్ల కల. సుదీప్గారితో వర్క్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు అనూప్ బండారి. -
‘విక్రాంత్ రోణ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..
Upcoming Movies Web Series July Last Week: సినీ ప్రియుల కోసం ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటాయి. సమ్మర్లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ సందడి చేయగా తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అంచనాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే జులై చివరి వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో మేం ఉన్నామంటూ సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! 1 విక్రాంత్ రోణ- జులై 28, 2022 2. ది లెజెండ్- జులై 28, 2022 3. రామారావు ఆన్ డ్యూటీ- జులై 29, 2022 4. ఏక్ విలన్ రిటర్న్స్- జులై 29, 2022 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లు అమెజాన్ ప్రైమ్ వీడియో 1. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్- జులై 26 2. ది బ్యాట్ మ్యాన్- జులై 27 3. బిగ్ మౌత (వెబ్ సిరీస్)- జులై 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 1. అదమస్ (వెబ్ సిరీస్)- జులై 27 2. గుడ్ లక్ జెర్రీ- జులై 29 3. 19 (1) (ఎ)- జులై 29 నెట్‌ఫ్లిక్స్ 1. ది మోస్ట్ హేటెడ్ మ్యాన్ ఆన్ ది ఇంటర్నెట్ (వెబ్ సిరీస్)- జులై 27 2. డ్రీమ్ హోమ్ మేకోవర్ (వెబ్ సిరీస్)- జులై 27 3. కీప్ బ్రీతింగ్ (వెబ్ సిరీస్)- జులై 28 4. మసాబా మసాబా (వెబ్ సిరీస్)- జులై 29 5. పర్పుల్ హార్ట్స్ (వెబ్ సిరీస్)- జులై 29 1. షికారు- జులై 29 (ఆహా) 2. పేపర్ రాకెట్- జులై 29 (జీ5) 3. 777 చార్లీ- జులై 29 (వూట్) -
కిచ్చా సుదీప్‌పై నెట్టింట పుకార్లు.. నిర్మాత క్లారిటీ!
బెంగళూరు: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ నేపథ్యంలో హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉండగా సుదీప్‌కు ఆరోగ్యం సరిగా లేని కారణంగా అవి వాయిదా పడ్దాయి. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. తాజాగా దీనిపై విక్రాంత్ రాణ చిత్ర నిర్మాత స్పందించారు. నెట్టింట సుదీప్‌పై వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపడేశారు. జలుబు, జ్వరం లక్షణాలు కనిపించడంతో సుదీప్ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం సుదీప్‌కు కరోనా సోకలేదని, క్షేమంగా ఉన్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. చదవండి: Arjun Kapoor: ఏడాది తిరిగేసరికి ఇల్లు అమ్మేసిన హీరో! -
మీడియాకి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రాంత్ రోణ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్ నేపథ్యంలో నేడు(జులై21)న హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, తనను క్షమించాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే త్వరలోనే అందరినీ కలుస్తాను అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. Apologies to all my media frnzz frm Chennai,Kochi & Hydarabad, for having canceled the press meet & event. I have Been Unwell. Feeling much better & shall resume travel again. IHoping to Reschedule to a sooner date. Looking forward to meeting u all. 🥂 Love & Regards, Kichcha❤️ — Kichcha Sudeepa (@KicchaSudeep) July 21, 2022 -
సుదీప్ కెరీర్లో ఇదే బెస్ట్ : రామ్‌గోపాల్ వర్మ
‘‘కన్నడ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్ గతంలో ఉండేది. కానీ, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్ సినిమాకే ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ మధ్య ‘కేజీఎఫ్ 2’ వచ్చింది.. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ వస్తోంది. సుదీప్ కెరీర్లో ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకుంటున్నాను’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సుదీప్ హీరోగా జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై జాక్ మంజునాథ్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘ఈ సినిమాకు సుదీప్‌గారు పిల్లర్‌గా నిలబడి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు అనూప్ భండారి. ‘‘భారతీయ సినిమా మరిన్ని కొత్త చరిత్రలను సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత షాలినీ మంజునాథ్. ‘‘విక్రాంత్ రోణ’ చిత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. ఓ సౌత్ ఇండియన్‌గా ఎంతో గర్వపడుతున్నాను’’ అన్నారు అఖిల్ అక్కినేని. కిచ్చా సుదీప్ మాట్లాడుతూ– ‘‘ఈగ’ వంటి సినిమాను నాకు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిగార్లకు థ్యాంక్స్. అలాగే నా తెలుగు జర్నీకి ఓ కారణమైన రామ్‌గోపాల్ వర్మగారు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. జూలై 28కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫైట్ మాస్టర్ విజయ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు. -
విక్రాంత్ రోణ ట్రైలర్: ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు
కన్నడ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించారు. గురువారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజైంది. 'ఆ ఊరే ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథని దాచగలరు, కానీ భయాన్ని దాచలేరు, ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్ మళ్లీ వచ్చాడు..' అంటూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. భయం నిండిన ఆ ఊరిలో భయం అంటే ఏమిటో తెలియని ఒకడు వచ్చాడు అంటూ విక్రాంత్ రోణగా సుదీప్ పాత్రను పరిచయం చేశారు. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉంది. కాగా ఈ సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇచ్చేందుకు ముందుకు వచ్చిందట. కానీ ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దీన్ని థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనూప్. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజైన ‘రా రా రాక్కమ్మా’ సాంగ్ విశేష ఆదరణ పొందిన విషయం విదితమే! రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. ఈ త్రీడీ చిత్రం కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జూలై 28న విడుదలవుతోంది’ చదవండి: -
విషమంగా నిర్మాత ఆరోగ్యమంటూ వార్తలు, క్లారిటీ ఇచ్చిన హీరో
ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాత జాక్ మంజునాథ ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా రకరకాల రూమర్లు షికారు చేస్తున్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో బెడ్‌పై ఆయన నిద్రపొతున్న ఫొటోలు కొన్ని ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఆయన ఆరోగ్యం విషయంగా ఉందంటూ కన్నడ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తూ కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ట్వీట్ చేశాడు. ‘మై డియర్ ప్రెండ్ అండ్ బ్రదర్ జాక్ మంజునాథ్ ముందు ప్రస్తుతం పూర్తి ఆరోగ్యం ఉన్నారు. ఈ రోజు ఆయన ఆయన డిశ్చార్జీ. ముందస్తు జాగ్రత్తగా సాధారణ సాధారణ చెకప్ కోసం ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రి సిబ్బంది బెడ్‌పై ఆయన నిద్రపోతున్న ఫొటోలను లీక్ చేశారు. దీంతో అభిమానులు, స్నేహితులు , బంధువులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మంజునాథ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరసరం. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతులు’ అంటూ సుదీప్ ట్వీట్ చేశాడు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటరైన జాక్ మంజునాథ్ సుదీప్ తాజా పాన్ ఇండియా చిత్రం ‘విక్రాంత్ రోణ’కు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ జులై 28న కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, యలయాళ భాషలో విడుదల కానుంది. My dear brother and friend @JackManjunath is fine and getting discharged today. He was admitted on precautionary grounds and nothing serious. Few leaked pics taken by staff while he was sleeping is doing rounds making it look serious. Thanks to all fo ua wshs and prayers.🙏🏼 — Kichcha Sudeepa (@KicchaSudeep) June 14, 2022 -
మంగ్లీ పాడిన మాస్ సాంగ్ 'రారా రక్కమ్మా..' విన్నారా?
సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా..’ అనే పక్కా మాస్ తెలుగు పాటను బుధవారం విడుదల చేశారు. ‘‘త్రీడీ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ‘రా రా రాక్కమ్మా’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘‘రా రా రాక్కమ్మా..’ పాట చిత్రీకరణ సమయంలో ఎంజాయ్ చేశాను. పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్‌కు నచ్చే సాంగ్ ఇది’’ అన్నారు జాక్వెలిన్. ఈ చిత్రానికి సహనిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్. చదవండి: విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత Sonali Bendre: క్యాన్సర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా -
కరోనా కల్లోలం.. మరో పాన్ ఇండియా చిత్రం వాయిదా
Sudeep Vikrant Rona Movie Postponed: కరోనా మహమ్మారి కలకలం ఇండియాలో తగ్గట్లేదు. రోజురోజుకీ కేసులు పెరుగుతూ విజృంభణ కొనసాగిస్తుంది. వైరస్ విలయంతో పెద్ద సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. కన్నడ స్టార్ సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'విక్రాంత్ రోణ'. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకుడు. కరోనా తీవ్రత, పరిస్థితులు, థియేటర్లలో పూర్తిగా లేని ఆక్యుపెన్సీ వంటి నిబంధనల కారణంగా 'విక్రాంత్ రోణ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలో నటించారు. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్. -
Vikrant Rona : రూ. 100 కోట్లు ఆఫర్.. అయినా ఓటీటీకి నో
సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ త్రీడీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రాన్ని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయనున్నాం’’ అన్నారు జాక్ మంజునాథ్. అనూప్ భండారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇవ్వడం గొప్ప విషయం. అయితే ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.