![Kiccha Sudeep Vikrant Rona Enters Rs 100 Crore Club In 4 Days - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/08/1/vikrantronamovieposter.jpg.webp?itok=0Bf7ZLI4)
Kiccha Sudeep Vikrant Rona Enters Rs 100 Crore Club In 4 Days: కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎమోషనల్ ఫాంటసీ అడ్వెంచర్ కథా చిత్రం 'విక్రాంత్ రోణ'. అనూప్ భండారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. ఈగ, బాహుబలి, సైరా లాంటి చిత్రాలతో సుదీప్ తెలుగు ఆడియన్స్‌కు దగ్గరవ్వడంతో టాలీవుడ్‌లో కూడా ‘విక్రాంత్ రోణ’పై హైప్ క్రియేట్ అయింది. అత్యంత భారీ అంచనాల మధ్య జులై 28న పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది విక్రాంత్ రోణ.
ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండటంతో మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరినట్లు సమాచారం. ఈ చిత్రం తొలి వారంలోనే వరల్డ్ వైడ్‌గా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగులోని నైజాం ఏరియాలో అతి తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది.
చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన
నైజాం ఏరియాలో తొలిరోజు నుంచే మంచి బజ్ రావడంతో వీకెండ్‌లో చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. దీంతో 4 రోజుల్లోనే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'విక్రాంత్ రోణ'ను నైజాం ఏరియాలో చాలా తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. కన్నడ చిత్రసీమలో 'కేజీఎఫ్ 2' సినిమా తర్వాత అంత భారీ హిట్ సాధించిన చిత్రంగా 'విక్రాంత్ రోణ' రికార్డుకెక్కింది. కాగా కన్నడ, తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రాన్ని రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment