కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' నుంచి ట్రైలర్ విడుదలైంది. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సుదీప్ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్ దక్కించుకున్నారు. అలా ఆయన పాన్ ఇండియా రేంజ్‌లో పరిచయం అయ్యాడు. అయితే, ఇప్పుడు మ్యాక్స్ సినిమాతో థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తుండగా విలన్‌గా సునీల్ కన్నడలో ఎంట్రీ ఇచ్చాడు. డిసెంబర్ 25న విడుదల కానున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. తెలుగులో కూడా ఈ మూవీ విడుదల కానున్నడంతో మ్యాక్స్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
'మ్యాక్స్' చిత్రంలో అర్జున్ మహాక్షయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కిచ్చా సుదీప్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా డేట్ అనౌన్స్ మెంట్ నుంచి అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం పోస్టర్స్ ఉన్నాయి. దీంతో తెలుగులో కూడా మ్యాక్స్ సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. క్రిస్మస్ రేసులో ఇప్పటికే సుమారు పదికి పైగా సినిమాలు ఉన్నాయి. అయితే, ఇదే సమయంలో కిచ్చా సుదీప్ కూడా రానున్నడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత గట్టిగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment