కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం విక్రాంత్ రోణ. గ్లామర్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాయకిగా నటించారు. ఈ చిత్రాన్ని అనూప్ భండారీ దర్శకత్వంలో మంజూనాథ్ గౌడ్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం సాయంత్రం చెన్నైకి వచ్చింది. ఇందులో పాల్గొన్న నటుడు కిచ్చా సుదీప్ మాట్లాడుతూ చెన్నైకి ఎప్పుడు వచ్చినా అత్యధిక గౌరవం ఇచ్చి పని ఇచ్చి అభిమానం చూపుతున్నారన్నారు. విక్రాంత్ రోణ భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్, అడ్వెంచర్, ఫాంటసీ కథా చిత్రంగా ఉంటుందన్నారు. మంచి ఇంటెన్స్‌తో కూడిన కథా చిత్రాన్ని చేయాలన్నది తన చిరకాల కోరిక అన్నారు. విక్రాంత్ రోణతో ఆ కల తీరిందన్నారు.
(చదవండి: కొత్త రకం హెయిర్ స్టయిల్‌లో రజనీకాంత్!)
ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుందన్నారు. మంచి కంటెంట్‌తో కూడిన కథ కావడంతో తనకు బాగా నచ్చిందన్నారు. దీనిని ఇంకా ఎలా బాగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లవచ్చు అన్న దానిపై దృష్టి పెట్టామన్నారు. దీంతో త్రీడీ ఫార్మెట్ రూపొందించినట్లు చెప్పారు. దర్శకుడు మంచి ఇంటెన్స్‌తో ఫుల్ ఎఫెర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.
ఈ చిత్రం విడుదల అనంతరం దర్శకుడి గురించి అందరూ చెప్పుకుంటారన్నారు. కాగా ఈ చిత్రాన్ని గత 20 ఏళ్ల క్రితం త్రీడీ ఫార్మెట్ వచ్చిన మై డీయర్ కుట్టి చేతన్ చిత్రంతో పోల్చవద్దని అన్నారు. అది ఒక హిస్టరీ అని పేర్కొన్నారు. ఆ చిత్రం అందించిన త్రీడీ ఎఫెక్ట్ మరే చిత్రం ఇవ్వలేదన్నారు. అప్పట్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినా దర్శకుడు కొత్త ఇమేజినేషన్, విజన్‌తో తీశారన్నారు. అయితే ఈ చిత్రాన్ని ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా బాగా రూపొందించినట్లు తెలిపారు. నిజానికి మంచి కథను ఎంపిక చేసుకోవడమే సక్సెస్ అని నటుడు కిచ్చా సుదీప్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment