Kichcha Sudeep Vikrant Rona OTT Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Vikrant Rona: ఓటీటీలో విక్రాంత్‌ రోణ, ఎప్పుడు? ఎక్కడంటే?

Published Thu, Aug 25 2022 2:41 PM | Last Updated on Thu, Aug 25 2022 3:32 PM

Kichcha Sudeep Vikrant Rona OTT Release Date Confirmed - Sakshi

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ నటించిన చిత్రం విక్రాంత్‌ రోణ. గ్లామరస్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా నటించింది. అనూప్‌ భండారి డైరెక్ట్‌ చేయగా మంజునాథ్‌ గౌడ్‌ నిర్మించారు. జూలై 28న రిలీజైన ఈ పాన్‌ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగానే వసూళ్లు రాబట్టింది. కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.

జీ5 విక్రాంత్‌ రోణ డిజిటల్‌ రైట్స్‌ను భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్‌ 2 నుంచి జీ 5లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక కొద్దిరోజులు ఆగారంటే విక్రాంత్‌ రోణను ఎంచక్కా కూర్చున్న చోటే వీక్షించేయవచ్చు.

చదవండి: పూరీ దగ్గర సుక్కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడా!
పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రోల్‌లో కీర్తి సురేష్‌.. ఏ సినిమాలో అంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement