Kiccha Sudeep Apologies To Media For Cancelling Vikrant Rona Press Meet, Deets Inside - Sakshi

Kiccha Sudeep: మీడియాకి క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్‌

Published Thu, Jul 21 2022 2:42 PM | Last Updated on Thu, Jul 21 2022 5:15 PM

Kiccha Sudeep Apologies To Media For Cancelling Press Meet Due To Health Issue - Sakshi

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం విక్రాంత్‌ రోణ ఈ నెల 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అనూప్ బండారి దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు భారీ సన్నాహాలు చేశారు. ప్రమోషన్స్‌ నేపథ్యంలో నేడు(జులై21)న హైదరాబాద్‌, చెన్నై, కొచ్చిలలో ప్రెస్‌మీట్‌ నిర్వహించాల్సి ఉంది.

అయితే ఇప్పుడు ఆ మీటింగ్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయి. ఈ క్రమంలో మీడియా ప్రతినిథులకు కిచ్చా సుదీప్‌ క్షమాపణలు చెప్పారు. అనారోగ్య కారణాలతో ప్రెస్‌మీట్లకు హాజరు కాలేకపోతున్నానని, తనను క్షమించాలని కోరారు. పూర్తిగా కోలుకున్న వెంటనే త్వరలోనే అందరినీ కలుస్తాను అంటూ ఆయన ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement