
Sudeep Vikrant Rona Movie Postponed: కరోనా మహమ్మారి కలకలం ఇండియాలో తగ్గట్లేదు. రోజురోజుకీ కేసులు పెరుగుతూ విజృంభణ కొనసాగిస్తుంది. వైరస్ విలయంతో పెద్ద సినిమాల సందడి లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' వంటి పాన్ ఇండియా చిత్రాల విడుదలకు బ్రేక్ పడింది. తాజాగా మరో పాన్ ఇండియా మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. కన్నడ స్టార్ సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'విక్రాంత్ రోణ'. త్రీడీలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకుడు.
కరోనా తీవ్రత, పరిస్థితులు, థియేటర్లలో పూర్తిగా లేని ఆక్యుపెన్సీ వంటి నిబంధనల కారణంగా 'విక్రాంత్ రోణ' సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా ప్రేక్షకులకు థియేట్రికల్ అనుభూతిని ఇవ్వాలనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమాలో నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలో నటించారు. అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీలో ఫిబ్రవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment