
సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘విక్రాంత్ రోణ’. అనూప్ భండారి దర్శకుడు. జాక్ మంజునాథ్, షాలినీ మంజునాథ్ నిర్మించిన ఈ త్రీడీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా చిత్రాన్ని 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో విడుదల చేయనున్నాం’’ అన్నారు జాక్ మంజునాథ్. అనూప్ భండారి మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు ఓటీటీ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ (దాదాపు రూ. 100 కోట్లు) ఇవ్వడం గొప్ప విషయం. అయితే ప్రేక్షకులకు ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్‌లోనే రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment