
సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలకానుంది. ఈ చిత్రం నుంచి ‘రా రా రాక్కమ్మా..’ అనే పక్కా మాస్ తెలుగు పాటను బుధవారం విడుదల చేశారు.
‘‘త్రీడీ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. ‘రా రా రాక్కమ్మా’ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ, నకాష్ అజీజ్ పాడారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ‘‘రా రా రాక్కమ్మా..’ పాట చిత్రీకరణ సమయంలో ఎంజాయ్ చేశాను. పాన్ ఇండియా లెవల్లో మాస్ ఆడియన్స్‌కు నచ్చే సాంగ్ ఇది’’ అన్నారు జాక్వెలిన్. ఈ చిత్రానికి సహనిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్.
చదవండి: విషాదం.. ఉగ్రవాదుల కాల్పుల్లో టీవీ నటి కన్నుమూత
Sonali Bendre: క్యాన్సర్ నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా
Comments
Please login to add a commentAdd a comment