‘విక్రాంత్‌ రోణ’ తెలుగు వెర్షన్‌ ఈ ఓటీటీలోనే? స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | OTT: Vikrant Rona Telugu Version to Premiere On Hotstar From Sep 16th | Sakshi
Sakshi News home page

Vikranth Rona Telugu OTT Release: ‘విక్రాంత్‌ రోణ’ తెలుగు వెర్షన్‌ ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Thu, Sep 1 2022 8:32 PM | Last Updated on Thu, Sep 1 2022 9:15 PM

OTT: Vikrant Rona Telugu Version to Premiere On Hotstar From Sep 16th - Sakshi

కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జూలైలో  విడుదలై మంచి విజయం సాధించింది. భారీ వసూళ్లను ఇండియన్‌ బాక్సాఫీసు షేక్‌ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ కన్నడ వెర్షన్‌కు సంబంధించి ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5(zee5)లో ఈ నెల 2(సెప్టెంబర్‌ 2న) నుంచి ఈ మూవీ కన్నడ వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. 

చదవండి: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం, సింగర్‌ దుర్మరణం

ఇదిలా ఉంటే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ రిలీజ్‌ డేట్‌ తాజాగా బయటకు వచ్చింది. సెప్టెంబర్‌ 16 నుంచి తెలుగు వెర్షన్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. అనూప్‌ భండారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంజునాథ్‌ గౌడ్‌ నిర్మాత. ఇందులో నిరూప్‌ భండారి, నీతా అశోక్‌, రవిశంకర్‌ గౌడ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎన్నోఅంచాల మధ్య జూలై 28న కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, యలయాళ భాషల్లో విడుదలైంది.  కేవలం రిలీజైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం. 

చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్‌ నోట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement