Jani Master: Kiccha Sudeep Gifts Costly Car To Choreographer, Deets Inside - Sakshi
Sakshi News home page

Jani Master Car Gift: జానీ మాస్టర్‌కి ఖరీదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన స్టార్‌ హీరో

Published Sat, Mar 26 2022 10:04 AM | Last Updated on Sat, Mar 26 2022 11:19 AM

Kiccha Sudeep Gifts Costly Car To Cheoreographer Jani Master - Sakshi

BB Kannada Host Gift To Dhee 14 Judge Jani: టాలీవుడ్‌కి చెందిన టాప్ డాన్స్ కొరియోగ్రాఫ‌ర్స్‌లో జానీ మాస్ట‌ర్ ఒక‌రు. స్టార్‌ హీరోల సినిమాల్లో చాలామందికి జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తుంటారు. ఇటీవలె బీస్ట్‌ మూవీ నుంచి 'అరబిక్ కుతు...' సాంగ్‌కి కొరియోగ్రఫీ చేసింది కూడా ఆయనే. ప్రస్తుతం టాలీవుడ్‌, కోలీవుడ్‌ సహా పలు ఇండస్ట్రీల్లో జానీ మాస్టర్‌కి మాంచి పేరుంది. తాజాగా కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌తో ఆయన పనిచేశారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌కి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు సుదీప్‌.

ఖరీదైన థార్‌ కారును ఆయనకు బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను జానీ మాస్టర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. సుదీప్‌కు ప్రత్యేకంగా థ్యాంక్స్‌ చెప్పారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ థార్‌ కారు ధర సుమారు రూ. 12-14 లక్షలు ఉండొచ్చని తెలుస్తుంది.కాగా కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. త్వరలో విడుదల కానుంది. ఇందులో సుదీప్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ మీద చిత్రీకరించిన పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement