![Kiccha Sudeep Hebbuli Movie Latest Updates - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/28/Sudeep-%2CAmala-Paul-2.jpg.webp?itok=Ti3_UG0z)
సుదీప్, అమలా పాల్ జంటగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘హెబ్బులి’. ఎమ్. మోహన శివకుమార్ సమర్పణలో సి. సుబ్రహ్మణ్యం నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ‘‘కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. కెప్టెన్ పాత్రను సుదీప్ స్టయిలిష్‌గా చేయడంతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో అద్భుతంగా నటించారు. తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.
హెబ్బులిలో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ యాంగిల్‌తో కూడిన మంచి కమర్షియల్ ఓరియంటేషన్ కంటెంట్ ఉంది. కన్నడలో విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలన వసూళ్లు సాధించిన పక్కా కమర్షియల్ మూవీ. డబ్బింగ్ మరియు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని తెలుగులో ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment